దేవుని వద్ద కొబ్బరి కాయను కొట్టేది ఎందుకు?
సర్వదేవతలను పూజించే సమయాల్లోను, యజ్ఞ హోమదుల్లోను కొన్ని శుబకార్యాల్లోను కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతిక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కోడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసు స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం.
-------------------------------------------------------------------------
గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?
“ప్రదక్షిణం ” లో “ప్ర” అనే అక్షరము పాపాలకి నాశనము, “ద” అనగా కోరికలు తీర్చమని, “క్షి” అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మ జ్ఞానము ఇమ్మని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాబట్టి భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వా ప్రదిక్షణ అవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా నేను అన్ని వైపులా నుంచి నిన్నే అనుసరిస్తూ ద్యానిస్తున్నాని అర్థం.
-------------------------------------------------------------------------
ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం?
ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళడం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు.కాబట్టి ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వార ఆపదలను తొలగించి మనల్నిసుఖంగా ఉండేలా చూస్తాడు. మహేశ్వరుడు లయకారుడు. కాబట్టి రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందర పడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతున్ని దర్శించాలి.
-------------------------------------------------------------------------
గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళితే మరింత శుబమా?
తలస్నానం చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. మన నిత్య కృత్యాలతో మనసు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ, క్రోధ, లోభ ,మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగా పరిశుద్ధంగా చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు కనుక కనీసం శరీరం మొత్తాన్ని శుబ్రపరచుకొని దర్శించుకున్తున్నాము. ఈ శరీరంలా మనసుని శుచిగా, నిర్మలంగా ఉండేలా చెయ్యమనే అర్థమే పూర్తి స్నానం యొక్క భావము.
-------------------------------------------------------------------------
గుడిలో శడగోప్యం (శతగోపనం) తలమీద పెట్టడం ద్వారా ఎం ఫలితం వస్తుంది?
దేవాలయం లో దర్శనం అయ్యాక తీర్ధం, శాదగోపం తప్పక తీసుకోవాలి. శతగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టె పూజారికి కూడా విన్పించానంతగా కోరికను తలచుకోవాలి. అంటే మీ కోరికే శదగోపం. మానవునికి శత్రువులైన కామం. క్రోధం, లోభం, మొహం మదం, మాత్సర్యములు వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడం మరో అర్ధం. షడగోప్యం ను రాగి,కంచు, వెండి లతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలు ఉన్ట్టాయి. షడ గోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికివేలుతుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి.
-------------------------------------------------------------------------
దేవాలయాల్లో తల నీలాలు ఎందుకు సమర్పిస్తారు?
బ్రతుకు జీవన పోరాటంలో మనం చెప్పే అబద్ధాలకు, చిన్న మోసాలకు అంతే ఉండదు. మనావుడు చేసే సర్వ కర్మల పాపఫలం వెంట్రుకలను చేరుతుంది. అందుకే పాపాలకి నిలయమైన వెంట్రుకలను స్వామికి సమర్పించి, స్వామి ఇంతవరకు పాపాలను వదిలేస్తున్నాను. ఇకపై మంచిగా, ధర్మంగా, న్యాయంగా ఉంటానని చెప్పడమే తలనీలాలు ఇవ్వడము.
-------------------------------------------------------------------------
దేవాలయపు వెనుక బాగాన్ని ఎందుకు తాకరాదు?
చాల మంది ప్రదిక్షినలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని అద్ది నమస్కరిస్తుంటారు. అలా చేయరాదు. ఆ బాగంలో రాక్షసులు ఉంటారు. అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదిక్షిణ చేయాలి.
-------------------------------------------------------------------------
దేవాలయంలో ప్రదిక్షిణ చేసేటప్పుడు ఎలా నడవాలి?
వింటి నుంచి వెలువడ్డ బాణంలా వెనేకేవరో తరుముతున్నట్టు ప్రదిక్షణం చేయరాదు. నిండు గర్భిని నడిచి నట్టు అడుగులో అడుగు వేస్తూ అడుగడుగునా దేవుణ్ణి స్మరిస్తూ ప్రదిక్షణలు పూర్తి చేయాలి. అలాగే అర్ధ రాత్రి, మధ్యాహానము దైవదర్శనం చేయరాదు.
-------------------------------------------------------------------------
గుడిలో ఎలా ఉండాలి?
గట్టిగ నవ్వడము, అరవడము,ఐహిక విషయాల గురించి మాటలాడడం చేయరాదు. గుడి పరిసరాలని పరిశుబ్రంగా ఉంచాలి. బగవంతున్ని కనులార వీక్షించి ఆపై కనులు మూసుకొని ధ్యానం చేయాలి. దేవాలయం లో నిలుచుని తీర్థం తీసుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్దం పుచ్చుకోవాలి. దీపారాధన శివుడికి ఎడమ వైపు, శ్రీ మహా విష్ణువుకు కుడివైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపమైతే ఎడమపక్కగా, ఆవు నేతి దీపమైతే కుడు వైపు వెలిగించాలి.
-------------------------------------------------------------------------
ధ్వజస్థంభం
మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.
భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.
ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.
శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.
మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.
--------***---------
చిత్రగుప్తుని దేవాలయం
మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు పాపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరు అనుకుంటారు, కానీ ఇదంతా భ్రమ. మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది. ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది. ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెబుతుంది. కలియుగంలో అతని పేరిట గుళ్లు గోపురాలు కూడా ఉన్నాయి. మన రాజధాని నగరంలోనూ చిత్రగుప్తుడికో ఆలయం ఉంది. అసలు చిత్రగుప్తుడు ఎవరో, ఆయన మన పాప పుణ్యాల చిట్టా రాయడం ఏమిటో తెలుసుకుందాం...
యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. కానీ వీటిని వేళ్ల మీద లెక్కించొచ్చు. ముఖ్యంగా ఆసియా ఖండంలో చిత్రగుప్తుడి భక్తులు ఎక్కువగా ఉన్నారు భరతుడు పాలించిన భారత దేశంలో వీటిని నిర్మించారు. రాముడు సైతం చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది.స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్టు ప్రతీతి. దీన్ని ధర్మ హరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మధ్యప్రదశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో చిత్రగుప్త దేవాలయాలు ఉన్నాయి. జబల్ పూర్ లోని ఫూటాతాల్, షిప్రా నదీ తీరంలోని రామ్‌ఘాట్‌లో , ఉజ్జయినిలో రెండు దేవాలయాలు ఉన్నాయి. అవి దాదాపు రెండు శతాబ్దాలు దాటినవి అయి ఉంటాయి. అంటే ఒక్క మధ్య ప్రదేశ్‌లో నాలుగు చిత్ర గుప్త దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్ అల్వార్‌లో మూడు శతాబ్దాల చిత్రగుప్త దేవాలయం ఉంది. అదే రాష్ట్రం ఉదయపూర్‌లో మరో చిత్రగుప్త దేవాలయం ఉంది.
దక్షిణాదిన
ఉత్తర భారత దేశంలో అరుదుగా ఉన్న చిత్రగుప్త దేవాలయాలు దక్షిణాదిన తమిళనాడులోని కాంచిపురంలో ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రగుప్తుడి దేవాలయం కేవలం ఒకే ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైద్రాబాద్ పాతబస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో ఉంది. అయినా స్థానికులు చాలా మందికి ఇక్కడ చిత్రగుప్త దేవాలయం ఉందన్న విషయం తెలియదు. చిత్రగుప్తుడి గుడి గంట మోగే శబ్దం వినిపించడం కన్నా వారికి చావు డప్పు, బంధువుల శోకాలు వినిపిస్తుంటాయి. దేవాలయం ముందు నుంచి తరచుగా పీనుగులను మోసుకెళ్లే పాడెలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే దేవాలయానికి కూత వేటు దూరంలోనే నల్లవాగు స్మశాన వాటిక ఉండటంతో ఈ మార్గం గుండానే అనేక శవయాత్రలు వెళాల్సి ఉంటుంది. దేవాలయ పరిసరాల్లో సాంబ్రాణి పొగ వాసనకు బదులుగా శవం కాలుతున్న వాసనలే విపరీతం. పాతబస్తీలో ఇదే అతిపెద్ద స్మశానవాటిక అని చెప్పొచ్చు. అపుడపుడు కందికల్ గేట్ రైల్వే ట్రాక్ మీద ప్రమాదాలు జరిగి మృత్యువాత పడే జీవులెందరో. బహుశా ఆ భయంతోనే ఇక్కడ రాత్రిపూట పెద్దగా జనసంచారం ఉండదు. దీపావళి రెండో రోజు మాత్రమే ఘనంగా జరిగే ఉత్సవం తప్పించి మామూలు రోజుల్లో కూడా పెద్దగా పూజలు జరగవు.
