.................. ............... .............. ............ .............. ............. ................... ............... .............. ............ ............
✍
✍
నేటి ఓర్పే రేపటి మార్పు..
ఓర్పు లేనిదే మార్పు రాదు.
✍
ఇష్టంతో చేసే పనికి కష్టంతో చేసే పనికి చాలా తేడా ఉంది.. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే అందరి బతుకులు బంగారమే...
✍
మగవాడిగా సంపాదించడం నేర్చుకున్నాం. ఆ సంపదతో ఎన్ని పాపాలు అయిన పరిష్కారం చేయొచ్చు అనుకుంటాం. కానీ మన తప్పులు, పాపాలు భరించి , సహించి ఎప్పటికప్పుడు మనల్ని మంచి మార్గంలో నడిపించాలని ఇంటిని స్వర్గం చేసుకోవాలి అని తాపత్రయ పడతారు స్త్రీలు... కల్మషం లేని మధురమైన మనసులు స్త్రీల మనసులు..
✍
#సముద్ర స్నానం ఎప్పుడు
అలల మధ్యనే చేయాల్సివస్తుంది.
#సంసారం ప్రయాణం ఎప్పుడు
సమస్యలు ఆటంకాల మధ్య వెళ్లాల్సి వస్తుంది...
#అలలు ఆగిన తరవాత
స్నానం చేద్దాం అనుకోవడం...
#సమస్యలు తీరిన తర్వాత
హాయిగా ఉందాం అనుకోవడం...
వింత , భ్రమ అని కూడా అనవచ్చు"
✍
#బ్రతుకు నవ్వులట కాదు.
నవ్వుతూ అదే అందమైన ఆట.
బ్రతుకులో నవ్వలేని వాడు.
నగుబాట్లకు గురి అవుతాడు.
నవ్వలేని ప్రతిక్షణం మరణం.
నవ్వుతూ బ్రతికే క్షణమే జీవనం.
✍
చీకటి వెలుగులు
ప్రకృతిని విడిచిపోతాలేవు
సుఖదుఃఖాలు మనిషిని
విడిచి పెట్టి పోతాలేవు.
✍
#మొగ్గ మొక్కను పట్టుకొని
కూర్చుంటే చాలు అదే
ఒకరోజు పువ్వై వికాశిస్తుంది..
ఒక పిందె చెట్టుకు పట్టుకొని
కూర్చుంటే చాలు అదే ఒకరోజు
మధురమైన ఫలం అవుతుంది..
#సాధకుడు కూడా తాను
ఎంచుకున్న పని ఏదన్నా సరే
ఓర్పుతో , సహనంతో చేసుకుంటే
తప్పక విజయం సాధిస్తాడు....
✍
మొదట మొగ్గ తొడిగే దశ నుండి
అమ్మని ఆరాధించే గుణం మన దగ్గర ఉంటే...
అక్కని అభిమానించే తత్వం మన సొంతమైతే..
చెల్లిని ప్రేమించే స్వభావం మనలో ఉంటే..
తరువాత స్త్రీ ఎవరు కనిపించిన తప్పక అమ్మ అనే భావన తప్పక మనలో వస్తుంది....
✍
పద్మవ్యూహంలోకి దిగాక
జాలిపడి ప్రయోజనం లేదు
మిత్రమా...
ఎందుకంటే నీ జాలిని ఎదుటివారు
మొదట ఉపయోగించుకుంటాడు ,
ఆ తర్వాత చేతకాని వాడిలా
చిత్రీకరిస్తాడు.
యుద్ధం తధ్యం అని తెలిశాక ఒక్క
అడుగు కూడా వెనక్కి వేయకూడదు....
✍
చీకటి చీకటి అని పదివేల సార్లు మొత్తుకున్నా చీకటి పారిపోదు.. పోవాలంటే దీపం వెలిగించాలి...
జీవితం కూడా అంతే సమస్యలు సమస్యలు అంటే ఎంత మొత్తుకున్నా లెక్కకు రాదు...
కష్టాన్ని ఇష్టారీతిలో మార్చి సమస్యను తరిమేయ్యాలి...
✍
ఊట సెలిమేలో పుష్కలమైన నీరు
ఎలా ఊరుతుందో...
మన హృదయంలో కూడా స్వచ్ఛమైన
ప్రేమ ఊరుతుండలి..
నీరు ఊరినప్పుడే సెలిమేకందం..
ప్రేమ కలిగినప్పుడే మనిషికందం....
నిజమేగా నేస్తమా..
✍
మది అనే నదిలో
మతితప్పిన ఒకే ఒక్క
మలినమైన ఆలోచన...
మదిని మాత్రమే కాదు...
ఒక మనిషి జీవితాన్నే
నాశనం చేస్తుంది జాగ్రత మిత్రమా
✍
కాలాన్ని వాడుకోవాలే గాని ,
కాలంతో అడుకోకూడదు. వాడుకలోనే ఉంది కదా అందమైన అద్భుతమైన వేడుక...
✍
నేటి ఓర్పే రేపటి మార్పు..
ఓర్పు లేనిదే మార్పు రాదు.
✍
ఓనా ప్రియనేస్తమా...
ఎందుకు అంత కంగారు.!
మూసిన ప్రతి తలుపు తాళం వేసి లేదు.!!
వెళ్లి నెట్టి చూడు....!!!
✍
జీవితం మీద అవగాహన వస్తే..
మొత్తం గెలుపు మలుపులు కలిపిస్తాయి...
జీవితం మీద అవగాహన లేకపోతే...
