🎋 ఆమె 🎋

★★★★★★★★★★★

ఆమెకు నేను ముద్దుగా పెట్టుకున్నపేరు"అమ్మ". ఆమె ఒక చెల్లెలుగా,
అక్కగా,అమ్మగా బహుముఖ పాత్రలు పోషిస్తూ విరామం,విశ్రాంతి లేక ఆమె కుటుంబానికి  కష్టపడే తీరు వర్ణనాతీతం!
ఆమె నువ్వు పెరగడానికి తన గర్భస్థానాన్నేఇచ్చింది.
కానీ ఆమె ఉండడానికి నీ ఇంట ఓ చీకటి గది కూడా ఇవ్వలేవా?ఆమె కష్టం గురించి చెప్పడానికి డిక్షనరీలలో ఉన్న పదాలు చాలవు.అయినా ప్రయత్నించి చూద్దాం!

"ఆమెకి కావలసినంత టైం తీసుకోనివ్వండి.ఆమె తాగే కప్పు కాఫీ అయినా హాయిగా తాగ నివ్వండి.తన వాళ్ళ కోసం ఎన్ని నిద్ర లేని రాత్రిళ్ళు కష్టపడి ఉరుకు పరుగులతో అందరిని రెడీ చేసి కూర్చున్న ఆమెను కాసేపు అలాగే ఉండనివ్వండి.

బయట హోటలుకు వెళ్లినప్పుడు ఆమెకు నచ్చినవి ఆర్డర్ చెయ్యనివ్వండి.రోజు ఇంట్లో అందరికి ఇష్టమైనవి ఆమె వండినప్పుడు ఒక్క
రోజైనా తనకు నచ్చింది
వండుకుందామని ఆమె
ఆలోచించలేదు కదా!

బయటకి వెళ్ళేటప్పుడు
తయారవ్వడానికి ఆమెకి
కావలసినంత సమయం
తీసుకోనివ్వండి.తన భర్త,పిల్లలు అందరూ
బాగా కనిపించాలని బట్టలు ఇస్త్రీ చేసి సమయానికి సమకూర్చలేదా?

టీ.వి చూసే పది నిమిషాలు
అయినా ఆమెకి నచ్చినది చూడనివ్వండి.అయ్యో!అతనికి,పిల్లలకి డిన్నర్ టైం అయ్యిందేమో!అత్తగారికి మందులు ఇచ్చే టైం అయ్యిందేమో!ఇదే ధ్యాస కదా ఆమెకి..!!

ఎంత లేటు అయినా మనకి మాత్రం రుచిగా చేసి వడ్డిస్తుంది కదా!తను మాత్రం మాడిన అట్లు,మన చేత తిట్లు తింటుంది కదా!టీ తాగాక కాసేపు అన్ని మరచి హాయిగా కిటికీలోంచి బయట ప్రపంచాన్ని చూస్తూ తనని తాను మరిచిపోనివ్వండి.

ఎన్ని సాయంత్రాలు తన వారి కోసం కేటాయించలేదు.ఆమె ఎన్ని పగళ్లు,ఎన్నెన్ని రాత్రుళ్ళు నిద్ర ,తిండి మాని
సేవ చేయలేదు.తన కోసం జీవితంలో ఆ మాత్రం సమయం మనం ఇవ్వడం
సబబే కదా!అవునంటారా?కాదంటారా?

కాబట్టి మిత్రులారా!ఆమె
నిరంతరం శ్రమిస్తూ..!
రవి అస్తమించినా ఆమె పనులనుండి నిష్క్రమించదు.మనం మాత్రం ఏ.సి.గదులలోన పట్టె మంచంపై పరుండి,ఆమెను మాత్రం చలికి గజ,గజ వణికిస్తూ ఆరుబయట పరుండబెడుతున్నాం!కన్నందుకు చింతిస్తూ ఏమి చేయలేని దుస్థితి!ఎవరికి మొరపెట్టుకోలేని పరిస్థితి!ఆమె(తల్లి)పాల రుణం తీర్చుకోలేని పిల్లల్ని ఏమందాం?ఆమె ఒడిలో నిద్ర పోయిన అనుభూతులను జ్ఞప్తికి తెచ్చుకో..!ఆమెను బాగా చూసుకో..!

  (ఆమె పాదములకు
          పాద్యం అర్పిస్తూ..!)

    "శతకోటి నమస్సులతో..."

మీ రాంకర్రి


- స్వస్తి