డాక్టర్లు వ్రాసే కోడ్స్ అర్ధాలు చూడండి... (Common Abbreviations) || Ram Karri
మనం ఎంత తిన్నా ఏమి చేసిన ఆరోగ్యం గురించి బాగా ఆలోచిస్తాం, చిన్న తలనొప్పి వచ్చినా తట్టుకోలేము. మనకి జలుబు చేసినా… లేదా ప్రాణాంతకమైన జబ్బు చేసినా డాక్టర్లను సంప్రదిస్తాం.. అప్పుడు వారు రాసే రాత చాలా సార్లు మనకు అర్ధం కాదు… కనీసం మందుల షాపు వారికైనా అర్ధమవుతుంది.. అది చాలు కదా!!
కానీ డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ లో కొన్ని కోడ్స్ ఉంటాయి.. Rx అని.. Hx అని.. ఇలా ఎన్నో కోడ్స్ ఉంటాయి. వాటిని ఎప్పుడైనా గమనించారా? పోనీ… వీటికి అర్ధం ఏంటో మీకు తెలుసా? మందుల షాపు వాడికి తెలిస్తే చాలదా అంటారా? మనం కూడా తెలుసుకుంటే మంచిదే కదా…
☞ Rx = Treatment (చికిత్స)
☞ Hx = History (చరిత్ర)
☞ Dx = Diagnosis (నిర్ధారణ)
☞ q = Every (ప్రతి)
☞ qd = Every day (ప్రతి రోజు)
☞ qod = Every other day (ప్రతి ఇతర రోజు)
☞ qh = Every Hour (ప్రతి గంట)
☞ S = without (లేకుండా)
☞ SS = One half (సగం)
☞ C = With (తోడు)
☞ SOS = If needed (అవసరమైతే)
☞ AC = Before Meals (భోజనానికి ముందు)
☞ PC = After meals (భోజనం తరవాత)
☞ OD = Once a Day (రోజుకి ఒక్కసారి)
☞ BID = Twice a Day (రోజుకి రెండు సార్లు)
☞ TID = Thrice a Day (రోజుకి మూడు సార్లు)
☞ QID = Four times a day (రోజుకి నాలుగు సార్లు)
☞ BT = Bed Time (పడుకునేటప్పుడు)
☞ hs = Half Strength or Bed Time (సగం లేదా పడుకునేటప్పుడు)
☞ BBF = Before Breakfast (అల్పాహారం తినే ముందు)
☞ BD = Before Dinner (రాత్రి భోజనం తరువాత)
☞ Tw = Twice a week (వారానికి రెండు సార్లు)
☞ SQ = sub cutaneous (చర్మం కింద)
☞ IM = Intramuscular (కండరాలలో)
☞ ID = Intradermal (చర్మం లోపల)
☞ IV = Intravenous (నరాల లోపల)
☞ QAM = (every morning) (ప్రతి ఉదయం)
☞ QPM (every night) (ప్రతి రాత్రి)
☞ Q4H = (every 4 hours) (ప్రతి 4 గంటలకు)
☞ PRN = (as needed) (అవసరమైనప్పుడు)
☞ PO or “per os” (by mouth) (నోటి ద్వారా)
☞ Mg = (milligrams) (మిల్లీ గ్రాములు)
☞ Mcg/ug = (micrograms) (మైక్రో గ్రాములు)
☞ G or Gm = (grams) (గ్రాములు)
☞ 1TSF ( Teaspoon) = 5 ml (ఒక చెంచా)
☞ 1 Tablespoonful =15ml (టేబుల్ స్పూన్ నిండా)