గెలుపు ఓటములు కనిపిస్తాయి...
✍
ఎవరినీ చేయి చాచనివాడు.
ఎలాంటి పరిస్థితి లోనూ ధైర్యాన్ని
వీడనివాడు.
ఉన్నంతలో తృప్తి పడేవాడు.
తనచుట్టూ ఉన్నవారిని సంతోషంగా
ఉంచగలిగినవాడే అధిక సంపన్నుడు..
✍
ఒక #స్త్రీ పరాయి మగాడితో
మాట్లాడినంత మాత్రాన
స్త్రీ యొక్క #పతివ్రత తనానికి ,
మన ధర్మానికి భంగం కలగదు.
✍
#కోకిల మనకి కిరీటం పెట్టలేదు.
#కాకి మన సొత్తు కాజేయలేదు
#నోరు మంచిదైతే #ఊరు మంచిగా
ఉంటుంది. ఎవరి విలువ వారిది..
✍
#నలుపు ఉంటేనే 👉 తెలుపుకి విలువ.
#ఓటమి ఉంటేనే 👉 గెలుపుకి విలువ.
#ఏడుపు ఉంటేనే 👉 నవ్వుకి విలువ.
#కష్టం ఉంటేనే 👉 సుఖానికి విలువ.
#నష్టం ఉంటేనే 👉 లాభానికి విలువ.
#చీకటి ఉంటేనే 👉🏼 వెలుగుకి విలువ.
గమనించు మిత్రమా మొదటిది
లేకుంటే రెండవ దానికి విలువ లేదు.
✍
ప్రేమను కామం మీద పెడితే
#సంతానం పెరుగుతుంది.
ప్రేమను సేవాలపై పేడితే
#సంతోషం పెరుగుతుంది
✍
ఓపిక , సహనం లేనటువంటి ఒక వ్యక్తి
తన జీవితంలో ఏ రంగంలోను విజయాన్ని సాధించలేదు...
✍
ఆకాశంలో పక్షుల బారులు , భూమి మీద చీమల బారులు ఎంతటి క్రమశిక్షణతో పయనిస్తుంటాయ్ తెలుసా. వెనకబడిన వాటిని తమతో కలుపుకుంటూ , చేదిరిపోయిన వాటిని చేరదీసుకొని ముందుకు పోతుంటాయి.
మనుషులు ప్రేమతో, సహకారంతో మెలిగితే ఎంత బావుంటాదో కదా.ఇలా చేస్తే లోకంలో నా లాంటి అజ్ఞానులకి లోకం తెలుస్తది...
✍
పంజరంలో బందిగా ఉండమని ఎవరు చెప్పారు
కానీ
అలిసిపోయే వరకు సున్యంలో అడవద్దని చెప్తారు...
✍
రాజకీయాల్లో అన్యాయం అనాదిగా జరుగుతుంది కానీ అది అనంతం మాత్రం కాదు. మనం ఎదురుతిరిగిన రోజునే అది చేదిరిపోతుంది.. అంత వరకు మనది గింతే గతి...
సామాన్యులము మనం ఏమి చేయగలం అనుకోకండి మిత్రమా. అనుకోవాలే గాని అసాధ్యం అంటూ లేదు మిత్రమా...
✍
#పాలు కాచి పది రోజులు
ఉంచిన గాని #పెరుగు కాదు.
#తోడు ఖచ్చితంగా కావాలి.
#జీవితం లో కూడా మనకి
సిరిసంపదలు , ఎన్ని ఉన్న
జీవితం పరిపూర్ణం కాదు
#జోడుగా ఓ తోడు ఖచ్చితంగా
కావాలి మిత్రమా...
✍
#పాలుగా ఉన్న
నువ్వు పెరుగులా కావాలన్న గానీ
#గురువు అందుంచే తోడు
చుక్కలను నువ్వు ఆస్వాదించాలి
✍
ఒక పని మొదలు పెడితే
తప్పక పూర్తి చెయ్యాలి. మిత్రమా..
కష్టం అని ఈ పనిని వదిలేస్తే రేపు
ఎంచుకున్నది దీనికన్నా కష్టం ఉంటది.
అప్పుడేమి చేస్తావు మిత్రమా...
✍
మిత్రమా
నువ్వు ఏదైనా సరే
ఒక పనిని ఎంచుకొని 21 రోజులు
సక్రమంగా చేసినట్లు అయితే
అది ఒక అలవాటుగా మారుతుంది.
మంచి అలవాటు అయిన సరే.
చేదు అలవాటు అయిన సరే.
✍
గురువు ఒక విషయం
గురించి సమాచారం ఇస్తాడు
ఆ సమాచారం వల్ల
ఒక అవగాహన వస్తుంది.
ఆ అవగాహన ఒక
ఆలోచనకి దారి తీస్తుంది.
ఆ ఆలోచనలే
చేతలుగా మారుతాయి.
ఆ చేతలూ గా కొనసాగితే
దానినే అలవాటు అంటారు.
ఆ అలవాటు దృక్పథంగా మారి
విజయానికి దారి తీస్తుంది.
✍
#అలవాటు అంటే లాభనష్టాలతో
సంబంధం లేకుండా పదే పదే చేస్తామో
దానినే అలవాటు అంటాము
✍
#ముక్తి దొరకాలి అంటే
భక్తిలో లీనమై పోవాలి...
జీవితంలో గెలవాలి అంటే
చేసే పనిలో లీనమై పోవాలి
✍
ఉరుములు మెరుపులు
వర్షం వచ్చే వరకే ఉంటాయి..
