ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా...ఛత్రపతి శివాజీ

 జననం – 19.02.1627 (వైశాఖ, శుక్ల పక్ష తదియ).  

 మరణం – 04.04.1680 (చైత్ర పౌర్ణమి).


ఓటమి ఎరుగని ధీరుడు ఛత్రపతి శివాజీ.


హిందూదేశంలో ఎందరో రాజులు అధికారంకోసం, రాజ్యం కోసం యుద్ధాలు చేశారు. రాజ్యాలను స్థాపించారు. హిందూ దేశాన్ని విదేశీయుల దాడులనుండి కాపాడి అమరులైనారు. వారి మరణానంతరం అయా రాజ్యాలు కూడా అంతరించాయి. అయితే శివాజీ కూడా అలాంటి వాడేనా లేక ఆయన చేసిన పోరాటం మొత్తం దేశానికి సంబంధిం చిందా? ఆయన సాగించిన సమరం ఆయన తోనే ఆగిపోయిందా? లేక ఆ తర్వాత వచ్చిన తరానికి ఉపయోగపడిరదా లేదా? ఆలోచించాలి.


శివాజీ గనుక ఈ దేశంలో జన్మించకపోతే ఏమి జరిగేదో ఆయనతోపాటు యుద్ధక్షేత్రంలో యుద్ధం చేసిన యోద్ధకవి, పండితుడు శివాజీ గురించి ఒక కావ్యంలో ఈవిధంగా వర్ణిస్తాడు.


కాశీజీకీ కళా జాతి, మథురా మసీద్‌ హోతి


యది శివాజి న హోతా తో సబకీ సున్నత్‌ హోతి


(కాశీ యొక్క కళ పోయేది, మథురా మసీ దయ్యేది. ఒకవేళ శివాజే లేకుంటే, అందరికి సుంతీ లయ్యేవి.)


శివాజీ రాజకీయ రంగప్రవేశం చేసేనాటి వరకు ఆసేతుహిమాచల పర్యంతం హిందూవీరులు ప్రాణా లను ఫణంగా పెట్టి మహమ్మదీయ బలాన్ని ఎదురిం చారు. కాని విజయాన్ని సాధించలేక పోయారు. ఈ చేదు నిజాన్ని దాహిర్‌ గతి, జయపాలుని యుద్ధాలు, అనంగపాలుని స్థైర్యం, పృథ్విరాజు పతనం, కళింగ పతనం, దేవగిరి పతనం, తాళికోట దుర్దినాలు ఋజువు చేయగలవు. కాని శివాజీ రాజకీయ రంగ ప్రవేశం జరిగిన తర్వాత హిందూజాతిని జాగృత పరిచి విదేశీయ మహమ్మదీయ పాలకుల ముందు ఏనాడూ తలవంచలేదు, హిందూవీరులను తల వంచనీయలేదు. ఎదురించి నిలిచారు. హిందూ పతాకాన్ని హిందూదేశ గగన తలంలో స్వాభి మానంతో రెపరెపలాడిరచాడు.


శివాజీ 1627లో జన్మించాడు. వయస్సు పెరిగే కొద్దీ అతనిలో హిందూజాతి రాజకీయ బానిసత్వం గురించిన ఆవేదన కూడా పెరుగుతూ పోయింది. మన గుళ్ళూ-గోపురాలు, గోమాతలు మ్లేచ్ఛుల పాదాల క్రింద నలిగి పోతుంటే తన హృదయం అగ్నిగోళమయింది. ఇందుకు కారణం వీరమాత జీజాబాయి శ్రీకృష్ణ, శ్రీరామ, అర్జున, భీమ, అభిమన్యు, హరిశ్చంద్ర మొదలగు మహా పురుషుల తేజో మయ జీవితాలతో శివాజీలో తరుణ శక్తిని, ధార్మిక భక్తిని పెంచి పోషించడమే.

1645లో మొదటిసారిగా యువ శివాజీ విప్లవ పతాకాన్ని ఎత్తాడు. బీజాపూర్‌ నవాబు పట్ల తాను అవిశ్వాసాన్ని చూపినాడన్న అపవాదును తీవ్రంగా ఖండిస్తూ ‘‘నావిశ్వాసము ఏ శాహకో, ఏ నవాబుకో ఏ వ్యక్తి కో కాదు; కేవలం దేవునికి మాత్రమే అర్పింప బడిన’’దని ఉత్తరంవ్రాశాడు. తనను పెంచి పెద్ద చేసిన దాదాజీ కొండదేవుని సాక్షిగా తన అనుచరులతో గూడి మొదట తోరణ దుర్గంపై భగవత్‌ పతాకాన్ని ఎగరేశాడు. అప్పటికాయన వయస్సు పదహారేళ్ళే. అలా మొదలయింది విజయప్రస్థానం. సహ్యాద్రి శిఖరాల పైన దైవసమక్షంలో చివరి రక్తపు బొట్టు వరకు పోరి ‘‘హిందవీ స్వరాజ్యం’’ను హిందు స్థానంలో ‘‘హిందూ – పద-పాద షాహి’’ని స్థాపించు టకు ప్రమాణముచేసి ప్రతిజ్ఞా కంకణం ధరించాడు. శివాజీ 1674లో జూన్‌ మాసంలో జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు సింహాసనస్థుడై ‘హిందూ-పద-పాదషాహి’ని స్థాపించి ప్రత్ఞిను నిలబెట్టుకున్నాడు.


