ఒక తండ్రికి సంతోషాన్ని కలిగించేది తనకు కొడుకు పుట్టినప్పుడు కాదు.
ఆ
పుత్రుడు సత్ప్రవర్తన తో పెరిగి, మంచి ప్రయోజకుడై సమాజంలో గొప్ప పేరును
సంపాదించుకున్నపుడు, అప్పుడు ఆ తండ్రికి అసలైన సంతోషాన్ని కలిగించేది.
దానినే పుత్రోత్సాహము అంటారు
ఇందుకు ఉదాహరణగా ఒక మంచి ఈ కథను చదవండి.
ఒక
తండ్రి తన కొడుకును కష్టపడి బాగా చదివించి ఒక కలెక్టర్ గా తీర్చిదిద్దాడు.
ఒక రోజు ఆ తండ్రి తన కొడుకు ఉద్యోగం చేస్తున్న అతడి కార్యాలయానికి వెళ్లి,
తన కలెక్టర్ కొడుకును కలెక్టర్ హోదాలో చూడాలని ఛాంబర్ లోకి వెళ్ళాడు ఆ
తండ్రి.
అక్కడ
కలెక్టర్ సీటులో హుందాగా కూర్చుని ఉన్న తన కొడుకును చూసి ఆనందంతో తన
కొడుకు భుజం మీద చేయి వేసి తన కొడుకుతో ఈ "ప్రపంచం లో అత్యంత శక్తివంతుడు
ఎవరు?" అని అడిగాడు.
అప్పుడు తన కొడుకైన కలెక్టర్ ఇలా సమాధానమిచ్చాడు.
ఈ ప్రపంచంలో అత్యంత శక్తి వంతుడిని నేనే అని అన్నాడు.
అది
విన్న ఆ తండ్రి ముఖం పాలిపోయింది. ఎందుకంటే తానడిగిన ప్రశ్నకు తన కుమారుని
నోటివెంట, ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు మా నాన్నే అనే జవాబు వస్తుందని
ఆశించాడు.
కానీ
తన కుమారుని సమాధానం అతడిని నిరాశ పరిచింది. ఎందుకంటే తాను ఎదురు చూసిన
సమాధానం ఒకటైతే, తన కొడుకు నుండి వచ్చిన సమాధానం వేరోకటి.
బాధగా
వెనక్కుతిరిగి ఛాంబర్ లోనుంచి బయటకు వెళ్తూ మరొక్కసారి తన కుమారునితో
ఇంకొకసారి ఆలోచించి జవాబు చెప్పమని తన కొడుకును రెండవసారి అడిగాడు.
అప్పుడు ఆ కొడుకు తన తండ్రి వైపు అడుగులు వేస్తూ ఇలా అన్నాడు.
మా నాన్నే ఈ ప్రపంచంలో నాకు అత్యంత శక్తివంతుడు అని బదులిచ్చి తన తండ్రి దగ్గరకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించాడు.
ఆశ్చర్యచకితుడైన ఆ తండ్రి తన కొడుకును అడిగాడు.
ఇంతకు ముందు నిన్ను నీవే శక్తివంతునిగా చెప్పుకున్నావు, మరి ఇప్పుడేమో నన్ను శక్తివంతుడు అంటున్నావు కారణం ఏమిటి అని అడిగాడు.
అప్పుడు ఆ కొడుకు తన తండ్రితో నాన్నా అప్పుడు నీచేయి నా భుజం మీద ఉండింది. అందుకే అప్పడు నేనే శక్తివంతమైన వాణ్ణి.
ఎందుకంటే
ఈ ప్రపంచంలో "ఏకొడుకు భుజంమీద తన తండ్రి చేయి ఉంటుందో ఆ కొడుకే అత్యంత
శక్తివంతుడు" కాదా నాన్నా? అని అనగానే ఆ తండ్రి కళ్ళలో నీళ్ళు సుడులు
తిరిగాయి.!
కొడుకును దగ్గరకు తీసుకొని తన హృదయానికి హత్తుకుని ఆనందబాష్పాలు కార్చాడు. అప్పుడు అతడి హృదయం ఆనందంతో పరవశించింది.
ఈ జన్మకు ఇది చాలు అనుకుంటూ తృప్తితో బయలు దేరాడు.
తోటలో నాటిన
విత్తనం మొలకెత్తడం సహజమే. కానీ ఆ విత్తును మొలకగాను, తరువాత చెట్టుగాను, ఆ
తర్వాత మహావృక్షంగాను మలచడంలో ఆ తోటమాలి యొక్క గొప్పదనం తప్పకుండా
ఉంటుంది.
ఇందులో విత్తులాంటి వాడు కొడుకైతే మహా వృక్షంగా మలిచే తోటమాలే మీ నాన్న!
ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రులను గౌరవించండి.
వారు
నీకు ఆస్తులు అంతస్తులు పంచివ్వక పోయుండొచ్చు, కానీ ఇప్పుడు నీవు
అనుభవిస్తున్న ఈ జన్మకు కారణమైన శరీరానికి వారి రక్తమాంసాలను అందించి,
నిన్ను పెంచి పోషించడం కోసం రెక్కలు ముక్కలు చేసుకొన్న వారు.
వారు
తిన్నా తినక పోయినా నీ కడుపు నింపడం కోసం పస్తులున్న వారు, నీవిప్పుడు
సమాజంలో పొందుతున్న గౌరవానికి ముఖ్య కారకులైన వారు వారే కాబట్టి, అలాంటి నీ
కన్న తల్లిదండ్రులకు (ఉంటే) ఇప్పుడే ఇది చదివిన వేంటనే వెళ్లి పాదనమస్కారం
చేయండి.
మన టెలిగ్రామ్ సమూహాలలో చేరాలి అనుకుంటే క్రింద ఉన్న లింక్ ను నొక్కి నేరుగా సమూహం లో చేరండి...
https://t.me/joinchat/CJ_JKkHtaUSprY6qLuY5vg
https://t.me/RamKarri
గమనిక : క్రింద వాట్సాప్ అని ఉన్న లింక్ ని నొక్కి నేరుగా మీ సలహాలు, సూచనలను నాతో వాట్సాప్ ద్వారా పంచుకొని.. మరింత విలువయిన విషయాలను అందివ్వడానికి సహకరించండి...
Blog : Ram Karri
Whatsapp : http://wa.me/+918096339900
-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -
మన టెలిగ్రామ్ సమూహాలలో చేరాలి అనుకుంటే క్రింద ఉన్న లింక్ ను నొక్కి నేరుగా సమూహం లో చేరండి...
https://t.me/joinchat/CJ_JKkHtaUSprY6qLuY5vg
https://t.me/RamKarri