"ముద్ద రుచిగా లేదని బాధ నీది.
అసలు ముద్ద దొరకనోడిదెంత బాధ"

"మేడలు లేవని బాధ నీది.
నిలువ నీడ లేనోడిదెంత బాధ"

"ప్రేమ దూరమైందని బాధ నీది.
ప్రేమను పంచే వారెవ్వరూ లేనోడిదెంత బాధ"

"తల్లి తిట్టిందని బాధ నీది.
పాపం ఎన్నడూ...
తల్లి ఒడిలో ఆడని వాడిదెంత బాధ"

"కష్టం నీ ఒక్కడిపై పగ పట్టిందనుకుంటూ...
కన్నీరు నిను వీడని బంధం అనుకుంటూ..."

"నూరేళ్ళ జీవితాన్ని మధ్యలోనే ముగించకు"

"నీ నవ్వే నీ కన్నీటిని చంపే అస్త్రం"
"నీ ధైర్యం నీ కష్టాన్ని తుంచే ఖడ్గం"