జ్ఞాపకల్లో పదిలమైన ఉత్తరం...


అమ్మా నాన్నలకు నా నమస్కారాలు .

నేను ఇక్కడ క్షేమం ,

మీరు క్షేమంగా ఉంటారని తలుస్తాను ..

అంటూ దూరంగా చదువుతున్న ఓ విద్యార్తి
తమ తల్లిదండ్రులకు రాసే ఉత్తరాన్ని చదివి

మురిసిపోయే తల్లిదండ్రుల
ప్రత్యుత్తరమూ వ్రాసి తమ బిడ్డనూ సంతోషపెట్టే ఆ ఉత్తరం ఎక్కడా కనిపించడంలేదు..

గతంలో ఈ ఉత్తరాల విప్లవం అంతా ఇంతా కాదు ,

ఉత్తరం ప్రతీ ఒక్కరికీ అనంతమయిన ఆనందాల్ని పంచిపెట్టేది .

బందాల నడుమ బలమయిన వారదిగా పనిచేసేది ..

గతంలో వ్రాసుకున్న ఉత్తర ప్రత్యుత్తరాలను దాచుకున్న వారు నేడు ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు .

ఓ ప్రేమికుడు తన ప్రేమను వ్యక్తపరచడానికి ఉత్తరం కంటే బలమయిన మార్గం మరొకటి ఉండదని చెప్పొచ్చు ..

అందుకే అప్పటి బందాలు చాలా గొప్పగా ,బలంగా ఉండేవి.

నాడు హాయ్ చెప్పడానికి ఎస్ ఏం ఎస్ లు లేవు .

మాటలు కలపడానికి సెల్ ఫోన్స్ లేవు ..

ఉన్న ఏకైక వారది ఉత్తరం మాత్రమే!!

రాసే ప్రతి అక్షరం ఎంతో విలువైనది అందుకే చెప్పాల్సినవి జాగ్రత్తగా పొందుపరిచేవారు..

ఉత్తరం చదువుతుంటే అప్పుడే అయిపోయిందా అని బాదపడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు..

అందుకే ఆ ఉత్తరాలను దాచుకున్న వారికి మధుర జ్ఞాపకాలను తెచ్చిపెడుతున్నాయి..

1879 లో బ్రిటిష్ వారు మన దేశంలో పోస్ట్ కార్డ్  ని పరిచయం చేశారు ..

అనంతరం ఈ ఉత్తరం దేశ వ్యాప్తంగా విస్తరించింది .

స్వాతంత్ర్యానంతరం ప్రజలకు మరింత చేరువ చేసింది.. భారత ప్రభుత్వం ..

అయిదు ఏళ్ల కిందటి వరకూ పాఠశాలలు ,కళాశాలలు ,వివిద కంపెనీలు ఉత్తరాలను హెచ్చుగా వినియోగించేవారు..

కానీ సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని తన బానిసగా మార్చేసుకుంది ..

ఎస్ ఏం ఎస్ లు ,ఈ మెయిల్స్, వాట్సాప్ ,ఫేస్ బుక్ తదితర ఆన్ లైన్ సమబందిత సేవలు ఈ సుదూరపు బాటసారిని కనుమరుగుచేశాయని చెప్పొచ్చు..

సాంకేతిక పరిజ్ఞానం ఎంత మార్పుని తీసుకువచ్చినా ,పోస్ట్ కార్డ్ జ్ఞాపకాలకు సాటి రాదని చెప్తున్నారు పోస్ట్ కార్డ్ కాలపు విద్యార్తులు కొందరు..

కాలము మార్పు ని తెచ్చి పెడుతోంది .

ఈ టెక్నాలజీ విప్లవం ప్రపంచాన్ని చాలా చిన్నదాన్ని చేసెసింది .

అందుకే పాత తరపు సేవలు కనుమరుగవుతున్నాయి..

కొత్తదనాన్ని వదలని ఈ ప్రపంచం పాత తరానికి వీడ్కోలు పలికింది..

మనకు ఎన్నో మధురానుబూతులు మిగిల్చిన ఆ ఉత్తరానికి ఒక్కసారి ధన్యవాదములు చేప్దాము.....

ప్రేమతో..
మీ రాంకర్రి..