అమృత వాక్కులు


  • 👉మనవాకృతి మహోన్నతం; మానవుడు మహోత్కృష్టుడు.
  • 👉ఇతరులు కూడా 'తానే' కాబట్టి మానవుడు అన్యులను ప్రేమించాలి.
  • 👉మనం మార్పు చెందితే ఈ ప్రపంచం మార్పు చెందుతుంది; మనం పరిశుద్దులమైతే ఈ లోకం పరిశుద్దమవుతుంది.
  • 👉విశ్వాసం! విశ్వాసం! విశ్వాసం! మనపై మనకు విశ్వాసం!! భగవంతునిపై విశ్వాసం!! ఇదే ఉన్నతికి(విజయానికి) రహస్యం.
  • 👉జీవులన్నింటిలోను మానవుడు ఉత్తమోత్తముడు.
  • 👉మహోన్నతమైన ఆదర్శం ఎన్నుకుని, ఆ ప్రకారం నీ జీవితాన్ని మలచుకో.
  • 👉మనలో లేనిదాన్ని మనం వెలుపల చూడలేం.
  • 👉కర్మాచరణ చిత్తశుద్దిని కల్గిస్తుంది విద్యను(ఆధ్యాత్మిక జ్ఞానం)ను ప్రాప్తింపచేస్తుంది.
  • 👉మానవుడు ముక్తిని పొందేది ఈ లోకంలో మాత్రమే.
  • 👉నీవు బలహీనుడవని భావించడం మహాపాపం.
  • 👉భౌతికంగా చూస్తే చెడు ఆలోచనలే వ్యాధిని కలిగించే విషక్రిములు.
  • 👉బాల్యం నుండీ సానుకులమైన, ఉత్సాహకరమైన, బలప్రదమైన, ఆశాజనకమైన ఆలోచనలు వారి(పిల్లల) మెదళ్ళలో ప్రవేశింపజేయండి.
  • 👉మాటలతో నీ శక్తిని వృథా పరచవద్దు. నిశ్శబ్దంగా ధ్యానం చేయి.
  • 👉ఎప్పుడూ నిరాశతో, నిరుత్సాహంతో జీవించేవారు ఏ పనినీ సాధించలేరు.
  • 👉దానం చేసే అవకాశం దక్కడం మన భాగ్యం. అలా తెలుసుకోవడం వలనే మనం పురోభివృద్ధి చెందుతున్నాం.
  • !
  • 👉నీ పురోభివృద్ధి కోసం, ఈ ప్రపంచం అనే ఒక వ్యాయామశాలను కల్పించినందుకు,  భగవంతుణ్ణి కొనియాడు,నువ్వు ఈ ప్రపంచానికి సహాయం చేయగలవని ఎన్నడూ తలచవద్దు.
  • 👉ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు, నీకు ఈ లోకంలో అసాధ్యం ఏది లేదు.
  • 👉పవిత్రంగా నిస్వార్థంగా ఉండటానికి సదా ప్రయత్నించు. మత సారమంతా ఇదే.
  • 👉కోరికలు ఎంతకాలం ఉంటాయో, అంతకాలం నిజమైన సుఖం కలుగదు.
  • 👉మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం 
  • ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే.
  • 👉నువ్వు ఏ మార్గంలో చేరుకోగలవో, ఆ మార్గం ద్వారా భగవంతుని చేరుకో.మామూలుగా వచ్చి చేరు. అంతేకాని నువ్వు రావటంలో ఇతరులెవ్వరిని ప్రక్కకు నెట్టబోకు.
  • 👉ఇతరుల కోసం చేసిన ఏ స్వల్ప కార్యమైనా, అంతర్గత శక్తిని మేల్కొలిపి క్రమంగా హృదయాన్ని సింహాసదృశమైన బలంతో నింపివేస్తుంది.
  • 👉సంపదలు, పేరుప్రతిష్టలుగాని, గౌరవ మర్యాదలుగాని, పాండిత్యంగాని పని చేయవు. ప్రేమ ఒక్కటే నిలిచి ఉంటుంది. కష్టాలు అనే అడ్డుగోడలను చీల్చుకొని పొగలిగేది శీలమే(సత్ప్రవర్తనమే).
  • 👉ఈ లోకంలో ఎల్లప్పుడూ ఇచ్చేవాని(దాత)స్థితిలోనే ఉండు. సాయంచేయి. సేవచేయి. ఏ స్వల్పమైనా ఇవ్వు. కానీ బేరమాడవద్దు.
  • 👉స్వార్థ చింతన లేనప్పుడే మనం ఘన కార్యాలు సాధిస్తాం. అప్పుడే మన ప్రభావం ఇతరులపై పడుతుంది.
  • 👉తినడంలోను, వస్త్రధారణలోను గాని, ఆటపాటలలోగాని, సుఖంలోగాని, దుఃఖంలో గాని అన్ని వేళలలోను మహోన్నతమైన నైతిక బలాన్ని ప్రకటించు.
  • 👉అనంతమైన ఓర్పు, అనంతమైన పవిత్రత, అనంతమైన పట్టుదల ఇవే సత్కర్మ సఫలమవటంలోని రహస్యాలు.
  • 👉విధేయత, సంసిద్ధత, కర్తవ్యం మీద ప్రేమ - ఈ మూడు మీలో ఉంటే మిమ్మల్ని ఏది అడ్డుకోలేదు.
