ప్లాస్టిక్ కవర్లలో వేడివేడి ఆహారం, కూరలు, కాఫీ, టీ, పాలతో పాటు వచ్చే క్యాన్సర్ మనకొద్దు . . .
అరిటాకు, విస్తరాకు, అడ్డాకు, స్టీల్ క్యారేజ్ లలో ఆహార పదార్థాలు మనకు మేలు . . .
ప్లాస్టిక్ పొరతో ఉన్న పేపర్ కప్పులలో టీ, కాఫీల తో పాటుగా క్యాన్సర్ ఉచితం . . .
స్టీల్ గ్లాస్, గాజు గ్లాస్, పింగాణి కప్పులలో టీ, కాఫీ లతో పాటు ఆరోగ్యం ఉచితం . . .
ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు కాల్చితే రోగం
పోగుచేసి దాచి అమ్మితే ఆదాయం . . .
ప్లాస్టిక్ పొరతో ఉన్న పేపర్ ప్లేట్ లో తినే ఆహారంతో క్యాన్సర్ . . .
అరిటాకు, విస్తరాకు, అడ్డాకు, స్టీల్ ప్లేట్ లో తినే ఆహారంతో ఆరోగ్యం . . .
విషపూరితమైన రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులతో పండిన పంటలతో క్యాన్సర్ మహమ్మారి వ్యాప్తి . . .
ప్రకృతి, సేంద్రియ, పశువుల ఎరువులతో పండిన పంటలతో అందరికీ ఆరోగ్యం, ఆనందం . . .
- స్వస్తీ . . .