మూతివంకరపోయే-ముఖపక్షవాతం
అక్కలకర్ర, నేలతాడి దుంపలు, బూరుగువేర్లు, లవంగాలు, దాల్చినచెక్క చలువ మిరియాలు, పిప్పళ్ళు, అశ్వగంధ గడ్డలు, జాజికాయలు, బాదం పప్పు, పిస్తాపప్పు, గసగసాలు, జాపత్రి, నల్ల జీలకర్ర వీటిని ఒక్కొక్కటి పదిగ్రాముల మోతాదుగా తీసుకొని తగి నంత తేనెతోకలిపి మెత్తగా ముద్దలాగా నూరాలి.
ఫిట్స్, మూర్ఛలు - హరించుటకు
అక్కలకర్ర వేర్లపొడిని వెనిగర్తో మెత్తగానూరి దానికి మూడురెట్లు తేనెకలిపి ఆ మిశ్రమాన్ని గాజు సీసాలో నిలువ పెట్టుకోవాలి. రోజు పరగడుపున మూడుగ్రాముల మోతాదుగా చప్పరించి తింటుంటే పిట్స్, మూర్ఛలు తగ్గిపోతయ్ . . .
పక్షవాతానికి - పసందైనమార్గం
అక్కలకర్ర వేర్లపొడి, దోరగావేయించిన సొంఠిపొడి, దోరగా వేయించిన నలజీలకర పొడి, దోరగా వేయించిన సన్నరాష్ట్రంపొడి సమంగా కలిపి నిలువవుంచుకోవాలి. రోజూ రెండుపూటలా రెండు లేక మూడు గ్రాముల మోతాదుగా ఈ పొడిని తగినంత తేనెతో కలిపి సేవిస్తుంటే క్రమంగా పక్షవాతం తగ్గిపోతుంది.
ఉబ్బసం, మూర్ఛవంటి - అసాధ్యరోగాలకు
అశ్వగంధాదిచూర్ణం : అశ్వగంధపొడి 640గ్రా॥,
దోరగావేయించిన సాంఠిపొడి 320గ్రా॥ దోరగా వేయించిన పిప్పలికట్టె పొడి 160గ్రా॥, దోరగా వేయించిన మిరియాలపొడి 80గ్రా॥, ఏలక్కాయల పొడి 40గ్రా॥, నాగకేసరాల పొడి 20గ్రా॥, లవంగాల పొడి 10గ్రా॥, కలిపి అందులో 1270గ్రా॥ పటిక బెల్లంపొడి కలిపి గాజుపాత్రలో నిలువవుంచుకోవాలి.
ఈ అద్భుత చూర్ణాన్ని పూటకు 5గ్రా॥ మోతాదుగా ఒకచెంచా తేనెకలిపి రెండుపూటలా ఆహారానికి గంట ముందు తింటూవుంటే ఉబ్బసం, ఆయాసం, ఆకలి లేకపోవడం, అతి పైత్యం, మూర్ఛ, అపస్మారం హరించిపోయి మనసుకు శాంతి, దేహానికి కాంతి, వీర్యానికి బలంకలుగుతాయ్.
వాతరోగాలకు - పెన్నేరుచూర్ణం
పెన్నేరు దుంపలపొడి దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి, దోరగా వేయించిన చవ్యంపొడి, చిత్రమూలం వేర్లపొడి సమంగా కలిపి దీనికి రెండు రెట్లు పాతబెల్లం కలిపి మెత్తగా దంచాలి. దీన్ని ప్రతిరోజూ 10గ్రా॥ మోతాదుగా రెండుపూటాలా ఆహారానికి గంట ముందు తింటుంటే సమస్తవాతవ్యాధులు సమూలంగా హరించిపోతయ్.