వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు? 


కాలజ్ఞానం అంటే ఏమిటి


వీరబ్రహ్మేంద్రస్వామి ఏం చెప్పారు ?


అవి ఎంతవరకూ నిజం అయ్యాయి అనే అంశాలు ఒక్కొక్కటీ తెలుసుకుందాం కాలజ్ఞానం అంటే భవిష్యద్దర్శనం అన్నమాట. భవిష్యత్తును దర్శించడం యోగులకుఋషులకు సాధ్యమే. మన పురాణ పురుషుల సంగతి వదిలేసినాచరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యద్దర్శనం చేసిన వారు ఉన్నారు.

ఇతర దేశాలలోనూ భవిష్యత్ ను తెలుసుకొనిజరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రోడామస్ అయితే తెలుగువారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్రస్వామి.


రష్యాటిబెట్చైనా వంటి సుదీర్ఘ చరిత్ర కలిగిప్రాచీన నాగరికతలు వెల్లివిరిసిన దేశాలలో భవిష్యద్దర్శనం చేసిన కొందరి పేర్లు మనకు వినిపిస్తుంటాయి. వారి గురించిన చారిత్రక వివరాలు గ్రంథస్తం చేసి ఉన్నాయి.


కాలజ్ఞానం ఒక విధంగా జ్యోతిష్యం వంటిదనే చెప్పుకోవాలి. జ్యోతిష్యం గ్రహగతుల ఆధారంగా కొందరు వ్యక్తుల జీవితంలో భవిష్యత్ లో జరగబోయే సంగతులను వివరించి చెప్పేది. ఈ జ్యోతిషంలోనూ అనేక పద్దతులు ఉన్నాయి. నాడీ జోస్యంహస్తసాముద్రికం తదితరాలు. అవి ఇప్పుడు అప్రస్తుతం.


కాలజ్ఞానం జ్యోతిషానికి భిన్నమైనది. ఇది ఒక దేశప్రపంచ పోకడలను వివరించేది. భవిష్యత్తులో సాంకేతికంగా వచ్చే మార్పులుప్రకృతి వైపరీత్యాలుదేశానికి ఏర్పడే ముప్పులుపెను విపత్తులుప్రముఖ వ్యక్తుల జననంవారి జీవనం ఇలాంటి సంగతులు ఎన్నిటినో వివరిస్తుంటుంది.


నాస్ట్రోడామస్వీరబ్రహ్మేంద్రస్వామి చేసింది సరిగ్గా ఇదే! నాస్ట్రోడామస్చెప్పినావీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినా వారి జోస్యాలలో  స్పష్టత ఉండదు. అస్పష్టతే ఎక్కువ. సూటిగా ఉండవు. మర్మగర్భంగా ఉంటాయి. అలాగని వారేదో ఊహాప్రపంచంలో విహరించివారికి తోచిందేదో రాసేశారు అనుకోడానికీ లేదు. ఎందుకు రాశారు అన్నదీ ఆలోచించాలి.


నాస్ట్రోడామస్నే ఉదాహరణగా తీసుకుంటే .... హిట్లర్నెపోలియన్ వంటి ప్రముఖుల ప్రస్తావన నాస్ట్రోడామస్ జోస్యంలో కనిపిస్తుంది. రాజీవ్ గాంధి హత్యప్రపంచ వాణిజ్య భవన సముదాయం కూల్చివేత వంటి విపత్కర సంఘటనలకు నాస్ట్రోడామస్ జోస్యాలు కొన్నింటికి అన్వయం కుదురుతుంది. మరి ఆయన చెప్పింది వీరి గురించేనాఅనేది స్పష్టంగా చెప్పలేము. అయితేవీటిని ఎక్కువమంది నమ్ముతారు.


వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిందీ ఇలాంటివే! నాస్ట్రోడామస్ ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను దర్శించారని ఆయన జోస్యాలను నమ్మినవారు భావిస్తునట్టేరాష్ట్రంలో అనేక సంఘటనల గురించి వీరబ్రహ్మేంద్రస్వామి ముందుగానే భవిష్యద్దర్శనం చేసి చెప్పిన ఉదంతాలు కాలజ్ఞానంలో కనిపిస్తాయి.


వీరబ్రహ్మేంద్రస్వామి జ్యోస్యాలలో కొన్ని సూటిగా వుంటేమరికొన్నింటికి మనమే అన్వయం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇప్పటికే జరిగాయిఇంకా కొన్ని ఇకముందు జరగవలసి ఉన్నాయి. భవిష్యత్తులో జరగవలసి ఉన్నవాటిలో ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయం 'కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అనేది.


కృష్ణానది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు చేరుకునేంతగా ఎగసి పడుతుందాలేక కనకదుర్గమ్మ ముక్కుపోగు నీటిని చేరుకుంటుందా అనేది మనం ఊహించలేము. ఈ రెండింటిలో ఎదైనా జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో జగరబోయే జలప్రళయాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి మనోనేత్రంతో దర్శించారు.


జల ప్రళయమే అవసరం లేదు. ఏదైనా భూకంపం వంటి ప్రకృతి వైపరిత్యంవల్ల శ్రీశైలంనాగార్జునసాగర్ ఆనకట్టలకు బీటలు పడితే ఎగసి వచ్చే అపార జలరాశి చాలు. అలాంటి విపత్తు ఎదురైతే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. ఇక ముక్కుపుడక కృష్ణానదిని చేరుకోవడం అనే విషయాన్ని ఎవరికి తోచినట్లు వారు ఊహిస్తున్నారు.


ఇప్పుడు మనం చూస్తున్న విపరీత పరిమాణాలుదుర్ఘటనలుఆశ్చర్యకర సంఘటనల గురించి వేల సంవత్సరాల కిందటే వివరించిన మహాజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో జన్మిచారు. ఆయన ఎప్పుడు పుట్టారుఎక్కడ పుట్టారుకాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు- అనే విషయాలపైన వాదోపవాదాలు వున్నాయి.


ఏదేమయినా క్రీస్తు శకం 1600 – 1610 మధ్యలో ఆయన జన్మించి ఉండవచ్చని కొందరి అంచనా. పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెబుతారు. అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అని తర్కించే వారి విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం భవిష్య సూచికగా అత్యధికశాతం హిందువులు నమ్ముతారు.


కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు 'నీవెవరివి?' అని శ్రీ కృష్ణుడిని ప్రశ్నించినపుడు "సర్వ శక్తిమంతుడైన కాలుడను నేను" అని జవాబిచ్చాడు. కాలుడు సమస్త చరాచర జగత్తును కబళించగలిగినసృష్టించగలిగిన శక్తి వున్నవాడు. భూతభవిష్యత్వర్తమాన కాలాలు కాలుని అధీనంలోనే ఉంటాయి! సృష్టి మొత్తం కాలం అధీనంలోనే వుంటుంది. కేవలం మహాజ్ఞానులకుయోగులకు మాత్రమే కాల పురుషుని గురించిన జ్ఞానం వుంటుంది. అటువంటి యోగి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి. అందువల్ల ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికే అత్యధికులకు అనుసరణీయంగా వుంటోంది.





కాలజ్ఞానంలో చెప్పినవి - ఇప్పటివరకు జరిగినవి

  • కాశీ పట్న దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అని భవిష్య వాణి చెప్పాడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. అది ఎలా నిజమయిందో చూద్దాం. 1910 – 12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు.
  • ఒక అంబ పదారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది.... ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలపాటు మన దేశానికి ప్రధానిమంత్రిగా వున్నారు. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంతకంటే ముందు సినిమా నటి. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సినీ రంగం నుంచి వచ్చినవారే! చిరంజీవివిజయశాంతిజమున- ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది తెరమీది నటులు రాజకీయాల్లో ప్రవేశించారు..
  • రాచరికాలురాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ లేదు. ఆఖరికి జమీందారీ వ్యవస్థ కూడా నశించింది. ఉన్నదల్లా ప్రభుత్వముమంత్రులూను. ఈ మంత్రులు వారసత్వం లాగా రారు. నిరంకుశత్వం ఉండదు. ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు. కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన మాట అక్షరాలా నిజమైంది.
  • ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేకమంది మరణిస్తారు ఆకాశంలో పక్షి వాహనాలు నడుస్తాయని పోతులూరి చెప్పేనాటికి అసలు విమానమే పుట్టలేదు. పుష్పకవిమానం అంటూ పురాణ కధలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతం తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విమాన ప్రమాదాల్లో ఎంతోమంది మరణిస్తున్నారు.
  • జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. ఒక్క భారతదేశ జనాభానే . వందకోట్లు దాటడం మితిమీరిన జనాభా పెరుగుదలకు నిదర్శనం. భవిష్యత్ లో అన్ని రకాల సమస్యలూ అధిక జనాభా గురించే మొదలవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటివారికి తెలియదు కానీవంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు వుండేవి. ప్రస్తుతం ఎక్కాడా అగ్రహారాలు లేవు.
  • హైదరాబాద్ లో తురకలుహిందువులు పరస్పరం కిరాతకంగా చంపుకుంటారు.... పదిహేనేళ్ళ కిందటి వరకు కూడా హైదరాబాద్ లో మత కల్లోలాలు - అది కూడా కేవలం ముస్లింహిందువుల మధ్య మాత్రమే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక హుండీలో చోరీలు చాలా ఎక్కువగా వున్నాయి.
  • చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీచావు పుట్టుకలు మాత్రం కనుగోనలేకపోతారు. సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అన్ని రంగాల్లాగే వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. కాలు విరిగేతే రాడ్ వేస్తున్నారు. అసలు కాలే లేకుంటే కృత్రిమ కాలు పెడుతున్నారు. గుండె మార్పిడి దగ్గర్నించీ ఎన్నో అపురూపమైన శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి సాధించిన మాట నిజమే కానీచనిపోయిన వారిని బతికించే యంత్రంమనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకూ కనుక్కోలేదు. బహుశాభవిష్యత్ లో కనుగొనగలరనే నమ్మకం కూడా లేదు.
  • రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టేను రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులుశ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. చివరకి ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలిగొన్న విషయం తెలిసిందే. ఎల్.టీ.టీ.ఈ. ప్రభాకరన్ హతుడైన సందర్భంలో ఇరుపక్షాలవారూ మృత్యువాతపడ్డారు.


వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన కొన్ని జోస్యాలు కొద్దిగా అస్పష్టంగా వుండటం వల్లవీటిని అనుసరించి ఖచ్చితంగా ఏ సంఘటనలు ఎక్కడ జరుగుతాయో ఊహించటం అంత సులభం కాదు.


ఉదాహరణకు - బ్రహ్మంగారు చెప్పినది - ''ఆకాశమున రెండు బంగారు హంసలు వచ్చి పురములందువనములందునదులయందు సంచరించెను. ప్రజలు వానిని పట్టుటకు పోయి కన్నులు గానక గిర గిర తిరిగి లక్షోపలక్షలుగా చచ్చేరు...'' వీటికి ఇక్కడ స్పష్టమైన అర్థం లేదు. పేర్లువివరాలు లేవు. బంగారు హంసలు అంటే అణుబాంబులు కావచ్చు. అణు బాంబులు పేలినప్పుడు విపరీతమైన మంటలు వస్తాయి. ఇవి పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరయినా మరణించటం ఖాయం.

అలా కాకుండా ఉల్కల గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. గతంలో ఆకాశం నుంచి భూమిమీద పడిన ఉల్కల వల్ల జీవజాతులు నశించిపోయాయి. ఉల్కలు భూ కక్ష్యలోకి ప్రవేశిస్తే ఆ రాపిడికి మంటలు రేగుతాయి. ఈ ఉల్కాపాతం జరిగినా పెను విద్వంసం తప్పదు. వీటిని కూడా బంగారు హంసలు అని అన్వయించుకునే అవకాశం వుంది.


అణుబాంబులుఉల్కలు కాకుండా యు.ఐ.ఓ.లు (అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్) కావచ్చు. ఇవి భవిష్యత్ లో భూమిమీదకు వస్తాయావీటివల్ల ప్రజలు మరణిస్తారాపై ప్రశ్నలకు జవాబులు మనకు దొరకటం చాలా కష్టం.


వీరబ్రహ్మేంద్రస్వామి ''మన దేశానికి ఒక స్త్రీ ప్రధానమంత్రి అవుతుందని'' చెప్పిన విధంగానేప్రపంచ భవిష్యత్ గురించి చెప్పిన నోస్ట్రడామస్ కూడా ఆ విషయాన్ని చెప్పాడు.


నోస్ట్రడామస్ ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్. ఈయన క్రీ.శ. 1500లోనే చెప్పాడు అంటారు. గాంధీవంశంలో హత్యలు జరుగుతాయనినోస్ట్రడామస్ తన 'క్వార్టైన్స్లో చెప్పాడు. ఇవి ఫ్రెంచ్ భాషలో వుంటాయి.


''అయిదు నదుల సంగమ స్థానం నుంచి తలకు పాగాతో వున్న ఒక సాధూజీ భారతదేశానికి ప్రధాని అవుతాడని'నోస్ట్రడామస్ వివరించాడు. బహుశా ఈయనే మన్మోహన్ సింగ్ అనుకోవచ్చు! ఈయన అధికారంలో వున్నప్పుడు సైనికపరంగా భారతదేశం ప్రపంచంలో బలమైన దేశంగా మారుతుందని ఆ జోష్యంలో వుంది. అది ఒకరకంగా నిజమే కదా! అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు ఆర్ధిక సంక్షోభంలో పుట్టాయి. ప్రస్తుతం మనదేశం పురోగామలోనే ఉంది.

ఇక్కడ నోస్ట్రడామస్ గురించి కొద్దిగా తెలుసుకోవటం అవసరం. తెలుగులో వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ విధంగా అయితే వందల సంవత్సరాల ముందు జరగబోయే విషయాలను దర్శించి చెప్పారో అలాగే నోస్ట్రడామస్ ఫ్రెంచ్ భాషలో చెప్పారు. నోస్ట్రడామస్ జీవితం చాలా ఆశ్చర్యకరంగా వుంటుంది. కాబట్టి అప్పట్లో వున్న మూఢ విశ్వాసాల ప్రాతిపదికగా ఆయన జోస్యం చెప్పాడనే ప్రశ్నకు జవాబు లేదు.


నోస్ట్రడామస్ 1503లో ఫ్రాన్స్ లో జన్మించారు. ఆయన తల్లితండ్రులు యూదులుచిన్నప్పటి నుంచీ ఆయన వివిధ శాస్త్రాలను నేర్చుకున్నారు. తర్వాత వైద్యంలో గ్రాడ్యుయేషన్ పొందారు. తన జీవిత దశలో అంటే 1564లో కింగ్ ఛార్లెస్ - కు రాజ వైద్యునిగా నియమితులయ్యారు. దీన్ని బట్టే ఆయన ఎంత మేధావో అర్థం చేసుకోవచ్చు.


నోస్ట్రడామస్ జీవిత చివరిదశలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. నోస్ట్రడామస్ అప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 1566జూలై ఒకటవ తేదీననోస్ట్రడామస్ చివరి జోష్యాన్ని తన వద్దకు వచ్చిన మత గురువుకు వివరించారు. ఆ గురువు వెళ్ళిపోతూ 'మనం రేపు కలుసుకుందాంఅన్నాడు. దానికి జవాబుగా నోస్ట్రడామస్ 'రేపు సూర్యోదయానికి నన్ను ప్రాణాలతో చూడలేరుఅని పలికాడు. ఆరోజు రాత్రే నోస్ట్రడామస్ మరణించారు.


నోస్ట్రడామస్ చెప్పినవి కూడా బ్రహ్మంగారు చెప్పిన విధంగానే కొద్దిగా అస్పష్టంగావిశేషణాలతోవర్ణనలతో కూడి వుంటాయి. ఖచ్చితత్వం తక్కువ. సంవత్సరాలుదేశాల పేర్లు ఎక్కువగా వుండవు. నాలుగు వాక్యాలతో ఫ్రెంచ్ భాషలో వున్న వీటినే 'క్వార్ట్టైన్స్అంటారు.


నోస్ట్రడామస్ చెప్పినది - '45డిగ్రీల కోణంలో ఆకాశంలో మంటలు చెలరేగుతాయి కొత్త నగరం వైపు ఆ మంటలు ప్రయాణం చేస్తాయిఇక్కడ నగరం పేరు లేదు. అది ఏ దేశంలో వుంటుందోమంటలు ఎలా పుడతాయో చెప్పలేదు. ఎంతకాలం అవి విధ్వంసాన్ని సృష్టిస్తాయో కూడా లేదు. దీనివల్ల ఈ జ్యోతిష్యాన్ని ఎవరికి వారు తమ విజ్ఞానాన్ని బట్టి అన్వయించుకున్నారు.


డామ 'కొత్తనగరంఅంటే న్యూయార్క్ అని పశ్చిమ దేశీయులు భావిస్తున్నారు. ఇది మూడో ప్రపంచ యుద్ధ సమయంలో సంఘటన అని కొందరి అంచనా.


పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన జోస్యాల్లో ఎన్నో నిజమయ్యాయి. 


ఉదాహరణకు..

గట్టివాడయిన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు ..

ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడయిన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమయిన పాలనను అందించారు.

కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. .


వీరివల్ల ప్రజలందరూ మోసపోతారు.. ప్రస్తుతం గాల్లోంచి ఏవేవో వస్తువులు సృష్టించి ప్రజలను మోసం చేసే బాబాలుకపట సన్యాసులు పెరిగిపోయారు. వీరికి ఏ మహిమలూ లేకపోయినా ప్రజలు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. పైగా ఈ దొంగ స్వాములు భోగవిలాసాలకు బానిసలుగా ఉన్నారు. ఎందరో దొంగ సన్యాసుల గుట్టు రట్టవుతోంది.


దొంగ స్వాముల వల్ల నిజమైన యోగులకు చెడ్డ పేరు వస్తోంది. ఈ విషయం గురించి వీరబ్రహ్మేంద్రస్వామి 500 ఏళ్ళ కిందటే వివరించారు. ఈ విషయమొక్కటే చాలు వీరబ్రహ్మేంద్రస్వామి ఇప్పటి బాబాలునకిలీ యోగుల మాదిరిగా పేరు కోసండబ్బు కోసంఇతర సుఖాల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని రుజువు చేసేందుకు. అంతే కాకుండా నిజాలు తెలుసుకోకుండా యోగులందరూ దొంగలే అని వాదించే కొందరికి ఇది కనువిప్పు కలిగిస్తుంది.

కాలజ్ఞానంలో ఇలాంటి అంశాలు కోకొల్లలు. వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన అన్ని విషయాలూ తెలుసుకోవాలంటే కాలజ్ఞానం చదవాలి.


కాలజ్ఞాన రచన


వీరబ్రహ్మేంద్రస్వామికి వీరం భోట్లయ్య అనే పేరు కూడా ఉంది. ఈయన తండ్రి పేరు వీర భోజ్య రాయలుతల్లి వీర పాపమాంబ. సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరబ్రహ్మేంద్రస్వామికి అపారమైన విజ్ఞానం ఏర్పడింది. ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులతో తక్కువగా మాట్లాడుతుండేవాడు.

అద్భుత తత్వవేత్త ఆది శంకరాచార్యుల వలెనె వీర బ్రహ్మేంద్రస్వామి కూడా వివిధ విషయాలపై తాను జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా ఇతరులకు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. తండ్రి మరణించిన కొద్దికాలం తర్వాత తన తల్లిని వదిలి వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు నిర్ణయించుకుని తల్లి అనుమతి కోరాడు.

తల్లి పుత్రా ప్రేమవల్ల దీనికి అభ్యంతరం చెప్పింది. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి తల్లికి వివిధ రకాల విషయాల గురించి జ్ఞానాన్ని అందజేశాడు.


అశాశ్వతమైన ఈ దేహం కోసంబంధాలుఅనుబంధాల కోసం ప్రతి క్షణం తపించడం వృధా ప్రయాస అని తెలియచెప్పాడు. శరీర తత్వం ఎలా ఉంటుంది ఈ భౌతిక శరీరం ఆకాశంగాలిఅగ్నినీరుపృథ్వి అనే అయిదు అంశాలతో రూపొందుతుందని తల్లికి వివరించాడు వీరబ్రహ్మేంద్రస్వామి. వేదాల్లోనూ ఇదే ఉంది.


పంచభూతాల కలయికతోనే ''నేను'' అనే భావన ఏర్పడుతుంది. ఈ సమస్త చరాచర ప్రకృతిని అర్ధం చేసుకునేందుకు మనకు చెవికన్నుముక్కు వంటి జ్ఞానేంద్రియాల వల్ల సాధ్యమౌతుంది. వీటి ద్వారా వివిధ రకాల పద్ధతులుమార్గాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. అయితే వీటన్నిటినీ సమగ్రంగా అర్ధం చేసుకోడానికి ఉపయోగపడే తత్వమే నేను లేదా అహం. మనం సంపాదించే విషయ పరిజ్ఞానాన్ని మొత్తాన్ని మన మేధస్సు కు ఆర్దమవడానికి కారణం తత్వమే.


ఈ పంచాంశాల వల్ల కామక్రోధమోహాలు కలుగుతాయి.ఇవి ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు ఆ జీవుడు లేదా బుద్ధి ఆ దిశగా చలిస్తూ ఉంటుంది. ఆత్మ అనేది నిమిత్తమాత్రంగా ఉంటూ అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది.ఏది మంచిదోఏది చెడ్డదో చెప్పడం వరకే దాని బాధ్యత. అంతే కానీ తప్పనిసరిగా 'నువ్వు ఈ దిశలో వెళ్ళుఅని ఆదేశించదు. ఆ విషయం బుద్ధి అధీనంలో ఉంటుంది. బుద్ధికర్మ అధీనంలో ప్రవర్తిస్తుంది. అందుకే ''బుద్ధీ కర్మానుసారిణీ'' అని పెద్దలు చెప్తారు.


భౌతికంగా ఎంతటి గోప్పవాడయినా కర్మ నుండి తప్పించుకోలేదు. శ్రీకృష్ణుడు అంతటి మహాయోగి చివరికి ఒక బోయవాని బాణపు దెబ్బకు అడవిలో మరణించాడు. ఈ విషయాన్ని ఎవరు గ్రహిస్తారోపరబ్రహ్మను ఎవరు ధ్యానిస్తారో వార్కికి దుఃఖం తగ్గుతుంది'' - అని తల్లి౮కి వివరించాదు


వీరబ్రహ్మేంద్రస్వామి. తర్వాత ఈ జనన మరణ చక్రాన్ని శాస్వతంగా వీడిపోయేందుకుమోక్షాన్ని సాధించేందుకు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పాడు పోతులూరి.