దీపావళి రెండో రోజు యమద్వితీయ ఉంటుందని ఆరోజు చిత్రగుప్తుడి పుట్టిన రోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది.దీన్నే భాయ్ దూజ్ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం అని దేవాలయ పూజారీ రంచాచార్యులు చెప్పారు.అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతామన్నారు. అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదు ఆరోగ్యం, చదువు, పెళ్లి, సంతానం ఇలా అనేక వాటికి పరిష్కారం కోసం ఈ దేవాలయాన్ని దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. కేతు గ్రహ దోష నివారణకు కూడా ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయని మరో పూజారీ చంద్రకాంత్ జోషి తెలిపారు. ఈ దేవాలయానికి భక్తులు సంఖ్య కూడా అంతంత మాత్రమే.ఇంతటి విశిష్టమైన దేవాలయం అభివృద్ది కాకపోవడానికి వాస్తు దోషమేనంటారు ప్రముఖ వాస్తు నిపుణులు జాలిగామ నరేష్ కుమార్. తూర్పు ఆగ్నేయం పెరగడం,తూర్పు భారం,ఈశాన్యం బరువు, దక్షిణ నైరుతి గేటు తెరవడం వల్ల దేవాలయం ఖ్యాతి చెందడం లేదని ఆయన అన్నారు.
మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో
దాదాపు 250 ఏళ్ల క్రితం ఇక్కడ చిత్రగుప్త దేవాలయాన్ని నిర్మించారు. నిజాం నవాబుల కాలంలో రాజా కిషన్ పర్షాద్ దీన్ని అభివృద్ది చేశారు.కాయస్త్ సామాజిక వర్గానికి చెందిన రాజా కిషన్ పర్షాద్ రెండు సార్లు హైద్రాబాద్ సంస్థానానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. కిషన్ పర్షాద్ పూర్వికులు ఈ దేవాలయ అంకురార్పణకు కృషి చేసినట్టు వినికిడి. కిషన్ పర్షాద్ ముగ్గురు హిందువులను, నలుగురు ముస్లింలను పెళ్లి చేసుకున్నారు. హిందూ భార్యలకు పుట్టిన సంతానాన్ని హిందువులతో, ముస్లిం భార్యలకు పుట్టిన సంతానాన్ని ముస్లింలతో వివాహం జరిపించారు. వారి సంతానం అపుడపుడు ఈ దేవాలయానికి వస్తుంటారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వాస్తవానికి ఈ దేవాలయ నిర్మాత ఎవరు అనే విషయంలో స్పష్టత లేదు. ఉత్తర ప్రదేశ్, బీహార్ నుంచి వలస వచ్చిన కాయస్తులు దీన్ని నిర్మించారన్న ప్రచారం కూడా ఉంది. మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయ భూమి రోజు రోజుకి అన్యాక్రాంతమౌతుంది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన సత్రాలు కూడా కబ్జాకు గురయ్యాయి. ఈ సత్రాల్లోనే ఎన్నో కుటుంబాలు కాపురాలు చేస్తున్నాయి. సాధారణంగా సత్రాలలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మూడు నాలుగు రోజులకు మించి ఉండకూడదు. కానీ ఇక్కడ మాత్రం మూడు నాలుగు తరాల నుంచి తిష్ట వేసిన భక్తులు ఉన్నారు. సత్రాలలో ఉన్న భక్తుల గూర్చి వాకబు చేయడానికి వెళ్లగా అక్కడ ఓ వృద్ద మహిళ కనిపించింది. ఃఃఇది మా అత్తగారిల్లు.నా పెళ్లయిన నాటి నుంచి నేటి వరకు ఇదే ఇంట్లో ఉంటున్నాముఃః అని ఎంతో నిర్బయంగా చెప్పింది. 80 వ దశకంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కబ్జాదారులు ఈ భూమి విడిచి వెళ్లాలి కానీ ప్రభుత్వం వారిని ఇంతవరకు ఖాళీ చేయించలేక పోయింది. గేదెల పాక ఇదే స్థలంలో ఉండడంతో భక్తులకు కొంత అసౌకర్యం కలుగుతుంది.
దేవాలయ మెయింటెనెన్స్ కోసం ప్రయివేటు పాఠశాలకు కొంత స్థలం ఇచ్చారు. తెలుగు, ఇంగ్లీషు మీడియం ఉన్న ఈ పాఠశాల నెలకు ఎంత ఆర్జిస్తుంది. దేవాలయ నిర్వహణ కోసం ఎంత ఇస్తుంది అన్నది శేష ప్రశ్నే. చిత్ర గుప్త దేవాలయం కాల క్రమంలో నాలుగుళ్ల దేవాలయంగా మారింది. ఇక్కడే శివాలయం, సాయిబాబా ఆలయం, హనుమంతుడి ఆలయం, అయ్యప్ప ఆలయం ఇలా నాలుగు ఆలయాలు చిత్రగుప్త దేవాలయంలో కొనసాగుతున్నాయి కాబట్టి నాలుగుళ్ల దేవాలయంగా ఇటీవలి కాలంలో ఖ్యాతి పొందింది. ఈ నాలుగు గుళ్లకు కలిపి ఇద్దరు పూజలు ఉన్నారు. ప్రస్తుతం చిత్రగుప్త దేవాలయం గుడుంబా వ్యాపారులకు అడ్డాగా మారింది. కూలీ నాలీ పనిచేసే కార్మికులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండడంతో ఈ వ్యాపారం మూడుపూవులు ఆరుకాయలుగా వర్దిల్లుతుంది.దీంతో మహిళా భక్తులు దేవాలయానికి రావడానికి జంకుతున్నారు. దేవాలయ అభివృద్ది కోసం ఏర్పాటైన ట్రస్ట్ బోర్డ్ కార్యకలాపాలు కూడా సందేహా స్పదంగా ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన ఎండోమెంట్ కమిటీకి సుదర్శన్ రెడ్డి చైర్మెన్ ఉన్నారు. ఈయన నేతృత్వంలోని కమిటీకి, స్థానిక కమిటీకి విభేదాలు ఉండడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని స్థాని కులు ఆరోపిస్తున్నారు. హుండీ ఆదాయాన్ని పంచుకోవడంలో అనేక సార్లు గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. సరైన పర్యవేక్షణ లేదు. పంచలోహ విగ్రహం కొన్నేళ్ల క్రితం చోరీ అయ్యింది. చిత్రగుప్తుడు తన ఇద్దరు భార్యలతో కల్సి ఉన్న రాతి విగ్రహం ప్రస్తుతం ఇక్కడ కొలువుతీరింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనకపోతే చారిత్రాత్మక ఈ దేవాలయం ఆనవాళ్లు చెరిగి పోయే ప్రమాదం ఉంది.