శివాజీ వంద ఏళ్ళకు సరిపోయే వ్యవస్థ చేశాడు

శివాజీ గళం నుండి వెలువడిన ‘‘హిందవీ స్వరాజ్‌’’ అనే ఈ మాటలే ఒక వంద సంవత్సరాల పాటు మహారాష్ట్ర వీరుల ఆశయాలను, సాధించ డానికి ప్రేరేపించాయి. శివాజీ ప్రారంభించిన ఉద్య మము స్థానిక ఉద్యమంగా, వ్యక్తిగత ఉద్యమంగా నడవలేదు, ముఖ్యంగా అది హిందూ ధర్మ రక్షణ కొరకు, విదేశీయ, విజాతీయ మహమ్మ దీయ అధికార ఆగడాల నిర్మూలన కొరకు, స్వతంత్ర హిందూ సామ్రాజ్య స్థాపన కొరకు ప్రారంభించబడిన అఖిల హిందూ ఉద్యమమిది.

విదేశీ బానిసత్వం నుండి హిందూజాతిని రక్షించే నాయకుడు ఒక్క శివాజేనని దేశప్రజలందరూ గుర్తిం చారు. సావనూరు ప్రజలు శివాజీకి పంపిన లేఖలో ‘‘విదేశీయుల క్రూర నిరంకుశ పాలన క్రింద నలుగు తున్నాం. పవిత్ర హిందూధర్మం కాలిక్రింద త్రొక్కి వేయబడుచున్నది. మహమ్మదీయ సేనాని యూసఫ్‌ దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నాం, రండి, మమ్ములను కర్తవ్యోన్ముఖులను చేయండి.’’ అని ప్రార్థిం చారు. ప్రజల ఆవేదనను ఆర్తనాదాన్ని అందు కున్న శివాజీ షయిస్థఖాన్‌ను పరుగుతీ యించాడు, అఫ్జల్‌ఖాన్‌ను అంతమొందించాడు. ఒక్కొక్క దుర్గాన్ని జయించుకుంటూ ముందుకు సాగిపోయాడు. హిందూ విజయకేతనాన్ని హిందూ గగనతలంలో రెపరెపలాడిరచాడు. సుస్థిరమైన రాజ్యవ్యవస్థను ఏర్పాటుచేశాడు. హిందూ విమోచ నోద్యమం శివాజీ, రామదాసుల కాలంలో పునః ప్రారంభింపబడి నప్పటికీ అది వారితో ఆగలేదు. ఆ మహాపురుషుల సంతతివారు,అనుయాయులు దానిని విజయ పీఠంపై కూర్చోబెట్టడానికి నిరంతర పోరాటం సాగించారు.


ఉద్యమానికి ప్రాణం పోశాడు శంభాజీ


శివాజీ మరణంతో మరాఠా రాజ్యం అనాథ అయిందని కొందరు భావించారు. ఔరంగజేబు ఆయన తాబేదార్లు సంతోషించారు.శివాజీ నిర్మించిన శివశక్తి అనాథ కాలేదు. శివాజీ లక్ష్యాన్ని పోరాట పటిమను ముందుకు తీసుకొని పోయింది. శంభాజీ తాను పాలించిన తొమ్మిది సంవత్సరాల్లో విరామ మెరుగక పోరాటం సాగిస్తూ. చివరకు ఔరంగజేబు సైన్యాలకు చిక్కాడు. ఔరంగజేబు శంభాజీని మతం మార్చుకొమ్మని అనేక చిత్ర హింసలకు గురి చేశాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించనందుకు శంభాజీ నాలుకను కోశారు. అయినా శంభాజీ ఒప్పుకోలేదు. చివరకు చిత్రహింసలకు గురిచేశారు.