ఎన్నికల ముచ్చటకి వస్తే..
అంత గెలుపోటములు
తెలిసే వరకే మిత్రమా...
✍
ఈ లోకంలో అందరూ
#మంచివాళ్లే
#చెడ్డవాళ్ళు ఎవ్వరు లేదు.
వచ్చే సందర్భాలు మానవులను
మంచివాళ్ళు , చెడ్డవాళ్ళుగా
చేస్తున్నాయి.. మిత్రమా..
✍
సృష్టిని క్లుప్తంగా దృష్టితో చూస్తే
అంత అద్బుతమే....
కాదు కూడదు అంటే అది మన దృష్టి లోపం....
అంతే గాని అది సృష్టి లోపం కాదు...
✍
విత్తనం ఒకటి వేసినప్పుడు
మొక్క కూడా అదే వస్తది...
మిత్రమా...
గొప్పగా ఆలోచిస్తే గొప్పోడివి
అవుతావు...
లేదు కాదు కూడదు అంటే
ఇంకా అంతే... గుర్తించుకో నేస్తమా...
✍
మించి పోయిన కార్యానికి
చింతించిన ఫలము లేదు...
✍
అసలు #అందం అంటే
ఏమిటో తెలుసా....
ఉపయోగకరమైన ప్రతిది
అందమైనదే తెలుసుకో...
✍
ఊట సెలిమేలో
పుష్కలమైన నీరు
ఎలా ఊరుతుందో...
మన హృదయంలో
కూడా స్వచ్ఛమైన
ప్రేమ ఊరుతుండలి..
నీరు ఊరినప్పుడే సెలిమేకందం..
ప్రేమ కలిగినప్పుడే మనిషికందం....
నిజమేగా నేస్తమా.....
✍
గడ్డి పరక అని తక్కువ
చూడకు మిత్రమా...
ఏ మైదానాన్ని అయిన ,
ఏ తోటనైనా , ఏ కొండనైన ,
ఏ కొననైన కనుల పండగ
అలంకరించేది ఇదే.... గడ్డి పరక...
✍
ఆవు నుండి పాలు మాత్రమే
రావాలి. పేడ రాకూడదు
అంటే కుదరదు.
పాలు రావాలంటే మేత మెయ్యాలి.
అది జీర్ణం అయిన తర్వాత. పాలు వస్తాయి..
జీవితం కూడా అంతే.. మిత్రమా..
సుఖం కావాలి అనుకుంటే
మొదలు కొంచం కష్టం వస్తుంది.
✍
మన చేతిలో లేని క్రొత్త
దాని కోసం ఉన్న విలువైన
దానిని పోగొట్టుకోవద్దు...
సమయాన్ని అయిన గాని
సందర్భమైన గాని...
✍
నువ్వు ఖర్చు చేసే దానిలో
పదో వంతు అయిన పక్క
పొదుపు చెయ్యాలి...
లేదంటే ఆర్థికంగా రేపటి రోజు
దెబ్బ పడుతుంది...
ఈరోజు నువ్వు జాగ్రత పడితే
ఇదే జాగ్రత నిన్ను మెరిసేలా చేస్తుంది...
✍
జీవితంలో ప్రతి ఒక్కరికి
ఎన్నో లక్ష్యాలు ఉంటాయి.. కానీ
వాటిని సాధించే క్రమంలో
సమాజం నుంచి ఎన్నో విమర్శలు
కూడా ఎదురు పడతాయి....
మన లక్ష్యం పైన శ్రద్ద ఉంచి ,
మిగతావి అన్ని పక్కన పెట్టి
శ్రమ పడితే ఖచ్చితముగా
లక్ష్యం చేరుకోవచ్చు....
✍
ప్రతి రాయిలో దేవుణ్ణి చూడొచ్చు..
ఎప్పుడంటే ఒక శిల్పి తలచినప్పుడు
✍
జీవితంలో పది మంది
పది రకాలుగా మన జీవితాన్ని
వాళ్లే కానీ ఎవరెంత చెప్పిన
నీకు ఏదైతే ఇష్టమో దేనిపైన
అయితే దృష్టి పెడతావో....
అందులోనే పరిపూర్ణత పొందగలవు..
✍
చేదు పువ్వుల నుండి కూడా
తియ్యని తావిని చేదుకునే
తేనెటీగలా మంచిని
గలించి పట్టుకోవాలి.
బుద్దిలో స్థిరంగా
పెట్టుకోవాలి.అప్పుడే
#జీవితానికి అందం.
#జీవికి మకరంధం
✍
మనిషి లో #అహం తగ్గిన రోజు
ఆప్యాయత అంటే ఎంటో అర్థమవుతుంది.
#గర్వం పోయిన రోజు ఏదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది.
#నేనే, నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండి పోవల్సివస్తుంది.
#గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం....
✍
#అద్దం ప్రతిబింబాన్ని
చూపేడుతుంది
#ఆశయం మనస్సును
చూపేడుతుంది
చూసుకో మిత్రమా అద్దాన్ని....
తెలుసుకో నేస్తమా మార్గాన్ని..
✍
ఇంటిని శుభ్రంగాను,
వంటను భద్రంగాను ,
భర్తను గౌరవంగాను ,
సంతానాన్ని సవ్యంగాను..
అనుసరించేది పెంచేది
అసలు సిసలైన #ఇల్లాలు...
