వీర్యహీనతకు - బ్రహ్మాస్త్రం

అత్తపత్తిగింజలు, చింతగింజల పప్పు, నీరుగొబ్బి గింజలు సమంగా తీసుకొని మట్టిపాలలో ఒకరాత్రి నానబెట్టి తరువాత గాలికి ఆరబెట్టి మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఎండబెట్టి నిలువ చేయాలి. 

రెండుపూటలా పూటకు మూడు. 

మాత్రలు నీటితోవేసుకొని వెంటనే నాటుఆవుపాలు కండచక్కెర కలిపి తాగాలి.

నలభైరోజుల్లో మూత్రములో వీర్యముపోవడం, శీఘ్రస్కలనం, నపుంసకత్వం, అంగబలహీనత హరించి ధాతుపుష్టి కలుగుతుంది.

 వేడి, పులుపు, కారం పదార్థాలు నిషేధించి బ్రహ్మచర్యం పాటించాలి .


వీర్యస్తంభనకు

అత్తపత్తి వేర్లను మేకపాలతోగానీ, గొర్రెపాలతో గానీ, గంధంలాగా నూరి ఆ గంధాన్ని పురుషులు తమ అరికాళ్ళకు మర్దించుకొని ఆ తరువాత రతిలో పాల్గొంటే చాలా సేపటివరకు వీర్యపతనం కాదు.

* తీపి పదార్థాలు బాగా వాడుకోవాలి.


లింగబలానికి - అశ్వగంధ

అశ్వగంధ దుంపలపొడి, నీటిలో పెరిగే నాచును ఎండించి చేసినపొడి, నల్లఉమ్మెత్త గింజలపొడి, సమంగా కలిపి నిలువచేసుకోవాలి. రోజూ రాత్రి తగి నంత పొడిని నిమ్మరసంతోనూరి లింగంపైన ముందు బాగం విడచి, వెనుకభాగానికి లేపనంచేసి ఉదయం కడుగుతూవుంటే అంగం దృఢంగా మారుతుంది


అతిరతికి - అశ్వగంధ ఘుటికలు

అశ్వగంధ దుంపలను ఏడుసార్లు ఆవుపాలలో వేసి పాలు ఇగిరేవరకు మరిగించి ఎండించి దంచినపొడి, అలాగే చేసిన అతిమధురంపొడి, అలాగే శుద్ధిచేసిన నేలగుమ్మడిపొడి, అలాగేశుద్ధిచేసిననేలతాడి దుంపల పొడి, ఏనుగుపల్లేరుకాయలపొడి, మిను ములపొడి, శతావరిపొడి, దూలగొండి గింజలపొడి, ఉసిరిక కాయలపొడి, బూరుగు జిగురుపొడి సమంగా కలపాలి. ఈ మొత్తానికి సమానంగా పటికబెల్లంపొడి కలిపి ఆ మొత్తంచూర్ణంలో తగినంత మంచితేనెచేర్చి బాగా పిసికి లేహ్యంలాగాచేసి నిలువవుంచుకోవాలి.

రోజూ రెండుపూటలా ఆహారానికి రెండుగంటల ముందు 20గ్రా॥ ముద్దనుతిని ఒకగ్లాసు ఆవుపాలు తాగుతూవుంటే 40రోజులలో అంతులేనంత శరీర బలం వీర్యవృద్ధి కలుగుతాయ్.





✍🏻 . . . రామ్ కర్రి జ్ఞానాన్వేషి 🧠, ధర్మ రక్షక్ 📿, నవ యువ కవి 📖, రచయిత ✒️, బ్లాగర్ 🪩 ,. టెక్ గురు 🖥️ , సామాజిక కార్యకర్త 🩸 , 📖 తెలుగు భాషా సంరక్షణ వేదిక 📚 , 🪷 సంజీవని ఔషధ వన ఆశ్రమం 🌱 , మరియు 🛕 జ్ఞాన కేంద్ర 🚩 వ్యవస్థాపకులు . . . www.ramkarri.org 8096339900