"తం భూసుతా ముక్తిముదార హాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీః|
శ్రీ యాదవం భవ్య భతోయ దేవం
సంహారదా ముక్తి ముతా సుభూతం||"


ఈ శ్లోకం 

'శ్రీ రామకృష్ణ విలోమ కావ్యం' లోనిది. 
కవి పేరు పండిత దైవజ్ఞ సూర్య సూరి. 
14వ శతాబ్దపు, దివిసీమ తాలూకా కవి.
ఈ శ్లోక విశేషమేమిటంటే మొదటినుంచి చివరకు చదివినా, చివరనుంచి వెనుకకు చదివినా ఒకేలాగ ఉంటుంది, అంటే వికటకవి లాగా అన్నమాట. 
ఇంగ్లీషులో దీనిని ప్యాలిన్డ్రోమ్ అంటారు. 
అర్థభేదం మాత్రం ఉంటుంది.


➡ఎడమనుండి కుడికి చదివినప్పుడు శ్రీరామ పరంగానూ, కుడినుండి ఎడమకు చదివినప్పుడు శ్రీకృష్ణ పరంగానూ ఉంటుంది.
చూడండి,  ఎడమనుండి చదివినప్పుడు
'ఎవరైతే సీతను రక్షించారో, ఎవరి చిరునవ్వు మనోమోహకంగా ఉంటుందో, ఎవరి అవతార విశేషం పరమ అద్భుతమో, ఎవరినుండైతే దయ, అద్భుతమూ అన్నిచోట్లా వర్షిస్తుందో అట్టి శ్రీరామునికి నమస్కరిస్తున్నాను,' 
అనే అర్థం వస్తుంది.


➡ అదే కుడినుండి ఎడమకు చదివినప్పుడు
'శ్రీ యాదవ కులంలో ఆవిర్భవించిన, సూర్యచంద్రులకు ప్రాణాధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మయైనట్టి శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాను,' 
అని అర్థం వస్తుంది.

- స్వస్తి