మన ఎదుటి వారు చెప్పేది నిజామా అబద్దమా తెలుసుకోడానికి 12 మార్గాలు :


12. వారి కళ్ళు

మనుషులు ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు చూపులు కలవడం చాలా సహజం. కానీ మనిషి అబద్దం చెప్పేటప్పుడు ఐతే అదేపనిగా కళ్ళలోకి చూస్తూ ఉంటారు లేకపోతే అసలు కళ్ళలోకి చూడకుండా దిక్కులు చూస్తూ మాట్లాడతారు. అలా కళ్ళలోకి చూస్తూ అబద్దం చెప్పడం చాలా కష్టం. కాబట్టి ఈసారి వారి కళ్ళని గమనించడం మర్చిపోవద్దు.11. గుటకలు మింగడం

మీరు పిల్లలు చూసే కార్టూన్లు చూస్తారా? అందులో అవి ఏమైనా ప్రమాదంలో ఉన్నప్పుడు గట్టిగా వినిపించేలా గుటకలు మింగినట్టు చూపిస్తారు. మనుషులు కూడా అంతే. అబద్దాలు చెప్పేటప్పుడు గుటకలు మింగడం, దగ్గడం లాంటివి చేస్తారు. అబద్దం చెప్పడం వల్ల మనలో టెన్షన్ వస్తుంది. అది పైకి కనపడనీయకుండా ఇలా చేస్తారు.10. తల

అబద్దం చెప్పే అప్పుడు మనిషి తను చెప్పే మాటకి విరుద్దంగా తలని ఊపుతాడు. అవును అన్నప్పుడు కాదు అన్నట్టు, కాదు అన్నప్పుడు అవును అన్నట్టు, సంబంధం లేకుండా తల ఊపుతారు. అంతే కాకుండా తల ఊపడానికి ముందు కాస్త తటపటాయిస్తుంటారు. అబద్దం చెప్తున్నామనే కంగారు వల్ల ఇలా జరుగుతుంది.9. ముక్కు

అబద్దాలు చెప్పే అలవాటు ఉన్నవాళ్ళకి కొన్ని వింత అలవాట్లు కూడా ఉంటాయి, ఉదాహరణకి వారు అబద్దం చెప్పే అప్పుడు తరచూ ముక్కుని గోకడం చేస్తారు. ఇలాంటి అలవాట్ల వల్ల అబద్దం చెబుతున్నారని మనం తెలుసుకోవచ్చు.8. నోరు

అబద్దం చెప్పాలనుకున్నపుడు మనుషులు తెలియకుండానే నోరు మూసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకరకంగా మన మెదడు మనల్ని అబద్దం చెప్పకుండా ఆపుతున్న సంకేతం అది. నోరు గట్టిగా మూసుకోవడం, పెదాలు కొరుక్కోవడం, పెదాలు గట్టిగా బిగించి పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు గమనించండి.7. ముఖ కవళికలు (Expressions)

ఒక్కోసారి మన ముఖంలో చిన్న తేడాతో మనం నిజం చెప్తున్నామా అబద్దం చెప్తున్నామా ఇట్టే కనిపెట్టేయచ్చు. ఓ చిన్న మార్పు. కనుబొమ్మలు పైకి ఎత్తడం లాంటివి. ఆ చిన్న మార్పుని గమనించండి. అబద్దం చెప్పేవారికి తప్పకుండా భయం ఉంటుంది. భయాన్ని ముఖంలో కనపడకుండా చేయడం చాలా కష్టం. కాబట్టి వారి ముఖంలో భయం కనపడుతుందో లేదో చూస్తూ ఉండండి.6. ఊపిరి 

అబద్దం చెప్పే వారు అప్పుడే పరిగెత్తినట్టు ఆయాసపడుతూ ఉంటారు. వేగంగా గాలి పీల్చడం చేస్తారు. ముందు చెప్పినట్లు మనలోని భయం దీనికి కారణం.5. చెప్పిందే చెప్పడం

వారు చెప్పిన అబద్దాన్ని ఎలా అయినా నమ్మించాలని చెప్పిందే మళ్ళి మళ్ళి చెబుతూ ఉంటారు. మామూలుగా మాట్లాడినట్లు కాకుండా చాలా విపులంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు.
4. గొంతు

వేగంగా మాట్లాడడం, లేకపోతే చాలా నెమ్మదిగా మాట్లాడడం కూడా అబద్దం చెబుతున్నారు అన్నదానికి సంకేతాలే.ఈ చిన్న చిన్న గుర్తులతోనే అబద్దాలు ఆడేవారిని పట్టుకోవచ్చు.
3. ఎక్కువ చేసి చెప్పడం.

సాధారణంగా ఒక అబద్దం చెప్పాకా దాన్ని కప్పిపుచ్చుకోడానికి ఏవేవో కల్లబుల్లి మాటలు చెప్తారు. ఉన్నవి లేనివి అన్ని కలిపి మీలో ఆశ్చర్యం కలిగించి అసలు విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు.2. చేతులు

మాములుగా మాట్లాడేటప్పుడు మన చేతులు అంతగా చురుకుగా ఉండవు. అదే అబద్దం చెప్పేటప్పుడు మాత్రం రకరకాలుగా చేతులు ఊపుతూ ఉంటారు. అంతే కాకుండా పైన చెప్పినట్టు ముక్కు, నోరు, చెవులు గోక్కుంటూ ఉంటారు. ఇవన్నీ మనిషి ఒత్తిడిలో ఉన్నాడు అని చెప్పడానికి సంకేతాలు. అబద్దం చెప్పేటప్పుడు సాధారణం కంటే అధిక ఒత్తిడిలో ఉంటారు.1. తప్పించుకోడానికి చూడడం

సాధారణంగా మాట్లాడే సమయంలో మన ఎదుటి వ్యక్తులతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఎక్కువ సేపు మాట్లాడాలంటే దగ్గరగా ఉండాలి కాబట్టి అబద్దం చెప్పే వ్యక్తులు త్వరగా వారు ఉన్న ప్రదేశం నుండి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. మాటలు పొడిగించకుండా వారు చెప్పాలనుక్కున్నది చెప్పేసి వెంటనే అక్కడనుండి వెళ్ళిపోతారు. 
చూసారుగా మిత్రులారా అబద్దం చెప్పే వ్యక్తుల హావ భావాలని మనం గమనించి వారి మోసం నుంచి మనల్ని మనం కాపాడుకోడానికి ఈ వ్యాసం రాసాను. 

మీకు ఈ పోస్టు నచ్చితే మీ స్నేహితులకి తప్పకుండా షేర్ చెయ్యండి.