పాతికేళ్ళక్రితం ఎవరైనా ఆత్మీయులు, అతిధులు  కనపడితే... ❗

"ఎలా వున్నావు..?   ఎక్కడుంటున్నావు.?

వేళకు తింటున్నావా.?

ముందు ఈ మంచినీళ్ళు త్రాగు.. కుర్చీలో కూర్చో"

అంటూ  మమకారం నిండిన
మంచి మనసు తో మనస్ఫూర్తి గా పలకరించేవాళ్ళు...

ఎంతైనా...

old days is Golden Days


కానీ...

నేటి ఈ కలికాలం లో ఎవరైనా ఆత్మీయులు కనపడగానే అడిగే మొదటి ప్రశ్నలు...

" ఏం చేస్తున్నావు... ?"

" నెలకెంత సంపాదిస్తున్నావు ?"

"ఉమ్మడి కుటుంబమా... ?

వేరే కాపురమా... ?"

ఇవన్నీ కనుక్కున్నాక...

ఆ వ్యక్తి ప్రయౌజకుడైతే భవిష్యత్లో  ఆ వ్యక్తి ద్వారా లాభం వుందనే నమ్మకం కుదిరిన తర్వాతనే  కుర్చీ వేస్తున్నారు. కూర్చోబెడుతున్నారు.

అతిధి మర్యాదలు చేస్తున్నారు.

ఎదుగుదల అంటే ఇదేనేమో..?!

కేవలం పాతికేళ్ళలోనే మనిషి జీవన శైలి లో ఇంత మార్పు వచ్చేస్తే...

రానున్న రోజుల్లో... క్రమక్రమంగా వైరస్ లాగ పెరుగుతున్న ఈ స్వార్ధం అనే జబ్బు వల్ల సమాజం లో...

ఆనాటి కాలం నుండి అనాదిగా వస్తున్న  నైతిక విలువలు అదృశ్యమవ్వడం ప్రత్యక్షం గా చూడాల్సిన దుస్ధితి మనకూ, మన పిల్లలకూ వస్తుందేమో... ❓

అదే నిజమైతే.
మనీ కే విలువిచ్చి "మర మనుష్యుల్లా అవుతామేమో... ❓
 అంతే కదా...