నిజాం నవాబుల హాయంలో నిర్మించిన చిత్రగుప్త దేవాలయం ప్రహారి గోడలు మట్టితో నిర్మించినవే. ఎంతో మందంగా నిర్మించిన తూర్పువైపు గోడ వచ్చే తరాలు ఇక చూడక పోవచ్చు.ఈ గోడకే ప్రధానద్వారం ఉంది. కందికల్ గేట్ వద్ద ఉన్న రైల్వే లెవల్ క్రాస్ వద్ద నిర్మిస్తున్న రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్‌ఓబి) డిజైన్‌లో భాగంగా ప్రహారి గోడను కూల్చే ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించడానికి 27 కోట్లతో ఈ ఓవర్ బ్రిడ్జి ని నిర్మిస్తున్నారు. మాస్టర్ ప్లాన్‌లో ఈ గోడ ఉన్నప్పటికీ అక్రమణదారులు అడ్డుకోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. ప్రహారి గోడకు ఆనుకుని ఉన్న ఇళ్లు, దుకాణాలకు నష్టపరిహారం క్రింద ప్రభుత్వం ఇప్పటికే చెక్కులను పంపిణీ చేసింది.వారంతా ఖాళీ చేయడంతో జిహెచ్‌ఎంసి వీలయినంత త్వరలో చిత్రగుప్త గోడను కూల్చడానికి సిద్దమౌతుంది. పొడవైన ఈ ప్రహారిగోడను కూలిస్తే చిత్రగుప్త దేవాలయం తన పూర్వవైభవాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
బ్రహ్మపుత్రుడు చిత్రగుప్త
సృష్టి కర్త బ్రహ్మకు ఎందరో పుత్రులు, పుత్రికలు ఉన్నట్టు పౌరాణిక కథలు చెబుతున్నాయి. అతని మానసపుత్రులు వశిష్ట, నారద, ఆత్రిలతో పాటు మాయా, కామం, యమ ధర్మ, భరత ఇలా ఎందరికో జన్మనిచ్చిన బ్రహ్మకు చిత్రగుప్తుడు సైతం సంతానమే. కానీ మిగతా సంతానంతో చిత్రగుప్తుడు వైవిధ్యమనే చెప్పాలి. బ్రహ్మకు పుట్టిన పిల్లలకు చిత్రగుప్తుడికి చాలా తేడా ఉంది. బ్రహ్మ శరీరంలో నేరుగా పుట్టిన బిడ్డ చిత్రగుప్తుడు. గరుడ పురాణంలో లిఖితపూర్వ కంగా ఆయన ప్రస్తావన ఉంది. పుట్టిన ప్రాణి గిట్టక మానదు. ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికీ మరణం తప్పదు. ఎందుకంటే విధి విధానం అది. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మృత్యు ఒడిలో ఎప్పుడయినా సేదతీరాల్సిందే. మరణించిన తర్వాత ఏమవుతుంది ఇది ఎప్పటికీ రహస్యమే. ఈ రహస్యాన్ని కూడా చేధించడం ఇంతవరకు సాధ్యం కాలేదు. కానీ వేదాలు,పురాణాల్లో మాత్రం ఈ భూలోకం మీద దివ్య లోకం ఉంటుంది. అక్కడ మృత్యుశోకమే ఉండదు.ఆ దివ్య లోకంలో దేవతలు నివాసముంటారు. ఆ దివ్యలోకం పైన బ్రహ్మ, విష్ణు, శివ లోకాలు ఉంటాయి. ఎప్పుడయితే కర్మఫలానుసారం పాప కార్యాల వల్ల దోషులవుతారో వారు యమలోకం వెళ్లాల్సి ఉంటుంది.
భూలోకంలో జీవులు చనిపోయిన తర్వాత వాటి ఆత్మలు నరకానికో, స్వర్గానికో వెళతా యని అంటుంటారు. నరక లోకానికి ప్రాతి నిధ్యం వహిస్తున్న యమధర్మ తీవ్ర గందర గోళంలో ఉండేవాడట. పాపాలు చేసి చనిపో యిన వారి ఆత్మలతో పాటు పుణ్యాలు చేసిన వారి ఆత్మలు కూడా తన వద్ద వస్తూ ఉండ డంతో కొంత అనిశ్చిత పరిస్థితి ఎదుర్కొ న్నాడు. కొడుకు ఎదుర్కొంటున్న సమస్య తండ్రి బ్రహ్మకు అర్థమైంది. బ్రహ్మ సృష్టించిన నాలుగు వర్ణాలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, క్షూద్ర ఉన్నాయి.నోటి నుంచి బ్రాహ్మణ, భుజాల నుంచి క్షత్రియ, తొడల నుంచి వైశ్య, పాదాల నుంచి క్షూద్ర వర్ణాలు పుట్టాయట.
అయితే జీవుల పాప పుణ్యాలకు సంబంధిం చిన వివరాలు సేకరించడానికి బ్రహ్మకు ప్రత్యేకమైన నెట్ వర్క్ లేదు. ఇందుకు పరిష్కారం వెతికే క్రమంలో బ్రహ్మ 11వేల సంవత్సరాలు ధాన్య ముద్రలోకి వెళ్లాడు. ధ్యానముద్రలో ఉన్న బ్రహ్మ కళ్లు తెరిచి చూసేసరికి ఆజానుబాహుడు కనిపిస్తాడు. చేతిలో పుస్తకం ,పెన్ను, నడుం భాగంలో కత్తి కనిపిస్తుంది. అపుడు బ్రహ్మ పురుషా నీవు ఎవరివి. ఎచటి నుండి వచ్చావు అని అడిగాడు. అపుడు ఆ పురుషుడు మీ చిత్ర్ (శరీరం)లో గుప్త్(రహస్యం)గా నివాస మున్నాను. ఇపుడు నాకు నామకరణం చేయండి, నా కార్యకలాపాలు ఏమిటో చెప్పండి అని ప్రాధేయపడతాడు. అపుడు బ్రహ్మజీ ఈ విధంగా అన్నారు. నీవు నా శరీరంలో రహస్యంగా తలదాచుకున్నావు కాబట్టి నీ పేరు చిత్రగుప్త.అదే పేరుతో వెలుగొందుతావు. అంతే కాదు జీవుల శరీరాల్లో తలదాచుకుని వారి మంచి చెడుల గూర్చి తెలుసుకుని పాపాత్ములకు శిక్షలు పడే విధంగా కృషి చేయి అని ఆశీర్వదిస్తాడు బ్రహ్మ. చిత్రగుప్తను సంస్కృతంలో కాయస్త్ అంటారు. కాయం అంటే శరీరం. అస్త్ అంటే అదృశ్యం అని అర్థం.ప్రస్తుతం ఇదే పేరు ప్రాచుర్యంలో ఉంది.
