"ఓం సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే,
భయేభ్య స్త్రహినో దేవి దుర్గా దేవి నమోస్తుతే"

🕉
 విజయదశమి మంచి మనసుతో వ్యవహరించే  మీకు మీ కుటుంబ సభ్యులందరికీ  సర్వదా  విజయం లభించాలని, సంతృప్తిని, సఖ్యతను, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆ దుర్గా మాత ప్రసాదించాలని కోరుతూ విజయ దశమి శుభాకాంక్షలు...లంకాధిపతి రావణుని ఆవేదన :


పూర్తి గా చదవండి... అర్ధాన్ని అర్ధం చేసుకోండి...

"నేను లంకాధిపతి రావణున్ని మాట్లాడుతున్నాను... ఈ దసరా రోజున
నేను చాల దుఃఖం లో ఉన్నాను..మీతో మాట్లాడాలనుకుంటున్నాను..నేను
చెప్పేది ఒక్కసారి వినండి ఆలోచించండి.. ఈ రోజు మీరందరు నన్ను
దహణం చేస్తున్నారు చెడుపై మంచి సాదించిన విజయంగా
చెప్పుకుంటున్నారు...ఒక్కసారి విఙ్ఞతతో ఆలోచించండి నిజంగా ఈ
రోజుల్లో మనుషులరూపం లో ఉన్న మృగాలకంటే నేను చెడ్డవాన్నా??
ఒకవేళ లక్ష్మణుడు నా చెల్లిపై దాడి చేసి చేసి ముక్కు చెవులు
కోసి ఉండకపోతే నేను సీతను ఎత్తుకొచ్చేవాన్నా?? మీరొక్కసారి
ఆలోచించండి ఒకవేళ మీ అక్కా చెల్లితో ఎవరైనా ఇలాగే చేస్తే
మీరేం చేస్తారు?
సీతని తీసుకువచ్చాక కూడా నేను తనతో ఎప్పుడు తప్పుగా
ప్రవర్తించలేదు, తనని అవమానించలేదు లేదా ఈ రోజుల్లోలాగ
ప్రేమించట్లేదని మొహం మీద యాసిడ్ దాడి
చేయలేదు..సభ్యత తెలిసిన వాడిని కాబట్టి తన కోసం వేచి
ఉన్నాను.
మూడుకోట్ల మందిలో నా అంత బలవంతుడు లేడు అయినా కూడా నా
మర్యాద నేను నిలబెట్టుకున్నాను సీతాదేవి పవిత్రతకి చిన్న
మచ్చకూడా రానివ్వలేదు కావాలనుకుంటే బలవంతంగా సీతని నా
రాజభవనంలో పెట్టుకునే వాన్ని కాని దాని వల్ల సీత శీలం పై
మచ్చ ఏర్పడుతుందని తెలుసు కాబట్టి తనని రాజభవనాలకి
దూరంగా "అశొక వాటిక" లో అది కూడా మహిళా సంరక్షకుల
పర్యవేక్షనలో ఉంచాను..
నా పుత్రులు, సోదరులు, నా సంబందీకులందరు రాముడు అతని సైన్యం
చేతిలొ మృత్యువు పాలయ్యారు, కాని దానికి ప్రతీకారం సీతమీద
తీర్చుకోలేదు..చివరి వరకు నా మర్యాద కాపాడుకున్నాను
బంగారంతో నిర్మించబడిన నా లంకా నగరం లో పేదవాడు అనేవాడు ఉండే
వాడు కాదు..అందరికి న్యాయం జరిగేది నా ప్రజలందరు సంపన్నులు,
సుఖసంతోషాలతో జీవిస్తూ ఉండే వారు... హనుమంతుడు నా కుమారున్ని
చంపినపుడు కూడా రాజధర్మాన్ని
పాటిస్తూ తోకకి నిప్పంటించమన్న తీర్పు మాత్రమే
ఇచ్చాను..కావాలనుకుంటే క్రూరమైన మృత్యుదండన శిక్ష విదించే
వాన్ని కాని నేను అలా చేయలేదు "రాజధర్మం"
పాటించాను...అయినా కూడా హనుమంతుడు నా నగరాన్ని
తగులబెట్టాడు...చెప్పండి ఎవరు ఉన్నతమైన వారు??
అంగదుడు నా దగ్గరకి వచ్చినపుడు నా స్నేహితుని కుమారుడు
అయినందువల్ల పూర్తి గౌరవం, స్నేహాన్ని అందించాను...కావాలనుకుంటే