✍
#సముద్ర స్నానం ఎప్పుడు
అలల మధ్యనే చేయాల్సివస్తుంది.
#సంసారం ప్రయాణం ఎప్పుడు
సమస్యలు ఆటంకాల మధ్య వెళ్లాల్సి వస్తుంది...
#అలలు ఆగిన తరవాత
స్నానం చేద్దాం అనుకోవడం...
#సమస్యలు తీరిన తర్వాత
హాయిగా ఉందాం అనుకోవడం...
"అనేది వింత భ్రమ అని కూడా అనవచ్చు"
✍
#మొక్క మొదళ్లను వదిలేసి కొనలకు
నీళ్లు పోస్తే ప్రయోజనం లేనట్టే....
#ఇంట్లో జన్మనిచ్చిన అమ్మ ని పెట్టుకొని
గుళ్లు గోపురాలు తిరిగితే ప్రయోజనం లేదు...
✍
ఎపుడైనా గుర్తు పెట్టుకో మిత్రమా..
కాకూడదు అనుకున్నది
ఎప్పుడు కాకుండా ఆగిపోదు...
రాకూడదు అనుకున్నది
ఎప్పుడు రాకుండా ఉండిపోదు....
✍
#శ్రద్ద చూపే ప్రతి వ్యక్తి విద్యలు
అన్నింటిలో నేర్పు పొందుతాడు...
#అశ్రద్ధ చూపే వాడేన్నాడు
విద్యలు నేర్వలేడు..
✍
పక్కవాడికి బయపడి సప్పుడుగాక కూర్చుంటే
ఎప్పుడు రా నీకు #ప్రపంచం పరిచయం అయ్యేది.
#వీది కుక్కలకు భయపడి కూర్చుంటే
ఇంటి గుమ్మం కూడా దాటలేవు
#విమర్శలు విజయానికి నాంది అని గుర్తించు..
✍
తినే #అన్నం పరబ్రహ్మ
స్వరూపం అయినప్పుడు
మనం చేసే #పని కూడా
పరబ్రహ్మ స్వరూపమే....
ఇదొక్కటి గమనిస్తే అన్ని సాధ్యమే...
✍
#పంట చేతికి రావాలంటే దరిన
కలుపు మొక్కను పికేయ్యాలి
#మంచి నడవడిక మనలో రావాలంటే
మదిలోని మలినాన్ని తొలగించాలి..
✍
పిల్లల్ని
చదువు సంధ్యలతో
కళలతో
ఆటలతో
వ్యాయమ శిక్షణలో
పిల్లల అభిరుచి తెలుసుకొని
పెద్దలు పిల్లల్ని పెంచగలిగితే
ఆ బాల్యం పున్నమి వెన్నెల్లాగా నిండుగా ప్రకాశించి , పెద్దయ్యాక పండువెన్నెల కాంతులు అందివ్వగలుగుతారు.
✍
పది మంది కోసం ఆలోచిస్తే
మన ఆనందం పదింతలు అవుతుంది.
పది మందికి దక్కకూడదు అనుకుంటే
మన ఆనందం పదోవంతు అవుతుంది.
పదిరేట్లు పెంచుకుందమా పదో వంతుకు
కుదించుకుందమా మనచేతుల్లో ఉంది.
ఆలోచించు నేస్తమా...
✍
ఎప్పుడైతే నీ ఆలోచన మారుతుందో
అప్పుడే నువ్వు చేసే పనులు మారుతాయి..
ఎప్పుడైతే నీ పనులు మారుతాయే
అప్పుడే వచ్చే ఫలితం మారుతుంది...
అనుకోవాలి గాని అసాధ్యం కానిది అంటూ ఏమి లేదు...
✍
కొన్ని కోట్ల శుక్రకణాలు వీరోచితంగా పోరాడి ఒక కణం పరస్పరం చెంది అండంగా ఆవిర్భావం చెందిన తర్వాత దాని ప్రతిఫలం మన జన్మ.
పుట్టుక ముందు నుంచే వీరోచితంగా పోరాడి ఆ పోరాటంలో గెలిచి జన్మనెత్తినం. ఆ పోరాటం కన్నా పెద్దాదా ప్రపంచంలో పోరాడడం..
DSP మేడం...
✍
నువ్వెంత.!!
నేనెంత.!!
అనుకునే సమరం కాదు
జీవిత ప్రయాణం అంటే..
నువు నేను కలిసిగట్టుగా జరుపుకునే సంబరం.....
✍
స్త్రీ వజ్రంతో సమానం. యోగ్యుడి చేతిలో పడితే హారంలా గుండెల్లో పెట్టుకుంటాడు. ఆయోగ్యుడి చేతిలో పడితే గులకరాయి లా వీధిలో విసిరేస్తాడు. సహా ధర్మచారిణి తో పెళ్లి రోజున ఏడాడుగులు నడిస్తే సరిపోదు. నూరేళ్లు నడిచే వాడే నిజమైన భర్త.....
✍
జీవితాన్ని నవ్వుతూ ప్రేమతో గడపండి మిత్రమా..
ఉన్న కాస్త చిన్న జీవితాన్ని కక్కలేక, మింగలేకా అంత కష్టం మీద ఎందుకు కొనసాగిస్తావు....
జీవితం అనేది ఒక స్వేచ్ఛ యాత్ర విహరించు....
✍
జీవితమే ఒక తరగతి గది
పుటపుటకో కొత్త పాఠం
రోజు రోజుకో కొత్త అనుభవం....
