జీవితం....
జీవితం అంటే కలల సమూహం, నెరవేరిన కలల గురించి చెబితే అది మన జీవిత చరిత్ర అదే నెరవేరని వాటి గురించి చెబితే అది మన జీవిత అనుభవం. అందుకే నేను కూడా జీవితం అంటే ఎలా ఉండాలని ఎప్పుడు కలలు కనే వాడిని కానీ దాని కోసం ఏమి చేయాలో మాత్రం ఆలోచించేవాడిని   కాను. నేను కనిన  కలలును కనక రాసుకొని ఉంటె ఏకంగా పుస్తకం అయ్యేది, అలాగే  తీరిన కలలు ఒక రాస్తే అవి ఒక పుట కూడా పూర్తికాదు. గంతించిన జీవితాన్ని చూస్తే చెప్పుకోదగ్గ విజయాలు లేవు అలా అని ఓడిపోయినా అనుభవం లేదు. ఎందుకంటే నేను అసలు ప్రయత్నం చేయలేదు ఒక వేళ ప్రయత్నం చేసిన, నా లోని శక్తీ సామర్ధ్యాలను పూర్తిగా వినియోగించక పొవటమే.

నేను ఒక్కసారి  జీవితం లో వెనిక్కి చూసుకుంటే మిగిలింది శూన్యం మాత్రమే. నాకు నా జీవితం  మీద ఇలా ఆలోచన ఉంటె, ఇంకొకరికి మరోలా ఉండవచ్చు. ఇంతవరకు నేను చదివిన లేదా నాకు తెలిసిన జీవిత నిర్వచనాలలో మొదటిగా జీవితమనేది ఒక చదరంగం
" ఈ భూమి ఒక చదరంగపు బల్ల అయితే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి ఒక పావులాంటివాడు, అయితే విధి ఆడే వింత ఆటలో ప్రతి మనిషి పావుల కదులుతూ తన జీవితాన్ని ముగిస్తాడు ..."
రెండవది గా జీవితమనేది ఒక నాటకం.....
" ఈ భూమి అనేది ఒక రంగస్థలం అనుకుంటే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవుడు ఒక పాత్రదారుడే, అయితే దేవుడు చేసే కధనం లో ఎవరి పాత్రలలో వారు జీవించి చివరికి తనువు చాలిస్తారు ..."
పైన చెప్పినట్లు మనిషి కొన్ని సార్లు నటిస్తూ..., మరి కొన్ని సార్లు ధనం కోసం, ఆస్తి కోసం ఎత్తుకి పైఎత్తులు వేస్తూ తమ జీవితాల్ని వెలిబుస్తారు. అందుకే కొన్ని సార్లు జీవితమంటే నాకు ఒకే ఒక మాట గుర్తుకువస్తుంది. అదే " జీవితమంటే జీతం" అందుకేనోమే జీవితం అనే  పదంలో జీతం అనే పదం చక్కగా ఇమిడిపోయింది. మనిషి ఎలాంటి సంఘ పరిస్థితలలొ పెరిగిన, లేదా జీవించన, ఎలాంటి మత పరమైన ఆచార వ్యవహారాలను కలిగి వున్నా,  ఈ భూమి మీద ఏ ప్రదేశాలలో నివసిస్తున్నప్పటికి, చివరికి వారు డబ్బు కోసం, డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందుకేనోమో ఈ సమాజంలో జీతం ఎక్కువ ఉన్నవారికి, అలాగే డబ్బు ఉన్నవారి జీవితాలను ఈ సమాజంలో జీవితాలుగా గుర్తిస్తున్నారు, వారినే గౌరవిస్తున్నారు, వారినే అనుసరిస్తున్నారు.

" విజయం సాధించిన ఎవరి చరిత్ర చదివిన, అంటే గొప్పవాళ్ళ కన్నా గొప్ప వాళ్ళు, గొప్ప సాహసవంతులు, గొప్ప శాస్త్రవేత్తలు, వారు ఏమి సాధించిన డబ్బుని ఆశించి చేయలేదు. అందుకే ఈ భూమి మీద మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, థామస్ అల్వ ఎడిసన్ వారిని ఈ ప్రపంచం గుర్తించుకున్నట్టు టాటా, బిర్లా, అంబానీ లను ఈ ప్రపంచం గుర్తించుకోదు." డబ్బు మనిషికి సౌకర్యాలను, తాత్కాలిక సంతోషాలను అందివ్వగలదు కానీ మనిషికి సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. అందుకే జీవితం అంటే జీతం కాదు, జీవితం అంటే జీవం, జీవం అంటే మన శక్తీ సామర్ధ్యాలను పూర్తి స్తాయిలో ఉపయోగించి జీవించడం అలా ఉపయోగించప్పుడు మనం మనుషులగా బ్రతికి ఉన్న మరణించినట్లే...

సాధారణంగా అందరు నాకు అంత శక్తీ సామర్ధ్యాలు లేవు, మనం ఇంత కష్టమైనవి సాధించలేము అని కుంటారు. కానీ నిజానికి మనం ప్రతి ఒక్కరం మెధవులమే... కానీ విచారకరమైన విషయం ఏమిటంటే అందరం అతి సాధారణ మైన వ్యక్తిగా మరణిస్తాము. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలచుకున్నను. సాధారణంగా పంది బ్రతికినంత కాలం క్రిందకి చూస్తూ బురదలలోను, మురుకి కాలువల లోను తిరిగుతూ బ్రతుకుతుంది. ఎప్పుడయితే ఆ పంది కాళ్ళని కట్టివేసి, తలక్రిందులుగా వేలాడదీసి చంపడానికి తీసుకేల్తున్నప్పుడు అది మొదట సారి ఆకాశాన్ని చూస్తుంది. అప్పుడు ఆ పంది మొదట సారి బాధ పడుతుంది, ఇంతవరకు ఇంత గొప్ప లోకంలో ఏమి చూడకుండా, ఏమి అనుభవించకుండా, ఏమి సాధించకుండా  చనిపోతున్నాని   చివరి నిమిషంలో చింతుస్తుంది. మనిషి చనిపోతున్నని తెలిసిన చివర ఐదు నిమిషాలలో ఉన్నప్పుడు, తను సాధించిన విజయాలు గుర్తుకు రావు, తనలో శక్తీ, సామర్ధ్యాలు కలిగిన పనులు చేయలేకపోయానని చింతిస్తాడు.
అందుకే జీవితమంటే జీతంతో బ్రతకడం కాదు. మన శక్తీ సామర్ధ్యాలతో బ్రతకడం, అయితే అన్ని సందర్భాలలో మన శక్తీ సామర్ధ్యాలను ఉపయోగించలేక పోవచ్చును. అయినంత మాత్రాన  మనం ఓడినట్టు కాదు. అయితే ప్రతి పనిని ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, నవ్వుతు, నవ్విస్తూ, జీవితంలో ప్రతి క్షణం సంతోషిస్తూ ముందుకు వెళితే మన జీవిత చివరి ఘడియలలో ఆలోచించాల్సిన అవసరం ఉండదు, అలాగే బాధ పడాల్సిన పని ఉండదు. జీవితం మాటలలో చెప్పడం సులువే, కాని ఆచరణలో కష్టమే, అందుకే  ఆగండి..., అర నిమిషం ఆలోచించండి...., మీకు ఆనందమైతే  ఆచరించండి.....


మీ రామ్ కర్రి
+918096339900