  • 👉సహనం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం సాధించలేడు.
  • 👉మతం అంటే, స్వతఃసిద్దంగా మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తం చేయుటయే.
  • 👉వేయిసార్లు ఓటమి పాలైన సరే సౌశీల్య నిర్మాణం గావించుకోవాలి.
  • 👉లక్ష్యంపై ఉన్నంత శ్రద్దాసక్తుల్ని, లక్ష్య సాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యమంతా ఇదే.
  • 👉సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించి తీరుతాం.
  • 👉ఈ లోకంలో సత్సాంగత్యం కంటే పవిత్రమైనది మరేదీ లేదు.
  • 👉మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకోవాలంటే మీ బుద్ధిని ఉపయోగించండి. ఎదుటి వారిని క్రమశిక్షణలో పెట్టాలంటే మీ హృదయాన్ని ఉపయోగించండి.
  • 👉పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి. కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు.
  • 👉ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయిన రేపైనా విజయం తప్పదు.
  • 👉ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం. - అవి విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.
  • 👉మనం ఏది కామో అదిగా మనల్ని జనులు భావించాలని మన శక్తిని ఖర్చు పెడతాం. ఆ శక్తిని మనం ఎలా ఉండాలనుకుంటున్నామో దానికోసం వినియోగించడం ఉత్తమం.
  • 👉ఈర్ష్య, అహంభావాలను పూర్తిగా వదిలి అఖండ శక్తి సామర్థ్యాలతో పనిచేయండి. మీ ఆదర్శం పట్ల మీకు పరమ నిష్టాగరిష్టత ఉన్నప్పుడే లక్ష్యసిద్ధి సాధ్యం.
  • 👉ఎవరి జీవితం ప్రేమమయమై, స్వార్థరహితమై ఉంటుందో అలాంటి వారే లోకానికి కావలసి ఉన్నారు. అటువంటి ప్రేమతో కూడిన ధీరవాక్కులే మనకు కావల్సినవి.
  • 👉నిన్ను నువ్వు జయిస్తే, విశ్వమంతా నీకు స్వాధీనమవుతుంది.
  • 👉ఇతరుల ఆలోచన విధానం, కార్యనిర్వాహనల్లోని తప్పుల్ని ఎత్తి చూపకూడదు. దానికి బదులు, వాటిలో పరిణతి సాధించే మార్గాలను వారికి తెలియజేయండి.
  • 👉ఆదర్శంగల వ్యక్తి వేయి తప్పులు చేస్తే, ఏ ఆదర్శంలేని వ్యక్తి ఏభై వేల తప్పులు చేస్తాడనడం నిస్సంశయం. కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండడం మంచిది.
  • 👉పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వ సాధారణం, అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటములే లేని జీవితం ఉంటుందా ?
  • 👉లోపం ఉన్నదని భావించడమే లోపాన్ని సృజిస్తున్నది. బలం పరిపూర్ణతల గురించి భావించడమే లోపాన్ని సరిదిద్దగలరు.
  • 👉లేవండి, ధైర్యంతో సమర్థులై నిలవండి. మీ భవితకు మీరే విధాతలని గుర్తించండి.
  • 👉నిరంతర వికాసమే జీవనం. సంకోచమే మృత్యువు. తన వ్యక్తిగత సుఖాలనే చూసుకుంటూ, సోమరితనంతో గడిపే స్వార్థపరుడికి నరకంలో కూడా స్థానం లేదు.
  • 👉మనోవాక్కర్మల యందు ఒక్కటైన కొద్దిమంది ప్రపంచాన్ని ఉర్రూతలూగించగలరు. ఈ సత్యాన్ని ఎన్నడూ మరువకండి.
  • 👉నువ్వు నిరుపేదవని అనుకోవద్దు; ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి.
  • 👉మొదట మన లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత దాన్ని ఆచరణలో పెట్టే మార్గాలను అన్వేషించాలి.
  • 👉అంధకారం నుండి మానవులు వెలుగులోకి రావాలి. పవిత్రులై ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తూ విద్యావంతులు అవ్వాలి. అప్పుడే లోకం నుండి దుఃఖం నిష్క్రమిస్తుంది. అందుకు మరోమార్గం లేదు.
  • 👉మనస్సు ఎంత నిర్మలమైతే, దాన్ని నిగ్రహించడం అంత సులభమవుతుంది. మనస్సును నిగ్రహించాలనుకుంటే, చిత్తశుద్ధికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి.
  • 👉అభ్యాసంతో యోగం సిద్దిస్తుంది. సిద్ధితో జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం నుండి ప్రేమ మరియు ప్రేమ వల్ల పరమానందం లభిస్తాయి.
  • 👉ప్రతి వ్యక్తిలోనూ దివ్యత్వం అవ్యక్తంగా ఉంది. అంతర ప్రవృత్తిని, బాహ్య నడవడిని నియంత్రిస్తూ అంతరాళ్ళాల్లోని ఆత్మ శక్తిని వెలికి తీయడమే మన లక్ష్యం.
  • 👉ప్రతి భాధ్యత పవిత్రమైనదే. భాధ్యత పట్ల మనకుండే భక్తియే భగవంతునికి మనం చేయగలిగే అత్త్యుత్తమమైన అర్చన.

- స్వస్తి...