బ్రహ్మంగారు చేసే కొన్ని పనులు వినేందుకు చాలా విచిత్రంగా ఉండేవి. ఆయన ఒకవైపు కొండగుహలో కూర్చుని కాలజ్ఞానం రాస్తూ ఉండేవారు. మరోవైపు పశువుల కాపరిగా తన బాధ్యతను నిర్వర్తించేవారు.

తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చేందుకు బయల్దేరిన వీరబ్రహ్మేంద్రస్వామి బనగానపల్లెకు చేరారు. ఆరోజు పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయారు. రాత్రికి ఆ ఊరిలోని ఒక ఇంటి వద్దకు చేరారు. నిద్రా సమయం ఆసన్నం కావడంతో అక్కడున్న అచ్చమ్మ అనే స్త్రీ ఇంటిముందు ఉన్న అరుగుపైన నిద్రకు ఉపక్రమించారు.


మరుసటిరోజు పొద్దున్నే అచ్చమ్మగారుతన ఇంటి అరుగుమీద పడుకున్న వీరబ్రహ్మేంద్రస్వామిని చూశారు. ఈ సన్యాసి ఎవరో అని కుతూహలం కలిగిఆయనను వివరాలు అడిగారు. తాను బతుకుతెరువు కోసం వచ్చాననిఏదో ఒక పని చేయదలచానని చెప్పగాతన దగ్గర ఉన్న గోవులను తోలుకెళ్ళమని చెప్పింది అచ్చమ్మ. అలా గోవుల కాపరిగా మారిన వీరబ్రహ్మేంద్రస్వామి ఆవులను తీసుకుని దగ్గరలో ఉన్న రవ్వలకొండ దగ్గరకు వెళ్ళాడు.


ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం ఆయనను ఎంతో ఆకర్షించింది. ఆ ప్రదేశాన్ని కాలజ్ఞానం రాసిఅందరికీ తెలియజెప్పేందుకు తగిన ప్రదేశంగా నిర్ణయించుకున్నారు. ఒక గుహను తనకు ఆవాసయోగ్యంగా చేసుకున్నారు.


ప్రతిరోజూ గోవులను తీసుకుని వచ్చివాటిని పొలంలో వదిలిపెట్టి మనసును కేంద్రీకరించి ధ్యానంలో మునిగిపోయేవారు. ఆ ధ్యానం వల్ల ఆయనకు రకరకాల అనుభవాలు కలిగేవి. వాటన్నిటికీ అక్షరరూపం కల్పించేవారు.


కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ ఉన్న ఒక తాటిచెట్టు ఆకులను కోసుకునికొండ గుహలో రాయడం మొదలుపెట్టాడు.


గోవులకోసం రేఖ


అయితే తాను కాలజ్ఞాన గ్రంధం రాయడంలో నిమగ్నమయ్యే సమయంలో గోవులు అచ్చమ్మగారి పొలం దాటి వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోతూ ఉండేవి. ఇలా జరగకుండా వుండేందుకు ఒక పుల్లతో ఆ గోవుల చుట్టూ పెద్ద వలయం గీశాడు. ''ఈ వలయం దాటి మీరు ఎక్కడికీ వెళ్ళవద్దు'' అని గోవులను ఆదేశించాడు. తర్వాత ప్రశాంతంగా తన కాలజ్ఞానాన్ని కొనసాగించారు.

పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. రకరకాల సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు.ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మొలిచింది.


ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారుఇలా ఎందుకు చేశారుఅనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు. ఒకరోజు మామూలుగా తన విధి నెరవేర్చేందుకు పశువులను తోలుకుని కొండకు బయల్దేరారు వీరబ్రహ్మేంద్రస్వామి.


యధాప్రకారం గోవుల చుట్టూ ఒక వలయం గీసికాలజ్ఞానం రాసుకునేందుకు తాటియాకులుచెట్ల ముళ్ళు కోసుకుని కొండ గుహలోకి వెళ్ళిపోయారు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమ్మ ఇదంతా చూసి ఒక అద్భుతాన్ని చూసిన విధంగా ఆశ్చర్యంలో మునిగిపోయింది.

తన దగ్గర గోవులకాపరిగా పనిచేస్తున్న వీరబ్రహ్మేంద్రస్వామి ఒక జ్ఞాని అని అప్పుడు తెలుసుకోగలిగింది అచ్చమ్మ.


కానీగుహలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడటానికి భయపడింది. తపస్సు చేస్తున్న మాదిరిగా కాలజ్ఞానాన్ని రాస్తున్న బ్రహ్మంగారి ఏకాగ్రతను భగ్నం చేసేందుకు ఆవిడ భయపడింది. అప్పటికి ఆయనతో ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది.


వీరబ్రహ్మేంద్రస్వామి గోవులను తోలుకుని తిరిగి రాగానే ఆయన పాదాలకు నమస్కరించితెలీక తాను చేసిన తప్పులన్నిటినీ మన్నించమని కోరింది.


''నాకు దూషణ అయినాభూషణ అయినా ఒక్కటే. నీవయినాతల్లి అయినా ఒక్కటే. ఈ ప్రపంచంలోని జీవులన్నీ నాకు సమానమే'' అని చెప్పిన బ్రహ్మంగారిని తనకు జ్ఞానోపదేశం కలిగించమని కోరింది అచ్చమ్మ.


ఆ పని ప్రస్తుతం చేసేందుకు వీలు లేదనిసమయం వచ్చినప్పుడు యాగంటి అనే పుణ్యక్షేత్రంలో జ్ఞానోపదేశం చేయగలననిచెప్పారు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆరోజు కోసం ఎదురుచూడసాగింది అచ్చమ్మ.


వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రం యధాప్రకారం కాలజ్ఞానాన్ని రాసిఅచ్చంమగారి ఇంటిలో ఒకచోట పాతిపెడుతూ ఉండేవారు.


ఒక శుభదినాన అచ్చమ్మగారిని ఈశ్వర క్షేత్రమైన యాగంటి'కి తీసుకుని వెళ్లారు వీరబ్రహ్మేంద్రస్వామి. అక్కడ జ్ఞానోపదేశం మొదలుపెట్టారు.


ఈ సందర్భంగా అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ సామాన్యులకు అర్ధమయ్యే విధంగా సరళమైన భాషలో జవాబులిచ్చారు వీరబ్రహ్మేంద్రస్వామి. వాటిలో కొన్ని.... 


పరమాత్మ ఎక్కడ ఉన్నాడు?


పరమాత్మ ప్రపంచంలో అణువణువునా ఉన్నాడు. ఈ పశువులలోనీలోనాలోకీటకాలలో.. అన్నిటిలోనూ ఆయన నివాసం ఉంటుంది.


దేవుని తెలుసుకోవడం ఎలా?


దేవుని తెలుసుకోడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ భక్తిధ్యానం శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే కేవలం భగవంతుని ధ్యానిస్తూ జీవితాన్ని గడపడమే. దీన్నే భక్తి యోగం అని కూడా అంటారు. ధ్యాన యోగం అంటే ప్రాణాయామం ద్వారా ఈ సృష్టిని ప్రారంభించిన బ్రహ్మ ను తెలుసుకోవడమే.


దేవుని ఏ రూపంలో మనం చూడగలంస్త్రీయాపురుషుడా?


పరబ్రహ్మ నిరాకారుడునిర్గుణుడు. మనం ఏ విధంగానూ నిర్వచించలేమ

ఈ విధంగా అచ్చమ్మగారి సందేహాలను తీర్చిన తర్వాత ఆమెకు కొన్ని మంత్రాలను ఉపదేశించారు వీరబ్రహ్మేంద్రస్వామి. వీటిని ఏకాగ్ర చిత్తంతో జపిస్తూ ఉండమని చెప్పారు.

తర్వాత కాలజ్ఞానం గురించి వివరించడం మొదలుపెట్టారు.


వీరబ్రహ్మేంద్రస్వామి తనకు తెలిసిన భవిష్యత్ విషయాలను వివిధ సందర్భాల్లో చెప్పుకుంటూ వెళ్లారు. అంతే కాకుండా వీరబ్రహ్మేంద్రస్వామి వివిధ ఊళ్లు తిరుగుతూ ఉండేవారు. ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ తినేవారువిశ్రమించేవారు. కాలజ్ఞాన ఉపదేశం చేసేవారు. అందువల్ల కాలజ్ఞానం ఒక క్రమ పద్ధతిలో ఉండదు.


వీరబ్రహ్మేంద్రస్వామి తాను రాసిన కాలజ్ఞానంలో ఎక్కువ బనగానపల్లెలో ఒకచోట పాతిపెట్టారు. తర్వాత దానిపైన ఒక చింతచెట్టు మొలిచింది. ఈ చింతచెట్టు వయసు 4,5 వందల సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించారు. ఈ చింతచెట్టుకు స్థానికులు పూజలు చేస్తూ ఉంటారు. ఈ చెట్టునుంచి కొన్నిసార్లు ఎర్రని ద్రవం వస్తుందనిస్థానికులు చెప్తారు. ఈ చెట్టుకు కాసే చింతకాయలు తినేందుకు పనికిరాకపోవడం ఆశ్చర్యం.


వీరబ్రహ్మేంద్రస్వామిఅచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తూ ఉంటారు.



చింతకాయలు తినేందుకు పనికిరాకపోవడం ఆశ్చర్యం.



వీరబ్రహ్మేంద్రస్వామిఅచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తూ ఉంటారు.


అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం
  • వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వావీ వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు.


ఇది అక్షర సత్యం అయింది. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చినవారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి.


  • రాజులు తమ ధర్మాన్ని మరిచిపోతారు. వారు విలాసాలువిందుల్లో మునిగితేలుతూ ఉంటారు. ధర్మభ్రష్టులవుతారు.

ఇక్కడ రాజులు అంటేపాలకులు అని అర్ధం. వారు రాజులు కావచ్చుప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులు కావచ్చు. అనేక రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులుదేశాల ప్రధాన మంత్రులు కూడా అవినీతి కుంభకోణాలలో చిక్కుకోవడం పత్రికల ద్వారా ప్రజలకు వెల్లడి అవుతోంది. పార్టీ ఏదైనా ప్రజా ప్రతినిధులు అత్యధిక శాతం అవినీతికి పాల్పడుతున్నారు.

  • శాంతమూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది. వివిధ వర్ణాలవారు తమ ఆచారాలను వదిలి ఇతరుల ఆచారాలను అనుసరించి నాశనమవుతారు.

నిజమే కదా.. మానసిక వత్తిడి విపరీతంగా పెరిగిన దరిమిలా శాంతమూర్తులు కూడా ఆవేశానికిఆగ్రహానికి లోనవడం మనం చూస్తూనే ఉన్నాం.
  • పైర్లు సరిగా పండవు. పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల కరువు భయంకరంగా పెరుగుతుంది..

మొదట తెలంగాణా లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే కరువు ఉండేది. ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు పెరిగిపోయింది. దీన్ని తట్టుకోలేక రైతులు పొలాలను వదిలేసి కూలీలుగా పట్నాలకు వలస వెళ్లిపోవడం సాధారణంగా మారిపోయింది. నీటికి కరవులేని కోస్తా జిల్లాల్లో కూడా ఇప్పుడు కొత్తగా నీటి సమస్య మొదలైంది. దీనివల్ల పంటలు కూడా పండని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • బ్రాహ్మణులు తమ ధర్మాలనుపౌరోహిత్యం వదిలి ఇతర కర్మలను చేపడతారు. దానివల్ల అంతా అల్లకల్లోలంగా మారుతుంది.

పోతులూరి చెప్పిన కాలంలో ఇది విడ్డూరమే. అప్పట్లో ఏ కులంవారుఆ కులవ్రుత్తి చేపట్టేవారు. ఇప్పుడు కులవృత్తులు లేవు. ఎవరికీ ఏ పని ఇష్టమైతేఆ పనిలో స్థిరపడుతున్నారు.

  • చోళ మండలం నష్టమైపోతుంది..

తుఫానులు ఎక్కువగా తమిళనాడు తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఈ కారణంవల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఏనుగుకు పంది పుడుతుంది. పందికి కోడి పుడుతుంది..
ఇలాంటి వింత సంఘటనలు తరచుగా పేపర్లలో చదువుతూనే ఉన్నాం. కుక్కకు పిల్లిపంది కడుపున కోతి పుట్టిన ఉదంతాలు ఫొటోలతో సహా వార్తల్లో చూశాం. వివిధ జన్యు కారణాలవల్ల ఇలా జరుగుతోందని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. వీటిని ఏ విధంగానూ ఆపలేమని కూడా శాస్త్రజ్ఞులు చెప్పారు.

  • వావీవరసలు తగ్గిపోతాయి. తండ్రి కొడుకునుకొడుకు తండ్రిని దూషించడం చాలా సాధారణం అవుతుంది..

తండ్రీకొడుకులు ఒకర్నొకరు దూషించుకోవడమే కాదుహత్యలు చేసుకోవడం ఎక్కువయ్యాయి. ఆస్తి పంచి ఇవ్వలేదనే కోపంతో తండ్రినితల్లిని హత్య చేసిన కొడుకుల కధలు ఎన్నో ఉన్నాయి. తాను చెప్పిన మాట వినలేదని కొడుకునుకోడళ్లను తండ్రి తగలబెట్టాడనే కధనం ఆమధ్య వార్తల్లో వచ్చింది. పైగా ఆ తండ్రి ఒక వైద్యుడు కూడా. ఇలాంటి వార్తలు కొల్లలుగా వింటున్నాం. కనుక బ్రహ్మంగారి మాట బ్రహ్మవాక్కే.

  • శిలలు కండలు కక్కుతాయి. ఆ కండలు తినేందుకు ఆకాశం నుంచి గద్దలు వచ్చి నేలపైన వాలతాయి. వెంటనే చస్తాయి. ఆ చచ్చినవాటిని పట్టుకుని ప్రజలు గంతులు వేస్తారు.
  • ప్రజలు కొరువులు (సిగరెట్లుబీడీలు కావచ్చు) నోట కరచుకుని తిరుగుతారు. కొండలు మండుతాయి.

చిన్నాపెద్దా తేడా లేకుండాఆడా మగా తారతమ్యం లేకుండా ఎందరో సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. బహుసా ఇది ఇంకా పెరుగుతుంది కావచ్చు. ఇక కొండలు మండటం అంటేఅగ్ని పర్వతాలు అని సూటిగానే తెలుస్తోంది. నిజానికి అగ్ని పర్వతాలు భారతదేశంలో ఎక్కడా లేవు. ఇవి ఆగ్నేయాసియా దేశాల్లోయూరప్ దేశాల్లో మాత్రమే కనపడతాయి. వాటిని గురించి బ్రహ్మంగారు 500 ఏళ్ళ కిందట చెప్పటం ఆశ్చర్యకరంగా ఉంది.

  • జనుల కడుపులో మంటలు పుడతాయి. నోట్లో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూరోగాలపాలయి జనులు మరణిస్తారు. అలాగే పశువులుక్రూర మృగాలు కూడా చస్తాయి.

పూర్వంతో పోలిస్తే ఇప్పుడు వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. అయినా సరేకొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. క్షయ లాంటి ఎన్నో జబ్బులకు అద్భుతమైన మందులు కనిపెట్టారు. కానీకాన్సర్ఎయిడ్స్ లాంటి వ్యాధులు భయపెడుతున్నాయి. దీనికి పంటల్లో వాడే ఎరువులువాతావరణ కాలుష్యంమన అలవాట్లుజీవనశైలి లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొత్తానికి ఈ పరిణామాన్ని వందల సంవత్సరాల కిందటే చెప్పడం అద్భుతం.

అణు బాంబుల వల్ల అణు ధూళి ఏర్పడుతుంది. దీనివల్ల బ్లడ్ కాన్సర్ ఇతర రోగాలు వస్తాయి. నోట్లో బొబ్బలు రావడం కూడా అణు ధూళి చూపించే ప్రభావం వల్లే. అణు బాంబు ప్రభావం వల్ల మనుషులే కాకుండా క్రూర మృగాలుపశువులు కూడా కోట్ల సంఖ్యలో మరణించాయి. మొత్తమ్మీద ఇక్కడ చెప్పినవి అన్నీ అణు బాంబుల వల్ల కలిగే దుష్పరిణామాలే అని అర్ధం చేసుకోవచ్చు.

  • దుర్మార్గులే రాజులుగా మారతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు.

లోకమంతా అవినీతిమయంగా ఉంది. నేరగాళ్ళుమోసగాళ్ళు ప్రజా పాలకులుగా మారుతున్నారు. మనదేశంలోనే కాదుఅభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలను పాలించేవారు అవినీతిపరులుదుర్మార్గులు ఉండటం చూస్తూనే ఉన్నాం.

ధనవంతులు మాత్రమే పాలకులుగా మారుతున్నారు. వారికి ధన సంపాదనే ధ్యేయం. ఈ ప్రయత్నంలో సామాన్య ప్రజల కష్టాల గురించి ఎవరికీ పట్టడం లేదు. ఒక పేదవాడు నేతగా మారటం దుస్సాధ్యంగా మారింది.

  • మత కలహాలు పెరిగి ఒకర్నొకరు చంపుకుంటారు...

దేశ విభజన సమయంలో కూడా హిందువులుముస్లింలు ఒకర్నొకరు చంపుకున్నారు. ఇటీవల కూడా గుజరాత్ లో నరమేధం జరిగింది. ఇక్కడ ముందుగా ముస్లింలు మత కల్లోలాలను ప్రారంభించారు. వారు రైల్లో ప్రయాణిస్తున్న కొందరు హిందువులను సజీవదహనం చేయడంతోహిందువులు ముస్లింలను వందల సంఖ్యలో హతమార్చారు. ఇలాంటి విషాదకర సంఘటనలు పెచ్చుమీరుతున్నాయి. క్రమంగా అన్ని మతాల్లోనూ ఉన్మాదుల సంఖ్య పెరిగిపోతోంది.

  • అడవి మృగాలు అడవులలో నుంచి గ్రామాలుపట్టణాల లోకి ప్రవేశిస్తాయి.. మానవులను చంపుతాయి...

పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దానివల్ల వారు పొలాల కోసంకలప కోసం లక్షల ఎకరాల్లో అడవులను నరికివాటిలో పంటలు పండిస్తున్నారు. ఫలితంగా అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. దీనివల్ల అక్కడ ఉండాల్సిన పులులుఏనుగులుజింకలుఎలుగుబంట్లు మొదలైనవి ప్రజలు నివసించే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. మనుషులను హతమారుస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి.

  • నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు..

బ్రహ్మంగారు పుట్టిజ్యోతిష్యం చెప్పిన సమయానికి మారుమూల పల్లెలే కాదుపట్నాల్లోకి కూడా ఎలక్ట్రిక్ దీపాలు రాలేదు. అసలు వాటి గురించి ఎవ్వరూ ఊహించలేదు కూడా. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది. కరంట్ ఉత్పత్తిలోని సూత్రం ఇదే. నీటినుంచే విద్యుత్తు వస్తోంది.ఈ శక్తి నీళ్ళ నుంచి ఆవిర్భవిస్తోందనేది మనందరికీ తెలుసు. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ళ కిందటే బ్రహ్మంగారు చెప్పగలగడమే విచిత్రం.

సందర్భం వచ్చింది కనుక ఇక్కడ ఒక అద్భుతాన్ని గుర్తుచేసుకుందాం. షిర్డీ సాయిబాబా కూడా ఒకసారి నీటితోనే దీపాలు వెలిగించారు. వివరంగా చెప్పాలంటే..

సాయిబాబాకు రోజూ వ్యాపారులు నూనె ఉచితంగా ఇచ్చేవారు. అయితే ఒకరోజు ''ఈ ఫకీరుకు ఉచితంగా నూనె ఎందుకివ్వాలి?'' అనుకుని వ్యాపారులు తమవద్ద నూనె లేదన్నారు. దాంతో సాయిబాబా తిరిగివచ్చి నూనె డబ్బాలో నీటిని పోసి దానితోనే దీపాలను వెలిగించినట్లు బాబా చరిత్రలో ఉంది.

  • విదేశీయులు వచ్చి భారత దేశాన్ని పరిపాలిస్తారు..

మరీ ప్రాచీనకాలంలో చూస్తే హూణులు తదితరులుఆ తర్వాత ముస్లింలుతర్వాత డచ్ వారుపోర్చుగీసువారుతర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించారు. వందల సంవత్సరాలు పాలించారు. భారతీయుల్లో సహజంగా ఉన్న అనైక్యత వల్లే విదేశీయులు మనదేశాన్ని పరిపాలించగలిగారు. ఈ పరిణామాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి ఎన్నడో ఊహించారు.

  • మాచర్ల లోని రాజులందరూ ఒక స్త్రీ కారణంగా తన్నులాడుకుని మరణిస్తారు..

పల్నాటి యుద్ధం గురించి చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలే కదా! నాయకురాలు నాగమ్మ వల్ల పల్నాడు స్మశానంగా మారిపోయింది. చిన్న చిన్న పట్టింపులుపౌరుషాల వల్ల యుద్ధం జరిగి వేలాదిమంది హతమారిపోయారు.

పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. దీనివల్ల కొన్ని గ్రామాల్లో ప్రజలు మరణిస్తారు.. దీని గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వలేము. ఇది విమానాల్లో నుంచి వదిలే బాంబులు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వియత్నాం యుద్ధంలో జరిగింది ఇదే. అక్కడ ఎక్కువగా గ్రామాలపైనే అమెరికా సేవలు దాడులు జరిపాయి. అక్కడ వామపక్ష గెరిల్లాలు గ్రామాలనుంచే తమ సాహసోపేతమైన పోరాటం చేశారు. అమెరికా సేనలను భయకంపితులను చేశాయి.

  • ఒకరి భార్యను మరొకరు వశపరచుకుంటారు. స్త్రీపురుషులు కామంచేత పీడితులవుతారు.

ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు స్త్రీపురుషుల్లో కామ వాంఛ పెరిగింది. నైతిక విలువలు క్రమంగా తగ్గుతున్నాయి.

  • వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాలను దోచుకుంటారు..

ఇప్పుడు ప్రతిరోజూ ఏదో ఒక దేవాలయంలో దొంగలు పడటం మామూలయింది. ఒక్క వెంకటేశ్వర దేవాలయం అని ఏమిటి.. అన్ని దేవాలయాల్లో దొంగతనాలు సాధారణం అయ్యాయి.

మహమ్మదీయులు వందల సంఖ్యలో హిందువుల దేవాలయాలను సర్వనాశనం చేశారు. గుజరాత్ లోని అత్యంత సుసంపన్నమైన సోమనాథ ఆలయం మీద ముస్లిం చక్రవర్తుల వరుసగా అనేకసార్లు దండయాత్రలు చేసి అక్కడి సంపదను మొత్తం దోచుకుని వెళ్లారు.

  • ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది..

ఈ కాల పరిణామం సరస్వతీ నది విషయంలో అక్షరాలా జరిగిందివేదకాలం నాటి సరస్వతీనది ప్రస్తుతం అంతర్ధానమై పోయినాశాటిలైట్ ద్వారా ఆ నది గతంలో ప్రవహించిందని శాస్త్రవేత్తలు ధ్రువీకరించిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
గంగ విషయంలో జరుగుతుందో లేదోననే సందేహమే అక్కర్లేదు. ఇప్పటికే గంగానది ఉధృతి తగ్గింది. ఎండిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
  • చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి.. కృష్ణానది మధ్య ఒక బంగారు తేరు పుడుతుంది. దాన్ని చూసినవారికి ఆ కాంతివల్ల కనులు కనబడవు.


ఇది ఇప్పటివరకూ జరగలేదు కానీఇకముందు జరిగే అవకాశం ఉంది.

  • ప్రపంచంలో ఇకముందు పాపుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది.

దీనికి సాక్ష్యాలునిదర్శనాలు అక్కరలేదు కదా! కళ్ళముందు కనిపిస్తున్న సత్యమే. ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. అంటేన్యాయంధర్మం ఒంటి కాలిమీద నడుస్తున్నాయి. మంచివారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మోసంద్వేషం రాజ్యమేలుతున్నాయి.

  • క్షీణించిపోతున్న ధర్మాన్ని కాపాడిపాపాత్ములను శిక్షించేందుకు నేను ఐదువేల ఏళ్ళ తర్వాత వీరభోగ వసంతరాయలుగా తిరిగి అవతరిస్తాను. .అప్పుడు నా భక్తులందరూ తిరిగి నన్ను చేరుకుంటారు.

దీనికి ఇంకా చాలా సమయం ఉంది. వందల ఏళ్ళు జరగాల్సిఉంది.

  • విజయనగరం కొన్నాళ్ళు అత్యంత వైభవంగా వెలుగుతుంది. ఆ తర్వాత ప్రాభవం కోల్పోయి నాశనమైపోతుంది.

ఇది ఒక చారిత్రక వాస్తవం. శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్యంలో అంతః కలహాలు ఏర్పడిఅసమర్థులుభోగలాలసులైన చక్రవర్తుల నేతలుగా మారారు.

మరోవైపు మహమ్మదీయుల దండయాత్రల వల్ల ఆ మహా సామ్రాజ్యం బలహీనమవడం ప్రారంభించింది. మిగిలిన భారతీయ రాజుల మాదిరిగానే కర్నాటకఆంధ్ర ప్రాంత రాజుల్లో అనైక్యత వల్ల కూడా విదేశీయులైన మహమ్మదీయులు విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయగలిగారు.

  • వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.

వేంకటేశ్వరునికి మహమ్మదీయ వనిత బీబీ నాంచారి భార్య అనే విషయం అందరికీ తెలిసిందే. బీబీ నాంచారిని మహమ్మదీయులు పూజిస్తారు కాబోలు.

  • కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చేను.

కృష్ణా గోదావరి నదులు సముద్రంలో కలిసే చోటు మన రాష్ట్రంలోనే ఉంది. గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫానుల వల్ల వేల సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయం అందరికీ తెలుసు.

  • తూర్పు నుంచి పడమర వరకు ఆకాశంబున యోజన ప్రమాణం వెడల్పుగా చెంగావి చీర కట్టినట్టు కనపడుతుంది.

ఇది కూడా అణ్వస్త్రాల వల్ల కలిగే ఫలితమే. అణుబాంబు వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్టు కనబడ్డాయి.

ఇలా వీరబ్రహ్మేంద్రస్వామిఅచ్చమ్మకు కాలజ్ఞానం ఉపదేశించారు. ఆయన బోధనల వల్ల క్రమంగా అచ్చమ్మలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోవడం మొదలైజ్ఞానజ్యోతి ప్రజ్వరిల్లడం ప్రారంభం అయింది.

అచ్చమ్మ గారి ద్వారా క్రమంగా బ్రహ్మంగారి గురించి అందరికీ తెలిసింది. ఆయనకు ఒక శిష్యగణం తయారైంది. తన శిష్యులకుభక్తులకు జ్ఞాన బోధ చేస్తూ కాలం గడపడం మొదలుపెట్టారు బ్రహ్మంగారు.

అచ్చమ్మ కుమారుడికి దృష్టిని ప్రసాదించడం
అచ్చమ్మకు ఒక కుమారుడు ఉండేవాడు. అతడి పేరు బ్రహ్మానందరెడ్డి. అతనికి అంధత్వం ఉండేది. ఎంతమంది వైద్యులను సంప్రదించినా అతనికి ఇక చూపు రాదనీ తేల్చి చెప్పారు వారు. అచ్చమ్మ బ్రహ్మంగారికి తన కుమారుడి విషయం చెప్పింది.

అతనికి పూర్వజన్మ ఖర్మం వల్ల చూపు పోయిందని ఆయన చెప్పారు. దృష్టి తెప్పించమని అచ్చమ్మ అడగగాతగిన సమయంలో ఆ పని చేస్తానని అప్పటివరకూ ఓపిక పట్టమని బ్రహ్మంగారు సూచించారు.

ఒకసారి అన్నాజయ్య అనే దైవభక్తిపరుడు బ్రహ్మంగారి మఠానికి వచ్చారు. ఆయనకు తన కాలజ్ఞానం వినిపించాలని నిర్ణయించుకున్నారు.

ఇది పూర్తయిన తర్వాత బ్రహ్మంగారు అచ్చమ్మను పిలిచారు. ''తల్లీనీ కుమారుడు గత జన్మలో ఒక మహిళ దృష్టి కోల్పోవడానికి కారకుడయ్యాడు కాబట్టేఈ జన్మలో ఇలాంటి దుస్థితి ఏర్పడింది. అయినప్పటికీ నేను అతనికి తిరిగి దృష్టిని ప్రసాదించగలను'' అన్నాడు.

తర్వాత బ్రహ్మానందరెడ్డిని పిలిచి అతని నేత్రాలను స్పృశించారు. బ్రహ్మానందరెడ్డికి అప్పటినుంచి కళ్ళు మళ్ళీ కనబడటం ప్రారంభమైంది.

అన్నజయ్యకు చెప్పిన కాలజ్ఞానం

ఈ కాలజ్ఞానం లోని కొన్ని సంగతులు గతంలో అచ్చమ్మకు చెప్పినట్టుగానే కనబడుతున్నాయి.

  • ఎంతోమందీ మార్బలం ఉన్న రాజులు కూడా సర్వ నాశనమైపోతారు. గ్రామాల్లో చోరులు పెరిగిపోతారు.
  • గతంలో జరిగిన యుద్ధాల్లో ఈ పరిణామం సంభవించింది. శ్రీకృష్ణుని నిర్యాణం జరగబోయే ముందు కూడా జరిగినది ఇదే కదా. అర్జునుడు యాదవ స్త్రీలను తీసుకుని వస్తుంటే దారిలో చోరులు అర్జునుడిమీదఅతని సైన్యం మీద దాడి చేస్తారు. వారిమీద తన మహాస్త్రాలను ప్రయోగించ దలచుకున్నప్పటికీ ఒక్క అస్త్రం కూడా గుర్తురాక నిస్సహాయుడైపోతాడు అర్జునుడు. అదంతా కలియుగ ప్రభావమే అని చెప్తాడు వ్యాసుడు.
  • పిడుగులు పడి నదులు ఇంకిపోయేను...
ఉల్కల వల్ల ఈ పరిణామం సంభవించవచ్చని కొందరి అభిప్రాయం. ఉల్కలు పడిన సమయంలో పిడుగు వంటి శబ్దాలు వస్తాయి. ఉల్కాపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమిమీద తిరుగాడిన మహాకాయులైన డైనోసర్లు తుడిచిపెట్టుకుపోయాయి. చిన్న పిడుగు పడితేనే ఎంతోమంది మనుషులు మరణిస్తున్నారు. అలాంటిది ఉల్క పడితేఏ ప్రమాదమయినా సంభవించవచ్చు.
  • విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్టునిల్చున్నవారు నిల్చున్నట్టు హతమారిపోయేరు.. 
  • రాత్రింబగళ్ళు గద్దలు గుంపులు కూడి అరుస్తాయి. నీటియండు చేపలు తాము చచ్చేమని తలచి బయటకు వస్తాయి..
  • పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది రోజులు ఉండిభ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమౌతుంది. 
  • శ్రీశైలం శిఖరాన అగ్ని వర్షం పుడుతుంది. నందీశ్వరుడు రంకెలు వేస్తాడు. ఖనఖనమని కాలు దువ్వుతాడు. 
  • సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది.

ఇది పురాణాలలో ఉంది. అశరీరవాణి తరచుగా సత్య నిర్ధారణ చేయడం ఎన్నొ సందర్భాల్లో మనం పురాణాలుఇతిహాలాసాల్లో కూడా చదువుకున్నాం. బహుసా అప్పుడు చెప్పిన అశరీరవాణి ఇదే కావచ్చు.

  • విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు నిండుతుంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాదిమంది ప్రజలు మరణించగాలక్షలాదిమందికి అనేక రుగ్మతలు కలిగాయి.  
  • గ్రామాలలోపట్టణాలలో నెత్తుటి వాన కురిసేను..

రక్తం మాదిరిగా ఎరుపు రంగులో వానలు పడటం కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు చూశారు. వివిధ రసాయనాలువాతావరణ కాలుష్యం కారణంగా ఎరుపురంగు వర్షం పడుతోందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.

  • సూర్యుడుచంద్రుడు ఉన్నంతవరకు నా మఠానికి పూజలు జరుగుతూనే ఉంటాయి. నా మఠానికి ఈశాన్యం వైపు ఒక చిన్నదానికి చిన్నవాడు పుట్టేను.. అతడు ''నేనే భగవంతుడను నన్ను పూజించండి '' అని పలుకుతాడు.. 
  • నెల్లూరు సీమ మొత్తం నీట మునిగి ఉంటుంది.

తుఫాను సమయంలో నెల్లూరు మొత్తం జలమయం అవడం అనేక సంవత్సరాలుగా మనకు తెలుసు కదా.


నవాబుకు కాలజ్ఞానం వినిపించిన వీరబ్రహ్మేంద్రస్వామి


వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన జోస్యాలుమహిమల గురించి బనగానపల్లె నవాబు విన్నాడు. అతనికి నమ్మకం కలగలేదు. అందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. పోతులూరి చెప్పేవి సత్యాలో కాదో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాక భటులచేత బ్రహ్మంగారిని పిలిపించాడు. ఆయనకు ఎదురువెళ్ళి నమస్కారం చేసిస్వాగతం పలికాడు. తర్వాత ఆయనను ఒక ఆసనంపై కూర్చోబెట్టారు.

నవాబుతన సేవకుడిని పంపి స్వామివారు తినేందుకు పండ్లుఫలహారాలు తెప్పించాడు. అందులో మాంసాహారం పెట్టి తీసుకురమ్మని ముందుగానే పురమాయించాడు.

నవాబు ఆదేశాన్ని అనుసరించిసేవకుడు కొన్ని మాంస ఖండాలను పళ్ళెంలో ఉంచివాటిపై వస్త్రం కప్పివినయంగా స్వామివారికి ఇచ్చాడు. ఆ పళ్ళెం పైనున్న వస్త్రాన్ని తీస్తే తాను ఫలహారం స్వీకరిస్తానని స్వామివారు చిరునవ్వుతో చెప్పాడు. ఆ సేవకుడు వస్త్రాన్ని తొలగించాడు.

నవాబు ఆశ్చర్యపోయే విధంగా ఆ పళ్ళెంలో పుష్పాలున్నాయి. ఈ ఉదంతంతో వీరబ్రహ్మేంద్రస్వామి నిజంగా శక్తివంతుడే అని బనగానపల్లె నవాబు నమ్మక తప్పలేదు. వెంటనే నవాబు క్షమాపణ చెప్పాడు. తనకు కూడా కాలజ్ఞానం వినిపించాలని కోరాడు.

అప్పుడు బ్రహ్మంగారు నవాబుకు కొన్ని సంగతుల గురించి వివరించాడు. ఆయన చెప్పిన వాటిలో కొన్ని ముఖ్యమైనవి...
  • విచిత్రమైన ఈత చెట్టొకటి పుట్టి రాత్రులు నిద్ర పోతుంది. పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరవు ఏర్పడుతుంది...

ఈ విషయం యదార్ధంగా జరిగింది. గుంటూరు జిల్లా చేబ్రోలు దగ్గర ఒక పొలంలో ఉన్న ఈతచెట్టు అచ్చం బ్రహ్మంగారి కధనాన్ని పోలి ఉండేది. రాత్రిపూట ఆ పొలంలో ఉన్న డొంక రోడ్డుకు అడ్డంగా పడుకునేది. మళ్ళీ సూర్యోదయం కాగానే లేచి నిలబడేది. ఈ వింత చెట్టు గురించిన విషయం అప్పట్లో ఫొటోలతో సహా దినపత్రికలో ప్రచురితమైంది.

  • కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ దాత్రు నామ సంవత్సరంలో అనేక ఊళ్ళల్లో రూపాయికి చారెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు.

ఇప్పటికే బియ్యం ధరలు మండిపోతున్నాయి. కిలో బియ్యం 40 రూపాయలు ఉంది. మరో ఐదేళ్ళలో కిలో 100 రూపాయలు పలికినా ఆశ్చర్యం లేదు. ఆకలి చావులు ఎక్కువయ్యాయి. కొన్నాళ్ళకి పేద ప్రజలకు బియ్యం అందుబాటులో లేకుండా పోతాయేమో!



బ్రహ్మంగారు తాను చెప్పినవన్నీ నిజాయితీతోనిర్భీతితో చెప్పారు. నవాబును సంతోషపెట్టేందుకు కాకుండా తనకు ఏది నిజంగా అనిపించిందో దాని గురించే చెప్పుకుంటూ వచ్చారు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాఈ కింద చెప్పినవి చదివితే ఈ విషయం సులభంగా అర్ధం అవుతుంది.
  • 5000 సంవత్సరానికి వచ్చేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవ్వరూ మిగలరు. ఈ వంశానికి ఉన్న ఆస్తి అయిన గోవుల మందలో ఒక్క గోవు కూడా మిగలదు.
  • బనగానపల్లె నవాబు పాలన క్రమంగా నాశనమైపోతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.

బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడం పూర్తయిన తర్వాత ఆయనకు 70 ఎకరాల భూమిని తన కానుకగా ఇచ్చాడు నవాబు. తన మఠానికి తిరిగి వచ్చిన తర్వాత బ్రహ్మంగారు మరల తన భక్తులకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపసాగారు.

దేశాటనకు బయల్దేరిన బ్రహ్మంగారికి ఒక సంవత్సరం గడిచిన తర్వాత దేశంలో పర్యటించి రావాలనే కోరిక పుట్టింది. తన కోరికను భక్తులుశిష్యులకు చెప్పారు. వారెవ్వరూ దీనికి ఒప్పుకోలేదు. కానీఅంతా ఆ సర్వేశ్వరుని నిర్ణయం ప్రకారమే జరుగుతుందని తన పర్యటనను ఆపేందుకు ఎవ్వరూ ప్రయత్నించరాదని నచ్చచెప్పారు స్వామి. ఆ తర్వాత కడప జిల్లాకు ప్రయాణమయ్యారు.

ఆ జిల్లాలో తిరుగుతూ కందిమల్లాయపల్లె చేరుకున్నారు. ఆ ఊరు ఆయనకు బాగా నచ్చడంతో అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. ఆయన ఒక మామూలు వడ్రంగి మాదిరిగా జీవించడం మొదలుపెట్టారు. తన గురించి ఎప్పుడూఎవరికీ చెప్పుకోలేదు.

ఇదిలా ఉంటే ఆ ఊరిలో ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ గుడిలో ప్రతి సంవత్సరం వేలాది రూపాయల ఖర్చుతో జాతర జరగడం ఆనవాయితీ. దీనికోసం ఊళ్ళో ఉన్న వారందరూ చందాలు వేసుకునేవారు.

ఆ ఊరి పెద్దలు వడ్రంగి పని చేసే బ్రహ్మంగారి వద్దకు వచ్చిఅమ్మవారి జాతరకు చందా ఇమ్మని కోరారు. తాను పేదవాడిననితానేమీ ఇవ్వలేనని చెప్పారు ఆయన. దాంతో పెద్దలు ఆయనను ఎగతాళి చేశారు.

తప్పనిసరి పరిస్థితులలో తాను జాతరకు ఏదో ఒకటి ఇవ్వగలననికానీ అందుకోసం అమ్మవారి గుడి దగ్గరకు పెద్దలందరూ రావాలని చెప్పారు బ్రహ్మంగారు. ఆ మాటల ప్రకారం అందరూ కలిసి ఆ ఊరి దేవత గుడి దగ్గరకు వెళ్లారు.

గుడి బయట నిలబడిన బ్రహ్మంగారు ఒక చుట్ట తీసుకుని గుడిలోని అమ్మవారిని ఉద్దేశించి నిప్పు తీసుకురా అని కోరారు. వెంటనే అమ్మవారు అదృశ్య రూపంలో ఒక మూకుడులో నిప్పు తీసుకుని వచ్చి వీరబ్రహ్మేంద్రస్వామి వారికి ఇచ్చింది. ముక్కున వేలేసుకోవడం అందరి వంతయింది.


అన్ని మతాలనూ సమానంగా ఆదరించిన బ్రహ్మంగారు
వివాహం అయిన తర్వాత కొంతకాలం వరకు తన భార్యతో కలిసి జీవిస్తూతన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ గడిపారు బ్రహ్మంగారు.

ఆయన ఎక్కడా కూడా తనను తాను దేవునిగా కానీ దేవదూతగా కానీ ప్రకటించుకోలేదు. తనకు శిష్యులున్నారని కూడా ఆయన చెప్పలేదు. ఎప్పుడూ తన వద్దకు వచ్చే సామాన్య ప్రజల సందేహాలను తీర్చేందుకే ప్రయత్నించేవారు తప్ప తన గురించితన శక్తి గురించి చెప్పుకోలేదు. మహిమలను కూడా ఎప్పుడూ ప్రదర్శించలేదు. అందుకు ఆసక్తి వుండేది కాదు.

అందువల్ల బ్రహ్మంగారిని స్వామిజీగా ఎవ్వరూ గుర్తించలేదు. ఇలా అనేకంటే బ్రహ్మంగారికి ఇలా చెప్పుకోవడం ఇష్టం లేదని అనుకోవచ్చు.ఆయనను ఒక జ్ఞానిగానే గుర్తించారు తప్ప హిందూ మతానికి సంబంధించిన గురువుగా ఎవరూ గుర్తించలేదు. కాబట్టే ముస్లిం మతస్థులు కూడా ఆయన శిష్యులుగా వున్నారు. ఆయన మానవులందరినీ మతం దృష్టితో చూడలేదు. అందువల్లనే ఆయనకు అన్ని మతాల వారిలో గుర్తింపు వచ్చింది.

బ్రహ్మంగారి దేశ సంచారం
కొన్నాళ్ళకి బ్రహ్మంగారికి దేశాటన చేయాలనే కోరిక పుట్టింది. కందిమల్లాయపాలెం నుంచి తన దేశాటనను ప్రారంభించారు.

ముందుగా విజయవాడకు చేరికృష్ణానదీ తీరాన ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
తర్వాత అక్కడి నుండి బయలుదేరి రాజమండ్రివరంగల్ ప్రాంతాల్లో తిరిగారు. వరంగల్ నుంచి హైదరాబాదుకు చేరారు. 
అప్పటికే హైదరాబాద్ నవాబు బ్రహ్మంగారి గురించి తెలుసుకున్నాడు. బ్రహ్మంగారితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మంగారు హైదరాబాద్ వచ్చారని తెలుసుకుని తానూ ఆయనతో మాట్లాడతానని కోరుతూ కబురు పంపాడు. హైదరాబాద్ నవాబు ఆహ్వానం మేరకు బ్రహ్మంగారు నవాబును కలిశారు. బ్రహ్మంగారిని ప్రశ్నించిన నవాబు బ్రహ్మంగారిని కలిసిన నవాబుముందుగా తనకు ఆయనపై నమ్మకం లేదని చెప్పాడు. ఆయన జ్ఞాని అయితే కావచ్చు కానీదైవాంశ సంభూతుడు అంటే మాత్రం నమ్మలేననితనకు ఆయన ఏమైనా మహిమలు చూపితే తాను ఆయన భక్తునిగా మారగలనని అన్నాడు. మహిమలు ప్రచారం చేసుకోవడంలో బ్రహ్మంగారికి నమ్మకం లేకపోయినాతన శక్తిని చూపించాలని నిర్ణయించుకున్నాడు.

ఒక గిన్నె నీటిని తెప్పించుమని నవాబును ఆదేశించాడు. సేవకుడు తెచ్చిన నీటిని ప్రమిదలో పోయించారు. తర్వాత ఆ దీపమును వెలిగించాడు. అది చూసిన నవాబు బ్రహ్మంగారిని భవిష్యత్ తెలుపగలిగిన జ్ఞానిగా గుర్తించాడు. రాజ్యంఅధికారం గురించితన వ్యక్తిగత విషయాలు భవిష్యత్ లో ఏ విధంగా వుంటాయో చెప్పమని ప్రార్థించాడు.

