రాత్రి పూర్తి అయ్యాక 55 ఘడియల తరువాత ఉషఃకాలం, 

57 ఘడియల తరువాత అరుణోదయ కాలం, 

58 ఘడియల తరువాత ప్రాతఃకాలం, 

60 ఘడియల తరువాత సూర్యోదయం.



'ఘడియ' అంటే 24 నిముషాలు. 

అంటే సూర్యోదయానికి ముందు 48 నిముషాల కాలం, ప్రాతఃకాలం, 

అంతకు ముందు 24 నిముషాల పాటు అరుణోదయం కాలం, 

అరుణోదయ కాలానికి ముందు 48 నిముషాలపాటు ఉషఃకాలం. 

ఉషఃకాల, అరుణోదయ కాల, ప్రాతఃకాల, సూర్యోదయ కాలాలను (సమయాలను) కాల చతుష్టయం అంటారు. 

ఈ కాల చతుష్టయానికి ముందు 2 గంటలపాటు "బ్రహ్మ ముహూర్తం"గా చెప్పబడింది.


సూర్యోదయం 6.00 గంటలకు జరిగితే, తెల్లువారుఘామున 2,00 గంటలనుండి 4.00 గంటలవరకు బ్రహ్మ ముహూర్తం అవుతుంది.



-స్వస్తి