యమపురికి దారి తెలియాలంటే మనిషి చచ్చేవరకు బతకాల్సిందే. బతికున్నప్పుడు చేసిన మంచి,చెడులు, పాప,పుణ్యాల మీద స్వర్గమా నరకమా డిసైడ్ అవుతుంది. కాబట్టి దుష్టులు,దుర్మార్గులకు మాత్రమే ఈ అడ్రస్ తెలిసే అవకాశం ఉంటుంది. వారిని తీసుకెళ్లడానికి ఎటువంటి ఫ్లయిట్లు మన వ్యవస్థలో లేవు. యమభటులే వారిని పద్దతి ప్రకారం ఎంత దూరం తీసుకెళ్లాలో అలా తీసుకెళ్లి యమపురికి చేర్చుతారు. బహుభీతి గ్రామం దాటిన తర్వాత వచ్చేదే యమపురి. దీనికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. దక్షిణాన ధర్మ ధ్వజుడు అనే ద్వార పాలకుడు కావలి కాస్తుంటాడు. తమ వెంట తీసుకెళ్లిన ఈ జీవి చేసిన పాప పుణ్యాల గూర్చి యమభటులు ఆ ద్వార పాలకుడికి సంక్షిప్తం గా సమాచారం అందిస్తారు. ఆ ద్వార పాలకుడు విన్నదంతా చిత్రగుప్తుడికి వివరి స్తాడు. చిత్రగుప్తుడేమో యమధర్మరాజు దగ్గరికి వెళ్లి ఇదే విషయాన్ని చెబుతాడు. నిజానికి యమధర్మరాజు వద్ద వచ్చిన జీవుల పూర్తి బయోడేటా ఉన్నప్పటికీ పరిపాలన పద్దతి ప్రకారం జరగాలన్న ఉద్దేశ్యంతో చిత్రగుప్తుడి ద్వారా సమాచారం తెప్పించు కుంటాడు. చిత్రగుప్తుడు కూడా యమభటులు చెప్పిన విషయాన్ని ప్రాతి పదికగా తీసుకోకుండా శ్రవణులు అనే యమలోకవాసులను అడిగి తెలుసు కుంటాడు. అంటే గూఢచారులు ఆ కాలంలో నుంచే ఉన్నారన్నమాట. యమ లోకంలో శ్రవణులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ శ్రవణులు బ్రహ్మదేవుడి కుమారులు. స్వర్గ, మత్స్య, పాతాళ లోకాల్లో వారు సంచరిస్తుంటారు. కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోని ధ్వనిని వినే శక్తి, చూడగలిగే దృష్టి వీరికి ఉంది. అందుకే వారిని శ్రవణులుగా పిలుస్తుంటారు. వీరి భార్యల పేర్లు కూడా శ్రవణులు. యమలోకానికి వచ్చే స్త్రీల విషయాన్ని ఆరా తీస్తారు. వీరు కూడా చిత్రగుప్తుడికి జవాబుదారిగా ఉంటారు. ఇంత పారదర్శకంగా జరుగుతున్న పరిపాలన వల్లే యమపురిలో తప్పు చేసిన ప్రతి వ్యక్తీ శిక్ష నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉంది. పాపాత్ములందరికీ యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. కానీ అతి భయంకరంగా. యముడి చేతిలో దండం ఉంటుంది. దున్నపోతు మీద కూర్చుని ఉంటాడు. తళ తళ లాడే ఆయుధాలు ఆయన చేతిలో ఉంటాయి. ఎర్రని గుంత కళ్లతో, కోరలున్న ముఖంతో, పొడవైన ముక్కుతో కనిపిస్తాడు యమ ధర్మరాజు. ఇదే సమయంలో చిత్రగుప్తుడు ఒక ప్రకటన చేస్తాడు. మీరు చేసిన పాపాల ఫలితంగానే మీరు ఇక్కడికి వచ్చారు. ఇందులో యమధర్మ రాజుది ఎటువంటి లోపం లేదుఃః అని చెబుతాడు. యమధర్మరాజు ఏ జీవిని డైరెక్ట్‌గా తీసుకెళ్లి పాపకూపానికి పంపించడు. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాకే పాపాత్ములకు శిక్ష విధిస్తాడు అని గరుడ పురాణం చెబుతోంది. చిత్రగుప్తుడు హిందువు ల్లోని కాయస్త్ కులానికి చెందిన వాడిగా అందరూ భావిస్తుంటారు. కాయస్తుల కుల దైవం కూడా
చిత్రగుప్తుడే.చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు
చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు.మొదటి భార్య సూర్యదక్షిణ నందిని. ఈమె బ్రాహ్మణ స్త్రీ, నలుగురు కొడుకులు.వారి పేర్లు భాను, విభాను, విశ్వభాను, వీర్యభాను. నలుగురు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు పక్షిణి, మాలతీ, రంభ, నర్మదా.రెండో భార్య పేరు పార్వతీ శోభావతి. ఈమె క్షత్రియ స్త్రీ, ఎనిమిదిమంది కొడుకులు ఉన్నారు. వారి పేర్లు చారూ, సుచారు, చిత్రాఖ్య, మతిమాన్, హిమవన్, చిత్ర్‌చారు,అరుణ, జితేంద్రలు. కూతుళ్లు ఎనిమిది మంది. వారి పేర్లు భద్రకాళిని, భుజ్ గాక్షి, గడ్ కీ, పంకజాక్షి, కొకల్సూత్, సుఖ్ దేవి, కామ కాల్, సౌభాగ్యినిలు.
వేదాలలో
వేదాలలో కూడా చిత్రగుప్తుడి గూర్చి ఉంది. యమధర్మరాజు మనుషులు చేసిన పాపాలు, పుణ్యాల గూర్చి తన వద్ద సమాచారం అస్పష్టంగా ఉందని బ్రహ్మతో మొరపెట్టుకుం టాడు. అపుడు బ్రహ్మ చిత్రగుప్తుడిని సృష్టిస్తాడు. పద్మ పురాణంలో చిత్రగుప్తుడు యమధర్మరాజు మనుషులు చేసిన మంచిచెడు విషయాల రికార్డు తయారు చేశాడు. భవిష్యపురాణంలో చిత్రగుప్తుడి సంతానం కాయస్త్ పేరిట భూలోకాన పరిఢవిల్లుతుంది. విజ్ఞాన తంత్ర కూడా అదే విషయాన్ని చెబుతుంది.

చిత్రగుప్తుడి పూజా సామాగ్రి
చిత్రగుప్తుడి పూజలో పెన్ను, పేపరు, ఇంక్, తేనె, వక్క పొడి, అగ్గిపెట్టె, చెక్కెర, గంధం చెక్కె, ఆవాలు, నువ్వులు,తమలపాకులు ఉంటాయి. న్యాయం, శాంతి, అక్షరరాస్యత, విజ్ఞానం ఈ నాలుగు గుణాలు పొందడానికి చిత్ర గుప్తుడి పూజా సామాగ్రిలో ఉంటాయి.
అకాలమృత్యువును జయించొచ్చు
వాన రాకడ ప్రాణం పోకడ తెలియదంటారు పెద్దలు. వాన వచ్చే విషయాన్ని అయినా కొంతవరకు చెప్పవచ్చుగానీ ప్రాణం పోకడ గూర్చి ఎవరూ చెప్పజాలరు. అకాల మృత్యువు వల్ల ఆ కుటుంబం దిక్కులేకుండా పోతుంది. వారి మీద ఆధారపడ్డ వారంతా అనాథలవుతారు. పిల్లల చదువులు, పెళ్లిల్లు అర్దాంతరంగా ఆగిపోతాయి.
పుట్టినవారు గిట్టక మానరు కానీ అకాల మృత్యువును జయించడం సాధ్యం కాదు. దీన్ని ఎదుర్కోవడానికి చిత్రగుప్తుడు కొంతవరకు సహకరిస్తాడని భక్తుల నమ్మకం. ఎందుకంటే చిత్రగుప్తుడు యమ ఆస్థానంలో అకౌంటెంట్ లేదా రికార్డ్ కీపర్. మనం చేసిన పాపపుణ్యాల చిట్టా చిత్రగుప్తుడి వద్ద ఉంటుంది.పాపాల చిట్టా పెరిగినప్పుడే యముడు తన లోకానికి తీసుకెళ్తాడన్న ప్రచారం ఉండనే ఉంది.