అప్పుడు బ్రహ్మంగారు జోస్యం చెప్పారు. అదే జగత్ప్రసిద్ధమైన కాలజ్ఞానంనేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారము దాల్చి మళ్ళీ జన్మిస్తాను. ఈ సంఘటన జరగటానికి ముందు అనేక ఉత్పాతాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకీనదిలో సాలగ్రామములు నాట్యమాడతాయి. మనుషులతో మాట్లాడతాయి. నదుల్లో దేవతా విగ్రహాలు దొరకటం ఎన్నోసార్లు జరుగుతూనే ఉంది కదా! అలా వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన అనేక వాక్కులు ఇప్పటికి ఎన్నో జరిగియదార్థ సంఘటనలుగా కళ్ళముందు నిలిచాయి.
  •  ప్రయాగ తీర్థంలో చాలామంది మరణించగాకొద్దిమంది బతుకుతారు.

ప్రయాగ హిందువులకుపుణ్యతీర్థము. ఇక్కడ జరిగే ప్రమాదంలో భక్తులు మరణిస్తారు అని దీనికి అర్థం అయి వుండవచ్చు.

  • సరస్వతీ దేవిని దుకాణాలలో అమ్ముతారు.

చదువుకోవడం కంటే చదువు కొనడమే జరుగుతోంది. నిజంగానే విద్య అమ్మకపు వస్తువు అయింది. కష్టపడి చదవకపోయినా ఉత్తీర్ణుల్ని చేసే స్కూళ్ళుకాలేజీలు ఉన్నాయి. అదీ వీలవకుంటే తిన్నగా వెళ్ళి సర్టిఫికెట్లు కొనుక్కునే సౌకర్యాలు కూడా పుష్కలంగా ఉన్నట్టు ఎన్నోసార్లు వార్తలు వింటున్నాం. కనుక బ్రహ్మంగారు చెప్పినట్లు సరస్వతిని అమ్మేవాళ్ళు అమ్ముతున్నారుకొనేవాళ్ళు కొంటున్నారు.

  • మూసీనది పొంగి నగరాన్ని ముంచేస్తుంది. ఆ వరదలలో ప్రజలు మరణిస్తారు.అనంతరం నీ వంశీయులు ఈ పట్టణాన్ని తిరిగి బాగు చేస్తారు. నీ సామ్రాజ్యమున గల అడవులు ఫలవంతంగా మారతాయి.పల్లెలు పట్నాలుగా మారతాయి. చంద్రమతీ దేవి కళలు తొలగిపోతాయి.

హైదరాబాదు విషయంలో ఈ వాక్కు రూఢి అయింది. 1908 లో మూసీ నదికి వరదలు వచ్చాయి. 6వ నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ సమక్షంలో దానికి పరిష్కారం దొరికింది. హైదరాబాదు నగరం తిరిగి బాగుపడింది. ఆ తర్వాత పెను వర్షాలువరదలు వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా పోయింది. మరి బ్రహ్మంగారి మాటలు అక్షర సత్యాలు అయినట్లే కదా!

  • స్త్రీలు పర పురుషులతో యదేఛ్చగా తిరుగుతారు.

ఈ విషయాన్ని బ్రహ్మంగారు చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే స్త్రీపురుషులలో కామ వాంఛ పెరిగివావి వరుసలు మాయమైపోతాయని అర్థం. తనను తాను తెలుసుకోగలిగిన యోగులకే నా దర్శనమవుతుంది.

  • ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు.

ఈ మాట వాస్తవమో కాదో అనే సందేహమే కలగదు. ఇప్పటికే బంగారం ధర చుక్కలను తాకుతోంది. మున్ముందు తులం బంగారం లక్షకు చేరుతుంది. ఇప్పటి పరిస్థితులు చూస్తే అందుకు సుదీర్ఘ కాలం కూడా అక్కరలేదు అనిపిస్తోంది. బహుశా వందేళ్ళ తర్వాత వీరబ్రహ్మేంద్రస్వామి మాటలు నిజమై ముత్యమంత బంగారం కూడా దొరక్కపోవచ్చు.
  • తూర్పు దేశమంతా నవనాగరికతతో మెరిసి,తిరిగి ధనహీనులై దరిద్రులై పోతారు...

తూర్పు దేశం అంటే జపాన్ అని చెప్పుకోవచ్చు.మొదటి ప్రపంచ యుద్ధంలో జపాన్ విజేతగా ఆవిర్భవించింది.తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా దెబ్బతింది జపాన్.అణుబాంబు వల్ల లక్షలాది మంది జపనీయులు మరణించగా,కొన్నిలక్షల మంది కాన్సర్ వంటి భయంకర వ్యాధులతోక్రమంగా మరణిస్తారు.

  • ఇత్తడి బంగారమవుతుంది. బంగాళా దేశము గొప్పదే అయినాఅక్కడ నదులు ఉప్పొంగిప్రజలందరూ ఆ జలములోపడి నశించిపోయేరు.

ఈ విషయం గురించి బ్రహ్మంగారు గతంలో కూడా చెప్పారు. బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో గంగానదికి తరచుగా వరదలు వస్తూ ప్రజలు మరణిస్తూ వుంటారు.

  • ఇరవై అయిదుగురు అక్కాచెల్లెళ్ళు ఏకముఖులై దుర్గాదేవి కళ్యాణం చేసేందుకు వస్తారు.
  • మళయాళమునపశ్చిమమునమహారాష్ట్రమునకర్నాటకమున నాలుగు దేశములలో నా స్వరూపమును తెలుసుకుకొన్నవారు మోక్షాన్ని పొందుతారు. 
  • వివాహాలలో కులగోత్రాల పట్టింపులు మానుతారు.
  • జాతిభేదవర్ణాశ్రమ బేధాలు లేకనే ప్రవర్తిస్తారు.

ఇది ప్రస్తుతం అందరూ చూస్తున్నదే !క్రమంగా వివాహ విషయాలలో కులం పట్టింపు తగ్గుతోంది.అలాగే ఇతర విషయాలలో కూడా జాతి,కుల బేధాలు కనుమరుగవుతున్నాయి.

బ్రహ్మంగారి తిరుగు ప్రయాణం - శిష్యుల సంవాదం

హైదరాబాద్ లో కొద్దికాలం గడిపిన బ్రహ్మంగారు తిరిగి తన ఊరికి రావాలని నిర్ణయించుకున్నాడు.

బ్రహ్మంగారికి సిద్దయ్య అనే వ్యక్తీ అభిమాన శిష్యుడిగా మారాడు.ఇది మిగిలిన శిష్యులకు కొద్దిగా కోపాన్ని కలిగించింది. బ్రహ్మంగారు కూడా సిద్ధయ్య మీద ఎక్కువ అభిమానాన్ని ప్రదర్శించేవారు. శిష్యుల్లో సిద్ధయ్య మీదా ఏర్పడిన భావాన్ని తొలగించాలని నిర్ణయించుకున్న బ్రహ్మంగారు అందుకు తగిన సమయం కోసం ఎదురుచూడటం మొదలు పెట్టారు.

హైదరాబాద్ నుంచి కడపకు పయనం సాగించారు బ్రహ్మంగారుఆయన శిష్య బృందం. ఆ మార్గ మధ్యలో స్వామివారు ఒక కుక్క కళేబరాన్ని సృష్టించారు.అది జీర్ణదశలో పురుగులతో నిండి,అతి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. అందరూ అ దుర్గంధాన్నిభరించలేకపోయారు. బ్రహ్మంగారు ఆ కుక్క శరీరం వేపు నడవటం మొదలుపెట్టారు. ఆ కుక్క శరీరం నుంచి వస్తున్న దుర్గంధం భరించలేకమిగిలిన శిష్యులందరూ కొంచెం వెనకగా నడవటం ప్రారంభించారు.అయితేసిద్ధయ్య ఒక్కడూ మాత్రం వేరే ఎటువంటి ఆలోచన లేకగురువునే అనుసరిస్తూ వచ్చాడు.

అందరూ ఆ కుక్క మృతదేహాన్ని సమీపించారు. వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ నిలబడిశిష్యులను కూడా ఆగమని చెప్పారు. అప్పుడాయన తన శిష్యులతో - "మీరందరూ పెద్ద కులంవారమనీ సిద్ధయ్య కంటే తెలివితేటలు ఎక్కువగా వున్నాయనీ అనుకోవటం నేను గ్రహించాను. మీకు నిజంగా నేనంటే గురు భక్తి వుంటేఈ శుకనాన్ని తినండి.. అప్పుడే నేను మిమ్ముల్నినా నిజమైనా శిష్యులుగా గుర్తిస్తాను"అన్నారు.

ఆ మాట వినటంతోటే శిశ్యులందరూ నిర్ఘాంతపోయారు.

'దూరంగా నిలబడేకుక్క శరీరం నుంచి వస్తున్న వాసనను భరించలేని తాము మాంసాన్ని ఎలా తినగలం అని ఆలోచించడం మొదలుపెట్టారు. అది గ్రహించిన బ్రహ్మంగారు సిద్దయ్యనుశునక మాంసాన్ని తినమని ఆదేశించారు. సిద్ధయ్య గురువుగారైన వీరబ్రహ్మేంద్రస్వామి మీద ఉన్న నమ్మకంతో క్షణం కూడా ఆలోచించకుండా ఆ మాంసాన్ని స్వీకరించాడు.

అప్పుడు స్వామి వారు శిష్యులవైపు తిరిగి "ఇప్పటికైనా సిద్ధయ్యకు గురువు అంటే ఎంత అభిమానముగౌరవమో ఉన్నాయో తెలిసిందా?! నన్ను త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు. అహర్నిశలూ నా మాటమీద విశ్వాసముగౌరవము ఉంచుతాడు. నేను ఏమని ఆజ్ఞాపించినాదాన్ని నేరవేర్చే దృఢ సంకర్పం కలిగిఉంటాడు. అందుకే సిద్దయ్య అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ,అభిమానం. ఎవరైతే నన్ను అభిమానంతో కొలుస్తారో వారిని నేను గుర్తిస్తాను.వారే నా ప్రేమకు పాత్రులవుతారు ” అని చెప్పారు.

వీరబ్రహ్మేంద్రస్వామి అలా చెప్పడంతో శిష్యులందరూ తమ తప్పు తెలుసుకున్నారు. పశ్చాత్తాపం చెందారు.

''గురువుగారూమా తప్పులను క్షమించండి.మేం మీకు శిష్యులుగా వున్నప్పటికీ కులం,అహంకారం,గర్వం వంటి వాటిని దూరంగా తరిమివేయలేకపోయాము. ఆ కారణం వల్లే సిద్దయ్యపట్ల చులకన భావంతో తక్కువగా చూస్తున్నాము. మీ భోధనల వల్ల మా మనసులో పేరుకుపోయిన అంధకారం మాయమైంది ” అంటూ వినయంగా చెప్పారు.

వీరబ్రహ్మేంద్రస్వామి తన శిష్యులను పరీక్షించ దలచికుక్క మాంసం తినమని ఆజ్ఞాపించిన సందర్భంలోవాళ్ళు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందారు. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి ఇప్పటికైనా మీరు నిజం గ్రహించారు. ఎవరయితే నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతారోసేవిస్తారోవారిమీద నేను ఎక్కువగా కరుణ చూపుతాను. దీనికి మీరు చేయవలసింది స్వార్థం వదిలివేయటమే !” అన్నారు.

ఈ సంఘటనతో సిద్దయ్య మాదిరిగా బ్రహ్మంగారి మిగిలిన శిష్యులందరూ కూడా స్వార్థ రహితంగా స్వామిగారిని సేవించడం మొదలు పెట్టారు. అనంతరం స్వామి ఆయన శిష్య బృందం తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ఒకరోజున మొత్తం ప్రయాణించిన తర్వాత బాగా అలసిపోవడంతో ఒక ప్రదేశంలో ఆగారు. అక్కడ విశ్రమించిన సమయంలో స్వామివారు తన శిష్యులతో ఆధ్మాత్మిక సంబంధమైన సంభాషణలు ప్రారంభించారు.

అలా కాలం గడుస్తుండగా బ్రహ్మంగారు హఠాత్తుగా తన శిష్యులలో ఒకరైన వెంకటయ్య వేపు తిరిగి "మరి కొద్ది సమయానికి ఒక అద్భుతం జరగబోతోంది ” అని తెలియజేశారు.

ఆ తర్వాత మళ్ళీ తన శిష్యులతో సంభాషణలో మునిగిపోయారు.

స్వామి వారు సిద్ధయ్యతో మాట్లాడుతూ వుండగా దగ్గరలో వున్న ఒక ప్రదేశం నుంచి ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు వినబడ్డాయి. అలా కొంతసేపు మాటలు వినిపించిన తర్వాత మళ్ళీ నిశ్శబ్దం...తర్వాత మళ్ళీ మాటలు వినబడ్డాయి.

అది గ్రహించిన స్వామివారు శిష్యుడు సిద్ధయ్యడుఇతర శిష్యులతో "వారెవరో తెలుసుకుందాం పదండి ” అని అందరినీ తన వెంట తీసుకుని అక్కడికి బయలుదేరి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగాఒక బ్రాహ్మణ స్త్రీ,కుష్టు రోగియైన తన భర్తనుతన ఒడిలో వుంచుకుని విలపించడం కనిపించింది.

అప్పుడు బ్రహ్మంగారు "ఏమమ్మా...మీరు ఎక్కడినుంచి వచ్చారుఎక్కడికి వెళ్తున్నారునీ భర్తకు ఈ వ్యాధి ఎలా వచ్చిందిమీ వివరాలన్నీ చెప్పండి ” అన్నారు.

ఆ బ్రాహ్మణ స్త్రీ చెప్పినవన్నీ విన్నతర్వాత -బ్రహ్మంగారు "ఇక మీ కష్టాలన్నీ పోయినట్టీ. మీ గత జన్మ పాపం వల్లే ఈ వ్యాధి మీకు వచ్చింది. మిమ్ముల్నినేను ఆ పాపం నుంచి విముక్తి చేస్తాను" అని అభయమిచ్చారు. తర్వాత బ్రాహ్మణ యువకుని ఒక్కసారి తన చేతితో తడిమారు.

అంతే... ఆ బ్రాహ్మణుని కుష్టువ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత బ్రహ్మంగారు ఆ దంపతులకు పంచాక్షరి మంత్రం ఉపదేశించారు.

స్వామీమీరు చేసిన ఉపకారం మేం ఎప్పటికీ మరిచిపోలేము. మీరు మా ఊరికి మాతోపాటు రావాలి. మా ఊరి వాళ్ళందరికీ మీ ఉపదేశాలతో జ్ఞానాన్ని కలగచేయాలి ” అని ప్రార్థించారు.

ఇప్పుడు నేను పర్యటనలో వున్నాను. తగిన సమయం వచ్చినప్పుడు మీరు పిలవకుండానే మీ ఊరికి వస్తాను" అని బదులిచ్చి వారిని పంపివేశారు. తనశిష్యులతోపాటు కందిమల్లాపాలెం జేరి తమ పనులలో నిమగ్నమయ్యారు బ్రహ్మంగారు.

బ్రహ్మంగారి పై నేరారోపణ


ఒకరోజు వీరబ్రహ్మంగారికి కడప నవాబు నుంచి ఒక జాబు వచ్చింది. అందులో పేరి సాహెబు అనే ఒక ముస్లిం తన కుమారుడైన సిద్దయ్యను స్వామీజీ ప్రలోభ పెట్టి హిందువుగా మార్చారని స్వామిపై నేరారోపణ చేశాడు. దీని గురించి విచారించేందుకు బ్రహ్మంగారిని తాము కడపకు రమ్మని ఆదేశిస్తున్నామని ఆ లేఖలో సారాంశం.

ఆ లేఖ అందుకున్న వీరబ్రహ్మంగారు తాను నవాబు దగ్గరకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. శిష్యులు తాము కూడా కడపకు బయల్దేరి వస్తామని చెప్పగాబ్రహ్మంగారు దానికి ఒప్పుకోలేదు. తాను ఒక్కడే అక్కడికి వెళ్తానని చెప్పారు. కానీ సిద్ధయ్య ,మాత్రం ఇది తనకు సంబంధించిన విషయం కాబట్టితాను మాత్రమే కడపకు వెళ్తాననిబ్రహ్మంగారు అక్కడికి రానక్కరలేదని చెప్పాడు. మొదట అందుకు ఒప్పుకోకపోయినా సిద్ధయ్య పట్టుపట్టడంతో అందుకు ఒప్పుకోక తప్పలేదు బ్రహ్మంగారికి.

ఆ లేఖను తీసుకు వచ్చిన జవాన్లతో కలిసి కడపకు బయలుదేరాడు సిద్ధయ్య. మార్గమధ్యంలోనే జవాన్లను ఏమార్చి వారికి కనబడకుండావేరే మార్గంలో ముందుగానే కడపకు చేరుకున్నాడు సిద్ధయ్య. అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని వచ్చిన వారితో మాట సంబంధమైన సంభాషణలు మొదలుపెట్టాడు.

వీరబ్రహ్మేంద్రస్వామి తన శిష్యులను పరీక్షించ దలచికుక్క మాంసం తినమని ఆజ్ఞాపించిన సందర్భంలోవాళ్ళు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందారు. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి ఇప్పటికైనా మీరు నిజం గ్రహించారు. ఎవరయితే నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతారోసేవిస్తారోవారిమీద నేను ఎక్కువగా కరుణ చూపుతాను. దీనికి మీరు చేయవలసింది స్వార్థం వదిలివేయటమే !” అన్నారు.

ఈ సంఘటనతో సిద్దయ్య మాదిరిగా బ్రహ్మంగారి మిగిలిన శిష్యులందరూ కూడా స్వార్థ రహితంగా స్వామిగారిని సేవించడం మొదలు పెట్టారు. అనంతరం స్వామి ఆయన శిష్య బృందం తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ఒకరోజున మొత్తం ప్రయాణించిన తర్వాత బాగా అలసిపోవడంతో ఒక ప్రదేశంలో ఆగారు. అక్కడ విశ్రమించిన సమయంలో స్వామివారు తన శిష్యులతో ఆధ్మాత్మిక సంబంధమైన సంభాషణలు ప్రారంభించారు.

అలా కాలం గడుస్తుండగా బ్రహ్మంగారు హఠాత్తుగా తన శిష్యులలో ఒకరైన వెంకటయ్య వేపు తిరిగి "మరి కొద్ది సమయానికి ఒక అద్భుతం జరగబోతోంది ” అని తెలియజేశారు.

ఆ తర్వాత మళ్ళీ తన శిష్యులతో సంభాషణలో మునిగిపోయారు.
స్వామి వారు సిద్ధయ్యతో మాట్లాడుతూ వుండగా దగ్గరలో వున్న ఒక ప్రదేశం నుంచి ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు వినబడ్డాయి. అలా కొంతసేపు మాటలు వినిపించిన తర్వాత మళ్ళీ నిశ్శబ్దం...తర్వాత మళ్ళీ మాటలు వినబడ్డాయి.

అది గ్రహించిన స్వామివారు శిష్యుడు సిద్ధయ్యడుఇతర శిష్యులతో "వారెవరో తెలుసుకుందాం పదండి ” అని అందరినీ తన వెంట తీసుకుని అక్కడికి బయలుదేరి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగాఒక బ్రాహ్మణ స్త్రీ,కుష్టు రోగియైన తన భర్తనుతన ఒడిలో వుంచుకుని విలపించడం కనిపించింది.

అప్పుడు బ్రహ్మంగారు "ఏమమ్మా...మీరు ఎక్కడినుంచి వచ్చారుఎక్కడికి వెళ్తున్నారునీ భర్తకు ఈ వ్యాధి ఎలా వచ్చిందిమీ వివరాలన్నీ చెప్పండి ” అన్నారు.

ఆ బ్రాహ్మణ స్త్రీ చెప్పినవన్నీ విన్నతర్వాత -
బ్రహ్మంగారు "ఇక మీ కష్టాలన్నీ పోయినట్టీ. మీ గత జన్మ పాపం వల్లే ఈ వ్యాధి మీకు వచ్చింది. మిమ్ముల్నినేను ఆ పాపం నుంచి విముక్తి చేస్తాను" అని అభయమిచ్చారు. తర్వాత బ్రాహ్మణ యువకుని ఒక్కసారి తన చేతితో తడిమారు.

అంతే... ఆ బ్రాహ్మణుని కుష్టువ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత బ్రహ్మంగారు ఆ దంపతులకు పంచాక్షరి మంత్రం ఉపదేశించారు.
స్వామీమీరు చేసిన ఉపకారం మేం ఎప్పటికీ మరిచిపోలేము. మీరు మా ఊరికి మాతోపాటు రావాలి. మా ఊరి వాళ్ళందరికీ మీ ఉపదేశాలతో జ్ఞానాన్ని కలగచేయాలి ” అని ప్రార్థించారు.

ఇప్పుడు నేను పర్యటనలో వున్నాను. తగిన సమయం వచ్చినప్పుడు మీరు పిలవకుండానే మీ ఊరికి వస్తాను" అని బదులిచ్చి వారిని పంపివేశారు. తనశిష్యులతోపాటు కందిమల్లాపాలెం జేరి తమ పనులలో నిమగ్నమయ్యారు బ్రహ్మంగారు.

బ్రహ్మంగారి పై నేరారోపణ
ఒకరోజు వీరబ్రహ్మంగారికి కడప నవాబు నుంచి ఒక జాబు వచ్చింది. అందులో పేరి సాహెబు అనే ఒక ముస్లిం తన కుమారుడైన సిద్దయ్యను స్వామీజీ ప్రలోభ పెట్టి హిందువుగా మార్చారని స్వామిపై నేరారోపణ చేశాడు. దీని గురించి విచారించేందుకు బ్రహ్మంగారిని తాము కడపకు రమ్మని ఆదేశిస్తున్నామని ఆ లేఖలో సారాంశం.

ఆ లేఖ అందుకున్న వీరబ్రహ్మంగారు తాను నవాబు దగ్గరకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. శిష్యులు తాము కూడా కడపకు బయల్దేరి వస్తామని చెప్పగాబ్రహ్మంగారు దానికి ఒప్పుకోలేదు. తాను ఒక్కడే అక్కడికి వెళ్తానని చెప్పారు. కానీ సిద్ధయ్య ,మాత్రం ఇది తనకు సంబంధించిన విషయం కాబట్టితాను మాత్రమే కడపకు వెళ్తాననిబ్రహ్మంగారు అక్కడికి రానక్కరలేదని చెప్పాడు. మొదట అందుకు ఒప్పుకోకపోయినా సిద్ధయ్య పట్టుపట్టడంతో అందుకు ఒప్పుకోక తప్పలేదు బ్రహ్మంగారికి.

