ఓ మనిషీ..

తిరిగి చూడూ..

నానాటికీ దిగజారిపోతున్న   నైతిక విలువలు...     

 డబ్బుకు లోకం దాసోహం అంటున్న జనాలు ...

 స్వార్థమెరిిగిన బంథాలు..

 స్వాహా చేసే అనుబంథాలు..

 పతనమైపోతున్న ప్రేమలు...

 పది నెలలు కూడా నిలబడలేకున్న పెళ్ళి బంధాలు..

 ఏమిటీ దౌర్భగ్యం..?       

 ఎందుకీ వైపరీత్యం...?     

  ఓ మనిషీ.. తిరిగి చూడూ...

 నీవు కోల్పోతున్న మానవత్వపు విలువలు...     

నీకు దూరమైన డబ్బు కన్నా విలువైన వ్యక్తులు...

 బండరాయిగా నువు దూరం చేసుకున్న బంథాలు.. 

 ఆపదలో కూడా నిను ఆదుకోవడానికి ఇష్టపడని అనుబంథాలు.. 

నిన్ను నువ్వే ప్రేమించుకోలేని     ఆ ప్రేమ..         

 పదికాలాల పాటు కూడా నీవు నిలబెట్టుకోలేని పెళ్ళి బంధం...

 ఇదేనా వీ ప్రగతి...         

ఇదేనా నీ ఔన్నత్యం....     

 ఇదేనా నీ ఉనికి..? 

 ఓ మనీషీ తిరిగి చూడూ...!!