ఏకాగ్రత లేకుండా ఏ పని చేసినా అది వృథా ప్రయత్నమే అవుతుంది. మెదడుకీ, శరీరానికీ మధ్య సమన్వయం కుదిరి, ఏకాగ్రతతోపాటూ జ్ఞాపకశక్తి పెంచేలా చేస్తాయీ వ్యాయామాలు. బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు వీటిని చేసి చూడండి మరి.

రోజురోజుకి కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, వాహనాల వాడకం పెరిగిపోయింది. దాంతో చాలామంది గంటల తరబడి మెడను సరైన స్థితిలో ఉంచకుండా.. మెడల్ని ఇష్టమైన రీతిలో వంచి మెడనొప్పి తెచ్చుకుంటున్నారు. దీనికి చెక్ పెట్టాలంటే ఈ ఆసనాలు ట్రై చేయండి..

వేడి తగలకుండా వ్యాయామం..
వ్యాయామం వల్ల మేలెంతో చెప్పక్కర్లేదు. కానీ వేసవి వస్తే చాలామంది వ్యాయామం విషయంలో తటపటాయిస్తుంటారు. అధికవేడి వల్ల చెమట ఎక్కువగా బయటకుపోయి.. నీరసం రావడం, చిరాగ్గా అనిపించడం ఓ కారణం. ఆ సమస్య రాకుండా ఇలా చేయండి..

ఆరుబయట చేసే పరుగూ, వేగవంతమైన నడక కంటే నీడపట్టున చేసే వ్యాయామాలకి ప్రాధాన్యం ఇవ్వండి. తప్పనిసరైతే ఉదయం ఎనిమిదిలోపు, సాయంత్రం ఆరుతర్వాతే నడకవంటి వ్యాయమాలు చేయండి. అప్పుడే ఎండ వేడి నుంచి తప్పించుకోగలుగుతారు. ముఖచర్మం ఆరోగ్యం కోసం కచ్చితంగా సన్‌స్క్రీన్‌లోషన్‌ రాసుకోండి.

వ్యాయామం కోసం ఎంచుకునే దుస్తులు శరీరానికి తగిన గాలినందించేలా ఉండాలి. చెమటని ఇట్టే పీల్చుకునేవై ఉండాలి. టీ షర్ట్‌లు, ట్యాంక్‌ టాప్‌లు, షార్ట్‌ల వంటివి చక్కగా సరిపోతాయి ఈ కాలానికి.

వ్యాయామం చేసేప్పుడు కచ్చితంగా నీళ్ల సీసా దగ్గర పెట్టుకోండి.
అలసట అనిపించినప్పుడు గటగటా తాగేయకుండా కొద్దికొద్దిగా చప్పరించండి చాలు.

నీళ్లు మరీ అధికంగా తాగితే.. ఎక్కుసార్లు మూత్రం పోవడం వల్ల శరీరంలో సోడియం నిల్వలు తగ్గిపోతుంటాయి. కాబట్టి నీళ్లకి ప్రత్యామ్నాయంగా పళ్లరసాలు, కొబ్బరినీళ్లు, ఎలక్ట్రోలైట్‌ సాల్ట్‌ వంటివి తీసుకోండి. శరీరం తాజాగా ఉంటుంది.


---------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -

Whatsapp : +918096339900 ,
Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -


Web Sites & Blogs :

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---
Google Map : Ram Karri

----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------