ఆ లేఖను తీసుకు వచ్చిన జవాన్లతో కలిసి కడపకు బయలుదేరాడు సిద్ధయ్య. మార్గమధ్యంలోనే జవాన్లను ఏమార్చి వారికి కనబడకుండావేరే మార్గంలో ముందుగానే కడపకు చేరుకున్నాడు సిద్ధయ్య. అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని వచ్చిన వారితో మాట సంబంధమైన సంభాషణలు మొదలుపెట్టాడు.

ముస్లిం మతస్తుడిని సిద్ధయ్యగా మార్చాడనే అభియోగం మోపడంతో వీరబ్రహ్మేంద్రస్వామికి నవాబు నుండి పిలుపు వచ్చింది. గురువుగారిమీద వచ్చిన ఆ నేరారోపణను తొలగించేందుకు సిద్ధయ్య బయల్దేరాడు.

మార్గమధ్యంలో అక్కడక్కడా చెట్ల కింద కూర్చున్న సిద్ధయ్యఎక్కువ సమయం ధ్యానంలో మునిగి వుండేవాడు. యోగముద్రలో ఉన్న సిద్ధయ్య వద్దకు ఎందరో బాటసారులు వచ్చితమ సందేహాలను బయటపెట్టేవారు. సిద్ధయ్య వారి సందేహాలను తెరచిసలహా ఇస్తూండేవాడు.

సిద్ధయ్య దగ్గరకు ఎక్కువగా మహమ్మదీయ భక్తులు వస్తూండేవారు. వారికి తన బోధలతో హితోపదేశం చేస్తూవారి మనసులను మార్చితనవలె నుదుట బొట్టుకాషాయములు రుద్రాక్షలు ధరింపచేస్తూండేవాడు.

సిద్ధయ్య జ్ఞానానికిబోధనలకు ముగ్దులైరెండు రోజులలోనే అనేకమంది మహ్మదీయులు హిందువులుగా మారిపోయారు.సిద్ధయ్య చేస్తున్న బోధనల గురించిముస్లింలు హిందువులుగా మారిపోవటం గురించి తెలుసుకున్న నవాబు సిద్దయ్యను తన సముఖమునకు పిలిపించాడు.

సిద్ధయ్య నవాబు దగ్గరకు వచ్చి నిర్భయంగా నిలబడ్డాడు. పైగా కాస్తయినా వినయంవిధేయతా ప్రదర్శించలేదు. అతని వైఖరి చూసి నవాబుకు కోపం వచ్చింది. సిద్ధయ్యకు ఉరిశిక్ష వేయాలన్నంత ఆగ్రహం కలిగినాదాన్ని అణుచుకుని ముందుగా అతని ఉద్దేశ్యం తెలుసుకున్న తర్వాతే తానేం చేయాలో నిర్ణయించుకోవాలని భావించాడు.

నువ్వు మహమ్మదీయుడవై వుండిహిందూ మతానికి చెందిన వ్యక్తిని ఎందుకు ఆరాధిస్తున్నావుఇది మహమ్మదీయ మతాన్ని విమర్శించటమే అవుతుంది. ఇది అల్లా పైన నీ అపనమ్మకాన్ని సూచిస్తోంది. ఇది మన మతాన్ని దూషించడమే! కాబట్టి నిన్ను కఠినంగా శిక్షించదలచుకున్నాను. దీనికి నీ జవాబు విన్న తరువాత ఏం చేయాలో ఆలోచిస్తాను” అన్నాడు నవాబు.

నవాబు అంత తీవ్రంగా మాట్లాడినా సిద్ధయ్య అణువంత కూడా చలించలేదు. నవాబును చూసి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. దానితో అసలే కోపంగా వున్నా నవాబుకు ఆగ్రహం మరింత పెరిగింది. కానీఅతన్ని శిక్షించేముందు విచారణ చేయాల్సి వున్నందు వల్ల సిద్ధయ్యతో ఇలా మాట్లాడాడు.

నీకు మహత్తులు తెలుసని చెప్పుకుంటున్నావు కదా! సరేఇప్పుడు నువ్వేం మహత్తు చూపగలవో ప్రదర్శించు. లేకపోతే నీకు తగిన శిక్ష విధిస్తాను" అని హెచ్చరించాడు.

దానికి ప్రతిగా సిద్ధయ్య "మా గురువుగారి అనుజ్ఞ ప్రకారం నేను ఎలాంటి మహిమలూ చూపకూడదు. కానీమా గురువుగారి శక్తి తెలుసుకోవాలని మీరు కుతూహల పడుతున్నారు కాబట్టితప్పనిసరి పరిస్థితులలో నేను మీకు ఒక మహిమ చూపించనున్నాను. దానికోసం మీరు ఒక బండరాయిని తెప్పించి నా ఎదురుగా వుంచండి. మా గురువు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగారి శక్తి ఏమిటో మీకు చూపుతాను” అన్నాడు.

వెంటనే నవాబు ఆలస్యం చేయకుండా తన భటులను పంపి ఒక పెద్ద కొండరాతిని తెప్పించాడు. ఈ సభలో నేనేమైనా అతీత శక్తి ప్రదర్శిస్తే మీకుసభలో వున్నవారికీకూడా ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం వుంది. కాబట్టి ఎక్కడన్నా ఖాళీ స్థలంలో బండరాయిని వుంచండి” అన్నాడు.

అందుకు ఒప్పుకున్న నవాబు రాతిని ఒక ఖాళీ ప్రదేశానికి తరలించాడు. ఇప్పుడు నీ శక్తినిమీ బ్రహ్మంగారి శక్తిని ప్రదర్శించు" అని ఆదేశించాడు.
సిద్ధయ్య మనస్సులో గురుదేవుడైన బ్రహ్మంగారిని స్మరించితన కుడి చేతిని ఎత్తి ఆ బండరాయికి నమస్కారం చేశాడు. వెంటనే అక్కడున్న ప్రజలందరూ భయకంపితులయ్యే విధంగాపెద్ద శబ్దంతో బండరాయి ముక్కలైపోయింది.
ఈ అద్భుత దృశ్యాన్ని నవాబుతో సహాఅక్కడ చేరిన ప్రజలందరూ చూశారు. ఎవ్వరికీ నోట మాట రాలేదు.

తర్వాత సిద్ధయ్య శాంతంగా నవాబు వేపు చూసి "అత్యంత శక్తిశాలి అయిన నా గురుదేవులను దోషిగా భావించి శిక్షించదలుచుకున్నారు. ఇప్పుడు చూశారు కదా ! ఆయన ఎంత శక్తివంతులో! ఒకవేళ ఆయనకు మీమీద ఆగ్రహం వస్తే మీరేమవుతారో ఆలోచించుకోండి” అన్నాడు.

ఈ సంఘటనతో నవాబు భయపడితన తప్పును క్షమించమని అడిగాడు. తనకు కూడా జ్ఞానోపదేశం చేయాలని ప్రార్థించాడు. తాను నవాబుకు జ్ఞానోపదేశం చేయలేననిఅందుకు అర్హుడు తన గురువుగారేనని సిద్ధయ్య ఆయనకు నచ్చచెప్పాడు.

వెంటనే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిని తీసుకురమ్మని ” నవాబు సిద్దయ్యను కోరాడు.

నేను కానీమీరు కానీ పిలిస్తే మా గురువుగారు రాలేరు. అందుకు తగిన సమయం రావాలి. అప్పుడు ఆయన వస్తారు. మీకు కూడా ఉపదేశం చేస్తారు” అని సిద్ధయ్యనవాబుకు నచ్చచెప్పాడు.

ఆ తర్వాత సిద్ధయ్య నవాబు వద్ద సెలవు తీసుకునిఅక్కడి నుంచి బయల్దేరి తిరిగి కందిమల్లయ్యపల్లికి వెళ్ళిపోయాడు.

సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం

ఒకరోజు సిద్ధయ్య వీర బ్రహ్మేంద్రస్వామితో చర్చను ప్రారంభించాడు. 

స్వామీ ఈ సమస్త సృష్టికి కారణభూతుడెవరు

ఆయనను మనం ఎలా కనుగొంటాం?” 

అని సిద్ధయ్య ప్రశ్నించాడు.
అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి సిద్ధయ్యకు ఇలా వివరించారు.

''ఈ ప్రపంచంలో మన అనుభూతికిజ్ఞానానికి అందని ఒక అద్భుత శక్తి వుంది. దానినే సర్వేశ్వరుడు అని మనం పిలుస్తాం. దీనిని వేర్వేరు మతాలకు చెందినవారు వేర్వేరుగా గుర్తిస్తారు. కానీ,ఆ శక్తిమంతుడు ఒక్కడే! అతడే భగవంతుడని ఆస్తికులంటారు.అది మన జ్ఞానానికి అతీతమైన సర్వోన్నత శక్తి అనిపుట్టుకమరణము లేని శక్తి అనీ నాస్తికులంటారు.దానిని మనం అన్వేషణ ద్వారా కనుగొనవచ్చు''

''మన కళ్ళకు కనిపించే ఈ ప్రపంచము మొత్తము పూర్తిగా కల్పితమైనదే! అంటే ఇది అశాశ్వతమైనది. ఇది నశించక తప్పదు. అయితే, మరి మనకి కనబడుతున్న ఈ జీవులుజీవం లేని వస్తువులు శాశ్వతం కాదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించవచ్చు. ఈ శరీరమే అశాశ్వతం. అలాంటప్పుడు మనకి గోచరమయ్యే ఈ చరాచర వస్తువులన్నీ కూడా నాశనమవుతాయి.

జీవుల జ్ఞానానికిదృష్టికి అందని ఒకే అంశంతత్త్వం ఈ సృష్టికి ముందు నుంచీ వుంది. ఇప్పుడు కూడా వుంది. తర్వాత కూడా వుంటుంది. దానినే మూల తత్త్వమనీభగవంతుడనీ రకరకాల పేర్లతో పిలుస్తాం. కొలుస్తాం. దాని స్వభావాన్ని గ్రహించటం అనేది దాదాపు అసాధ్యం. అది సాధారణ భావనకు అందనిది.

సమస్త సృష్టికీ కారణభూతమే ఈ అంశం. ఇది పరిపూర్ణమైనది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ ఇందులోంచే ఉద్భవించాయి. తిరిగి ఇందులోనే లయమైపోతాయి.శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు.

ఈ ప్రపంచంలో జీవులు అనుభవించే అనుభూతులకు అతీతమైనది అది. తన కర్మకు తాను నిర్వరిస్తూ పోతుంది. తప్ప ఎవ్వరి అనుజ్ఞ కోసంప్రార్థనల కోసమూ ఆగదు. దానిని మనం భగవంతుడని పిలుస్తూఅనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తూ వుంటాం.

భగవంతుడికి లేదా ఈ అనంతత్వానికి ఒక రూపం లేదు. గుణం లేదు. చావు లేదు. పుట్టుక లేదు.అతడు ఆది లేనివాడు.అనంతమైన వాడు. అన్నింటిలోనూ వుంటాడు. అన్నీ తానై వుంటాడు. కానీ ఇందులో ఏ ఒక్కటీ భగవంతుని గురించి లేదా ఈ ఏకత్వం గురించి చెప్పలేదు.

కేవలం మొక్కుబడిగా చేసే పూజలుచదివే మంత్రాలతో ఎవరూ భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేదు. అలాగే స్వార్థం కోసం చేసే యజ్ఞాలతోనూ మనం భగవంతుని చూడలేం. నిర్మలమైన మనస్సుతో చేసే పనుల వల్ల మాత్రమేఎలాంటి యజ్ఞాలు చేయకపోయినా మంత్రాలు చదవకపోయినా భక్తులు సర్వేశ్వరుడిని చూడగలరు.

భూతభవిష్యత్వర్తమాన కాలాలకు దైవం తెలీదు. ఈ చర్మ చక్షువులతో భగవంతుని ఎవ్వరూ దర్శించలేరుగుర్తించలేరు. ఎంతమంది భక్తులున్నప్పటికీ అతి కొద్దిమంది మాత్రమే భగవంతుని చేరుకోగలరు.

ఇక జీవుని గురించి వివరిస్తాను. ఈ శరీరంలో 20 కోట్లకు పైన రోమ రంధ్రములున్నాయి. 70 ఎముకలుమాంసముతో నిర్మితమయినదే ఈ స్థూల దేహము. ఇది సుఖకరమైన అనుభవాలను అందిస్తున్నట్టు భ్రాంతి కలిగించే దుఃఖస్వరూపం. సామాన్య మానవులే కాదుయోగులుఋషులు కూడా వాంఛల ద్వారా మాత్రమే జీవించే ఈ శరీరం పట్లసుఖముల పట్లకోర్కెల పట్ల అనుబంధము పెంచుకుని ఎన్నో కష్టాలు పొందారు.

ఆత్మవేరుశరీరం గుర్తించే నేను వేరు. అనేక కోరికల ఫలితంగా రూపుదిద్దుకునేదే నేను. ఆత్మకు ఈ వాంఛలు వర్తించవు.కేవలం నిమిత్త మాత్రముగా ప్రవర్తిస్తూజీవుని నడిపిస్తుంటుంది. దానికి ఇరువది అయిదు తత్త్వాలుదశ నాడులుసప్త ధాతువులచే నిర్మితమైన ఈ శరీరంలో ఏడు పుష్పములున్నాయి.

వీనిలో మొట్టమొదటిది మూలాధారం. గుద స్థానము నందు వుండే మూలధార చక్రమునకు విఘ్నేశ్వరుడు అధిదేవత.
రెండవది స్వాథిష్టాన చక్రము. ఆధార చక్రమునకు రెండు అంగుళములపై నాలుగు రేకులు కలిగి,మూడు కోణములతో తెల్లని రంగుతోప్రకాశవంతంగానిర్మలంగా వుంటుంది. ఇది జల తత్త్వాన్ని కలిగి వుంటుంది. ఈ చక్రమునకు బ్రహ్మదేవుడు అధిదేవత.
మూడవది మణిపూరకము. స్వాధిష్ఠాన చక్రమునకు పైన ఒక మణివలె ప్రకాశిస్తుంటుంది. నీలవర్ణము కలిగింది. మొత్తం పది రేకులతో వుంటుంది. విష్ణువు ఈ చక్రానికి అధిష్టాన దేవత.
అనాహత చక్రము హృదయ స్థానములో పన్నెండు రేకులతో వుంటుంది. స్వర్ణ కాంతులను వెదజల్లుతూంటుంది. ఇది వాయు స్వభావం కలిగి వుంటుందని యోగుల భావన. దీనికి రుద్రుడు అధిష్టాన దేవత.
విశుద్ధ అనేది ఐదవ చక్రము. అనాహిత చక్రమునకు పైనకంఠములో వుంటుంది. పదహారు దళములుంటాయి.
ఆజ్ఞా చక్రము ఆరవది. విశుద్ధ చక్రము మొదలు 12 అంగుళములపైన భ్రూ మధ్య స్థానంలో (త్రికూట స్థానము) ఉంటుంది. రెండు రేకులు కలిగి వుంటుంది. ఎరుపుపసుపు రంగులతో అపారమైన కాంతిని వెదజల్లుతుంటుంది. దీనికి ఈశ్వరుడు అధిష్టాన దేవత.
సహస్రాకారము అనునది ఆజ్ఞా చక్రానికి పైన కపాలంలోబ్రహ్మరంథ్రము వద్ద వుంటుంది. ఎనిమిది దళాలుంటాయి. వేయి రేకులు కలిగి వుంటుంది.
ప్రాణ వాయువునకు కుడి ఎడమ వేపుల ఇడ పింగళులు అనే నాడులు వున్నాయి. ఇడ పింగళులు సహస్రారము మొదలు ఆగ్నేయ చక్రం వరకు వ్యాపించి వుంటాయి. వీటిమధ్య సుషుమ్ననాడి వుంటుంది. ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి వుంటుంది. ఈ నాడుల యందు ప్రవహించే జీవ శక్తి జీవుని చలనంతో ఉంచుతుంది''

ఇప్పుడు మీకు కుండలినీ శక్తి గురించి వివరిస్తాను. కుండలినీ శక్తిని జాగృతం చేయగలిగినవారు ఈ సృష్టిలో ఏదైనా సాధించగలుగుతారు. ఈ సృష్టిలో అతి కొద్ది మందికి మాత్రమే ఇది సాధించే శక్తి వుంటుంది. అది రకరకాల కారణాల వల్ల సాధ్యం కావచ్చు. యోగులు వేలమంది వుండవచ్చు. కానీ కుండలినీశక్తిని జాగృతం చేయగలిగినవారు అతి తక్కువ.

కఠోరమైన సాధన ద్వారా కుండలినీ శక్తిని మేల్కొలపగలుగుతారు. ఇది హఠ యోగం వల్ల సాధ్యపడుతుంది. లేదా మంత్ర జపం వల్ల కూడా సాధ్యమే! మన ఋషులలో ఎక్కువమంది ఈ శక్తిని సాధించనవారే! అందువల్లే వారు భూత భవిష్యత్ కాలాలను గురించి చెప్పగలిగేవారు. వివిధ మహిమలను ప్రదర్శించేవారు.

మన మనస్సు సాధారణ వాంఛల వేపే మొగ్గుతుంది.ఎంతటి సన్యాసి అయినాయోగి అయినా కొద్ది క్షణాలసేపు అయినా కామ వాంఛలకు లొంగని వాడుండడు. అంతటి చంచలమైన మనస్సుపై అదుపు సాధించి ధ్యానంలో నిమగ్నం చేయటం అనేది అతి కొద్దిమంది సాధకులకే సాధ్యపడుతుంది. వారిలో కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగినవారు చాలా తక్కువ.

హఠయోగం ప్రకారం కుండలినీ శక్తి పీఠం గుదస్థానం మర్మస్థానం మధ్యలో వుంటుంది. స్త్రీలకు యోని స్థానంలో వుంటుంది. ఇది అండం ఆకారంలో వుంటుంది. సర్పం చుట్టలు చుట్టుకుని నిద్రిస్తున్న విధంగా ఈ శక్తి వుంటుంది. ఈ సృష్టిని ఏ శక్తి అయితే శాసిస్తుందో ఆ శక్తి అంశమే కుండలిని. ఈ శక్తిని మేల్కొలిపితే ఆ భౌతికకాయం జీవంతో వున్నంతవరకు శక్తి వుంటుంది. శరీరంలోని నాడులన్నిటినీ మహాశక్తితో నింపుతుంది కుండలిని. మహా శక్తివంతమైన కుండలినీ శక్తిని జాగృతం చేయడమే యోగాభ్యాసంలోని అత్యున్నత స్థితి. మానవ శరీరమే దేవుని నిలయం. మన శరీరంలోనే ఎన్నో అధ్బుతాలున్నాయి. యోగ సాధన ద్వారా మాత్రమే వీటిని మనం దర్శించగలం" అని వివరించారు.

వీరబ్రహ్మంగారు తన శిష్యుడు సిద్దయ్యకి శరీరం గురించికుండలినీ శక్తిని గురించి వివరిస్తుండగాకక్కయ్య అనే వ్యక్తి ఇదంతా రహాస్యంగా విన్నాడు. అతడు తన అమాయకత్వంతో "బ్రహ్మంగారు చెప్పినదాని బట్టి శరీరం లో చాలా అధ్బుతాలు వున్నాయి. వాటిని నేను చూడాలి” అనుకుని ఇంటికి వెళ్లాడు.

అక్కడ నిద్రిస్తున్న తన భార్య శరీరాన్నికత్తితో నరికివేసిఅందులోతనకు ఏమైనా అద్భుతాలు కనబడతాయేమోనని చూశాడు. కానీకక్కయ్యకు రక్త మాంసాదులు తప్ప ఏమీ కనబడలేదు.

'అయ్యో ఆ అయ్యవారు చెప్పిన మాటలు విని నేనునా భార్యను చంపాను. నాకు దేవుళ్ళు ఎవరూ కనబడకపోగాపెండ్లాము ప్రాణం తీసిన వాడయ్యాను. దీనికంతటికీ కారణం బ్రహ్మంగారే! ఇదంతా నేను వెళ్లి ఆయననే అడుగుతాను. సమాధానం చెప్పకపోతే ఈ స్వామి దొంగోడు అని అందరికి చెబుతా' - అనుకుని బ్రహ్మంగారి దగ్గరకు వెళ్లాడు. తర్వాత కక్కయ్య బ్రహ్మంగారికి జరిగినదంతా వివరించిఆయనను దూషించడం మొదలు పెట్టాడు.

కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపోయారు బ్రహ్మంగారు. తర్వాత "కక్కయ్యా! నేను చెప్పినదేదీ అసత్యం కాదు. నేను అసత్యాలేవి చెప్పను. దానికి ఋజువుగా మరణించిన నీ భార్యను నేను బతికిస్తాను ” అని అభయమిచ్చి అతని వెనుక బయల్దేరారు.

కక్కయ్య ఇంటికి చేరిన తరువాత కక్కయ్య భార్య శరీరంపై మంత్రజలం చల్లారు. ఆశ్చర్యకరంగా ఆమె పునర్జీవితురాలైంది.

ఆ అద్భుతాన్ని చూసి బ్రహ్మానందభరితుడైన కక్కయ్య బ్రహ్మంగారి కాళ్ళమీద పడ్డాడు. నన్ను క్షమించండి ప్రభూ ! నేను మిమ్ముల్ని తెలుసుకోలేకపోయాను. ఇక ఎప్పటికీ నేను మీ శిష్యుడిగానే వుండిపోతాను” అని ప్రార్థించాడు.

నా శిష్యులు ఎవ్వరూ నన్ను పూజించకూడదు. వారందరూ ఆ సర్వేర్వరుని కోసం అన్వేషిస్తూ వుండాలి. నువ్వు కూడా అదే విధంగా జీవించు" అని కక్కయ్యను ఆయన ఆదేశించి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయారు.

యధా ప్రకారం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన దేశాటనను కొనసాగించారు. గ్రామాల్లో తిరుగుతూప్రజలకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపటం మొదలుపెట్టాడు.

