ఒక చిన్న కథ మీకోసం.
ఒకసారి యమధర్మరాజు విష్ణువునకు ప్రణామాలాచరించడానికి గాను వైకుంఠానికి వెళ్ళాడు.
అక్కడి ద్వారం దగ్గర హాయిగా ఉన్న ఒక చిలుక ని చూసి, ఆశ్చర్యంగా భ్రుకుటి ముడిచి, చిన్న చిరునవ్వుతో లోపలికి వెళ్ళాడు..
ఇదంతా గమనించిన గరుత్మంతుడు,యముని చూపు ఆ చిలుక మీద పడిందని, ఆ చిలుకకు ప్రాణాపాయం ఉందని, ఆ చిలుకని ఎలాగైనా కాపాడాలని, తలచి, ఆ చిలుకని మనోవేగంతో తీసుకుని వెళ్లి భూలోకంలో దాచి వచ్చి ,ఏమీ ఎరగని వానిలా కూచున్నాడు...
కొంత సేపు తర్వాత యముడు బయటకు వచ్చి,
అక్కడ చిలుక లేకపోవడం చూసి, గరుత్మంతుని ఆ చిలుక గురించి అడిగాడు..
దానికి, గరుత్మంతుడు జవాబిస్తూ,
“నీ చూపు పడిందిగా..అందుకే దాన్ని నీ చూపుకందని చోట దాచాను” అన్నాడు..
దానికి యమధర్మరాజు జవాబిస్తూ, ఆ చిలుకకి మరి కొద్ది సేపట్లో, భూలోకంలో, ఒక మర్రి చెట్టు తొఱ్ఱ లో ఉన్న ఒక పాము కి ఆహారం కాబోయే కర్మ రాసిపెట్టిఉంది… అలాంటి ఆ చిలుక, ఇక్కడ వైకుంఠ ద్వారం దగ్గర, ఇంత క్షేమంగా ఎలా ఉందా అని నేను ఆశ్చర్యపడ్డాను.. ఇంతకీ దానిని ఎక్కడ దాచేవూ… అని అడిగాడు…
అయ్యో… నేను దానిని ఆ మర్రిచెట్టు తొఱ్ఱ లోనే ఉంచి వచ్చేను….అన్నాడు, గరుత్మంతుడు….
......విధినెవ్వరూ తప్పించలేరు......------------------------------------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.
--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --

Whatsapp : +918096339900 ,

Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --

Web Sites & Blogs :


--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --
Google Map : Ram Karri


---------------------------------------- సమాప్తం --------------------------------