కాయస్థుల కులదైవం
కాయస్త్ కుటుంబాల్లో చిత్ర గుప్తుడి ఆరాధన విశేషంగా జరుగుతుంది. కోటి కాగి తాల మీద ఓం అనే అక్షరాన్ని రాసే సంప్రదాయం ఇప్ప టికీ కొనసాగుతోంది. "ఓం" అంటే బ్రహ్మ తాత్పర్యార్థం. పురాణ, ఇతిహాసాల ప్రకారం సృష్టిలో కోటి కోటి బ్రహ్మం డాలు ఉన్నాయి. వాటికి రచయిత బ్రహ్మ. పాలకుడు విష్ణు, నాశనకారి శంకరుడు. కానీ చిత్రగుప్తుడు మాత్రం ఒకడే. అతనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడికి మూలం. బ్రహ్మ యొక్క ఆత్మ అని కూడా సంభోదిస్తుంటారు. వైదిక కాలం నుంచి కాయస్థులు ప్రతీ దేవీ దేవతలను కొలుస్తుంటారు. ప్రతి మతాన్ని వాళ్లు విశ్వసిస్తుంటారు. ప్రతి ఒక్కరిలో పరబ్రహ్మ(చిత్రగుప్తుడు)ఉంటాడు. అల్లా అయినా, జీసస్ అయినా వాళ్లు నమ్ముతారు. ఈ కారణం గానే కాయస్థులు అన్యమతస్థులతో కూడా మంచి సంబం ధాలు కొనసాగిస్తుంటారు. చిత్రగుప్తుడి మొదటి భార్య బ్రాహ్మణురాలు అయినప్పటికీ కాయస్థులు పెద్దగా మడీ ఆచారాలు పాటించరు. అంటరాని కులాలు అయినా, ఇతర మతాలు అయినా వారిని చేరదీస్తుంటారు. ఎవరినీ బహిష్కరించరు. ఆకారం లేని చిత్రగుప్తుడికి గుళ్లు గోపురాలు లేవు. ఎలాంటి చిత్రపటాలు లేవు. ఎటువంటి విగ్రహాలు లేవు. ఎటువంటి పండుగలు, పబ్బాలు లేవు. ఎటువంటి చాలీసాలు లేవు. ఎటువంటి స్తోత్రాలు లేవు. ఎటువంటి ఆరతిలు లేవు. పురాణ ఇతిహాసాలలో పెద్దగా ప్రస్తావన లేదు. కానీ కలియుగంలో విగ్రహ పూజతో బాటు వివిధ రకాల పూజలు పెరగడంతో కాయస్థులు కూడా చిత్రగుప్తుడి చిత్ర పటం లేదా విగ్రహాన్ని పూజించడం ప్రారంభించారు. దాదాపు 600 ఏళ్ళ నుంచి ఇటువంటి పూజలు జరుగుతున్నప్పటికీ కాయస్తుల అస్థిత్వం మాత్రం వైదిక కాలం నుంచి ఉంది. బ్రహ్మ శరీరంలో పుట్టిన చిత్రగుప్తుడి రూపం, వేషధారణ అంతా అశాస్త్రీయం, కాల్పనికం. భ్రమలతో కూడిన కథల ఆధారంగా జయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. వాస్తవానికి చిత్రగుప్తుడు అనాది నుంచి ఉన్నాడు. అనంత విశ్వంలో ఉన్నాడు. అతనికి జన్మలేదు, అతను అమరత్వం పొంది ఉన్నాడు. చిత్రగుప్తుడి రూపం వేషం గూర్చి ఎటువంటి వర్ణనలు లేవు.
వ్రత కథ
పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతని పేరు సదాస్. ఈ రాజు పాపాలు చేసేవాడు. ఈ రాజు ఎవ్వరికీ పుణ్యకార్యం చేయలేదు. ఒకసారి వేటకు వెళ్లిన సమయంలో అడవిలో తప్పిపోతాడు. అక్కడ ఓ బ్రాహ్మ ణుడు కనిపిస్తాడు. అతను పూజ నిర్వహి స్తుంటాడు. రాజు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి ఓ బ్రాహ్మణా నీవు ఎవరి పూజ చేసు ్తన్నావు ఇందుకు ఆ బ్రాహ్మణుడు సమా ధానమిస్తూ ఇవ్వాళ కార్తిక శుక్ల ద్వితీయ (యమ ద్వితీయ). ఈ రోజు నేను యమ రాజు, చిత్రగుప్తుడి పూజ చేస్తున్నాను. ఈ పూజ చేయడం వల్ల నరకం నుంచి విముక్తి పొందొచ్చు అపుడు ఆ రాజు పూజా విధానం తెలుసుకుని ఇంటికి వెళ్లి పూజ చేస్తాడు. విధి ప్రకారం ఒక రోజు యమ దూత రాజు ప్రాణం తీసుకోవడానికి వస్తాడు. రాజు ఆత్మను గొలుసులతో బంధించి తీసుకె ళ్తాడు. యమరాజు దర్బార్ కు వచ్చిని రాజును యమధర్మరాజు ముందు ప్రవేశ పెడ్తారు. అపుడు చిత్ర గుప్తుడు తనదగ్గరున్న విధి పుస్తకాన్ని తెరిచి చదువుతాడు. యమ ధర్మరాజా ఈ రాజు చాలా పాపాలు చేశాడు. కానీ ఇతను కార్తిక శుక్ల ద్వితీయ తిథి రోజు వ్రతమాచరించాడు. అతని పాపాలు నివారమ య్యాయి. ధర్మానుసారం ఈ రాజుకు విముక్తి ప్రసాదించాలి అని ప్రాధేయపడ తాడు చిత్రగుప్తుడు. దీంతో ఆ రాజు నరక లోకం నుంచి విముక్తి పొందుతాడు. ప్రస్తుతం ఈ కథ ప్రాశస్త్యంలో ఉంది.
-------------------------------------------------------------------------
శివతాండవాన్ని బ్రహ్మదేవుడు చిత్రించిన పుణ్యస్థలి ! కుట్రాలం
తమిళనాడులోని కుట్రాలం అనే పేరు వినగానే, అందరి మదిలో అదొక పర్యాటక స్థలంగానే మెదలుతుంటుంది. కుట్రాలంలోని కొండలు, ఆ కొండల పై నుండి జాలువారుతోన్న జలపాతాలే మన మదిలో మెదలడం సహజం. పేదవాళ్ళ ఊటీగా పేర్కొనబడుతున్న కుట్రాలానికి ఆ పేరు ఏర్పడటానికి కారణం అక్కడ నెలకొన్న కుట్రాలీశ్వరుడే ! పంచసభలలోని ఇంద్రసభ ఇక్కడ ఉన్నదని ప్రతీతి. ఇంతటి ఘనచరిత్ర గలిగిన ఈ పుణ్యస్థలం గొప్పదనాన్ని ఎందరో తమిళకవులు తమ కీర్తనలలో నిక్షిప్తం చేసారు. తిరుజ్ఞాన సంబంధర్, తిరునావుక్కరసు, అరుణగిరినాథర్ వంటి కవులు ఈ క్షేత్రమహత్యాన్ని తమ కీర్తనల ద్వారా లోకానికి చాటారు. వేదవ్యాస విరచితమైన 'తామ్రపర్ణి మహాత్మ్యం'లో ధరణీపీఠం గురించి, శెన్బగదేవి గురించి, కుట్రాలీశ్వరుని గురించి విపులంగా వివరించబడింది. ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కుట్రాలం యొక్క గొప్పదనం అర్థమవుతుంది.
పూర్వము ఈ పుణ్యభూమి పృథులలో చెప్పిన నియమాలనుననుసరించి పరిపాలన చేస్తున్న పృథువు రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో విలసిల్లసాగారు. ఆ రాజ్యంలో బృహస్పతి వంశావళికి చెందిన రోచిష్మానుడు, సురుచి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. నాలుగు వేదాలను, సకల శాస్త్రాలను ఔపోసన పట్టిన ఈ అన్నదమ్ములు అపర విష్ణుభక్తులు, అయితే, వారు అపరిమితమైన విష్ణుభక్తి పరాయణత్వంతో దేశంలోని అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ శివనింద చేయసాగారు. విష్ణువేగొప్ప, శివుడు గొప్ప కాదన్న వాదనలతో దేశమంతా పర్యటిస్తుండేవారు. ఆ నోట, ఈనోట ఈ విషయం పృథుమహారాజు చెవిన పడింది. విషయం విన్నంతనే ఎంతో కలత చెందిన పృథువు, నేరుగా కైలాసానికి వెళ్ళి శివునితో ఈ విషయాన్ని వినమ్రతతో విన్నవించాడు.
"పరమేశ్వరా ! నాదేశంలో శివభక్తి పరాయణులు ఉండాలి. అందుకు నువ్వే ఏదైనా మార్గాన్ని చూపాలి" అని వేడుకున్నాడు అతని ప్రార్థనను విన్న శివపరమాత్మ, "తగిన సమయంలో అగస్త్య మహాముని ద్వారా అందుకు తగిన ప్రయత్నాలు మొదలవుతాయి" అని పృథువును స్వాంతన పరిచాడు. అందుకు తగినట్లుగానే, కొన్నాళ్ళ తర్వాత అగస్త్య మహామునీశ్వరుడు కుట్రాలంలోనున్న విష్ణు సన్నిధికి శివచిహ్నాలతో వచ్చాడు, ఆ దృశ్యాన్ని చూసిన విష్ణుభక్తులు అగస్త్యుని విష్ణుసన్నిధికి రాకుండా అడ్డుకున్నారు. వారి గొడవకు ఆరోజున తిరిగి వెళ్ళిపోయిన అగస్త్యుడు మరుసటి రోజున ఓ విష్ణుభక్తునివలె వేషాన్ని వేసుకుని విష్ణ్యాలయానికి చేరుకున్నాడు, అగస్త్య మునీశ్వరుని ఆవిధంగా చూసిన విష్ణుభక్తులు, ఆయన్ని సాదరంగా ఆహ్వానించి, ఆలయం లోపలకు తీసుకెళ్ళి, ఆయన్నే పూజావిధులు నిర్వహించమని చెప్పారు. గర్భగృహంలోకి వెళ్లిన అగస్త్యుడు, శివుని ధ్యానిస్తూ పూదండతో విష్ణువును తాకాడు. అంతే ఆ మరుక్షణమే, నిల్చున భంగిమలో నున్న విష్ణుమూర్తి ప్రతిమ క్షణమాత్రములో శివలింగంగా మారిపోయింది. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలోనున్న విష్ణు పరివార దేవతలంతా శివపరివార దేవతలుగా మారిపోయారు.