తన మార్గాంతరంలో నంద్యాల చేరుకున్నారు. ఆ దగ్గరలో వున్నఒక గ్రామంలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. భోజనం చేసే సమయంలో దాహం వేసిఆ ఊరిలో వున్నఒక విశ్వబ్రాహ్మణుని యింటికి వెళ్లికొద్దిగా మంచినీరు ఇవ్వమని అడిగారు.

ఆ విశ్వబ్రాహ్మణుడు తన పనిలో నిమగ్నమై వున్నందువల్లఇంటిలో ఎవ్వరూ లేనందువల్ల పక్కనే వున్న బావి వద్దకు వెళ్లి నీరు తాగమని చెప్పాడు. కానీ బ్రహ్మంగారు ఆ మాటలను పట్టించుకొనక మళ్ళీ మంచినీరు ఇవ్వమని అడిగారు. దాంతో ఆ విశ్వబ్రాహ్మణుడు కోపం తెచ్చుకుని కొలిమిలో కరుగుతున్న లోహాన్ని మూసతో సహా తీసుకువచ్చిబ్రహ్మంగారికి ఇచ్చి దాహం తీర్చుకోమని ఎగతాళి చేశాడు. అతని అహంకారమును పోగొట్టాలని నిర్ణయించుకున్న బ్రహ్నంగారు ఆ మూసను చేతితో పట్టుకుని మంచి నీటి వలె తాగేశారు.

ఇది చూసిన ఆ విశ్వబ్రాహ్మణునికి భయం వేసింది. తర్వాత బ్రహ్మంగారు మామూలు మనిషి కాదని గ్రహించుకునిఆయన పాదాలపై పడితన తప్పును క్షమించమని ప్రార్థించాడు.

ఒక సందర్భంలో బ్రహ్మంగారుతన శిష్యుడు కక్కయ్యను ఉద్దేశించి, "నాకు ఎవ్వరి మీదా ఆగ్రహం కలగదు. కేవలం అజ్ఞానం మీద తప్ప! ఆ అజ్ఞానాన్ని తొలగించుకుని సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా విజ్ఞానం అంకురిస్తుందివిచక్షణ పెరుగుతుంది. ఇప్పుడు నేను నీ విషయంలో చేసిందే అదే. కాబట్టి ఇకపై నువ్వు వివేకవంతుడిలా ప్రవర్తించు. జరిగినదాని గురించి మరచిపో " అని జవాబిచ్చాడు.

నా అజ్ఞానాన్ని తొలగించినాకు జ్ఞాన బోధ చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ నేను మీకు శిష్యుడిగానే వుండిపోతాను. మీరు అంగీకరించండి ” అని ప్రార్థించాడు.

అందుకు ఒప్పుకున్న బ్రహ్మంగారుకక్కయ్యను స్వీకరించిఅతనికి సంతృప్తిని కలిగించారు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి కర్నూలు జిల్లాలోని కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించినంద్యాలకు చేరుకున్నారు.

నంద్యాలలో విశ్వబ్రాహ్మణులలో సంపన్నులను 'పాంచాననం 'అని పిలిచేవారు. వీరు చాలా అహంకారంతో ప్రవర్తించేవారు. సహాయం కోరి వచ్చిన వారితోనూఇతరులతోనూవయసులో పెద్దవారు అని కూడా చూడకుండా తలబిరుసుతనంతో కించపరుస్తూ మాట్లాడేవారు.

ఒకసారి బ్రహ్మంగారు ఆ ఊరికి వచ్చారు. ఆ ఊరిలోని కొందరు భక్తులు స్వామి వారికి భోజనాది వసతులు కల్పించారు. కానీ,పాంచాననం వారు మాత్రం తమకేమీ పట్టనట్టు వున్నారు.

ఇదంతా గమనించిన బ్రహ్మేంద్రస్వామి తానే వారి వద్దకు వెళ్లి "నాయనలారా నా తప్పేముందిఅతి పేదలమైన మేము క్షుద్భాదని ఓర్వలేక మా ఆకలి తీర్చగలరని మీ వద్దకు వచ్చాము. మాకు భోజన సదుపాయములు కల్పించి మా ఆకలి తీర్చగలవారు మీరొక్కరే అని భావిస్తున్నాను. అందువల్ల మీ దగ్గరికి వచ్చాం" అని పలికారు.

వారిలో ఒక వృద్ధుడు 'తినేందుకు ఎంత అన్నం అవసరం అవుతుందో చెప్పమని 'పరిహాస పూర్వకంగా అన్నాడు.

మాకు ఎంత అవసరం అవుతుంది నాయనా?! ఏదో మా కడుపు నిండితే చాలు" అని బ్రహ్మంగారు జవాబిచ్చారు.

బ్రహ్మంగారిని ఏదో విధంగా అవమానపరచాలని అనుకున్నవారిలో ఒక వ్యక్తి "అబ్బే... మీరు మరీ అంత తక్కువ తింటే మాకు సంతృప్తి వుండదు స్వామిగారూ! మీరు మా అతిథి. మేం మీ కోసం పుట్టి బియ్యం వండి నైవేద్యం అందిస్తాం. మీరు ఏమీ మిగలకుండా తింటేనే మాకు ఆనందం కలుగుతుంది'' అని ఎగతాళిగా అన్నాడు.

మీరు అంత అడిగినప్పుడు నేను కాదు అని ఎలా అనగలను నాయనా! అలాగే చేయండి ” అన్నారు బ్రహ్మంగారు.

ఆ విశ్వబ్రాహ్మణులు పుట్టి బియ్యం వండించారు. దానిని ఆరగించమని స్వామి వారినిశిష్యులను భోజనానికి పిలిచారు.

వీరికి తగిన జవాబివ్వాల్సిందేనని నిశ్చయించుకున్న స్వామివారు తన శిష్యుడయిన సిద్ధయ్యను పిలిచి "ఈ అన్నం మొత్తం నువ్వొక్కడివే స్వీకరించిమనకు అన్నం దానమిచ్చిన వారిని సంతుష్టులను చేయి" అని ఆజ్ఞాపించారు. తర్వాత ఆ అన్నపు రాశి నుంచి ఒక ముద్దను తీసుకుని పక్కకు నిలబడ్డాడు. గురుదేవుని ఆజ్ఞ ప్రకారం ఆ పుట్టి అన్నాన్ని కూడా వేగంగా ఆరగించేశాడు.

వెంటనే జీర్ణం చేసుకునితనకు మరింత అన్నం కావాలని సంజ్ఞ చేశాడు. దీన్ని చూసి నిర్ఘాంతపోయిన ఆ విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారు కావాలని ఈ విధంగా చేశారని గ్రహించారు. వారి శక్తిని గ్రహించితమ అహంకారాన్నిఅజ్ఞానాన్నిక్షమించమని కోరారు.

బ్రహ్మంగారు చిరునవ్వు నవ్వితన చేతిలో వున్నఅన్నపు ముద్దను సిద్ధయ్యకు తినిపించాడు. అప్పటికి గానీ అతనికి కడుపు నిండలేదు. తర్వాత ఆ విశ్వ బ్రాహ్మణులు స్వామికి పూజలు చేసితమకు తత్వోపదేశం చేయమని అభ్యర్థించారు. బ్రహ్మంగారు వారందరికీ జ్ఞానోపదేశం చేశారు.

తర్వాత స్వామివారు అక్కడి నుంచి బయల్దేరి అహోబిలం చేరి అక్కడ వున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ నుంచీ మళ్ళీ బయలుదేరి కడపకు చేరారు. కడప నవాబుకు తమ రాక గురించి తెలిపారు.
వెంటనే నవాబు తన పరివారంతో సహా బ్రహ్మంగారి దగ్గరకు వెళ్లి ఆయనకు సకల గౌరవ సత్కారాలు చేసితమతో పాటు తోడ్కొని వెళ్లాడు.

బ్రహ్మంగారి మహిమలు గురించి విన్ననవాబుఏదో విధంగా స్వామి వారి మహిమలను చూడాలని నిర్ణయించుకునిస్వామి దగ్గరకు వచ్చిమరుసటి రోజు కచేరీ ముందు వున్న మైదానంలో జరిగే సభకు రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చిరునవ్వుతో "నీ మనస్సులో వున్న కోరిక తెలిసింది.నువ్వు అనుకున్నదానిని నేను చేసి చూపించగలను'' అని చెప్పి పంపించారు.

తన మనస్సులో బ్రహ్మంగారి మహిమను పరీక్షించాలి అనుకున్నట్టు ఈయన ఎలా కనిపెట్టారో అర్థంకాక నవాబు విస్మయంలో మునిగిపోయాడు. తాను ఏర్పాటు చేస్తున్న సభ గురించి అందరికీ తెలిసేలా చాటింపు వేయించాడు నవాబు.

మరుసటి రోజు సాయంత్రం ప్రజలందరూ సభా స్థలం వద్దకు చేరుకున్నారు. వీర బ్రహ్మేంద్రస్వామి తన శిష్యులతో సభకు వచ్చి ఆశీనులయ్యారు. నవాబు లేచి నిలబడి "స్వామీ! నా వద్ద ఒక చూడి గుర్రం వుంది. అది ఆడ గుర్రాన్ని కంటుందో లేక మగ గుర్రాన్ని కంటుందో తెలియజేయండి" అని కోరాడు.

స్వామి చిరునవ్వుతో ఆ గుర్రాన్ని సభకు తీసుకురమ్మని కోరగా నవాబు స్వామివారి ఎదుటకు గుర్రాన్ని తెప్పించాడు. స్వామి ఆ గుర్రాన్ని చూసి "దీని గర్భంలో నాలుగు తెలుపురంగు కాళ్ళునొసట చుక్కపువ్వుల తోక కలిగిన మగ గుర్రం ఉంది. అలాంటి వింత గుర్రమే జన్మిస్తుంది" అని చెప్పారు.

ఆ మాట విన్న తర్వాత కూడా నవాబుకి వున్న సందేహం దూరం కాలేదు.


వీరబ్రహ్మేంద్రస్వామికి మహిమలు ఉన్నాయో లేదో పరీక్షించాలి అని నవాబు అనుకున్నప్పుడునవాబును ఉద్దేశించి "ఆ గుఱ్ఱము గర్భములో వున్న శిశివును చూడటమే నీ ఉద్దేశ్యం అని నాకు అర్థమయింది. అది చూసేవరకూ కూడా నాపై నీకు కలిగిన సందేహం తొలిగిపోదు... అవునా!” అని నవ్వుతూ అడిగారు స్వామి. నవాబు అవునని జవాబిచ్చాడు.

వీరబ్రహ్మంగారు నాలుగువేపులా డేరా కట్టించిగుఱ్ఱం గర్భంలో వున్నపిల్లను బయటకు తీసి నవాబుకు చూపించారు. నవాబు దాన్ని తన చేతులతో అందుకునితెర బయటకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రజలందరికీ చూపించారు.అది బ్రహ్మంగారు వర్ణించినట్టే చిత్రమైన గుర్తులు కలిగి వుంది. అందురూ స్వామివారి శక్తిని కళ్ళారా చూసిఆశ్చర్యపోయారు.

తిరిగి బ్రహ్మేంద్రస్వామి ఆ గుఱ్ఱపు పిల్లని గుర్రం గర్భంలో ప్రవేశపెట్టిగుర్రాన్ని తిరిగి బ్రతికించి నవాబుకు ఇచ్చేశారు. ఈ సంఘటనతో నవాబుకు వీరబ్రహ్మంగారిమీద నమ్మకం పెరిగింది. తన భవిష్యత్తు చెప్పమని ప్రార్థించాడు.

శ్రీ స్వామి వారు కడప నవాబుకు కాలజ్ఞాన బోధ చేయుట

నేను శ్రీ వీర భోజుండనయి ఉద్భవిస్తాను. ఈ కలియుగంలో 5000సంవత్సరములు గడిచేసరికి దుష్టశిక్షణశిష్టరక్షణకై వస్తాను. ఈలోపుగా సంభవించే కొన్ని పరిణామములను తెలియపరుస్తున్నాను విను.

ఉప్పుకొండూరులో ఊరి చెరువు కింద ఉత్పాతాలు పుడతాయి. నిజాయితో వ్యాపారం చేసే వర్తకులు క్రమంగా నశించిపోతారు. జలప్రవాహాలు ముంచెత్తటంవల్ల 14 నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నేను రావటానికి ఇదే ఒక ప్రబల నిదర్శనం.

నాలుగు వర్ణాలవారు న్యాయం తప్పి నడుస్తారు.

దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుపోయిమాడిపోతారు.

5972సంవత్సరం ధాత నామ సంవత్సరం మాఘ శుద్ధ బుధవారం రోజున పట్టపగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురవుతాయి. కోటిదూపాటిలోనూకొచ్చెర్ల కోటలోనూ కోడి మాట్లాడుతుంది.

జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ములు దిగమింగి అబద్ధాలాడి బాకీలు ఎగ్గొడతారు. దీనిని నిరూపించుకోవడం కోసం తప్పుడు ప్రమాణాలు చేస్తారు. భర్త మరణించిన స్త్రీలు మరల ముత్తయిదువులవుతారు.

కోమటి కులంలో 25గోత్రముల వారు మాత్రమే నిలిచివుంటారు. ఉత్తర దేశంలో ఉత్తమభేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.

ఇది మహాత్మాగాంధీ గురించి చెప్పిన జ్యోతిష్యం అని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. బ్రహ్మంగారు తాను చెప్పిన జోస్యంలో ఏ విధంగా అయితే 'మహాత్మఅనే పదం వాడారో గాంధీ కూడా అదే పేరు మీద పేరు పొందటం మనందరికీ తెలిసినదే కదా! దేశ విదేశీయులందరూ కూడా ఆయనను 'మహాత్మపేరు మీదే సంభోదిస్తారు.
మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
పట్టపగలు ఆకాశంలోనుంచి పిడుగుల వాన పడినిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
దక్షిణ ప్రాంతంలో అయిదు తలల మేకపోతు పుడుతుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది.
ఇలాంటి వింతలూ ఇప్పటికే అనేకం జరిగాయి. పంది కడుపున ఏనుగు తొండం మాదిరి అవయవం కలిగిన పంది పిల్లలు పుట్టడంఇతర అనేక జంతువులు వికృత రూపంతో పుట్టడం ఎన్నోసార్లు వార్తల్లో విన్నాం.
బనగానపల్లెలోని కాలజ్ఞాన పాతర మీది వేపచెట్టుకు జాజిపూలు పూస్తాయి.
గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగానపల్లె నవాబు కొంత కాలమే పాలన చేస్తాడు. ఆ తరువాత బనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు.
గోలకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణము ఏలతారు.

మహానంది మరుగున మహిమలు పుడతాయి.

నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించినవారిని నేను కాపాడుతాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు వచ్చి మేమే వీర భోగ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటలను నమ్మరు. మూఢులుమాత్రం నమ్ముతారు.

మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలుఅరికాలున తామరపద్మం కలిగిన వారు వస్తారు. వారిని నేనే అని భ్రమ వద్దు. నా రాకకు ఒక గుర్తు ఏమిటంటే కందిమల్లయ్యపల్లిలో నవరత్నమంటపం కడతారు. ఈ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది.

కంచికామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాదిమంది మృతి చెందుతారు.

ఆవు కడుపులోని దూడ పుట్టకుముందే బయటి ప్రజలకు కన్పిస్తుంది.

పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.

కృష్ణగోదావరుల మధ్య మహాదేవుడను వాడు జన్మించి శైవుడైనాఅన్నిమతాలనూ గౌరవిస్తూగుళ్ళూ గోపురాలూ నిర్మిస్తాడు. పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామదేవతలు ఊగిసలాడుతారు.

కాశీకుంభకోణంగోకర్ణ క్షేత్రాల మహాత్తులు తగ్గిపోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.

ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూఈ నిదర్శనాలు కనిపిస్తూంటాయి. పతివ్రతలు పతితలౌతారు. వావీ వరుసలు పాటించరు. ఆచారాలు అన్నీ సమసిపోతాయి.

రాయలవారి సింహాసనం కంపిస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది.

శ్రీశైల క్షేత్రాన కల్లుచేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి. మందులకు తగ్గవు. స్త్రీ పురుషులంతా దురాచారులు అవుతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.

ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.

వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవమతం తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలతాయి. బెండ్లు మునుగుతాయి. చివరికి శివశక్తి అంటూ లేకుండా పోతుంది.

విజయనగరాన కోటలోని రాయల సింహాసనం బయటపడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామాలలోని రాతి విగ్రహాలు ఊగిసలాడుతాయి. అప్పుడు బిజ్జలరాయని కొలువున రాయల సింహాసనం బయటపడుతుంది...'' ఇలా స్వామివారు కడప నవాబుకు కాలజ్ఞానము బోధించిమంత్రదీక్ష యిచ్చి ఆశీర్వదించారు.

ఆయన అక్కడినుంచి బయలుదేరి పొద్దుటూరు మీదుగా అల్లాటపల్లె చేరారు. అక్కడ వీరభద్రాలయంలో పూజలు చేయించి బయలుదేరారు. సిద్ధయ్యమిగిలిన శిష్యులు వెంట రాగా నెమ్మదిగా వెళ్తున్నారు.

ఇదే మార్గంలో అరణ్యంలో తొమ్మిదిమంది దొంగలుదారిన పోయే బాటసారులను కొల్లగొడుతూహతమారుస్తూ వుండేవారు. అందువల్ల ఆ మార్గంలో ప్రయాణించేందుకు ఇష్టపడేవారు కాదు. ఆ మార్గంలోనే బ్రహ్మంగారు ప్రయాణించడం మొదలుపెట్టారు.

సిద్ధయ్యతో ఇష్టాగోష్ఠి జరుపుతూ వస్తున్న స్వామివారి బండిని ఆ తొమ్మిది మంది దొంగలు ఆపారు. వారిని చూసి బండితోలే వ్యక్తి భయపడిపోయిబండిని ఆపేశాడు.

కర్రలు ఎత్తి స్వామివారి పైకి పోయిన దొంగలు స్వామి వారి దృష్టి పడటంతోటే ఎత్తిన చేతులు ఎత్తినట్లే వుండిపోయారు. మాట్లాడదామంటే మాటలు కూడా రావటం ఆగిపోయాయి. అలాగే రాతి మనుషుల్లాగా వుండిపోయారు.

అది చూచి వీరబ్రహ్మంగారు బండి దిగివారందరినీ తీసుకురమ్మని సిద్ధయకు చెప్పారు. వెంటనే సిద్ధయ్య అందరినీ నెట్టుకుంటూ స్వామి వారి వద్దకు చేర్చాడు. స్వామివారు దొంగలందరిని స్వయంగా తాకి వారి చేతులను కిందికి దించారు.

నన్ను కొట్టి ఈ బండిలో వున్నధనాన్ని తీసుకోండి" అన్నారు.
జవాబు చెబుదామనుకున్నారు గానీ వారికి నోట మాట రాలేదు.

స్వామివారు కొంత విభూతి వారి నోటిలో వేశారు. అయినా వారు శరీరాన్ని కదపలేక పోయారు. పశ్చాత్తాప పడిన దొంగలు స్వామిని ప్రార్థించారు. దాంతో స్వామి వారిని క్షమించి వదిలివేశారు. స్వామివారు అక్కడినుంచి బయలుదేరిపుష్పగిరి అగ్రహారం చేరారు.

పుష్పగిరి వాసులకు చెప్పిన కాలజ్ఞానం....

నేను శ్రీ వీరభోగవసంతరాయలుగాకలియుగంలో 5000సంవత్సరంలో దుష్టశిక్షణశిష్టరక్షణార్థం భూమిపై అవతరిస్తాను.

మార్గశిర మాసంలో దక్షిణభాగంలో ధూమకేతువనే నక్షత్రం ఉదయిస్తుంది. మీ అందరికీ కన్పిస్తుంది. క్రోథి నామ సంవత్సరమునమార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో శ్రీ వీర భోగ వసంతరాయలుగా వచ్చే సమయంలో దక్షిణాన నక్షత్రము ఒకటి పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి''

నాలుగు వర్ణాలవారు మద్యపానం చేత భ్రష్టులై పోతారు.

వేదములు అంత్య జాతుల పాలవుతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్తుల పంచన చేరతారు. విధవా వివాహాలు జరుగుతాయి. విప్రులు స్వ ధర్మాలు మాని ఇతర వృత్తులు చేపడతారు. బానిసత్వం చేస్తారు.

బ్రాహ్మణులను పిలిచేవారు వుండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంట భూములు అమ్ముతారు. నేను తిరిగి అవతరించేసరికి బ్రాహ్మణులకు తినేందుకు తిండిగుడ్డ కరువవుతాయి.

మీన రాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీర భోగ వసంత రాయలుగా ఉద్భవిస్తాను. నాలుగు మూరల ఖడ్గము పట్టి శ్రీశైల పర్వతం మీదికి వచ్చిఅక్కడి ధనమంతా పుణ్యాత్ములయిన వారికి పంచి ఇస్తాను.
నేను తిరిగి భూమి మీదకు ఎలా వస్తానో వివరిస్తాను - వినండి

కేదారివనంలో నిరాహారినై తపం చేస్తాను.మూడు వరాలు పొందిఅచ్చటి నుండి విక్రమ నామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి,బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసి అక్కడ మహా మునులమహార్షుల దర్శనము చేసుకుంటాను.

అక్కడినుండి బయలుదేరిశ్రీశైలం మల్లిఖార్జునుని సేవిస్తాను. అనంతరం దత్తాత్రేయుల వారిని దర్శించుకుంటాను.

మహానందిలో రెండు నెలలుండిఅక్కడి నుంచి శ్రావణ శుద్ధ పౌర్ణమి నాటికి వీరనారాయణపురం చేరుకుంటాను. అక్కడ కొంతకాలం నివసిస్తాను. నేను తిరిగి వచ్చేసరికి జనులు ధన మదాంధులుగా మారి అజ్ఞానంతో కొట్టుకుచస్తారు.

నా రాకకు ముందు సముద్రములోని జీవరాశులన్నీనశిస్తాయి. పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండ పగులకొడతారు.

కాశీదేశములో కలహాలు చెలరేగుతాయి.

మున్ముందు విధవా వివాహాలు విస్తృతంగా జరుగుతాయి. అవి సర్వసాధారణం అయిపోతాయి.

