కో లాభో గుణి సంగమ: కిమ సుఖం ప్రాఙ్ఞేతరై స్సంగతి:
కా హాని స్పమయచ్చుతి: నిపుణతా కా ధర్మతత్త్వే రతి:
కశ్శూరో విజితేంద్రియ: ప్రియతమా కా2నువ్రతా కిం ధనం
విద్యా కిం సుఖ మప్రవాసగమనం రాజ్యం కిమాఙ్ఞాఫలమ్
ఈ
శ్లోకంలో కొన్ని మంచి ప్రశ్నలూ, వాటికి ప్రత్యుత్తరాలూ ఉన్నాయి. అన్నీ
ఆచరించ తగినవే. అనుభవ సిద్ధులు చెప్పినవే. జీవిత సారమంతా కాచి వడ బోసి
నిగ్గు తేల్చిన నిజాలే. చూడండి..
ఏది లాభకరం?
మంచి వారితో సాంగత్యం.
ఏది సుఖకరం కాదు?
మూర్ఖులతోడి చెలిమి.
ఏది ఆత్మహాని?
ఇచ్చిన మాట నిలబెట్టుకో లేక పోవడం
ఏది నిపుణత?
ధర్మం తు.చ తప్పక పాటించడం
ఎవడు శూరుడు?
ఇంద్రియాలను జయించిన వాడు
ఎవతె ప్రియమైన చాన ?
అనుకూలవతి అయిన భార్య
ఏది వెలలేని సంపద?
విద్య
ఏది సుఖం?
దేశాలు పట్టి పోకుండా ఉన్న చోటనే ఉండడం
ఏది రాజ్యం?
తన మాట ఎంత వరకు చెల్లుబాటు అవుతుందో, అంత మేర తన రాజ్యమే.
మన టెలిగ్రామ్ సమూహాలలో చేరాలి అనుకుంటే క్రింద ఉన్న లింక్ ను నొక్కి నేరుగా సమూహం లో చేరండి...
https://t.me/joinchat/CJ_JKkHtaUSprY6qLuY5vg
https://t.me/RamKarri
గమనిక : క్రింద వాట్సాప్ అని ఉన్న లింక్ ని నొక్కి నేరుగా మీ సలహాలు, సూచనలను నాతో వాట్సాప్ ద్వారా పంచుకొని.. మరింత విలువయిన విషయాలను అందివ్వడానికి సహకరించండి...
Blog : Ram Karri
Whatsapp : http://wa.me/+918096339900
-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -
మన టెలిగ్రామ్ సమూహాలలో చేరాలి అనుకుంటే క్రింద ఉన్న లింక్ ను నొక్కి నేరుగా సమూహం లో చేరండి...
https://t.me/joinchat/CJ_JKkHtaUSprY6qLuY5vg
https://t.me/RamKarri