ముందుగా భారత మాత ముద్దు బిడ్డలందరికీభారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు....

పరాయిపాలనకు చరమగీతం పాడి, భారతమాత దాస్య శృంఖలాలు త్రుంచడానికి పాటుపడిన దేశభక్తులు కోకొల్లలు.

ఐతే, స్వాతంత్ర్యం సిద్ధించిన పిదప ఈ దేశం ఎట్లా ఉండాలని ఆలోచించిన నాయకుల్లో అగ్రగణ్యుడు  - డా ౹౹ బి.ఆర్.అంబేడ్కర్‌.


భావితరం ఎలా ఉండాలి? 

ఏ పథాన ఈ దేశం ముందుకెళ్ళాలి?

ఎటువంటి రాజ్యాంగ నియమావళి ఉండాలి?

 అన్నట్టి దేశ ఆకాంక్షను తీర్చి మనదేశ రాజ్యాంగంను అంబేడ్కర్ గారు రచించి రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు నవంబరు 26 (1949లో).

ఈ సందర్భంగా "రాజ్యాంగం ఎంత మంచిదైనా కావచ్చు.

దానిని అమలు జరిపేవారు చెడ్డవారైతే అదీ చెడ్డదవుతుంది.

"అని అంబేడ్కర్‌ అన్నారు.

ఇది అక్షర సత్యం.

రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దేశం ఇప్పటికీ అభివృద్ధి కాలేకపోయిందంటే దానికి కారణం నీచ రాజకీయాలదే తప్ప ఇంకొకటి కాదు.

అంబేడ్కర్ లాంటి మహానేత మన దేశంలో పుట్టడం ఈ దేశ మహద్భాగ్యం.

      "రాజ్యాంగంలో రూపుదిద్దిన నిబంధనల కన్నా పాలకుల స్వీయ నైతికతే దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది". అన్న అంబేడ్కర్‌ వాణిని మనసావాచా నమ్మిన నేటి కేంద్రప్రభుత్వం నవంబరు 26 ను రాజ్యాంగ దినోత్సవంగా జరపడం ప్రశంసనీయం.


మీ రాంకర్రి

8096339900