వావీ వరుసలు లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. పార్వతి అవతారములను డబ్బులకు అమ్ముతారు. కులగోత్రములునీతి జాతి లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి.

భూమ్మీద ధనరాశులు ముక్కుటంగా ఉంటాయి. చివరికి అరణ్యాలల్లోనూఅమితమైన ధనముంటుంది. నేను భూమిపై పెక్కు దుష్టాంతాలను పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమి మీద మంటలు పుడతాయి.

నాలుగు సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. నూట ఇరవై పుణ్యక్షేత్రములు నశించిపోయేను.

నా రాకకు ముందు అనేక చిత్రములు కలిగేను. శృంగేరిపుష్పగిరి పీఠములు పాంచాననం వారి పాలవుతాయి.

ఉత్తర దేశంలోకత్తులు తెగుతాయి. తూర్పుదేశం ధూళి అయిపోతుంది.

హరిద్వారంలోని మఱ్ఱి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం వాకిలి మూసి వుంటుంది.

అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజిపువ్వులు పూస్తాయి.
నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది.

వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్య మండలం నుండి కొలువుపాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలముతర్వాత సూర్యనంది చేరుకుంటాను.

శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4999నాటికి కలిరూపం కొంత నాశనమవుతుంది.
కలికి అవతారం కలియుగాంతాన వస్తుంది. పూర్వులు గ్రంథములలో కలియుగముకలికి అవతారం వివరించారు వ్యాసభగవానుడు. శాంతి పర్వం చివరన ఈ అవతారం గూర్చి చెప్పారు.

శ్రీశైలాన పొగ మంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ 'గణగణ మువ్వల మోత వినబడుతుంది.

భ్రమరాంబ దేవాలయంలో ఒక మొసలి 7రోజులపాటు కనిపించిఆపైన అదృశ్యమవుతుంది.

భ్రమరాంబ మెడలోని మంగళసూత్రం తెగిపడిపోతుంది. ఆమె కంట నీరు కారుతుంది. స్తనాలనుంచి పాలు కారతాయి.

కందనూరి గోపాలుని గుడి ముందు చింతచెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయమున రెండు పాములు తిరుగుతాయి. వాటిల్లో పెద్ద పాము శిఖరాన మూడు రోజులుండి తరువాత అదృశ్యమవుతుంది.

సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలు పూచికాయలు కాచిపండ్లు పండి వెను వెంటనే మాయమవుతుంది.

శిరువెళ్ళ నరసింహుని గుడి ముందర గంగరావి చెట్టు మొలుస్తుంది. బహు ధాన్య నామ సంవత్సరంవైశాఖ శుద్ధ తదియశుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు.

బసవన్న రంకె వేస్తాడు. తిరువళ్ళువరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపిస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమటలు పుడతాయి. ఆమె కంట నీరు స్తనాల పాలు కారతాయి.

శాలివాహనశకంలో 1541న ధూమకేతువు పుడుతుంది. శాలివాహన శకం 1555 నాటికి వివిధ దేశాల్లో జననష్టం జరుగుతుంది.

పెమ్మసాని తిమ్మనాయుడు వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరినెల్లూరులు రూపుమాసి పోయేను. గండిపేటగోలకొండఆదలేనికందనూరి పట్టణాలు నశించి తురకలు పారిపోతారు. విజయపురంలాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించెను.

స్త్రీల కన్నుల నుండి నెత్తుటి బిందువులు రాలతాయి. వడగండ్ల వానలుబాణ వర్షాలు కురిసెను. చెరువులుబావులునదుల నీరు ఇంకిపోతాయి. అయినా జుర్రేరు నీరు ఇంకదు.

వీర బ్రహ్మేంద్ర స్వామి పుష్పగిరి నుండి వచ్చే మార్గమధ్యంలో ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో సిద్దయ్యస్వామివారి పాదాలు ఒత్తుతూ తనకు జ్ఞానబోధ చేయమని కోరాడు.

దానికి అంగీకరించిన బ్రహ్మేంద్రస్వామి అమూల్యమైన విషయాలను ప్రసంగించడం మొదలుపెట్టారు. సిద్ధయ్యావినుజ్ఞానేంద్రియాలు అయిదుకర్మేంద్రియాలు అయిదుప్రాణాలు ఐదు. ఇవి అన్నీ కలిసి 24 తత్వములవుతాయి. . ధవళశ్యామలరక్తశ్వేత వర్ణముల మధ్య ప్రకాశించేది ప్రకృతి’. అదే క్షేత్రము’. అదే సర్వసాక్షి అయిన సచ్చిదానంద స్వరూపం.. ధవళశ్యామలరక్తపీత వర్ణాలలో రక్తవర్ణమే స్థూల శరీరం. శ్వేతవర్ణమే సూక్ష్మదేహం.. శ్యామలవర్ణమే కారణ శరీరం. వీటి నడుమ ప్రకాశించే పీత వర్ణమే మహా కారణ దేహము. ఈ కాయమూలా ప్రమాణం గురించి వివరిస్తాను విను...
''స్థూలకాయము ఒకటిన్నర అంగుళాల వ్యాసము గలది. కాయమూలము అంగుళముపైన వుంటుంది. వీటిని మించి ప్రకాశిస్తూవుండేదే ఆత్మ. అదే చైతన్యం. ఇవన్నియూ నేత్రములకు కనిపించేవే! నీకు అవి గోచరమయ్యే విధంగా నేను నా శక్తిని వినియోగిస్తాను’’ అని చెప్పిసిద్ధయ్యకు వాటిని దర్శింపచేశారు స్వామి దాంతో సిద్దయ్య సంతృప్తి పడ్డాడు. 

స్వామివారు పంచాననం వారికి కాలజ్ఞానమును చెప్పటం...

శ్రీముఖ నామ సంవత్సరమున శ్రీ వీరభోగ వసంతరాయులనై వచ్చి పరిపాలనా బాధ్యత స్వీకరిస్తాను. మహానందికి ఉత్తరాన అనేకమంది మునులు పుట్టుకొస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు.
  • 5000 సంవత్సరం వచ్చేసరికి బ్రాహ్మణులు సంకరవృత్తులను చేస్తూతమ వైభవం కోల్పోతారు. ఏ కులం వారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్ధులుయోగులు జన్మించిన ఆ బ్రాహ్మణకులము పూర్తిగా వర్ణసంకరం అవుతుంది.
  • ఆనాటికి ప్రజలలో దుర్భుద్ధులు అధికమవుతాయి. 
  • కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కుపోగును తాకుతుంది. 
  • రాజాధిరాజులు అణిగి ఉంటారు. 
  • శూద్రులు విలాసాలను అనుభవిస్తూరాజుల హోదాలో వుంటారు. వారి ఇంట ధనలక్ష్మి నాట్యమాడుతూ వుంటుంది. 
  • నా భక్తులయిన వారికి నేనిప్పుడే దర్శనమిస్తాను. కానీ వారి నెత్తురు భూమిమీద పారుతుంది. కొంత భూభారము తగ్గుతుంది. 
  • దుర్మార్గుల రక్తముతో భూమి తడుస్తుంది.
  • చీమలు నివసించే బెజ్జాల్లో చోరులు దూరతారు. దురాలోచనలు మితిమీరుతాయి. అందువల్ల చోరులు ప్రత్యేకముగా కనపడరు. బిలం నుంచి మహానంది పర్వతము విడిచి వెళ్తుంది.
  • గడగ్లక్ష్మీపురంరాయచూరుచంద్రగిరిఅలిపిరిఅరవరాజ్యమువెలిగోడుఓరుగల్లుగోలకొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. 
  • నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు. 
  • క్షత్రియులు అంతరిస్తారు. 
  • చలనేంద్రియయములుఆయుధాల చేతబాణముల వల్ల నశిస్తాయి.
  • ఉత్తర దేశాన భేరి కోమటి గ్రంథి’ అనే మహాత్ముడు అవతరిస్తాడు. అందరిచే పూజింపబడతాడు.  

అందరూ పాటించవలసిన కొన్ని ధర్మములను గురించి నీకు చెబుతాను ... విను 

  • తాము భోజనము చేయబోయే ముందుగానే ఇతరులకు పెట్టటం ఉత్తమ ధర్మం. తాము భోజనం చేసి యింకొకరికి పెట్టటం మాధ్యమంఫలాపేక్షతో ఒకరికి అన్నదానం చేయటం అధమం. చాలకుండా అన్నం పెట్టటం అధమాధమం. దానాలన్నిటిలోనూ అన్నదానం అత్యుత్తమం.
  • కలియుగం 4808 సంవత్సరములు గడిచిన తరువాత కొట్లాటలు ఎక్కువవుతాయి. 
  • నిద్రాహార కాల పరిమితులు పాటించక మానవులు ధర్మహీనులవుతారు. 
  • శాంత స్వభావం కలవారు కూడా కోపాన్ని ఆపుకోలేకపోతారు. 
  • పిల్లలు పెద్దలను ఆశ్రయించుటకు బదులుపెద్దలే పిన్నలను ఆశ్రయిస్తారు. 
  • దుష్టమానవుల బలం పెరుగుతుంది. 
  • రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారు. భిక్షమెత్తిన వారు ఐశ్వర్యమును పొందుతారు.
  • కుటుంబాలలో సామరస్యత తొలగిపోతుంది. వావి వరసలు నశిస్తాయి.
  • బ్రాహ్మణనిందవేదనిందగురువుల నిందలు ఎక్కువవుతాయి.
  • జారుత్వంచోరత్వంఅగ్నిరోగదుష్టులవలన ప్రజలు పీడింపబడతారు.
  • అడవిమృగాలు పట్టణాలుపల్లెలలో తిరుగుతాయి.
  • మాలమాదిగలు వేదమంత్రాలు చదువుతారు.
  • ఏనుగు కడుపున పందిపంది కడుపున కోతి జన్మిస్తాయి.
  • రక్త వాంతులునోటిలో పుండ్లు వలనతలలు పగలడం వలన జనం మరణిస్తారు (ఇది అణు దాడి వల్ల సంభవించే కాన్సర్ తదితర వ్యాధుల వల్ల జరగవచ్చు)
  • కొండల మీద మంటలు పుడతాయి.
  • జంతువులూ గుంపులు గుంపులుగా మరణిస్తాయి.
  • భారతదేశము పరుల పాలనలోకి వెళుతుంది. ఈ పాలనలో అన్ని వర్ణాల వారు చదువుకుంటారు. కులంఆచారం నశిస్తాయి. మనుషులందరూ కలిసి మెలిసికుల మత వర్ణబేధాలు లేక ప్రవర్తిస్తారు.
  • ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తాయి.
  • మంచినీటితో జ్యోతులు వెలుగుతాయి.
  • ఒకే రేవున పులిమేక నీరు తాగుతాయి.
  • వెంపలి మొక్కకు నిచ్చెనలు వేసే మనుష్యులు పుడతారు.
  • విజయనగర వైభవము నశిస్తుంది.
  • కాశీ నగరం పదిహేను రోజులు పాడుపడిపోతుంది.
  • గోదావరి నది పన్నెండు రోజులు ఎండిపోయి తిరిగి పొంగిపొర్లుతుంది.
  • వేంకటేశ్వరుని కుడిభుజం అదురుతుంది. మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి.
  • కృష్ణానది మధ్యలో బంగారు రథం కనిపిస్తుంది. ఆ రథాన్ని చూసిన వారి కళ్ళుపోయిగుడ్డివారవుతారు. 
  • కర్ణాటక దేశంలో దేవాలయాలను తురకలు ధ్వంసం చేస్తారు.
  • కుక్కలు గుఱ్ఱాలను చంపుతాయి. 
  • ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి.
  • నేల నెత్తురుతో తడిచిపోతుంది .చనిపోయిన వారి ఎముకలు గుట్టలుగా పడి వుంటాయి. 
  • దుష్టశక్తులు విజ్రుంభిస్తాయి. అందువల్ల జననష్టం జరుగుతుంది. కాకులు కూస్తాయినక్కలు వూళలు వేస్తాయి. ఫలితంగా ప్రజలు మరింతమంది గుంపులుగా మరణిస్తారు.
  • కొండవీటి రాతిస్థంభం కూలిపోవటం తథ్యం.
  • కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతిముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి.
  • పసిబిడ్డలు మాట్లాడతారు. ఒకరి భార్య మరొకరి భార్యగా మారుతుంది.
  • కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కన్పిస్తాయి. అవి అయిదు నెలలపాటు వుంటాయి. 
  • వేంకటేశ్వరుని సొమ్ము దొంగలు అపహరిస్తారు. 
  • కృష్ణాగోదావరి నదుల మధ్య ప్రాంతమందు జనులు ఎక్కువగా నశిస్తారు. 
  • ప్రజలు గ్రామాలు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. 
  • అనేక రకాలయిన జబ్బుల వలన పలువురు మరణిస్తారు.
  • అమావాస్య నాటి అర్థరాత్రి సమయాన ఉదయగిరి శిఖరం మీద చక్రాంకితుడైన ఒక పరమహంస ఎక్కి నిలిచి వుండడం చూసిచంద్రగ్రహణం అని జనులు ఆశ్చర్యం చెందుతారు.
  • ఆకాశమార్గాన రెండు బంగారు హంసలు వచ్చిపట్టణాల్లో సంచరిస్తాయి. దురాశాపరులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి సర్వ నాశనమైపోతారు. 
  • ఆకాశాన తూర్పు పడమరలు కాషాయరంగున కనిపిస్తాయి. 
  • కొండల నుండి పెద్ద పెద్ద ధ్వనులు వినిపిస్తాయి.

 వీరభోగవసంతరాయులునై నేను వచ్చులోపల ఇలాంటి వింతలూ అనేకం జరుగుతాయి’’ అని చెప్పి బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ముగించారు.



తన గత జన్మల గురించి చెప్పిన వీరబ్రహ్మేంద్రస్వామి

ఒకరోజు సిద్దయ్య స్వామికి సేవ చేస్తూ స్వామీ! మీకు గతంలో కొన్నిసార్లు త్రేతాద్వాపర యుగాలలో కూడా జన్మించారని నాకు తెలిపారు. మీ పూర్వ జన్మల వివరాలను గురించి నాకు వివరిస్తారా?’’ అని అడిగాడు.

నా గతజన్మల గురించిన వివరములు రహస్యములే అయినానీకు మాత్రం వివరించగలను’’ అని తన పూర్వ జన్మల గురించి చెప్పటం ప్రారంభించారు బ్రహ్మేంద్రస్వామి.
  • బ్రహ్మలోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను. 
  • ఆ తరువాత వెండి కొండ మీదకి వెళ్ళి 54 బ్రహ్మకల్పములు రాజ్యపాలన చేశాను. 
  • అప్పుడే మూడు యోజనాల పొడవైన కూర్మసిహాసనమును నిర్మించి, 290 బ్రహ్మకల్పాలు విష్ణుసేవ చేశాను. 
  • నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు పంచ విధ ముక్తి’ అనే వరం ఇచ్చారు. 
  • తర్వాత నేను సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రితువు ఆశ్రమమ వద్ద అన్ని విద్యలూ అభ్యసించిమూడేళ్ళ తరువాత అనేక యోగశాస్త్ర విద్యలను నేర్చుకున్నాను. 
  • 12000 గ్రంథములను పఠించిఅందులోని మర్మములన్నియూ గ్రహించాను.

వీటి ఫలితంగా నేను కాల అకాల మృత్యువులను జయించగలిగే శక్తిని సంపాదించాను. అనంతరం నా యోగబలం వల్ల దివ్య శరీరం ధరించి మూడువేల బ్రహ్మకల్పములు చిరంజీవిగా వున్నాను. ఆ తరువాత నా అవతారముల గురించి వివరముగా తెలుపుచున్నాను విను.
  • మొదట అవతారమెత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా 99,662 బ్రహ్మకల్పాలు వున్నాను. 
  • మూడవ అవతారంలో 1,09,00,000 వున్నాను. 
  • నాల్గవ అవతారంలో కోటి పదమూడు వందల పదిహేడు బ్రహ్మకల్పాలు వున్నాను. 
  • అయిదో అవతారంలో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల యాభై అయిదు వేల బ్రహ్మకల్పాలు వున్నాను. 
  • ఆరవ అవతారంలో ఆరువందల బ్రహ్మకల్పాలు వున్నాను. 
  • ఏడవ అవతారంలో 27,62,03,400 బ్రహ్మకల్పాలు బతికి వున్నాను.
  • ఎనిమిదో అవతారంలో 22,60,000 బ్రహ్మకల్పాలు వున్నాను. 
  • పదవ అవతారంలో కనిగిరిలో జన్మించాను. ఆ జన్మలో 70 లక్షలకు పైగా బ్రహ్మకల్పములలో జీవించాను.

ఇప్పుడు బనగానపల్లెలో వీరప్పయాచార్యుడనై 125 సంవత్సరములు తపస్సు చేశాను. వీరబ్రహ్మేంద్రస్వామిగా మొత్తము 175 సంవత్సరములు జీవించి జీవసమాధి పొందుతాను’’
  • నేను చనిపోయేలోగానే హరిహరరాయలు మొదలు రామరాయలవరకు చరిత్ర అంతమవుతుంది. తరువాత కాలంలో ఈ ఖండం మహ్మదీయుల పరమవుతుంది. శ్వేతముఖులు (తెల్లవాళ్ళు) భారత రాజ్యాన్ని ఏలతారు.
  •  పల్నాటి సీమలో నరులు వచ్చి ఆకులు తిని జీవిస్తారు. 
  • మొగలాయి రాజ్యాన ఒక నది పొంగి చేలు నాశనమయిన రీతిగాజనాన్ని నశింపచేస్తుంది.
  • వ్యభిచార వృత్తి అంతరించిపోతుంది. ఆ వృత్తిలోని వారువివాహాలు చేసుకుని కాపురాలు చేస్తారు. 
  • గురువులు ఆడంబరంగా బతుకుతారు.
  • కుటుంబంలో సఖ్యత వుండదు. తల్లీతండ్రీపిల్లల మధ్య వాత్సల్యాలు వుండవు. ఒకరిమీద మరొకరికి నమ్మకం నశిస్తుంది. 

నా రాకకు ముందుగానా భక్తులు వారి శక్త్యానుసారము నా ధర్మ పరిపాలనకు అంకురార్పణలు చేస్తారు’’ అని సిద్ధయ్యకు వివిరించారు బ్రహ్మేద్రస్వామి.


కర్నూలు నవాబుకు స్వామివారు కాలజ్ఞానము బోధించుట 
  • క్రోధ నామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమిసోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీర భోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశకరమైన ఒక గొప్ప నక్షత్రం ఉద్భవించిఅందరికీ కనిపిస్తుంది.
  • చండి పర్వతంఆలంపూర్ మొదలైన స్థాలములలో ఉత్పాతాలు పుడతాయి. ఈ ప్రాంతంలో పాలెగాళ్ళుతమలో తాము ఘర్ఘణ పడిచెడి అడవుల పాలై భ్రష్టులై పోతారు. 
  • నలు దిక్కుల యందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి.
  • అమావాస్య రోజున పూర్ణచంద్రుని చూసి జనులు నశిస్తారు. 
  • కార్తీకం నిజమని నా మహిమను తలచుకుంటారు. 
  • కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణుభక్తి పుడుతుంది. 
  • అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది. 
  • తూర్పున శిరస్సుపడమర తోకగాతోక వెడల్పుగా ఇరువది బారల పొడవుగల నల్లని ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన ముప్పై రోజులకు అందరికీ కన్పిస్తుంది. 
  • ఆకాశం ఎర్రబడిఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్దాలు పుడతాయి.
  • ఈశ్వరమ్మను. రంగరాజునకిచ్చి వివాహం చేసేనాటికి కందిమల్లయ్య పల్లె నవరత్న మండపాలతో పన్నెండు ఆమడల పట్నమవుతుంది. నా భక్తులు యావన్మంది యిక్కడకు వచ్చి కళ్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనం’’

ఈ కాల జ్ఞానం విన్న తరువాత నవాబుస్వామివారికి అనేక బహుమతులను అందజేశాడు. ఆ బహుమతులను బ్రహ్మగారి మఠంలోనే వుంచారు.



కొన్ని రోజుల తరువాత కొంతమంది దొంగలు ఈ వస్తువులను ఏ విధంగా అయినా దోచుకోవాలని అక్కడికి వచ్చారు. ఆ రాత్రి మఠంలో ప్రవేశించి ఆ వస్తువులను పట్టుకున్నారు. అంతే! వారికి కండరములు స్వాధీనంలో లేకుండా అయిపోయాయి. ఎంత ప్రయత్నించినా మాట కూడా మాట్లాడలేకపోయారు. భయంతో అలాగే నిలబడి చూడటం తప్ప వేరే ఏమీ చేయలేకపోయారు. 

వారిని పట్టుకున్నారు ఆశ్రమవాసులు. ఇది తెలిసి అక్కడికి వచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వామి. వారిని చూసినాఆయన కోపం తెచ్చుకోలేదు. పైగా వారికి తగిన బోధ చేయాలని నిర్ణయించుకునివారికీ సైతం కాలజ్ఞానాన్ని ఉపదేశించారు.


దొంగలకు చెప్పిన కాలజ్ఞానం
  • దేశానికి ఆపదలు తప్పవు. 
  • ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. 
  • ఆరు మతాలూ ఒక్కటవుతాయి. 
  • నిప్పుల వాన కురుస్తుంది. 
  • నెల్లూరు జలమయం అవుతుంది. 
  • నెత్తురు ఏరులై పారుతుంది. 
  • ఏడు గ్రామాలకు ఒక గ్రామంఏడిళ్ళకు ఒక ఇల్లు మిగులుతాయి.
  • ప్రజలు కత్తులతో పోట్లాడుకుంటారు. 
  • పార్వతిబసవేశ్వరుల కంట నీరు కారుతుంది. 
  • కప్పలు కోడికూతలు కూస్తాయి, భూమి కంపిస్తుంది. 

అప్పుడు నేను సమాధిలో నుంచి వీర భోగ వసంతరాయులుగా మరల జన్మిస్తాను’’ అని వివరించారు.


