" ఈ పాట నాకు బాగా నచ్చింది అందుకే ఈ పాట యొక్క లిరిక్స్ ని మీ కోసం తెలుగు లో మన ఈ బ్లాగ్ లో రాస్తున్నాను...  "


హరి హారా.... ఆ.... ఆ... ఆ...


నువ్వో రాయి... 

నేనో శిల్పీ ...

చెక్కుతున్నంత సేపూ...

నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ...

ఆ తరువతా అంటారంతా నిన్ను దేవుడనీ... 

నేనో అంటరానివాడిని...


నువ్వో రాయి... 

నేనో శిల్పీ ...

చెక్కుతున్నంత సేపూ... 

నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ...

ఆ తరువతా అంటారంతా నిన్ను దేవుడనీ... 

నేనో అంటరానివాడిని...


నీ గర్భ గుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి... 

అది పూర్తయ్యాక లోనకొస్తావుంటే 

నన్ను బయటికి తొస్తివి...



నిన్ను మేలు కొలుపగా డోలు సన్నాయి నేనే వాయిస్తిని
కాని నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తినీ..



అయ్యో... ఓ...ఓ..ఓ... దేవా..ఆ..ఆ..ఆ...


నువ్వు నడిచెప్పుడు...
నీ పాదాలు కందకుండా చేసాను నీకు చెప్పులు...


నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు
ఏంటయ్యా నా తప్పులూ....



సింగారించా నీకు
బంగారు వస్త్రాలు ఎన్నో
నేసాయి నా చేతులు....
కాని నిను చూడరావాలంటే...

నాకో జత బట్టల్ లేవు

ఏంటయ్యా మా రాతలు...


నీ మాసిన బట్టలే మా ప్రసాదామని...

నేను శుభ్రంచేస్తిని...

కాని మైల పడిన వాడివంటూ 

దూరంగా ఉండాలంటివి...


నీ ముందు వెలిగే దీపాంటలు నా చెమట తో చేస్తినీ...
కాని ఎందుకో మా మాటి బ్రతుకున 

ఏ దీపం పెట్టవైతివి...


ఏ... ఏ.. ఏ... 


నోరే లేని మూగ జీవాలను గాయమని గోసీవో గొంగలీ ఇస్తివి...
ఇప్పుడు వాటికి మాకు ఏ తేడాలే లేవన్నట్లు చులకనగా వెనకబడెస్తివి...



తల్లీ పాల వంటి తాటి కల్లు గీసే 

నా గోసలు చూడవైతివి...

వందడుగుల చెట్టే ఎక్కే

నా కళ్ళకు నిన్నే మోసే భాగ్యాన్నే ఇవ్వవైతివి...


నీ పల్లకీ చేసిన చేతులకు పాచిక పుల్లయిన ఇవ్వకపోతివి..
ఊళ్ళో అందరికీ నేనే క్షవరాలు చేస్తే 

నా బ్రతుకే క్షవరం చేస్తివి...


మా పుట్టుక బట్టీ... 

చేసే పనులు బట్టీ ఏవేవో పేర్లు పెడితివీ...

కాని ఉన్నోడు లేనోడంటూ తేడాలు చూపి 

నువ్వు కూడా మనిషై పొతివి..


--- --- --- --- --- --- --- --- --- --- --- --


రాయికి రకరకముల రంగులు అద్ది తమ దగ్గరున్న కళ తో, శ్రమ తో దేవుడిగా మలిసే వాళ్ళు మాములు మనుషులు 


అదే దేవుడిని తమ దగ్గరున్న డబ్బుతో పేరుతో గుళ్ళో ప్రతిష్టించే వాళ్ళు మారాజులు


ఇది దేవుడి రూలో లేక మనుషుల ఆలోచనలో తెలియక కులం అనే  విష వృక్షాలు పెరివి పెద్దవవుతున్నా , 

కుల వృత్తులనే కొమ్మలు ఎందుకు విరిగి పోతున్నాయో అర్ధం కాక సతమతమౌతున్న అన్ని కులాల అన్నదమ్ములకు ఈ పాట అంకితం...





--- --- --- --- --- --- --- --- --- --- --- --

BVM Team Works Presents
Direction & Editing: Suresh Surya
Cinematographer: Vinee
lyrics-Singer-Music: Charan Arjun
CAST: BVM Siva Shankar