అత్యద్భుతమైన ఈ అంతు చిక్కని సృష్టిలో మనిషి మదిలో వచ్చే ఆలోచనలు అలలలాగ ఎగసిపడతాయి...

ఒక్కో ఆలోచన ఒక్కో సంఘర్షణ...

అసలు ఆలోచనే అపూర్వం.

కడలిలో అలకు మదిలో ఆలోచనకు బహుశ దగ్గరి సంబంధం ఉందేమో..!!

ఎక్కడో నడి సంద్రంలో పుట్టిన అల తన గమ్యం వైపు పయనిస్తూ ఆ క్రమంలో ఎన్నో సార్లు పైకి లేస్తూ పడుతూ చివరకి భూమిని తాకుతుంది...

ఆలోచన కూడా అంతే.

ఆలోచన మనసులో ఎక్కడో మూల అరల్లో నుంచి తన్నుకొచ్చి ఎన్నో తెరలు దాటుకొని...

దానిలో కొంత వడబోసి మరికొంత వదిలేసి మెదడును చేరేలోపు ముప్పుతిప్పలు పెడుతుంది..,

ఆ ఆలోచన ఆలోచన'రహితమో'..,

ఆలోచన'హితమో'

మనకు మనమే మదిలో మర్దన చేయాలి..

మనసు లోతుల్లోంచి వచ్చిన

మంచి ఆలోచన మనలో ఆత్మజ్యోతై నలుగురికి వెలుగునిస్తూ ఆపన్న హస్తం అందిస్తుంది....!!