బందీగా పట్టుకొని కారాగారం లో వేయవచ్చు కానీ నేనలా
చేయలేదు...నేను "మిత్రధర్మం" నిలబెట్టుకున్నాను
కుంభకర్ణునితో బాటు నా సోదరులందరూ నాపై గౌరవం, భయభక్తులతో
ఉండే వారు, విభీషనుడు ఒక్కడే నా అలోచనలకు వ్యతిరేఖంగా ఉండే
వాడు...నా రాజ్యం లో భగవంతుడు శివున్ని పూజించాలి, లేదంటే నన్ను
పూజించాలి..కాని అతడు విష్ణువు ని పూజించే వాడు...
వీభీషనుడు రాముని పై సానుభూతి తో ఉన్నాడని తెలుసు అయినా
అతడు రాముని శరణుజొచ్చి వెళ్తే కూడా వెళ్ళనిచ్చాను....ఒక
సోదరునిగా మాతృభూమి కష్టాల్లో ఉన్నాకూడా శతృవు పంచనచేరడం
విభీషనునికి ధర్మం అనిపించుకుంటుందా??
అందరూ రాజుల లాగా నేను కావాలనుకుంటే విభీషనున్ని బందీగా చేసి
ఉండొచ్చు రాజద్రోహి అనే ఆరోపణతో మరణదండన
విదించొచ్చు...కానీ నేనలా చేయలేదు వీభీషనుని నిర్ణయాన్ని
గౌరవించాను రాముని దగ్గరికి వెళ్ళనిచ్చాను..
నా నాభి లో అమృతం ఉంటుంది అది ఒక్క విభీషనునికి మాత్రమే
తెలుసు, అయినా కూడా అతన్ని శతృవర్గం లోకి వెళ్ళనిచ్చాను...నా
చావు రహస్యాన్ని విభీషనుడు రామునికి చెప్పి ఉండకపోతే
రాముడు నన్ను ఎప్పటికి చంపి ఉండే వాడు కాదు..నేను రాజునయుండి
కూడా విభీషనుని నిర్ణయాన్ని గౌరవించాను, రాముని దగ్గరకు
వెళ్ళనిచ్చాను..నేను నా "సోదర ధర్మం"
నిలబెట్టుకున్నాను...దానికి ప్రతిగా విభీషణుడు ఏం చేసాడో మీ
అందరికీ తెలుసు....ఇలాంటి వాన్ని మీ భాషలో ఏమంటారు??
నేను చేసినదానికి పశ్చాత్తాపపడ్డాను అయినా రాముడు నన్ను
క్షమించకుండా చంపేసాడు..
ప్రతిసంవత్సరం నన్ను దహణం చేస్తున్నారు, "చెడు" కి ప్రతీకగా
నన్ను చెప్తున్నారు..కానీ ఈ దేశం లోనన్ను దహణం
చేస్తున్నవాళ్ళు చేస్తున్న పనులేంటి..
ఈ దేశం లో స్త్రీల మీద ఎలాంటి అమానవీయ సంఘటనలు
జరుగుతున్నాయో ఈ ప్రజలకి కనిపించడం లేదా??
చిన్నచిన్న పిల్లల్ని మానభంగం చేయడం, వాళ్ళని చంపేయడం..
ఇష్టం లేదు అని చెప్తే అమ్మాయిలు పై
యాసిడ్ దాడులు చేయడం..
కులమతాల పేరుతో చంపడం..
పసిపిల్లల్ని నిలువునా తగలబెట్టడం..
వీళ్ళు ఏం మనుషులు??
మీరు మీలో ఇలాంటి జంతు మనస్తత్వాన్ని వదిలేయండి లేదా
రావణ
దహణాన్ని మానేయండి..
నేను తప్పు చేసినవాన్ని అయిండొచ్చు, కానీ దుర్మార్గున్ని కాదు..
నేను రావణున్ని..ఈ దేశ మూల్నివాసుల
చక్రవర్తిని..ధర్మబద్దంగా పరిపాలించినవాన్ని."


---------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -

Whatsapp : +918096339900 ,
Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -


Web Sites & Blogs :

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---
Google Map : Ram Karri

----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------