✍
ఎప్పుడు చూసినా కష్టాలలోనే దేవుడిని తలుస్తావేందుకు..
అందమైన , ఆనందమైన క్షణాలు కూడా మీరు ఇచ్చినవే అని. నీ చల్లని చూపు మామీద ఉందని అప్పుడు భవించవేందుకు....
✍
వాస్తవాన్ని
ముక్కుసూటిగా చెప్పేవారు
మాత్రం ఎప్పుడూ
ముప్పుతిప్పల వంతెనపై
తప్పుచేసిన వారుగా కనబడతారు
✍
నేటి రాజకీయాల్లో ఎవరిని అంత లోతుగా నమ్మొద్దు మిత్రమా... కక్కిన కూటికి కకృత్తి పడే యదవలు కూడా ఉన్నారు..... తస్మాత్ జాగ్రత...
✍
యుద్ధం చేయక మునుపే నేను గెలుస్తాను అని చెప్పేవారు తనమీద తనకి ఆత్మవిశ్వాసం ఉండి, నేను చేయగలను అని బలమైన సంకల్పంతో , నమ్మకంతో ఉన్నవారే...
✍
ఎప్పుడు చూడు బాగుపడవలసింది చెడిపోయినోళ్లే..
చెడిపోయిన వాళ్ళ కొరకు బాధపడల్సింది మంచోల్లే...
✍
ఇష్టపడిన వాళ్ల కోసం నువ్వు పడే కష్టం ఎంత పెద్దదైన సరే ఎప్పుడు శిక్షగా అనిపించదు...
✍
కావలిసిన వస్తువు మీరు పారేసుకున్నప్పుడు వేతకదానికి మీరు వెళ్లొచ్చు... కానీ
కావాలని కళ్ళు మూసుకుని విసిరేసిన వస్తువు వొళ్ళంతా కళ్ళు చెసుకొని వెతికిన దొరకదు మిత్రమా...
✍
ఈరోజుల్లో డబ్బుని చూడొద్దు ఎందుకంటే డబ్బును మించిన అంతకన్నా పెద్ద జబ్బులు కూడా ఉన్నాయి...
✍
ఒకే పాట ఎంతో మంది పాడతారు కానీ కొందరి కంఠంలొనే తియ్యగా వినపడుతుంది.
ఒకే ఆట ఎంతో మంది ఆడతారు కానీ అది కొందరిలొనే అందగా కనిపిస్తుంది..
✍
చూడు మిత్రమా
కష్టపడి తినే వయసులో కూర్చోని తింటే....
కూర్చొని తినే వయసులో అడుక్కు తినాల్సి వస్తుంది....
✍
మన శత్రువు అంటే కేవలం మనిషి మాత్రమే కాదు.. సమస్య , చిరాకు , ఇబ్బంది , అసంతృప్తి ఇవన్నీ కూడా మనిషికి శత్రువులే.. వీటితో పోరాటమే జీవితం.....
✍
ఏది ఏమైనా నీ ప్రయాణం మాత్రం అపకు మిత్రమా....
ముందు కనిపించే నీ గమ్యం కళ్ళకి మాత్రమే దూరం....
నడిచె కాళ్లకు కాదు....
✍
అంధుని చేతికి ఆసరాగా ఊత కర్ర ఎంత అవసరమో...
దప్పికతో ఉన్న వారికి మంచినీరు ఎంత అవసరమో... ఆపదలో ఉన్న వారికా ధైర్యం అంత అవసరం...
✍
తప్పు నాదైనా నీదైనా సద్దుకుపోయే మనసుంటే మనం ఎప్పటికైనా కలుస్తాం.... వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ మనం ఒక్కటిగా కాలేము...
✍
నీతికి మించిన "ఆస్తి"
నిర్మలమైన మనసుకు మించిన "అంతస్తు"
త్యాగానికి మించిన "ధనము" లేవు అని తెలుసుకో మిత్రమా...
✍
నీ జీవితంలో ఎవరినైనా మర్చిపో కానీ నీవల్ల ఏమవుతుంది... నువ్వేమి సాదించలేవు... అనే వాళ్ళని మరవకు ఎందుకంటే నీ విజయానికి వల్లే కారణము అవుతారు...
✍
మనిషికి సుఖమేప్పుడో తెలుసా.?
చేసిన అప్పును ,
పోంచివున్న ముప్పును , ఒంటికున్న జబ్బును
పూర్తిగా తొలిగిస్తేనే..
మనసు రోగం పోతుంది. మనసు రోగం లేకపోతే మనిషికి ఆనందం , సంతోషం , సుఖం అన్ని తనతోనే వుంటాయి... 🖋
✍
నేడు నేను ఎంచుకున్న గమ్యం
మోయలేని బరువు కాదు.
నడవలేని దారి కాదు.
పోరాడలేని యుద్ధం కాదు.
ఈదలేని సముద్రం కాదు...
దేనికైనా సమయం కావాలి మిత్రమా..
✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍
నా మదిలోని మాట...
అన్నం తినే సమయంలో ఒక్క మెతుకు కింద పడితే మళ్ళీ తీసుకొని తినే రకం నేను.. అలా అని కక్రుతి వాడిని కాదు. ఒక్కపూట ఆకలి తీర్చే అన్నం మెతుకు కోసం పడే రైతు కష్టం విలువ పెట్టె సమయం విలువ తెలిసిన ఒక రైతు కుటుంబంలో పుట్టాను నేను..
