నేడు బాలల దినోత్సవం......మీ బాల్య జీవితం గుర్తుచేసుకోండి.......
బాల్యమా.. ఏదీ నీ చిరునామా ....?

బాల్యం ఓ అద్భుత వరం. బాల్యం గుర్తుకొస్తే చాలు భారమైన వయసు తేలికవుతుంది. బాల్యం నాటి జ్ఞాపకాలను మరోమారు మనసులోనే ఆవిష్కరింపజేస్తుంది. జీవితంలో ఒక్కసారైనా బాల్యాన్ని తలుచుకోని మనిషి ఉండడు.

🌀ముద్దు ముద్దు మాటలతో, చిలిపి అల్లరి చేష్టలతో ఇంటిల్లిపాదినీ అలరించే బాలలంటే అందరికీ ప్రేమే. ప్రకృతితో సహా అందరి ప్రేమకు అర్హులైనవారు వీరు మాత్రమే.వారికోసం ప్రత్యేకంగా బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు.

🌀 బాలలంటే బడి పిల్లలే కానక్కరలేదు. సాటి పిల్లల్లా విద్య ద్వారా ఉత్తమ భవిష్యత్తును అందుకోవాలని ఆశించినా, ఆర్ధిక స్థితిగతుల అడుసులో కూరుకుపోయి, బడికి దూరమై బ్రతుకు భారాన్ని అతి పిన్నవయసులో మోయవలసిన పరిస్థితిలో... భవిష్యత్తంటే ఏ పూటకాపూట కడుపు నింపుకోవడమే అనే ఏకైక ఆలోచనకు బలవంతంగా బద్ధులై బ్రతికే సగటు బాలుడు బాల్యాన్ని ఎందుకు కోల్పోతున్నాడు?దీనికి అనేక కారణాలున్నాయి.బాలల హక్కులను కాలరాస్తున్న మన పాలకుల నిర్లక్ష్యధోరణి ప్రధాన కారణం.

ఈ నేపథ్యంలో బాలల హక్కులు, పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిల్డ్రన్స్‌ డే ప్రత్యేక వ్యాసం...

🌀 మనదేశంలో భారత తొలి ప్రధాని పండిట్‌ జవహరాల్‌ జన్మదినమైన నవంబర్‌ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం... విషయం తెలిసిందే. అయితే పిల్లల సంక్షేమం కోసం ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంపొం దించే మరో శుభదినమే ఐక్యరాజ్య సమితి పాటించే ప్రపంచ బాలల దినోత్సవం. ప్రతి ఏడాది నవంబరు 20వ తేదీని ప్రపం చ బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. యూనిసెఫ్‌ (యునై టెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్స్‌ ఫండ్‌)బాలల దినం కార్యక్రమాలను సమన్వయం చేసి నిర్వహిస్తున్నది. పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్నది.ఇదే వారంలో (నవంబర్‌ 19) బాలల అత్యాచార నిర్మూలన దినోత్సవం (చైల్డ్‌ అబ్యూస్‌ ప్రివెన్షన్‌ డే) కూడా జరుపుకోవడంతో ఈ వారం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

🌀 అయితే ఈ ఉత్సవాల సంగతి ఎలా ఉన్నా మనదేశంలో బాలల స్థితిగతులు ఎలా ఉన్నాయి? విద్యా, వైద్య సేవలు చిన్నారులకు అందుతున్నాయా? అని పరిశీలించుకుంటే ఎన్నోభయంకర వాస్తవాలు వెలుగుచూస్తాయి.񝰮నదేశంలో 147 మిలియన్ల పిల్లలు పూరిళ్ళల్లో నివసిస్తున్నా రు. 77 మిలియన్ల పిల్లలు కొళాయిల తాగునీరు వాడడంలేదు. 85 మిలియన్ల పిల్లలకు వ్యాధి నిరోధకటీకాలు సకాలంలో అందడం లేదు. 27 మిలియన్ల పిల్లలు బరువుతక్కువగా ఉన్నారు. ఇలాంటి అనేక భయంకర చేదు వాస్తవాలను ఈ నివేదిక బట్టబయలు చేసింది. నివేదిక ప్రకారం 33 మిలియన్ల మంది బడి ముఖం చూడలేదు.

🔷 5-14ఏళ్ళ లోపు 72 మిలియన్ల పిల్లలకు ప్రాథమిక విద్య అందుబాటులో లేదు. మగపిల్లలకే ప్రా దాన్యం ఇస్తున్నందువల్ల ఆడపిల్లలు అశ్రద్ధకు, తీవ్రమైన వివక్షకు గురవుతున్నారు. ఈ సమస్యల నివారణ కోసం భారత్‌ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ వాస్తవరూపం దాల్చడంలేదని నిర్వివాదాంశం.

-స్వస్తి...