ఏది నిజం?


మానవ జాతి చరిత్ర మొత్తం దీనికోసం అన్వేషణ.
ఈ విశ్వం ఏమిటి? ఈ జీవరాశి ఎంటి? మానవుడేంటి? అతని జీవిత లక్ష్యం ఏమిటి? దానిని సాధించే మార్గం ఏమిటి?
ఇలాంటి ప్రశ్నలెన్నో!
వాస్తవానికి మనకు అనుభవమయ్యే విషయం ఒకలా ఉంటుంది. దాని వెనుక ఉన్న నిజం మరోలా ఉంటుంది.
మనకు వాస్తవం అనిపించే వస్తువు లేక విషయానికి ఆధారభూతమైన నిజం దానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఉంటుంది. నిజం కాక పోయినప్పటికీ, మనం వాస్తవం అనుకొనే విషయాలు లేక వస్తువుల పైనే మన జీవన విధానం ఆధారపడి ఉంది.
ఉదాహరణలు :-

1. మనం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని, పడమరన అస్తమిస్తాడని భావిస్తాం. దీనిఆధారంగానే ఉత్తర దక్షిణ దిక్కులను మనం గుర్తిస్తున్నాం.
అక్షాంశాలపై (lattitude) సూర్యుని గమనాన్ని బట్టి వివిధ ఋతువులు, ఋతుపవనాలు వంటివి ఏర్పడుతున్నాయి. సూర్యోదయ, సూర్యాస్తమయాల ఆధారంగా మన జీవన విధానం ఉంటుంది.
కానీ, నిజానికి భూమి ఒక గోళం కదా! భూ భ్రమణం వల్లనే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నట్లు, పడమరన అస్తమిస్తున్నట్లు మనకు అనిపిస్తోంది.
కానీ మన అనుభవానికి పూర్తి వ్యతిరేకంగా "నిజం" ఉంది.
భూమి మీద ఒక ప్రాంతంలో ఉన్నవాడికి తూర్పు దిక్కుగా అనిపించేది, భూమికి మరో వైపున ఇతనికి అడుగున (opposite) ఉన్న వ్యక్తికి పడమరగా అనుభవమౌతుంది.
కాబట్టి దిక్కులనేవి నిజమైనవి, స్వత:సిద్ధమైనవి కావు.
మన అనుభవం ఒకలా ఉంది. నిజం వేరొకలా ఉంది. కానీ మన జీవన విధానాలు మన అనుభవాలమీదే అధారపడి ఉన్నాయి. నిజాల మీద కాదు.
2. కదులుతున్న బస్ లేదా రైలులో మన శరీరం తూలుతుంది. కానీ గంటకు ఎన్నో వేల మైళ్ళ వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ అనంత ివిశ్వంలో ప్రయాణిస్తున్నా, మనకు భూమి స్థిరంగా ఉన్నట్లే అనుభవమవుతుంది. కానీ నిజం దీనికి పూర్తిగా విరుద్ధం.
3. సినిమా చూసే ప్రేక్షకుడు అది నిజం కాదని తెలిసినా అందులో లీనమై భావోద్వేగాలను, కామ వికారాలను పొందుతాడు. తెర మీద నిజంగా మనుషులు లేరని తెలుసు, సెకనుకి 24 frames కదలడం వల్ల తెరమీద సినిమా నిజంలా కనబడుతోందనీ తెలుసు. అయినా భ్రమలో పడతాడు. సినిమాల కోసం ఎంతో ఖర్చు పెడతారు. ఒక భిక్షగాడికో, ఆకలిగొన్నవాడికో సినిమా ఖర్చులో నాలుగో వంతైనా ఇవ్వాలంటే మనసొప్పదు. ప్రత్యక్షంగా కనిపిస్తున్న నిజం కంటే కల్పనకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మనుషులు.
కాబట్టి మన నిత్యజీవితం నిజాలపై కంటే, నిజాలుగా కనిపించే అబద్ధాలపైనే ఆధారపడి ఉందని చెప్పక తప్పదు.


---------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -

Whatsapp : +918096339900 ,
Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -


Web Sites & Blogs :

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---
Google Map : Ram Karri

----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------