సాయంకాలం గువ్వలాన్ని గూటికి చేరిన ఇంకా కాసేపు పని చేసేవాళ్ళం కదా అని పనిలో లీనమై పోయే రకం నేను.. అలా అని సమయం వృధా చేసే వాడిని కాదు.. అక్కడ ఇంకా ఒక గంటలో పడే కష్టంతో అదనంగా వచ్చే ఆదాయం విలువ తెలిసిన ఒక కూలి కుటుంబంలో పుట్టాను నేను..
కార్లలో , విమానాల్లో , నక్షత్రాలహోటల్లో తిరిగే డబ్బున్న వాళ్ళను చూసి నాకెప్పుడూ వస్తాయో ఈరోజులు అని కలలు గన్నా రకం నేను.. అలా అని కష్టాన్ని మరిచి కలలు కంటూ కూర్చునే రకం కాదు నేను.. అక్కడ నేను కనే కలలు అణిచి వేసి నా కోరికలను తుంచి వేసి మనం పేదోళ్ళం మనకు అవన్నీ సాధ్యం కాదు అని చెప్పేన బీదరిక కుటుంబము లో పుట్టాను నేను...
పెద్ద పెద్ద ఉపాధ్యాయులను , మేధావులను చూసినేను మీలాగే గొప్ప వాడిని కావాలనే చాలా ప్రయత్నం చేసినా రకం నేను.. అలా అని అందరిలా బడికి వెళ్లి వచ్చే రకం కాదు నేను.. నేనేం చేసిన నూటికి నూరుపాళ్లు విజయం నా పక్కే ఉండేట్టు చూసుకునే రకం నేను..ఎందుకంటే నువ్వు ఎంచుకునే చిన్న పని అయిన సరే నికంటే అందంగా ఎవరు చేయలేరు అన్నట్లుండలి. అని చెప్పే ఒక మహానుభావుని కుటుంబంలో పుట్టాను నేను...
కానీ..... నన్ను కాలం మర్చివేసింది....
అయిన నేను తగ్గుతానా తగ్గను... ఎందుకంటే జీవితం అనే యుద్ధంలో గెలుపు నాదే అని నమ్మి ముందడుగు వేస్తున్నా ......
✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍
నేస్తమా నీ పలకరింపు
అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు...
శబ్దం విని.... అమ్మ తన బాధను
అంతా మరిచి నవ్వే చిరునవ్వు వంటిది.
వాడిపోయిన మొక్కకు
తొలకరి జల్లు వంటిది.
బాగా అలిసిన క్రీడాకారుడికి
గ్లూకోన్ - డి వంటిది.
శారీరకంగా వ్యాధి వచ్చిన
వ్యక్తి కి ఔషధం వంటిది.
ఎండలో నడిచివెళ్లే బాటసారికి
దప్పిక తీర్చే బావి వంటిది.
పద్మం వికాశించడానికి
కావాలిసిన రవి కిరణం వంటిది.
చెత్తకుప్పల మధ్య వెతికే వీధి
బాలలకు దొరికిన పరమాన్నం వంటిది.
అడవి మొత్తం గాలించిన తుమ్మెదకి
కనిపించిన పువ్వు మకరంధం వంటిది.
మేతకెళ్లిన తల్లి ఆవును రావడం చూసి
గెంతులేసే లేగ సంతోషం వంటిది.
మనసు బాధలో ఉన్నప్పుడు వినగానే
ఉల్లాసం పుట్టించే కమ్మని పాట వంటిది.
✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍
🌹🌹 అమ్మ నీకు వందనం🌹🌹
అమ్మ నాకు ఒకచిన్న వస్తువు పట్టుకోవడానికె
చాలా ఇబ్బంది పడుతున్న ఈరోజు
ఆ రోజు నన్ను తొమ్మిది నెలలపాటు ఎలా మోశావు అమ్మ...
అమ్మ నాకు ఒకచిన్న ముల్లు దిగితేనే అంత
బాధపడుతున్నావు ఈరోజు
ఆ రోజు నాకు జన్మనిచ్చిన సమయంలో
అంత బాధ ఉన్నగాని ఎలా భరించావు అమ్మ.....
అమ్మ నాకు తినే పదార్థాలు ఏవి కొంచం అటూఇటూ
అయిన ఆనారోగ్యం పాలవుతున్నాను ఈరోజు
ఆ రోజు కడుపులో ఉన్న నాకు అంత సక్రమంగా
సరైన పోషకాలు ఎలా అందించావు అమ్మ...
అమ్మ నాకు ఏదైనా ఒకపనిని సక్రమంగా
చేయడానికే ఇబ్బంది పడుతున్నాను ఈరోజు
ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎలాగమ్మ
అన్ని రకాల పనులు చేయగలుగుతున్నావు.
అమ్మ నీ రుణం నేనెప్పుడు తీర్చలేను అమ్మ.
అమ్మ నీ కమ్మని మాటలు మరవలెనమ్మ.
అమ్మ చందమామలాంటి అందమే కాదు అమ్మ
వెన్నెల లాంటి మనసు కూడా ఉందమ్మ మీతో.
కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే కాదు.
ఆ ప్రేమను ఎల్లప్పుడూ పంచే గుణం ఉందమ్మ మీతో.
కష్టం నాకు వస్తే కన్నీళ్లు నీకు వస్తాయి..
నాకు బాధ వస్తే నువ్వు ఏడుస్తావు..
నేను తిన్నప్పుడు నీ కడుపు నిండేది ఎలాగమ్మ..
బహుశా ఇదేనేమో అమ్మ మాతృ వాత్సల్యం అంటే.
