🙏తల్లి మాటలోని మహత్తు!! 🙏
✍అనగనగా ఒక బాలుడు. అతడికి జట్కాబండిలో ప్రయాణించడమంటే చాలా ఇష్టం. అతడు ఇంటినుంచి రోజూ బడికి వెళ్లేది జట్కాలోనే. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారని బడిలో పిల్లల్ని టీచరు అడిగారు. ఒకరు డాక్టరవుతానని, ఇంకొకరు ఇంజినీరవుతానని, మరొకరు లాయరు అవుతానని చెబుతుండగా, ఈ బాలుడు మాత్రం జట్కావాలా అవుతానని జవాబిచ్చాడు.
✍టీచరు, పిల్లలు గొల్లున నవ్వారు.
బాలుడు ఇంటికి చేరే లోపలే ఈ కబురు ఊరికీ, ఊళ్లోని తల్లికి అందిపోయింది.
🙏ఇంటికి రాగానే తల్లి ప్రశాంతవదనంతో బాబూ! పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావని అడిగింది. అతడు పాత సమాధానమే చెప్పాడు. ఆమె తప్పకుండా అవుదువుగానీ, ఇలా రా అంటూ పూజామందిరం తలుపులు తెరిచింది.
🙏ఒక్క గుర్రంతో నడిపే బండిని కాదు బాబూ, నాలుగు గుర్రాలు నడిపే బండీకి నువ్వు జట్కావాలావి కావాలి, అదిగో, ఆ శ్రీకృష్ణుడిలాగా - అని బోధించింది ఆ తల్లి..
✍ఆ నాలుగు గుర్రాల పేర్లు ధర్మ, అర్థ, కామ, మోక్షాలనీ, ఆ విషయాలను బోధించే జట్కావాలా జగద్గురువైన శ్రీకృష్ణుడనీ చెప్పింది. నువ్వు కూడా జగత్తుకి ఈ నాలుగింటిని బోధించే గురువువి కావాలి, సరేనా! అంటూ అతడి ఆలోచనను చక్కని మలుపు తిప్పింది.
✍ఆ బిడ్డడే పెరిగి పెద్దయ్యాక వివేకానందుడుగా మనందరికీ తెలిసిన నరేంద్రుడు.
🙏నిజంగా, అమ్మ మాటలో ఎంత మహత్తు వుంది కదా!