ఆ దృశ్యాన్ని చూసిన విష్ణుభక్తులు స్తంభించిపోయారు. అక్కడున్న సురుచి ఆవేశంతో ఊగిపోయాడు. ఫలితంగా అగస్త్యునికి, సురుచికి మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం మొదలైంది. అప్పుడు ఆకాశవాణి పలుకుతూ, ఎవరైనా మధ్యవర్తిని పెట్టుకుని వాదనలను కొనసాగించమని చెప్పింది. ఆ మరుక్షణం శివుని ఎడమభాగం వైపు నున్న ధరణి పీఠం నుంచి ఒక దేవి ఆవిర్భవించింది. ఆ దేవి మధ్యవర్తిత్వం వహించగా, అగస్త్య, సురుచిల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలో ఎవరైతే ఓడిపోతారో, వారు తెలిచిన వారి మతాన్ని అనుసరించాలన్న నిబంధనతో సుమారు ఐదురోజులపాటు వాదన కొనసాగింది. చివరగా అగస్త్యమహామునీశ్వరుడే గెలిచాడు. ఫలితంగా అక్కడున్న విష్ణుభక్తులంతా అగస్త్యుని ద్వారా శివదీక్షను స్వీకరించారు. ఈ వాదనకు మధ్యవర్తిత్వం వహించింది ఆ పరాశక్తియే. ఆ ధరణిపీఠ నాయకి సృష్టి, స్థితి, సింహారము అనే మూడింటిని నిర్వహిస్తుంటుంది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేద అనే మూడు వేదాలరూపంగా భాసించే ధరణీపీఠనాయకి తెలుపు, ఎరుపు నలుగు రంగులతో దర్శనమిస్తుంటుంది. అప్పుడు జరిగిన వాదప్రతివాదనలకు సాక్ష్యంగా కుట్రాలం లో కొలువైన ధరణీపీఠ నాయకి, భక్తజనులను తన కరుణాపూరిత దృక్కులతో కరుణిస్తోంది.
ఇక కుట్రాలంలో ప్రధాన నదీదేవి చిత్రాననదీ దేవి. ఈ నదికి కొంచెం పై భాగంలో శెన్బగవనం అని పిలువబడుతుండేదట. ఒకానొకప్పుడు ఈ ప్రాంతంలో శుంభనిశుంభులు శివునివల్ల అనేక రకాల వరాలను పొందారు. పురుషుల వలన మరణం రాకుండా వరాన్ని పొందిన వీరు, యజ్ఞభాగాలను అపహరిస్తూ, అందరినీ బాదిస్తుండటంతో మునులమొరలను ఆలకించిన ఆది పరాశక్తి వారిద్దరినీ సంహరిస్తుంది. ఇదంతా చూసిన శుంభనిశంభుల గురువు ఉదంబరునికి వణుకు పుట్టింది. ఆదిపరాశక్తి తనను కూడా సంహరిస్తుందని వణికిపోయాడు. ఆదిపరాశక్తి కంట్లో పడకుండా ఎక్కడ తల దాచుకోవాలన్న విషయమై తర్జనభర్జనలు పడి యముడిని ఆశ్రయించాడు. ఉదుంబరుని పరిస్థితిని అర్థం చేసుకున్న యముడు కుట్రాలం ప్రక్కనున్న ఓ పర్వతారణ్యములో దాక్కుని ఉండమని చెప్పాడు. అలా ఆ పర్వతారణ్యములో దాక్కున్న ఉదుంబరుడు పగలంతా ఎవరికీ తెలియకుండా నక్కి ఉండి, రాత్రయితే బయటకు వచ్చి అన్ని జీవులను పీడిస్తుండేవాడు, ఆ రాక్షసుని ఆగడాలకు తట్టుకోలేకపోయిన మునీశ్వరులు దేవితో మొరపెట్టుకోగా, ఆ రాక్షసుని, అతని పరివారముతో సహా అంతమొందించింది.
అనంతరం ఆ ఋషిపుంగవులతో దేవి, "మీకు తోడుగా నేను కూడా ఇక్కడే కొలువై వుంటాను" అని ఓ చెట్టు కింద ధరణీపీఠ నాయకిగా కొలువై భక్తులను కరుణిస్తోంది. ఈ పవిత్ర ప్రదేశం కుట్రాలము జలపాతాలకు సుమారు మూడు కిలోమీటర్ల దూరములో ఉంది. ఇక్కడున్న తీర్థాన్నిదేవి పేరుతో శెన్బగతీర్థం అని పిలుస్తూంటారు. ఈ దేవికి చైత్రమాసంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతూంటాయి. కుట్రాలీశ్వరుని ఉత్సవాలు జరిగేముందు, ముందుగా ఈ అమ్మవారికే పూజలు జరుగుతూంటాయి. ఈ ఆమ్మవారి ఆలయానికి పైభాగములో 'శివమధుగంగ' అనే జలపాతం ఉంది. ఇక్కడ గంగాదేవి శివలింగానికి తేనెతో అభిషేకం చేసినందువల్ల ఈ జలపాతదారకు 'శివమధుగంగ' అనే పేరు ఏర్పడిందని ప్రతీతి. ఇక్కడ పౌర్ణమి రోజున పసుపువర్ణంతో కూడిన వర్షం పడుతుంటుందని పెద్దలు చెబుతుంటారు. అదేవిధంగా పరమశివుడు ఐదుచోట్ల తాండవనృత్యం చేసాడని ప్రతీతి. ఇక్కడ స్వామివారు నృత్యం చేసిన సభచిత్రసభగా పిలువబడుతోంది. ఈ చిత్రసభ మిగతా సభల కంటే భిన్నమైనది. మిగతా నాలుగు సభలలో శివుడు విగ్రహరూపంలో గోచరిస్తుండగా, ఇక్కడ మాత్రం చిత్రరూపంలో దర్శనమిస్తూంటాడు. శివతాండవాలలో ఒకటైన త్రిపురతాండవము ఈ చిత్రసభలో జరిగిందట.
ఈ చిత్రసభకు ముందు కోనేరు, దాని మధ్యలో ఓ మంటపం ఉంది. చిత్ర సభలో పరమశివుడు దేవేరితో పాటు తాండవం చేస్తుండగా, ఆ దృశ్యాన్ని బ్రహ్మదేవుడు ఓ గోడపై చిత్రీకరించాడని పురాణకథనం. అందువల్లనే వ్యాసభగవానుడు ఈ సభను చిత్రసభ అని పిలుచుకున్నారు. ఇక్కడ మార్గశిర మాసంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. కుట్రాలీశ్వరుని ఆలయ ప్రాంగణంలో కుళళ్ వాయ్ మొళియమ్మన్ ఆశయం ఉంది. నత్తి, మూగ తనంతో బాధపడేవారు ఈ అమ్మవారిని మొక్కుకుంటే చక్కని ఫలితం ఉంటుందని భక్త జనుల విశ్వాసం. ఈ కుట్రాలీశ్వరుని ఆలయంలో రోజుకు తొమ్మిది సార్లు పూజలు జరుగుతూంటాయి. చిత్రసభలో ఆరుద్ర దర్శనం జరుపబడుతుంటుంది. ఆ సమయంలో తాండవ దీపారాధన జరుగుతూంటుంది. సంవత్సరానికి ఒకసారి జరుపబడే ఆరుద్ర దర్శన పండుగ సమయంలో బ్రహ్మ, విష్ణువులతో పాటు సమాస్త దేవతలు ఇక్కడకు వస్తారని ప్రతీతి. ఇంకా చైత్రమాసంలో వసంతోత్సవం, కార్తీకమాసముతో పవిత్రోత్సవం, నవరాత్రి, స్కందషష్ఠి అంటూ అన్నీ ప్రధాన పండుగలు ఈ ఆలయములో జరుపబడుతూంటాయి.
