రామాయణం ఎందుకు ?????


..
.
తెల్లవారితే పట్టాభిషేకం అంతలోనే తండ్రి ఆదేశం అడవులకు వెళ్ళ మని !
అంతే ఆయన ఆదేశాన్ని శిరసవహించాడు మారు మాటాడకుండా బయటకు నడిచాడు.
.
అప్పటిదాకా మానసికంగా ఉన్న స్థితి నుండి అకస్మాత్తుగా వేరే స్థాయికి మారాల్సి వచ్చింది
అయినా కళవళ పడలేదు . తండ్రిమీద తిరుగుబాటు చేయలేదు.
.
Change management అని ఇవ్వాళ మనం చెప్పుకునేది ఇక్కడ చూడవచ్చుఁ.
.
లక్ష్మణుడు కోపంతో తండ్రిని, కైకని,భరతుణ్ణి వధిస్తాను అని అంటే ,అతడ్ని వారించి ధర్మమార్గ ము ఏమిటో చెప్పి శాంతిమ్ప చేసాడు శ్రీరాముడు.
.
If you stick to your dharma, ( regulations)  automatically change management takes place .
.
ఆ సమయంలో అక్కడ పట్టాభిషిక్తుణ్ణి చేసేటప్పుడు అభిషేకించటానికి అవసరమయ్యే జలాలు ఉంటాయి .వాటిని కూడా రాముడు ముట్టుకోడు ఎందుకంటే అవి రాజ ద్రవ్యామట.
వనవాస వ్రత స్నానం చేయడానికి వేరే నీళ్లు వాడతాడు..అధికారం లేకపోయినా అడ్డదిడ్డంగా  అధికార ప్రదర్శన చేయాలని తహతహలాడే వారు మన వీధి బయటకు వెళితే కోకొల్లలు.
.
అధికారాన్ని అడ్డంపెట్టుకొని ,లేని అధికారాన్ని కల్పించుకొని లేనిపోని హడావిడి చేసే మననాయకులు నేర్చుకోవడానికి లేదా?
.
కామాన్ని ప్రేమగా పొరబడి తప్పటడుగులు వేస్తున్న నేటి సమాజానికి ధర్మబధ్దమయిన కామం అంటే ఏమిటో తెలియచేస్తుంది రామాయణం.
.
అన్నగారి భార్యతో, పరస్త్రీలతో సంభాషించేటప్పుడు ఎలమెలాగాలో ఇంద్రియనిగ్రహం అంటే ఏమిటో లక్ష్మణుడి పాత్ర ద్వారా వాల్మీకి మహర్షి సమాజానికి సందేశం ఇస్తారు.
.
తనదికాని రాజ్యాన్ని తృణప్రాయంగా ఎలా .వదులుకోవాలో భరతుడి ద్వారా చూపిస్తారు మహర్షి.
.
బిడ్డలకు ఏ ఉపదేశం ఇవ్వాలో తల్లి కర్తవ్యమేమిటో సుమిత్ర ద్వారా చూపిస్తారు మహర్షి
.
మిత్రుణ్ణి ఎలా ఆదుకోవాలో ,మిత్రత్వం ఎలా నెరపాలో  రామ గుహుల ,రామ సుగ్రీవ మైత్రి తెలుపుతుంది.
.
ఏ పని ఎప్పుడు చేయాలో ఎంతవరకు చేయాలో ,ఎదుటివారి శక్తీ సామర్ధ్యాలు ఎలా అంచనా వేయాలో హనుమంతుడు చూపెడతాడు.
.
ఎట్టి విపత్కర పరిస్థితిలో కూడా ధైర్యంగా నిలబడటం ఎట్లాగో సీతమ్మ చూపిస్తుంది.
.
పదునైన పళ్ళమధ్యలో తెలివిగా ఉండే నాలుక లాగా క్రూరులైన రాక్షసుల మధ్యలో తాను ఒకటిగా ఉండి తన కర్తవ్యాన్ని నెరవేర్చుకోవడంకోసం ఎలాగో విభీషణుడు చూపెడతాడు.
.
రామాయణం ఒక అపార పారావారం ఎన్నొ రత్నాలు మనకు దొరుకుతాయి. మునిగి తేగల సత్తా ఉంటె!
.
మానవీయ విలువల భాండాగారం రామాయణం.


------------------------------------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.
--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --

Whatsapp : +918096339900 ,

Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --

Web Sites & Blogs :


--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --
Google Map : Ram Karri


---------------------------------------- సమాప్తం --------------------------------