శ్రీ శార్వరి నామ సంవత్సర 

సమగ్ర భారతీయ తెలుగు కాలమాన దర్శిని  :

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
( Click Here for Download Compressed Telugu Kala Darshini  )

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

శ్రీ శార్వరి గంటల పంచాంగం శ్రీ శంకరమంచి వారి దృక్ సిద్ధాంతం పూర్వ గణితం

( Click Here for Download Panchangam )

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


కాల దర్శిని ని ఇక్కడే వీక్షించండి
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

శ్రీ శార్వరి నామ సంవత్సర సమగ్ర భారతీయ తెలుగు కాలమాన దర్శిని గురించి వివరంగా...


                  మనం సమగ్రమైన భారత తెలుగు కాలమాన దర్శిని ని (జంత్రి) మరచిపోయి, అర్థంలేని గ్రెగోరియన్ (ఆంగ్ల) క్యాలండర్ ను అనుసరిస్తున్నాం అని గమనించాలి...

                భారతీయ కాలమాన దర్శిని (జంత్రి) ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది...

 గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకృతికి విరుద్ధం.. 

ఎలాగో గమనించండి..

            భారతీయ కాలమానం ప్రకారం సూర్యోదయంతో దినం మొదలవుతుంది.. 

        మనకు ఒక రోజు అంటే ఇవాళ తెల్లవారుఝాము నుండి మరునాటి తెల్లవారు వరకూ.. 

        కానీ గ్రెగోరియన్ క్యాలండర్ మాత్రం అర్ధరాత్రి పూట దినం మొదలవుతుంది.. 

అది తిరిగి అర్ధరాత్రి వరకూ కొనసాగుతుంది..

సృష్టిలో ఏ ప్రాణి అయినా తెల్లవారు ఝామునే నిద్ర లేస్తుంది..

మనుషులంతా ఉదయాన్నే నిద్ర లేని దైనందిన కార్యక్రమాలకు సిద్ధమవుతాం..

పక్షుల కిలకిలరావాలు సుమధురంగా వినిపించేది..

తోటల్లో పూవులు వికసిస్తాయి..

ఆవులు దూడలకు పాలను ఇస్తాయి..

మరి ఈ చర్యలన్నీ అర్ధరాత్రి జరగడం మీరెప్పుడైనా చూశారా?

ప్రకృతి నియమాల ప్రకారం సాగే ఈ చర్యలు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి పూట జరగడం మీరు ఎక్కడైనా చూశారా?

       మన ఆలయాల్లో సుప్రభాత ప్రార్ధనలు తెల్లవారునే ఎందుకు చేస్తాం ?

అర్ధరాత్రి ఎందుకు చేయం...

            మన పండుగలు భారతీయ కాలమానం ప్రకారమే జరుపుకుంటున్నం...

              గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడైనా జరుపుకుంటున్నామా ?


       భారతీయ సాంప్రదాయం ప్రకారం ఉగాదితో నూతన సంవత్సరం ఆరంభం అవుతుంది...


    సూర్యమానమైనా, చంద్రమానమైనా గ్రహాల గమనం, ప్రకృతి ధర్మాల ప్రకారం మన కాలమానం రూపుదిద్దుకుంది...


    జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం అని చెప్పడానికి సరైన ప్రమాణాలు లేవు...


           రోమన్లు, గ్రీకులు పాటించే గ్రెగోరియర్ క్యాలెండర్ కాలగమనంలో అనేక మార్పులకు లోనైంది...


           యూరోప్ దేశాల వలస పాలన ద్వారా ప్రపంచ దేశాలన్నిటిపైనా బలవంతాన రుద్దబడింది...


ఆంగ్లేయుల ద్వారా మన దేశానికి దాపురించింది...


      నిజానికి స్పష్టమైన కాలగణన ఉన్న భారతీయ కాలమానమే ప్రపంచానికి ఆదర్శం...


 గ్రెగేరియన్ క్యాలండర్లో ఎన్నో లోపాలు కనిపిస్తాయి..

            మనం నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సింది ఉగాది రోజునే...

 జనవరి 1వ తేదీన జరుపుకోవాలని నియమం ఏమీ లేదు..

 ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ను అనుసరిస్తున్నాయి.. 

దీన్ని మనం క్యాలెండర్ మార్పుగానే గుర్తించాలి..

          అందుకే ఇప్పుడు తెలుగు వారి కోసం మన భారతీయ కాలమాన సూచికని  ( జంత్రి )  అచ్చ తెలుగు లో తయారు చేయడం జరిగినది...

         ఇందులో  తెలుగు మొదటి నెల ( చైత్రం ) తో మొదలయ్యి పాల్గుణం తో ముగుస్తుంది...

ఆంగ్ల క్యాలెండర్ మాదిరి జనవరి నుండి డిసెంబర్ ఉండదు...

తిధుల ద్వారా ఈ భారతీయ తెలుగు కాలమాన దర్శిని ని (క్యాలెండర్) ని రూపొందించడం జరిగినది... ఇదే నిజమైన కాల సూచిక...

ఈ కాల సూచిక (జంత్రి) ను చైత్రం మాసపు మొదటి రోజయిన చైత్ర శుద్ధ పాడ్యమి రోజున అనగా ఈ రోజున విడుదల చేయడం జరుగుచున్నది...

నూతన సంవత్సరం సంధర్బంగా శ్రీ శార్వరి నామ సంవత్సర సమగ్ర భారతీయ తెలుగు కాలమాన దర్శిని ని మీ కోసం పిడిఎఫ్ రూపంలో పంపడం జరుగుతున్నది...


Add caption

ధన్యవాదములతో...

మీ రామ్ కర్రి