🌏రోజు కొద్దిసేపు అన్నిటికీ దూరంగా వెల్లు. మనసు అదే కుడుటపడుతుంది!!

🌏ఎన్ని పాట్లు ఎన్ని కష్టాలు పడ్డా వన్నది కాదు అనుభవం అంటే! సత్యానికి, జ్ఞానానికి ఎంత చేరువయ్యావు అన్నదే అసలైన అనుభవం!!

🌏రూపం అనేది కళ్ళకు నచ్చే అందం. గుణం అనేది మనలోని అంతరాత్మకు మనం చెప్పుకునే నిజం!!

🌏సరళ తే సరైన జీవన విధానం.ఏదీజరిగింది అనికాదు. ఎలా తీసుకున్నావు! అన్నదే జ్ఞానం!!

🌏నిన్ను నీవు చేరాలంటే నీకు నీవు సమయం ఇవ్వవలసిందే! వేరే దారి లేదు!!

🌏విజయం అంటే ఎదో ఒకటి సాధించి అలసిపోవడం కాదు! చివరి శ్వాస వరకు సాధిస్తూనే ఉండడం!!

🌏సుఖము బయట నుండి వస్తే ఆనందం లోపలనుండి మాత్రమే వస్తుంది తెలుసుకదా మీకు!!

🌏నిత్యం హాయిగా ఉండాలంటే సత్యం తో ఉండాలి మరి!  వేరే దారి లేదు!!

🌏సమస్య ఎప్పుడూ నీ చుట్టూ  కుంభ వృష్టిలా కురవనీ గొడుగు అనే ఆత్మవిశ్వాసాన్ని నీతో ఉంచుకో ఎంతటి జడి వాన అయినా నిన్నేమీ చేయదు!!


♥మనశ్శాంతి లేదు అంటే మిమ్మల్ని మీరు మరిచారు అని అర్థం! ఒక్కసారి చూసుకోండి మరి!!

♥ఇతరుల గురించి మాట్లాడడానికి సమయం లేనంతగా  మీ పరివర్తనకు సంభందించిన సాధనలో మీరు ఉండండి!! అంతే!!

♥సానుకూల ఆలోచనలే  శక్తిని మరింత పెంచే సాధ కాలు!!

♥తెలిసి తెలియక ఎక్కువ మందికి ఉన్న ఒకే ఒక దీర్ఘ కాలిక జబ్బు అహంకారమే!
అది పోయినపుడు సంపూర్ణ ఆనందం!!

 ♥తాను కూర్చున్న కొమ్మ విరిగి పోతుందని పక్షకి భయం ఉండదు. ఎందుకంటే ఏ పక్షి  కూడా తను కూర్చున్న కొమ్మను నమ్ము కోదు.తన రెక్కలను మాత్రమే నమ్ముకుంటుంది.!!

♥మనసే స్వర్గము.. మన చేతి లో ఉన్నంత వరకు..మనసే నరకము మన చేతి లో లేకుంటే
అంటే చేయి దాటి పోతే!!

♥లోపల ఏమి కాకుండా  ఏమి లేకుండా వుండటమే అసలైన జీవిత మంటే !!

♥గురువులు మారితే సాధనా పద్ధతులు మారవచ్చేమో కానీ సత్యం మారదు.!!

♥పంచడమే ధర్మం. మన దగ్గర వున్న మంచిది ఏదైనా!!

♥జడ్జిమెంట్స్ తీసివేయగా మిగిలేది ప్రేమ మాత్రమే!!


💗అన్నీ అర్థం అవ్వాలని లేదు. అర్థం కాకపోతే తక్కువా కాదు.ఎక్కువా కాదు. అర్థం కాలేదన్న అర్థం అయితే చాలు!!

💗నిజంగా నీవు సత్యం లో ఉంటే విజయం సహజం. విజయం కోసం పరుగుపెడుతూ ఉన్నావంటే నీవద్ద సత్యం లేదా!!

💗పోయినది, వచ్చినది, ఉన్నది, వచ్చేది అన్నీ వరాలే. అన్నే అద్భుతాలే. అన్నీ బహుమతులే ! ఈ జీవితంలో!!

💗ఎవ్వరి మీదైనా కోపాన్ని మోస్తూ పోవడం అంటే నెమ్మదిగా విషయాన్ని తాగడమే! గుర్తుంచుకోండి!!

💗జనాలు నిన్ను ప్రేమిస్తారు! ద్వేషిస్తారు! వీటితో దీనితో నీకు పనిలేదు! నీపని నీదే!!

💗మనం ఎలా వున్నా సరే అనేవాడు కాదు స్నేహితుడు! మనకు సరైన దారి చూపే వాడే సరైన స్నేహితుడు! సన్నిహితుడు!!

💗భాధలు పోవాలంటే మీ అంతర్గత స్థితికి మీరే బాధ్యత వహించి ఇప్పుడే ఈ క్షణమే అడుగు వేయడం మొదలు పెట్టాలి!!

💗మన బాధలకు వ్యక్తులు కారణం అనుకోవడం ఒకరకమైన అమాయకత్వం! అజ్ఞానం!బాధలకు మూలం మన చంచలమైన మనస్సు!!

💗పోటీ పడుతున్నారంటే ఇంకా మీకు అంతటా మీరే అన్న బ్రహ్మజ్ఞానం అర్ధం కాలేదని అర్థం!!

💗ఒక ద్వారం మూయ బడినపుడు మరో ద్వారం తప్పక తెరుచుకోబడుతుంది! సహనం తో వేచి ఉండండి!! 👍