జూన్ నుంచి సెప్టెంబర్ లోపు కుట్రాలానికి వెళితే వర్షాకాలం కావడం వలన గలగల పారే నిండుజలపాతాలను చూడొచ్చు. కుట్రాలానికి రైలు ప్రయాణ సౌకర్యం లేదు. కాబట్టి బస్సులోనే అక్కడకు చేరుకోవలసి ఉంటుంది. కుట్రాలంలో బస సౌకర్యాలకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించాలనుకునే వారికి ఇదొక అపురూప అవకాశం.

----------------------------------------------------
శివలింగంపై కొప్పు
అగస్త్యుడు: ఒకానొక సమయంలో వింధ్య పర్వతానికి మేరు పర్వతంపై అసూయ కలిగి, తాను అదే పనిగా పెరిగిపోతూ గ్రహనక్షత్రమండల గమనానికి అవరోధం కలిగించసాగింది. అందుకు సూర్యుడు తన చుట్టూ తిరుగక మేరువు చుట్టూ తిరగడమే ప్రధాన కారణం. అలా వింధ్య పర్వతం పెరిగిపోవడంతో లోకవ్యవహారం దెబ్బ తిన్నది. దేవతలు వింధ్య పర్వతాన్ని ప్రార్థించారు. ఆయన వినలేదు, తగ్గ లేదు. చేసేదేమీలేక దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అంత బ్రహ్మ ఈ ఉపద్రవము నుండి మిమ్ము రక్షించువాడు అగస్త్యుడు తప్ప మరెవరూ లేరని సెలవిచ్చారు. దేవతలు తిన్నగా అగస్త్యుని వద్దకు చేరి విషయం విశదపరిచారు. విన్న అగస్త్యుడు భయము వలదని వారికి అభయమిచ్చి తాను వింధ్య పర్వత ప్రాంతాన్ని సమీపించాడు. అంత దూరాన అగస్త్యుని చూచిన వింధ్య, పూర్వం వలె ఒదిగిపోయింది. గ్రహ గమనము మరలా ప్రారంభమైంది. వింధ్య పురుషాకృతి దాల్చి అగస్త్యునకు సాష్ఠాంగదండ ప్రణామం చేసి ఆయన రాకకు కారణం వినగోరాడు.
అందుకు సమాధానంగా ఆ మహా ముని “నేను దక్షిణాపథంలో ఉన్న తీర్థములను చూడ బయలుదేరాను. నేను తిరిగి వచ్చేవరకూ నీవు ఇలాగే ఉండవలెను” అని ఆదేశించగా వినమ్రంగా వింధ్య అంగీకరించి అలాగే ఉండి పోయింది. అప్పటి నుండి ఆయన దక్షిణ భారతంలోనే స్థిరపడి పోయారు. ఆయనకిచ్చిన మాట మేరకు వింధ్య పర్వతం కూడా అలాగే ఉండి పోయింది. అగస్త్యుని మాట వింధ్య పర్వతం విన్నది అంటే, ఆయన ఎంతటి పుణ్య పురుషుడో అర్థమవుతుంది. శ్రీమద్రామాయణం, అరణ్య కాండము సర్గలు 10, 11 లలో ఆయన ఎంతటి గొప్పవాడో స్వయంగా శ్రీరాముడే తెలియజేస్తాడు. నిజానికి ‘అగమ్ స్థంభయతీతి అగస్త్యః’ అనగా అగమును (పర్వతమును) స్థంబింపజేసిన వాడు కాబట్టి ఆయన ‘అగస్త్యుడు’ అను పేరుతో విఖ్యాతి కెక్కారు.
శ్రీ స్వామివారి పూర్వ చరిత్ర:
శ్రీ అగస్త్యేశ్వరుడు కొప్పులింగేశ్వరుడైన చరిత్ర:
మహారాజు ఆ నిర్మాల్య మాలికలో నిగనిగలాడుతున్న పొడవైన వెంట్రుకను చూసి శంకించి పూజారిని ప్రశ్నించగా అతను “పరమశివుడు జటాఝూటధారి” కాబట్టి పూలమాలికను అగస్త్యేశ్వరుని కేశము చుట్టుకొని ఉంటుందని బదులు పలికాడు. లింగమునకు జటాఝూటములు ఉండటమా అని రాజు ఆశ్చర్యపడి – అయినా కానీ ఈశ్వరలింగమునకు కేశములు చూపించు అన్నాడు. దానికి పూజారి నిర్మల హృదయుడై ధైర్యంగా, మహారాజా, యిది మధ్యాహ్న సమయము, స్వామివారికి అభిషేక పూజా విధులు నిర్వర్తించి మహానివేదన చేసి నాగాభరణాలు అలంకరించాను, రేపటి ఉదయం వరకు అలంకరణాదులను తొలగించరాదు. మీరు ప్రాతః కాలము వరకు ఉంటే స్వామి జటాఝూటమును చూపగలన నేను అన్నాడు.
మహారాజు దానికి అంగీకరించి జటాఝూటములు చూపింకపోతే నీకు శిరచ్ఛేదము తప్పదని చెప్పి ఆ రాత్రి పల్వలపురంలోనే విడిదిచేశాడు. దాంతో పూజారి తనకు శిరచ్ఛేదము తప్పదని తలచి అవసానకాలంబున చేసికొనినచో మోక్షం లభించునని తలచి ఆ రాత్రంతా శ్రీ స్వామి గర్భాలయములోనే ఉండి పరమశివుని పలురీతులు వేడుకొనుచూ "స్వామీ! నీ భక్త పరమాణువును నా పూర్వ జన్మ ఫలంబుచే నేనీ పాపాలు చేసి యుంటిని. నా తప్పును మన్నించి ఇప్పటి నుండి మీరు కొప్పును ధరించవలెను. మీ కొప్పును మహారాజుగారికి చూపనిచో నాకు శిరచ్ఛేదము తప్పదు. మీరు కొప్పును ధరించరేని నా శిరస్సును ఈ లింగమునకు బాదుకొని ప్రాణములు విడుస్తాను'' అని దీనముగా పలికి మూర్ఛపోయాడు.
దాంతో భక్తవల్లభుడైన నీలకంఠుడు పూజారి మొరాలకించి లింగోద్భవ కాలమున (అర్ధరాత్రి) కొప్పును ధరించాడు. స్వామి కొప్పును ధరించుట పూజారి చేసిన కృత్రిమ చర్య అని ప్రజలు ఏకకంఠముతో పలికారు. దాంతో మహారాజు “ఏది శిరోజమును పెకిలించి తీసుకొని రా” అని ఆజ్ఞాపించగా పూజారి అలాగే చేశాడు. రాజుకు శిరోజములో మొదట రక్తము కనిపించింది. వెంటనే రాజుకు నేత్ర అవరోధము కలిగింది. అప్పుడు మహారాజు పరమేశ్వరునకు అపచారము జరిగింది అని తలచి, దోషమును మన్నించి దృష్టిని ప్రసాదించమని వేనోళ్ళ పరమేశ్వరుని వేడుకొనగా అప్పుడు పరమేశ్వరుడు శాంతించి రాజుకు దృష్టిని ప్రసాదించాడు. మహారాజుకు పరమేశ్వరుడు దృష్టిని ప్రసాదించినందుకు దానికి గుర్తుగా రాజుగారు జుత్తుగపాడు గ్రామానికి చెందిన భూమిని స్వామికి కానుకగా సమర్పించు కొన్నాడు.
