🕉       🕉         🕉        🕉       🕉         🕉       🕉       🕉        🕉       🕉         🕉




🕉       🕉         🕉        🕉       🕉         🕉       🕉       🕉        🕉       🕉         🕉


దీపావళి అనగా అందరికీ గుర్తు వచ్చేది నరకాసురవధ 
"నరక+అసుర+వధ అనే మూడు పదాల ఒక పదం.


నరకం: అనగా "కష్టం" అని అర్థం. అజ్ఙానం వల్ల కష్టాలు వస్తాయి.


అసుర: అనగా రాక్షస అని అర్థం. అరిషడ్వర్గాలే అసుర గుణాలు, అవి కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మత్సరములు. ఈ గుణాలతో మనసు నిండి ఉంటే మనిషి రాక్షస ప్రవర్తన కల్గి ఉంటాడు.


వధ:  అంటే వధించడం. మనలో గల అజ్ఙానాన్ని తొలగించుకోవడం. అజ్ఙానం అనే చీకటి పోవాలంటే జ్ఙానం అనే వెలుగు కావాలి.


అందుకే దీపావళి రోజు జ్ఙానానికి గుర్తుగా దీపాలను మరియు టపాకాయలను వెలిగిస్తారు. మనలో అజ్ఙానం పోయి, జ్ఙానం రావాలంటే,


1. ప్రతీ రోజూ మంచి ఆలోచనలే చేయాలి . 
2. ప్రతీ రోజూ సజ్జన సాంగత్యము చేయాలి.
3. మంచిని బోధించే విషయాలు చదవాలి.
4. ప్రతీ రోజూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి.


ఇలా సాధన చేయడం ద్వారా ప్రతీ మనిషి మాధవుడుగా మారతాడు.ఇలా మారాలని గుర్తుగా ప్రతీ సంవత్సరం దీపావళి పండుగ జరుపుకుంటాము.

🕉       🕉         🕉        🕉       🕉         🕉       🕉       🕉        🕉       🕉         🕉

అన్నీ తనకనుకూలంగా సుఖకరంగా ఉన్నా, 

ఉన్నదానితో తృప్తి పడక ఏదోఒక దానికోసం తల్లడిల్లుతూనే ఉంటారు కొందరు. 

అన్ని కష్టాలే నష్టాలే అయినా..

వాటి మధ్య కూడా శాంతం గా ఆత్మ విశ్వాసం తో జీవిస్తారు మరికొందరు. 

నుక శాంతికి అశాంతికి హేతువు బాహ్యంలో లేదు. 

కేవలం అంతరంగం లోనే ఉంది. 

అంతరంగం లో జ్ఞాన జ్యోతి ని వెలిగిద్దాం... 

అదే అసలైన దీపావళి....



🕉       🕉         🕉        🕉       🕉         🕉       🕉       🕉        🕉       🕉         🕉

ఆనంద దివ్య దీపావళి

దేవుడికి ఆలయం కట్టించాలని ఊరూరా దేవాలయాలు నిర్మించారు మెసపుటోమియన్లు.

భూమి నుండి పెట్రోలు తీసి దీపాలు వెలిగించారు బాబిలోనియన్లు

మనిషికి ఒక గది కట్టాలని సమాధులను నిర్మించారు ఈజిప్షియన్లు

దీపాన్ని పర బ్రహ్మగా భావించి ఆరాధించిన వారు మన ఇండియన్లు

దీపావళి దీపాల ఆవళి

ఇంటింటా బాణసంచాల రవళి

అమావాస్య నాడు ఆకాశంలో పున్నమి జాబిలి

తమస్సును తొలగించే ఉషస్సుల కావలి

శ్రీ లక్ష్మీ పూజల పవిత్ర ధావళి

ధాన్య రాసులను పెంపొదించే నాగలి

పిల్లలందరికీ ఇష్టమైన
పండుగ దివాలి

మిత్రులందరూ కలసి
ముక్కల లెక్కలను లెక్కించుకునే జాగరణ మరాళి

పెద్దలకు తలచుకుని దీప దానంచేసే నివాళి

అర్ధులకు మనం చేసే సాయం వారి జీవితాలు
పరిమళించే గుబాలి

జ్ఞాన దీపాలను
ప్రసరించే రంగేళి

నరకమనే చీకటిని తొలగించే పటాకుల కవాళి

ప్రతి ఇంట సుఖ సంతోష గీతాల జావళి

అరిషడ్వర్గాలను
అదుపు చేసే ఆరావళి

నరకుని వధించి
వసుధకు స్వేచ్ఛ
నిచ్చిన కబాలి

కోపం,ఈర్ష్య,అసూయ ద్వేషాలతో ముసురు కున్న చీకటి నుండి
ప్రేమ,సహనం, శాంతులతో ప్రకాశించే వెలుతురులోకి ప్రవేశించి హృదయపు లోతుల్లో ఆనందపు దివ్వెలు

వెలిగించాలని సంకల్పం చేసిన 

మనసున్న నా ప్రియమైన మీకు, మన కుటుంబ సభ్యులకు పరివారానికి సహృదయపూర్వక  దివ్య దీపావళి శుభాకాంక్షలు.....

🕉       🕉         🕉        🕉       🕉         🕉       🕉       🕉        🕉       🕉         🕉


మీకు ఈ పోస్ట్ నచ్చినట్లయితే.. ఈ క్రింద ఉన్న షేర్ బటన్స్ 

ద్వారా మీ బంధు మిత్రులందరికీ పంచండి...