ఒక దంపతులకు చాలా ఏండ్లవరకు పిల్లలు
కలుగలేదు.ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా ప్రయోజనం
లేకుండా పోయింది.......బాధను కొంచెం అయినా
తగ్గించుకోవచ్చని........వారి స్నేహితుల ఇంట్లోనుండి
అప్పుడే పుట్టిన కుక్కపిల్లనొకదాన్ని తెచ్చుకుని పసిబిడ్డలా
చూసుకున్నారు......ఆ కుక్క కూడా వారిని వొదిలి ఉండేది
కాదు.....
కొద్దిరోజులకు వీరికి ఏ దేవుడు కరుణించాడో సంతానం
కలిగింది....పుట్టిన బిడ్డను
చూసుకుంటూ కుక్కను బాగా నిర్లక్ష్యం చేశారు.........
పాపం కుక్క చాలా బాధతో వారు పిల్లవాడి దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి
తనను పట్టించుకోవడంలేదని బాగా మొరిగేది బాధతో.......
కానీ ఆ దంపతులు ఆ కుక్క తమ బిడ్డమీద ఈర్షతో అలా
అరుస్తుందని అనుకునేవారు.
ఒకరోజు ఆ దంపతులు ఇద్దరూ వారి బిడ్డను ఉయ్యాలలో
పడుకోబెట్టి మేడమీదికి వెళ్ళారు....కాసేపటికి కుక్క విపరీతంగా
అరవడం గమనించి వచ్చి చూశారు.......
ఇంటి గుమ్మం దగ్గర కుక్క నోటినిండా రక్తాన్ని
చూసి........తమ బిడ్డను ఈర్షతో
చంపేసిందన్న కోపంతో ఇంట్లోకి వెళ్ళి తమ తుపాకీతో ఆ
కుక్కను కాల్చి చంపేశారు......
ఇంతలోపల పిల్లవాడి ఏడుపుచూసి రూంలోకి వెళ్ళి చూసి బిడ్డ
క్షేమంగా ఉయ్యాలలోనే ఉండటం చూసి సంతోషంగా
బిడ్డవద్దకు చేరుకున్నారు...
బిడ్డ ఉయ్యాలకింద రెండు పాములు రక్తపు మడుగులో
పడి చనిపోయి ఉన్నాయి...
వారికి పరిస్థితి అర్థమైంది.......తన బిడ్డకు కీడు జరగకుండా
ఆ కుక్క వాటితో పోరాడి చంపేసిందని.....అది తెలుసుకుని ఆ
దంపతులు విపరీతంగా ఏడ్చి,,,,,తమ తప్పును
తెలుసుకున్నారు......కోపం మనిషిని ఎలా దిగజారుస్తుందో
తెలుసుకోవడానికి ఇంతకంటే నిదర్శనం అవసరంలేదు కదా!
మనుషులకు ఇలాంటి పగ,ఈర్ష ఉంటాయికానీ నోరులేని జీవాలకు
కాదని తెలుసుకుందాం.............కోపాన్ని పక్కకు పెట్టి ప్రేమగా
ఉండండి... మనుషులు మనుషులగా బతుకుదాం .

🏵️లోకా సమస్తా సుఖినోభవంతు🏵️