విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. అయితే ఈ 21 ఆకుల పేర్లు అర్ధంగాక చాలామంది వీటిని సరిగా గుర్తించలేకపోతారు.
--------------------------------
1) మాచీ పత్రం:
మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి.
--------------------------------
2) దూర్వా పత్రం:
దూర్వా పత్రంఅంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.
---------------------------------
3) అపామార్గ పత్రం:
తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.
----------------------------------
4) బృహతీ పత్రం:
దీనిని ములక అంటారు దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి పత్రాలు వంగ ఆకులు మాదిరి తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి.
---------------------------------
5) దత్తూర పత్రం
దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఇది వంకాయ జాతికి చెందింది ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి.
----------------------------------
6) తులసీ పత్రం:
హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. ఈ ఒక్కరోజే వాడాలి.
---------------------------------
7) బిల్వ పత్రం:
బిల్వ పత్రం అంటే మారేడుఆకు మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు.
--------------------------------
8) బదరీ పత్రం:
బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.
---------------------------------
9) చూత పత్రం:
చూత పత్రం అంటే మామిడి ఆకు.ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు.
--------------------------------
10) కరవీర పత్రం:
దీనినే గన్నేరు అంటారు. తెలుపు పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది.
---------------------------------
11) మరువక పత్రం:
దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.
--------------------------------
12) శమీ పత్రం:
జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
--------------------------------
13. విష్ణుక్రాంత పత్రం:
ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు.
---------------------------------
14) సింధువార పత్రం:
సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడపిలుస్తుంటారు
---------------------------------
15) అశ్వత్థ పత్రం:
రావి ఆకులనేఅశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మన సంప్రదాయం.
----------------------------------
16) దాడిమీ పత్రం:
దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తిస్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.
-------------------------------
17. జాజి పత్రం:
ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు.
---------------------------------
18) అర్జున పత్రం:
మద్దిచెట్టు ఆకులనే అర్జునపత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలోపెరిగే పెద్ద వృక్షం ఇది.
---------------------------------
19) దేవదారు పత్రం:
దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలాఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకుసహజత్వం ఉంటుంది.
----------------------------------
20) గండకీ పత్రం:
దీనినే లతాదూర్వాఅనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది.
--------------------------------
21) అర్క పత్రం:
జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు.తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందంటారు.
---------------------------------------------------------
૨αɱ ҡα૨૨เ
ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.
--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -
Whatsapp : +918096339900 ,
Phone : +919492089900 .
--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -
Web Sites & Blogs :
Intellectual Brainy || Ram Karri || Tech Guru Ram || Ammaku Prematho || Nannaku Prematho || Ethics of Old Genarations || Telugu Quotes Park || Health Tips || Telugu Vignana Sarvaswam || Telugu Whatsapp Group's || Go for Green World || Naaku Amma Cheppindhi ||Karri Ram || Left Handers Club India || Lefties Rule The World || BroadMind Creation's || Mana Telugu Patalu Lyrics || Pusthakalayam || Voice Of Ram || RamKarri.In || RamKarri.Com ||
-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---
Facebook Id : https://www.facebook.com/UrsRamKarri
Google Map : Ram Karri
LinkedIn : https://www.linkedin.com/in/karriram
----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------