సమాధి పొందే సమయం ....
కొన్ని సంవత్సరములు పూర్తయిన తర్వాత వీరబ్రహ్మేంద్రస్వామి ఇక తాను సమాధి పొందే సమయం దగ్గర పడిందని తెలుసుకున్నారు. తన వారసుడిగా పెద్ద కుమారుడు గోవిందాచార్య స్వామికి పట్టాభిషేకము చేయదలిచిఈ విషయమై తన భక్తులందరికీ కాల జ్ఞాన సౌజన్య పత్రికను పంపారు.

కాలజ్ఞాన సౌజన్య పత్రికలో ఈ విధంగా వుంది...
మేం ఈ వైశాఖ శుద్ధ దశమి ఆదివారం 2.30 గంటలకు ఈ భౌతిక దేహాన్ని వదిలి జీవ సమాధి సిద్ధిని పొందదలచుకున్నాము. కనుక ఈ పీఠాధిపత్యం నా పెద్ద కుమారుడైన గోవిందాచార్య వారికి అప్పగించుకోదలిచాను. అది తిలకించి నా దగ్గర మూడు రోజులుండినేను సమాధిగతుడనగుట చూడవలెనని ఆహ్వానము. నేను వివరించబోవు కాలజ్ఞాన విశేషాలను విని తరించవచ్చును. అలా స్వయముగా వచ్చి కాలజ్ఞానాద్వైత తత్త్వబోధ వినలేని వారి కోసం ఈ పత్రికతో కొన్ని కాలజ్ఞాన విశేషాలను వివరించి యున్నాము. ఈ పత్రికనే వారు దీపారాధననైవేద్యములతో పూజించిన వారికి సకల శుభములు కలుగును.

నేను ఈ వీరబ్రహ్మేంద్రస్వామి అను పేరు ధరించి ఇప్పటికి 175 సంవత్సరములు గడిచాయి. ఇప్పుడు నేను సమాధినిష్టలో వుండాలని నిర్ణయించుకున్నాను. తిరిగి భూమి మీదకు వీరభోగవసంతరాయులుగా రాబోతున్నాను.
  • నేను వచ్చే సమయానికి ఈ కళియుగం లోకంలోఎర్ర బొయీలు – శ్వేత ద్వీప వాసులు వస్తారు. శాలివాహన శకమునందేవీరు మహ్మదీయులతో స్నేహం పొందిభరతఖండం పాలిస్తారు.
  • హరిహరాదుల గుళ్ళల్లో పూజలు హరించి పోతాయి. ధనమధాందతచే సాధువులనుజ్ఞానులనుదూషణ చేస్తారు. భూమిపై వర్షములు కురిసినట్లుగానే వుంటాయి. కానీ పంటలు పండవు. పైరులు పండినట్లుగానే వుంటాయి. కానీ నిలవవు. బహు ధాన్య నామ సంవత్సరంలోకనకదుర్గ మొదలయిన శక్తులు భూమి మీదకు వస్తాయి.
  • శ్రీశైలంలో తపస్సు చేస్తాను. నంద నామ సంవత్సరంలో నేను తపస్సు ప్రారంభించబోయే ముందు, భూమి మీద కొన్ని నక్షత్రాలు రాలిపడతాయి. భూమి గడగడ వణుకుతుంది. అనేకమంది ప్రజలు మరణిస్తారు. 
  • శుభ కృత నామ సంవత్సరంలో కార్తీక మాసంలోదక్షిణ భాగంలో అనేక ఉత్పాతాలు కనబడతాయి. అదే సమయంలో ధూమకేతు నక్షత్రం ఆవిర్భవిస్తుంది. అందువల్ల అనేకమంది మరణిస్తారు.
  • నేను సమాధి విడిచి విష్ణు అంశతో కల్కి అవతారం ఎత్తుతాను. ప్రమాదినామ సంవత్సరానికి ఎనిమిదేళ్ళవాడినై ఎర్ర బొయీలతో కలిసి వారికి అంతర్య బుద్ధులు కల్పిస్తాను.
  • అక్కడినుండి శాలివాహనశకం 5407 సంవత్సరము నాటికిసరిగా పింగళనామ సంవత్సరంలో భయంకరమైన కొట్లాటలు ప్రారంభమవుతాయి. 
  • కాళయుక్త నామ సంవత్సరం వరకూఉత్తరదేశాన పోట్లాటలు విపరీతంగా జరుగుతాయి. 
  • ఆనందనామ సంవత్సరంలో మార్గశిర బహుళ అష్టమీ గురువారం మల్లిఖార్జునుడు భ్రమరాంబా సమేతంగా వింధ్యపర్వతానికి చేరతాడు.
  • రక్తాక్షినామ సంవత్సరంలో విజయవాడకు వచ్చిఅక్కడ పోతులూరి వారి కన్యను పెళ్ళాడిపట్టాభిషిక్తుడనవుతాను. 
  • దుర్ముఖినామ సంవత్సరంకార్తీక శుద్ధ చతుర్దశి మొదలుకొనిదుష్ట నిగ్రహం ఆరంభిస్తాను. నేను వచ్చేసరికి కలియుగ ప్రమాణం 4094 అవుతుంది.

నా భక్తులయిన వారును సదా నమ్మి ఓంహ్రీంక్ల్రీంశ్రీంశివాయ శ్రీ వీరబ్రహ్మణే నమః అను బీజ సంపుటయైన మహామంత్రమును ఎప్పుడూ పలుకుతుంటేవారికి నేను మోక్షం ప్రసాదిస్తాను’’

పుత్రుడు గోవిందాచార్యుల స్వామికి బ్రహ్మంగారు తెల్పిన భవిష్యత్ శ్రీ వీరబ్రహ్మంగారుతన కుమారులకు చెప్పిన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తేమొదటగా శ్రీ బ్రహ్మంగారు విశ్వనాథ అవధూతగా పుడతారు. ఆ తరువాత ముప్పరంలో స్వర్ణ అమరలింగేశ్వర స్వామిగాచెరుకూరి శివరామయోగిగా జన్మిస్తారు. ఆ తరువాత వీర భోగ వసంతరాయుల అవతారం.

నాయనా! నేను కంది మల్లయ్యపల్లె చేరి వీర బ్రహ్మ నామతో యిప్పటి వరకు 175 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటివరకూ నేను ఈ కలియుగంలోని సామాన్యుల మనస్సులను మార్చికేవలం పరబ్రహ్మ ఉపాసకులుగా మార్చగలిగాను.

ఇప్పుడు ఈ బాధ్యతను నీవే స్వీకరించవలసి వుంది. వీరి ఆలోచనలను ఏ విధంగా మార్చగలవో అది నీ యిష్టం. నేను ఈ దినము సమాధి నిష్ఠలో ప్రవేశించేందుకు నిశ్చయించుకున్నాను. నీ సోదర సోదరీమణులను జాగ్రత్తగా సంరక్షించుకో. నీకొక రహస్యాన్ని తెలియజేస్తున్నాను. నీ గర్భవాసంలో పరమేశ్వరియే జన్మిస్తుంది. ఆమె భూతభవిష్యత్వర్తమానములను తెలిసిన బ్రహ్మజ్ఞాని. ఈ కలియందలి మూఢులకు నేనెట్లు మహిమలు చూపానోఆమె కూడా అద్భుతములైన మహిమలు ప్రదర్శిస్తుంది.

ఆమె వాక్కులు వెంటనే ఫలిస్తాయి. చివరికామె ఆ విధంగానే సమాధి నిష్టను పొందుతుంది. నా విధంగానే అంటే ... నాకు ఏ విధంగా మఠములున్నాయోఅదే విధంగా ఆమెకు కూడా మఠములుంటాయి. నాకే విధంగా పూజలు జరుగుతున్నాయో అలానే ఆమెకు కూడా పూజలు జరుగుతాయి. ఆ దేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవలసి వుంది. ఇక సిద్ధుని విషయంలో అసలు రహస్యం చెబుతాను విను. అతడు ఈశ్వరాంశ సంభూతుడు. ఈతడు ఒక క్షత్రియుని ఇంట పుట్టి గోహత్య చేయటంవల్ల ఇలా మహమ్మదీయ వంశంలో జన్మించాడు. ఆ గోహత్య పాపపరిహారం కోసమే యిప్పుడు నా సేవకుడయ్యాడు.

గోవిందమ్మకు జ్ఞాన బోధ 
వైశాఖ శుద్ధ దశమిఆదివారం అభిజిత్ లగ్నం మధ్యాహ్నం రెండున్నర గంటలకు శుభ సమయమైనందున తాను సమాధి పొందగలనని వీరబ్రహ్మంగారు ప్రకటించారు.

గోవిందమ్మ విలపించటం ప్రారంభించారు. అప్పుడు గోవిందమ్మను ఉద్దేశించి బ్రహ్మంగారు నాకు మరణం లేదునీకు వైధవ్యం లేదు. నీవు సుమంగళిగా జీవించు. సమాధిని చీల్చుకుని నేను వీరభోగ వసంతరాయులనై భూమి మీద అవతరిస్తాను. నా ధర్మ పాలనతో భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను తిరిగి అవతరించే వరకు ఏమేం జరుగుతాయో నీకు క్రమక్రమంగా వివరిస్తాను’’ అంటూ కాలజ్ఞాన బోధ మొదలుపెట్టారు.
  • బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది.
  • మహాలక్షమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది. 
  • కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కు పోగు తాకుతుంది. 
  • కంచికామాక్షి నేత్రాల కన్నీరు ఒలుకుతుంది. 
  • కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది. 
  • బనగాపల్లెలో నా ప్రథమ భక్తురాలు అచ్చమ్మవంశము సర్వనాశనమైవారి వంశం అంతరించిపోతుంది. నారాయణమ్మ వంశస్తులే మఠాధిపతులవుతారు. నువ్వు ఇకనైనా ఈ భ్రాంతిని విడిచిపెట్టు’’ అని చెప్పి గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టారు.

సమాధికి ముందు కాలజ్ఞానము
  • నేను పుట్టబోయే సమయంలో అనేక నక్షత్రాలు భూమిపైకి రాలతాయి.ఏడు గ్రామాలకు ఒక గ్రామమవుతుంది. అంటే ప్రాణనష్టం జరుగుతుంది. ఆ సమయంలో లక్షలాది పశువులు మరణిస్తాయి. ధూమకేతువు అనే నక్షత్రం పుడుతుంది. 
  • చిన్న చిన్న పాలెగాళ్ళ సామ్రాజ్యాలు అంతమైపోతాయి. ఎర్రబోయీల జీవన విధానాలను వీరు అనుసరిస్తారు.
  • విరోధి నామ సంవత్సరంలో లింగాలపాటిలో ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తి అంకమ్మ’ అనే పేరుతో లోకమంతా సంచరించిదగ్ధం చేసి తిరిగి నందికొండ వస్తుంది.
  • పింగళనామ సంవత్సరంలో ధూమకేతు పుట్టి అదృశ్యమవుతుంది.
  • గొప్ప దేశములుదేవాలయములు నశిస్తాయి. 
  • సిద్దాత్రి నామ సంవత్సరాన అద్దంకి సీమలో భూమి వణుకుతుంది.
  • రౌద్రినామ సంవత్సరాన ఆషాఢమాసంలోమహా ధ్వని చేస్తూ నక్షత్రాలు రాలుతాయి. అప్పుడు పర్వత గుహల్లో ఉదక పానీయములు తయారు చేస్తారు. 
  • బంగాళ దేశంలో కాళి ప్రత్యక్షమై శక్తి రూపియై రక్తం గటగటా తాగుతుంది. 
  • బెజవాడ గోలకొండ అంత పట్నమవుతుంది.
  • మేఘంఅగ్నిసర్పాకారంగా వచ్చి ధ్వనులు చేస్తాయి. 
  • పిడుగులుశ్రీశైలాన నంది చెరువులో ఆరెదొండచెట్టు పుడుతుంది. భ్రమరాంబ గుడిలో మొసళ్ళు చొరబడటంతో గుడి పాడయి పోయెను. ఈశాన్యంలో పాతాళగంగ కృంగి మల్లిఖార్జునుడు అదృశ్యమైపోతాడు.
  • పాతాళ గంగలో శాపవశాత్తూ వున్న చంద్రగుప్తునికి కలికి అవతార పురుషుని పాదం సోకిశాప విముక్తుడవుతాడు. ఆకాశాన విషగాలి పుట్టిఆ గాలి వల్లరోగాల వల్ల జనులు నశిస్తారు.
  • తిరుపతి వేంకటేశ్వరుని గుళ్ళో మొసళ్ళు ప్రవేశించిమూడు రోజులు పూజలు లేక తలుపులు మూసి వుంచుతారు. 
  • గరుడధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి. 
  • తిరువళ్ళువరు వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి.
  • ఆకాశాన మూడు నక్షత్రములు ఉదయించికన్పించకుండానే అదృశ్యమవుతాయి. 
  • ఆనంద నామ సంవత్సరంలో శ్రీశైల మల్లిఖార్జునుడు ఉత్తరాన వింధ్య పర్వతాలకు పోయినిజ రూపం చూపుతాడు. అప్పుడు ఆ రాజ్యం తల్లడిల్లిపోతోంది. 
  • దేశాన కొత్త కొత్త జాతులు పుట్టుకొస్తాయి. అన్ని కులాలవారు మద్యపాన ప్రియులవుతారు.
  • రాజులకు రాజ్యాలు ఉండవు. 
  • వ్యవసాయ వృత్తినే అవలంభిస్తారు. 
  • అన్ని జాతుల వారు వింత వింత వస్త్రాలు ధరిస్తారు. 
  • బ్రాహ్మణులకు పీటలుయితరులకు మంచాలు వస్తాయి. 
  • బ్రాహ్మణులు విదేశీ విద్యలువిజ్ఞానానికి భూములను అమ్ముకుంటారు. ప్రభుత్వ బంట్లుగా ఉద్యోగాలు చేస్తూ బతుకుతారు. వానిలో కూడా బ్రాహ్మణులకు ఆధిక్యత లేకపోగా అన్య కులాల వారే ఆధిక్యత పొంది వారి కింద పని చేస్తారు. జీవనోపాధి కోసం ఏ వృత్తినయినా చేసే స్థితికి వస్తారు. 
  • పౌరోహిత్యం కూడా కొనసాగక బ్రాహ్మణులు బాధలు పడతారు. 
  • విదేశీ విజ్ఞానం విద్యలు నేర్చుకుంటారు. ఉద్యోగాలలోవ్యాపారాలలో ఉన్నత స్థితికి చేరుకుంటారు’’
  • ఫాల్గుణ మాసంలో నేను వీరభోగ వసంతరాయులనై శ్రీశైలం వెళ్ళి అక్కడి ధనాన్ని బీదలకు పంచిపెడతాను. తరువాత ఉగ్రమైన తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి నుండి మూడు వరాలు పొందుతాను.
  • విక్రమ నామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి రోజున బెజవాడ ఇంద్రకీలాద్రికి వస్తాను. అక్కడ ఋషులను దర్శించితరువాత కార్తవీర్యార్జున దత్తాత్రేయులవారి వద్ద పలు విద్యలు అభ్యసించిఆది దత్తాత్రేయులవారిని దర్శించిఅక్కడి నుండి మహానందికి వెళ్ళి రెండు నెలలు గడుపుతాను. అనంతరం శ్రావణ నక్షత్ర యుక్త కుంభ లగ్నాన వీరనారాయణపురం చేరతాను. అక్కడ 15 దినములు గడుపుతాను.
  • కలియుగాన 3040 సంవత్సరాలు గడిచిపోయేటప్పటికి పుణ్యతీర్థాలు క్రమ క్రమంగా తమ పవిత్రతను కోల్పోవటం జరుగుతుంది. గంగానది పూర్తిగా అంతర్థానమయిపోతుంది.
  • ప్రపంచాన ధనమే అన్నింటికీ మూలమౌతుంది. 
  • పాతాళ గంగలో నీరు ఇంకిపోతుంది. 
  • నూట యిరవై తిరుపతులు నీటిపాలయిపోతాయి. 
  • నాలుగు సముద్రాల మధ్య నున్న ధనమంతా శ్రీశైలం చేరుకుంటుంది.
  • సముద్రాలు కలుషితమయిపోతాయి. జల చరములు – ఎక్కడివక్కడే నశించిపోతాయి. 
  • బంగారు గనుల కోసం కొండల్లో బతికేందుకు ప్రజలు మక్కువ చూపుతారు. 
  • కాశీనగరంలో కొట్లాటలు జరుగుతాయి. 
  • వర్ణాంతర వివాహాలుమతాంతర వివాహాలు ఎక్కువ అయిపోతాయి.
  • కలహాలుకల్లోలాలు మితిమీరిపోయాయి. 
  • కుటుంబంలో సామరస్యత వుండదు. వావీ వరసలు వల్లకాట్లో కలుస్తాయి.
  • సృష్టి మొత్తం తెలిసిన యోగులు పుడతారు. 
  • రెంటాల చెరువు క్రింద ఆపదలు పుడతాయి. 
  • వినాయకుడు వలవల ఏడుస్తాడు. 
  • గోలుకొండ క్రింద బాలలు పట్నాలు ఏలుతారు. 
  • శృంగేరిపుష్పగిరి పీఠాలు పంచాననం వారి వశమవుతాయి. 
  • హరిద్వార్ లో మర్రిచెట్టు మీద మహిమలు పుడతాయి. హరిద్వారానికి వెళ్ళే దారి మూసుకుపోతుంది. 
  • అహోబిలంలోని ఉక్కుస్థంభం కొమ్మలు రెమ్మలతోజాజిపూలు పూస్తుంది. 
  • నా రాకకు ముందుగా స్త్రీలు అధికారాన్ని అందుకుంటారు. 
  • కులాధిక్యత నశించి వృత్తిలో ఎక్కువ తక్కువలు అంటూ లేక అందరూ సమానమయిపోతారు’’
సమాధి తర్వాత తిరిగి దర్శనం
నవమి నాటి రాత్రికి సిద్దయ్యను బనగానపల్లెకు పంపి పువ్వులు తెప్పించమని గోవిందమాంబకి ఆదేశించారు స్వామి. వెంటనే సిద్దయ్య బనగానపల్లెకు ప్రయాణం అయ్యాడు.

సిద్దయ్య తిరిగి వచ్చేసరికి స్వామి సమాధిలో ప్రవేశించటం పూర్తయిపోయింది. అది తెలుసుకున్న సిద్దయ్య తీవ్రంగా దుఃఖించి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. సమాధి నుంచి అది తెలుసుకున్న బ్రహ్మంగారు సిద్దయ్యను పిలిచిసమాధిపై వున్న బండను తొలగించమని తిరిగి పైకి వచ్చారు.

అప్పుడు సిద్దయ్య కోరిక ప్రకారం పరిపూర్ణ స్థితిని’ బోధించారు.

********

బ్రహ్మంగారు వైదిక ధర్మమును అవలంభించారు. అయితేఎప్పుడూ కుల మతాతీతులుగా ప్రవర్తించారు తప్ప ఏనాడూ సంకుచిత కులాభిమానమును గానీమాట ద్వేషమును గానీ ప్రదర్శించలేదు. దూదేకుల కులస్థుడైన సైదులును తన శిష్యునిగా స్వీకరించిఅనేక విషయాలనుశాస్త్ర రహస్యాలను అతనికి వివరించారు.

సమాధి అయిన తరువాత కూడా అతనికే దర్శనమిచ్చి దండ కమండల పాదుకలుముద్రికను కూడా ప్రసాదించారు. తమ కొడుకులకు కూడా యివ్వని ప్రాముఖ్యత దూదేకుల సైదులుకు ఇచ్చారు. అతనిని సిద్దునిగా మార్చి, ‘సిద్దా’ అనే మకుటంతో పద్యాలు చెప్పారు. అలాగే కడపబనగానపల్లెహైదరాబాదుకర్నూలు నవాబులకు జ్ఞానబోధ చేసి శిష్యులుగా స్వీకరించారు.

కందిమల్లాయపాలెం – చింతచెట్టు
కందిమల్లాయపాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి యింటి ఆవరణలో, 14,000 కాలజ్ఞాన పత్రాలను పాత్రలో దాచారు. పైన ఒక చింతచెట్టు నాటినట్లు తెలుస్తోంది. అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి వుంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులుమరేవైనా ప్రమాదాలు కలిగే ముందుసూచనగా ఆ చెట్టుకు వున్న మొత్తం పూత ఒక రాత్రికే రాలిపోయిజరగబోయే అశుభాన్ని సూచిస్తుంది.

అలాగే ఈ చెట్టుక్కాసిన చింతకాయలు లోపల నల్లగా వుండితినడానికి పనికి రాకుండా వుంటాయి. చెట్ల పంగ నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారిగడ్డ కట్టి కుంకుమలా వుంటుందట. దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులుప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు. బనగానపల్లెలో వున్న వృద్దులందరూ ఆ చెట్టు గూర్చి చెప్పగలుగుతారు.

ఆ చింతచెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే వుంటుంది.

********







                                           ********


గమనిక : క్రింద వాట్సాప్ అని ఉన్న లింక్ ని నొక్కి నేరుగా మీ సలహాలు, సూచనలను నాతో వాట్సాప్ ద్వారా పంచుకొని.. మరింత విలువయిన విషయాలను అందివ్వడానికి సహకరించండి...

Blog            : Ram Karri



-- స్వస్తి

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -


Whatsapp : +918096339900 ,
Phone        : +919492089900 .


-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -

Web Sites & Blogs :

Ram Karri || Intellectual Brainy || Ram Karri || Tech Guru Ram || Ammaku Prematho || Nannaku Prematho || Ethics of Old Genarations || Telugu Quotes Park || Health Tips || Telugu Vignana Sarvaswam || Telugu Whatsapp Group's || Go for Green World || Naaku Amma Cheppindhi ||Karri Ram || Left Handers Club India || Lefties Rule The World || BroadMind Creation's || Mana Telugu Patalu Lyrics || Pusthakalayam || Voice Of Ram || RamKarri.In || RamKarri.Com ||


-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -

Social Media :



Facebook Id :   https://www.facebook.com/UrsRamKarri


Instagram    :   https://instagram.com/ramskarri


LinkedIn      :   https://www.linkedin.com/in/karriram


Twitter         :   https://twitter.com/RamsKarri


-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -

Adress :


Ram Karri ,

S/O : Subrahmanyam ,

D.No : 1 - 240, 

Raja Rajeswari Colony,

Rayavaram , 

Rayavaram Mandal ,

East Godavari District ,

Andhrapradesh .

Pin : 533346

Google Map        :   Ram Karri


----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------