అమ్మ కచ్చితంగా చెప్తున్నాను దునియాలో ఏది
శాశ్వతం కాదు ఒక్క నీ స్వచ్చమైన ప్రేమ తప్ప.
ఎవరమ్మ చెప్పింది మనసేవాయే మాధవసేవా అని.
అన్నింటి కన్నా ముందు మాతపితా సేవయే మాధవసేవ.
భూమిని మొత్తం చుట్టి నీ కాళ్ళ దగ్గర పెట్టిన గానీ
అది కృతజ్ఞత అనుకుకోవలె గాని... రుణం మాత్రం కాదు అమ్మ..
✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍
మరి వినయం ముచ్చట..
మల్లెపువ్వుకి సుగంధం ఉంది కాని ,
సుందరమైన ఆకారం లేదు.
మందారనికి అందమైన ఆకారం ఉంది కాని ,
సుమధురమైన సుగంధం లేదు.
సంపంగికి మత్తుగలిగించి మైమరిపించే శక్తి ఉంది కాని
దాన్ని అలంకరించుకోవడానికి అనువు కాదు
మొగలి పువ్వు కూడా అద్భుతమైన సువాసన
ఉంది కాని కొప్పులో దాన్ని పెట్టుకోలేము.
రోజా పువ్వుకి పుష్పసుగంధం ఉంది
సుంధమైన రూపం కూడా ఉంది దాన్ని
అందుకే అందరూ ఎక్కువగా దాన్ని గౌరవిస్తారు.
సుంధరత్వం , సుగంధం అన్ని పువ్వులకి ఉండదు.
కొన్నింటికి మాత్రమే ఉంటుంది..
మనుషులా విషయానికి వస్తే..
విద్య ఉంటే , వినయం ఉండదు
వినయం ఉంటే , విద్య ఉండదు
నా వరకు వస్తే పెద్ద విద్య లేదు
కానీ వినయం ఉంది అని భావిస్తున్న...
ఈరోజుల్లో ఒక మంచి ఉన్నత విద్య పట్టాలు
సుందరమైన ఆకారాలు ఉంటే చాలు అంటున్నారు...
✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍
జన్మస్థలన్ని కామక్రీడా స్థలముగా పరిగణించి చెలరేగిపోతాడు మృగంలా అని ముందే తెలిస్తే
తల్లి వాడికి జన్మ నివ్వక అభార్షన్ పేరుతో డాక్టర్ కత్తులకి బలి ఇచ్చేదేమో.
ఊపిరి పోసి ఉగ్గుపాలను అందించే స్త్రీ రొమ్ములను సిగరెట్ తో కాల్చే దుర్మార్గుడిగా తయారవుతాడు అని ముందే తెలిసి ఉంటే వాడి తల్లి వాడికి చనుపాలు పట్టేది కాదు పీకనొక్కి చంపేదేమో...
పులి తన పంజాతో జింకను వేటాడినట్టు వాడు తన గోళ్ళతో స్త్రీ శరీరముపై గుచ్చుతాడు అని తెలిసి ఉంటే వాడి తల్లి వాడికి చిన్నతనంలోనే పట్టకారతో మొదళ్లనుంచే గొర్లను పికించేదేమో..
కుక్కలా మీదపడి రక్కేసి మూతులు నాకే వాడని ముందే తెలిసి ఉంటే వాడి తల్లి బడికి పంపే సమయంలో వేడి వేడిగా సలాకి తో మూతి మీద నాలుగు వాతలు పెట్టేదేమో...
ఒక స్త్రీ శరీరం మీదపడి బలవంతంగా రాక్షసుడిలా ఊగుతాడాని ముందే తెలిసి ఉంటే వాడి తల్లి వాడిని ఉయ్యాల నుండి కింద పడేసి పీడ వదిలింది అని చేతులు దులుపుకునేదేమో..
అన్నయ్య వదిలేయ్ అని ఎంత బ్రతిమాలిన విడిపించుకోవదానికి ప్రయత్నించిన స్త్రీ ఇంతకు మించి ఏమి చేయలేదు అని నవ్వి పర స్త్రీ ని రాక్షసుడిగా పసిమొగ్గను తుంచేస్తాడు అని ముందే తెలిసి ఉంటే చందమామ రావే జాబిల్లి రావే అని తినిపించె గోరు ముద్దలో కాస్త విషం కలిపి తినిపించేదేమో...
ఊపిరడానివ్వకుండా మీదమీద పడి ఉక్కిరిబిక్కిరి చేసి మానాలను చేరుస్తాడాని ముందే తెలిసి ఉంటే వాడి తల్లి తలకింది దిండు తినుకొని వాడిమీద వేసి ఊపిరి అడనివ్వకుండా చంపి రేపటి కామాందుడు ఈరోజే చచ్చాడు అని మరో పండగ సంబరం జరిపేడేమో విజయదశమి లాగ
ధన్యవాదములు
✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍
ప్రేమ ప్రేమ ప్రేమ...
ఎక్కడ చూసినా
ఇదే పదం.
ఇదే పదం..
తల్లి కొడుకు మీద చూపేది ప్రేమ కాదా.?
నాన్న కూతురి మీద చూపేది ప్రేమ కాదా.?
గురువు శిష్యుల మీద చూపేది ప్రేమ కాదా.?
తల్లిదండ్రులపట్ల, గురువులపట్ల గట్టిగా వినపడని ప్రేమ. అమ్మాయి అబ్బాయి విషయానికి వస్తే ఎందుకు మారు మ్రోగుతుంది.?