జుత్తుగపాడు అనే గ్రామం రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామానికి రెండు ఫర్లాంగుల దూరంలో వుంది. కాబట్టి అగస్త్యేశ్వరుడు తన పూజారి ప్రాణాలను కాపాడటానికి కొప్పును ధరించుడం వలన అప్పటి నుండి శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామిగా నామాంతరము చెంది అప్పటి నుండి మొదలు శోభాయమానంగా విరాజిల్లు చున్నది. ఆనాటి పల్వలపురమే నేటి పలివెల గ్రామము. పలివెల (Palivela), తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామము. పలివెల రాజమండ్రికి 50 కి.మీ., కాకినాడకు 90 కి.మీ. మరియు అమలాపురానికి 25 కి.మీ. దూరంలో కలదు. ఈ గ్రామము లొ శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం కలదు.ఇక్కడ శివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవం విశేషం.
---------------------------------------------------------------------
భూమ్మీదే కైలాసం (మౌంట్ కైలాస్)
ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం లభిస్తుంది. బ్రహ్మ లోకానికి, వైకుంఠానికి ప్రాణం ఉండగా వెళ్లడం సాధ్యకాదుకాని..కైలాసానికి మాత్రం మానవశరీరంతోనే వెళ్లిరావచ్చు. శివుని కైలాసం ఉన్నది మరెక్కడో కాదు టిబెట్లో ఉన్న హిమాలయా పర్వతాల్లో మంచు కొండల్లో వెండివెన్నెల, అతీంద్రియ మహాశక్తులు, అంతుపట్టని వెలుగు దివ్వెలు, సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సైన్స్ కు అందని అసాధారణ వ్యవస్థ. పరమశివుని ఆవాసం, పార్వతినివాసం ఈ భూమ్మీదే ఉంది.
సముద్ర మట్టానికి 21,778 అడుగుల (6,638 మీటర్లు) ఎత్తులో టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయా పర్వత శ్రేణుల్లో ఈ కైలాస పర్వతం (మౌంట్ కైలాస్) ఉంది. ఈ పర్వతంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు. ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లజ్, కర్నాలి (గంగానదికి ఉపనది)మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. హిందువులు, బౌద్ధులు, జైనులు, బాన్ మతస్థులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మౌంట్ కైలాస్ మామూలు పర్వతం కాదు. హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. మానస మేథస్సుకు అర్థంకాని రహస్యాలు ఎన్నో ఇక్కడ దాగి ఉన్నాయి. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది. నాలుగు రంగుల్లో ఇది దర్శనమిస్తుంది. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతిభక్తునికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం కలుగుతుంది.
హిందూ మత విశ్వాసాల ప్రకారం లయకారుడు శివుడు ఈ కైలాస పర్వత శిఖర భాగాన నివశిస్తాడు. పార్వతీ సమేతుడై నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు. విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతం ప్రపంచానికి పునాది వంటిది. తామర పువ్వు ఆకారంలో గల ఆరు పర్వత ప్రాంతాల మధ్యలో ఈ పర్వతం ఉంటుంది. కైలాసం నుంచి మొదలయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకి ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి. కైలాస పర్వత నాలుగు ముఖాలు స్పటిక, బంగారం, రుబి, నీలం రాయులతో రూపొందినట్లు విష్ణు పురాణం చెబుతుంది. అందుకే ఇది నలువైపులా నాలుగు వర్ణాల్లో గోచరిస్తుంది. అంతేకాదు కైలాస పర్వతానికి నాలుగు రూపాలు ఉన్నాయి. ఒకవైపు సింహంగా, ఇంకోవైపు గుర్రంగా, మూడోవైపు ఏనుగుగా, నాలుగోవైపు నెమలిగా కనిపిస్తుంది. ఇందులో గుర్రం హయగ్రీవ రూపంకాగా, సింహం పార్వతి దేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరుని ప్రతీక అయితే నెమలి కుమార స్వామి వాహనం.ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెబుతాయి.
మంచుపూర్తిగా కప్పుకున్నప్పుడు పౌర్ణమి రాత్రి వెండికొండలా మిలమిల మెరిసే కైలాస దర్శనం అత్యద్భుతం, అమోఘం. కైలాస పర్వతాన్ని అపశవ్య దిశతో చుడతారు. దీని చుట్టుకొలత 52 కిలోమీటర్లు. కొంత మంది యాత్రికులు కైలాస పర్వతాన్ని ఒక్కరోజులోనే చుట్టిరావాలని నమ్ముతారు. కానీ ఇది అంత సులభం కాదు. మంచి ఆరోగ్యవంతుడై వేగంగా నడిచే వ్యక్తి ఈ 52 కిలోమీటర్ల దూరం చుట్టిరావడానికి 15 గంటల సమయం పడుతుంది. సాధారణ యాత్రికులకు మూడురోజుల సమయం పడుతుంది.
కైలాసాన్ని ఎవరూ అధిరోహించలేదా :
కైలాస పర్వత యాత్ర :
భారత ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో మానససరోవర, కైలాస పర్వత యాత్ర నిర్వహిస్తుంది. టిబెట్, ఖాట్మాండుకు చెందిన కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. ఫిట్ నెస్ కి సంబంధించి వైద్య పరీక్షల్లో పాస్ అయితేనే ఈ యాత్రకు అనుమతినిస్తారు.
మానస సరోవరం :
కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం. మానససరోవరం నుంచి కైలాస పర్వతాన్ని చూడవచ్చు. మానస్ అంటే మైండ్, బ్రహ్మ తన మైండ్ నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో బ్రహ్మీ ముహుర్తంలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే. ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గృహల్లో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారని భక్తుల విశ్వాసం. మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలు ఉన్న మొక్కలు మనకు కనిపిస్తాయి.
ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా, మానస సరోవరం తల్లిగా ఉందని హిందువుల విశ్వాసం. పట్టాభిషేకం తర్వాత రామ,లక్ష్మణులు, చివరి దశలో పాండవులు, వశిష్ఠుడు, అరుంధతి, ఆది శంకరాచార్యుడు కైలాస పర్వత యాత్ర చేసారని హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి.బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలోనే స్నానమాచరించి మంచి తనయుడు పుట్టాలని ప్రార్థించినట్లు బౌద్ధమత గ్రంథాలు పేర్కొన్నాయి. మానససరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్ జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. కైలాస దర్శనం భక్తులకు ఒక పవిత్ర అనుభూతి, మాటల్లో వర్ణించలేని భావమది. పదాలకు అందని పవిత్రత అది.
*----*-----*----*
గమనిక : క్రింద వాట్సాప్ అని ఉన్న లింక్ ని నొక్కి నేరుగా మీ సలహాలు, సూచనలను నాతో వాట్సాప్ ద్వారా పంచుకొని.. మరింత విలువయిన విషయాలను అందివ్వడానికి సహకరించండి...
Blog : Ram Karri
Whatsapp : http://wa.me/+918096339900
-- స్వస్తి
-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -
૨αɱ ҡα૨૨เ
ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.
-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -
Whatsapp : +918096339900 ,
Phone : +919492089900 .
-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -
Web Sites & Blogs :
Ram Karri || Intellectual Brainy || Ram Karri || Tech Guru Ram || Ammaku Prematho || Nannaku Prematho || Ethics of Old Genarations || Telugu Quotes Park || Health Tips || Telugu Vignana Sarvaswam || Telugu Whatsapp Group's || Go for Green World || Naaku Amma Cheppindhi ||Karri Ram || Left Handers Club India || Lefties Rule The World || BroadMind Creation's || Mana Telugu Patalu Lyrics || Pusthakalayam || Voice Of Ram || RamKarri.In || RamKarri.Com ||
-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -
Social Media :
Facebook Id : https://www.facebook.com/UrsRamKarri
Instagram : https://instagram.com/ramskarri
LinkedIn : https://www.linkedin.com/in/karriram
Twitter : https://twitter.com/RamsKarri
-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -
Adress :
Ram Karri ,
S/O : Subrahmanyam ,
D.No : 1 - 240,
Raja Rajeswari Colony,
Rayavaram ,
Rayavaram Mandal ,
East Godavari District ,
Andhrapradesh .
Pin : 533346
Google Map : Ram Karri
----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------