ఈరోజుల్లో చీకటిలో తియ్యగా కనిపించే ప్రేమ
వెలుగులోకి వచ్చేసారికి చేదు అవుతుందేందుకు.?
ఇలాంటి ప్రేమలో రెండూ హృదయాల కలయిక ఉందా.?
హృదయానికి ఏమైనా సంబంధం ఉందా.?
అంతా వ్యామోహం.
కలల , కల్లోల ప్రపంచంలో యువత వ్యామోహనికి పెట్టుకున్న అందమైన పేరు ప్రేమ అని అనవచ్చునా..!
ప్రేమిద్ధం ప్రతిక్షణం మన మేలుకోరే తల్లిదండ్రులును...
గౌరవిద్దాం ఎల్లప్పుడూ మన ఎదుగుదల కోరుకునే పూజ్యులైనా గురువులను, పెద్దలందరినీ...
జన్మనిచ్చిన తల్లిదండ్రులను కళ్ల ముందు పెట్టుకొని
పుణ్యం దొరుకుతుంది అని క్షేత్రాన్ని దర్శించడం సరికాదు.
తల్లి,తండ్రి, గురువు దైవం అన్నారు పెద్దలు గుర్తించండి
✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍
ఎండనక వాననక
రాత్రనక పగలనక
వెనకనక మందనక
బతుకు కోసం తిరుగుబాటు చేసిన పుట గడవడం కష్టంగా ఉంది కొందరికి...
ఈరోజు
పొద్దున్నే లేచి అమ్మ
స్నానానికి వేడినీళ్లు పెట్టి..
వేడివేడి గా టిఫిన్ పెట్టి..
చక్కెట్ లకి బాగ్ లో డబ్బులు పెట్టి...
అపురూపంగా బుగ్గన ముద్దు పెట్టి...
అన్ని కల్పించి స్కూల్ కి పంపిస్తే... చదవడం కష్టం అంటున్నారు ఇప్పుడు...
చదువు చదువు అంటున్నారు కానీ
సంస్కరం విలువ సరిగా తెలపడం లేదు..
ఎక్కడికి మీ పరుగు..
దేనికోసం మీ పరుగు
ఎందుకంత ఉరుకు...
ఆలోచించు మిత్రమా...
వేలుపోసి ప్రైవేట్ రంగాల్లో చదివిస్తున్నారు
పిల్లలకి ఉన్న అసలు వేరు..
పిల్లలకి ఉన్న ఆశయాలు వేరు..
అలాగే
నీకున్న అసలు వేరు..
నీకున్న ఆశయాలు వేరు.. చివరికి వాళ్ళ ఆశలు నీ ఆశలు ఎవరివి నెరవేరడం లేదు..
పిల్లలు ఎగరాలి అనుకుంటున్నారు...
పిల్లలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలి అనుకుంటున్నారు...
ఎప్పుడు మీకున్న కోరికలు వాళ్ళకి రుద్ది రుద్ది వాళ్ల కోరికలను మొగ్గలోనే తుంచి వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సాధ్యం కాదు...
మీరు అనుకుంటున్నారు ఈరోజు నా కొడుకు నా కూతురు ఉన్నత చదువుల్లో పెద్ద హాస్టల్ లో ఉన్నారని కానీ అక్కడ వాళ్ళకి పంజరంలో చిలక ఉంది బ్రతుకు.....
మాములు పంజరం కాదు బంగారు పంజరం అనుకుండొచు కానీ అది పంజరం అని మరవకు...
కష్టంతో చేసినదానికి ఇష్టంతో చేసిన దానికి చాలా తేడా ఉంది.. ఇదొకటి గమనిస్తే అందరి బతుకులు బంగారమే....
✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍ ✍
కాను నేనెప్పుడు
కాను కాను నేనెప్పుడూ వడ్ల గింజల్లో తాలు గింజను కాను..
అవుతాను నేను పరమాన్నంలో అన్నపు మెతుకును ....!
కాను కాను నేనెప్పుడు మందలో ఒకడిగా కాను...
అవుతాను నేను వందలో ఒకడిగా....!
కాను కాను నేనెప్పుడూ పంట పొలంలో కలుపు మొక్కను కాను...
అవుతాను నేను
చేతులు జోడించబడే తులసి మొక్కను...!
కాను కాను నేను ఊట సెలిమలో ఓండు నీటిని కాను..
అవుతాను నేను పుష్కలంగా పారే జలపాతాన్ని ......!
కాను కాను నేనెప్పుడూ పూల వనంలో గంజాయిని మొక్కని కాను... అవుతాను నేను బురదలో పూసినా పద్మాన్నే అవుతాను..!
కాను కాను నేనెప్పుడు మీ మనసులో మలినమైన ఆలోచనను కాను.. అవుతాను నేను ఆహ్లాదమైన మధురాను భూతి ......!
కాను కాను నేనెప్పుడూ తారల్లో తారను కాను. అవుతాను నేను పున్నమి వెన్నెల్లో చందమామను .....!
కాను కాను నేన్నడూ తాలుపిప్పి సోకిన జొన్న దంటును కాను...
అవుతాను నేను మా ఇంటి గుమ్మంలో వలసొచ్చిన పక్షుల కోసం వేలాడదీసే జొన్న కంకిని .....!
- స్వస్తి...
రచన మరియు సేకరణ
- చిరునవ్వుల చిన్నోడు
Golla Chinnaiah
8186891638
9652115616
H.no.1-81