అతని కళ్ళు పొడిచారు. నాలుక కోశారు.. ‘‘ముస్లిములను చంపి, బంధించి, అగౌరవ పరిచినం దుకు, ఇస్లాం నగరాలను కొల్లగొట్టినందుకు’’ శంభాజీని చంపాలని మహమ్మదీయ న్యాయవేత్తలు డిక్రీ ప్రకటించారు. శరీరంలోని ఒక్కొక్క అంగాన్ని నరికి ఆ మాంసాన్ని కుక్కలకు వేసి క్రూరంగా శంభాజీని హింసించి చంపారు. నరికిన ఆయన తలలో గడ్డి కూరి డోలు, సన్నాయిలు వాయిస్తూ దక్కన్‌ లోని ముఖ్య పట్టణాలన్నింటిలో ప్రదర్శించారు. శంభాజీ బలిదానం సంగతి తెలియగానే మహా రాష్ట్రుల గుండెలు మండి ఉవ్వెత్తునలేచి కదన రంగానికి పరుగులు తీశారు. బ్రతికి వున్నప్పటికంటే అమరుడయ్యాకనే శంభాజీ తన జాతిని ఉత్తేజ పరిచాడు. ప్రతి మరాఠా వీరుడు సర్వస్వం త్యాగం చేసే వీర సైనికుడయ్యాడు. ఆయుధాలతో యుద్ధ రంగంలో దుమికారు.


అధికారం కాదు- హిందూ సమాజ రక్షణే ముఖ్యం

శంభాజీ మరణం తర్వాత శివాజీ కోడలు, శంభాజీ భార్య యశూబాయి కూడా తన మామగారు ఆచరించిన రీతికి నీతికి మచ్చ రానీయకుండా అధికార పీఠం మీద కూర్చోబెట్టడానికి ఏడేళ్ళ కుమారుడు సాహు ఉన్నప్పటికి సమాజ రక్షణ ముఖ్యమని భావించి యుక్త వయస్కుడైన తన మరిది రాజారాంకు పట్టం కట్టింది. శివాజీ మార్గానికి దారి చూపింది. శంభాజీ బలిదానం, యశూబాయి త్యాగంతో హిందూధర్మ రక్షణఆవశ్యకతను హిందూ ప్రజానీకమంతా గుర్తించి నది. హిందూ సమాజ రక్షణకు పూనుకున్నది.


బాలాజీవిశ్వనాథరావు విజయ బీజం

శివాజీ, అతని కుమారుడు శంభాజీల త్యాగమయ పోరాటాల వలన ఆతర్వాత మహారాష్ట్ర వీరులు బాలాజీ విశ్వనాథరావ్‌ నేతృత్వంలో ముస్లిం సామ్రాజ్యాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. ముస్లింలపై ఆధిపత్యాన్ని సంపాదించారు. 1718లో సయ్యద్‌ సోదరులు తమను వ్యతిరేకించిన ముస్లిం ప్రతి పక్షు లను అణచి వేయుటకు బాలాజీ విశ్వనాథ రావును ప్రార్థించగా యాబైవేల మరాఠి సైన్యంతో ఢిల్లీకి వెళ్ళి వాళ్ళను అణచి వేశాడు. ప్రతిఫలంగా దక్కన్‌లో చౌత్‌ వసూలు చేసుకొనే అధికారం పీష్వా పొందాడు!

బాలాజీ విశ్వనాథరావు 1720లో మరణించాడు. తర్వాత అతని కుమారుడు బాజీరావు మహ రాష్ట్రమండలికి సాహు అధ్యక్షతలో నాయకుడైనాడు. శివాజీ తర్వాత మహారాష్ట్ర చరిత్రలో రెండవ ప్రధాన ఘట్టం బాజీరావు రాజకీయ రంగప్రవేశం. బాజీరావు పీష్వా హిందువుల నందరిని మరోసారి సంఘ టితం చేశాడు. నాదిర్షా హిందూ దేశంపై దండెత్తి వచ్చినప్పుడు వివిధ హిందూరాజు లకు అఖిల హిందూ రాజకీయ స్వాతంత్య్రానికి సంఘటితం కావలసిన ఆవశ్యకతను నొక్కిచెప్పాడు. బాజీరావు అన్నిటా శివాజీకి తగిన వారసుడని నిరూ పించినాడు. అందుకు ఉదాహరణ 1727ఆగస్టు 7న నిజాం ఏలు బడిలో ఉన్న ప్రాంతాలపై దండెత్తాడు. నిజామును ఎదుర్కొని చివరకు యుద్ధభూమిలో నిజాంను బంధిం చాడు, దానితో సాహును సర్వ మహారాష్ట్ర భూమికి ఏకైక సార్వభౌమునిగా నిజాము అంగీకరించి బాకీ వున్న చౌతు సర్దేశముఖు పన్నులను చెల్లించి నాడు.


మహారాష్ట్రుల జైత్ర యాత్ర

శివాజీ లక్ష్యం మరాఠా సామ్రాజ్యం కాదు- హిందూ సామ్రాజ్యం. అందుకే మరాఠావీరులు దేశం లోని వివిధ హిందూ రాజులకు సహాయ మందించి హిందూసామ్రాజ్య నిర్మాణానికి బాటలు వేశారు. ఆ దృష్టికోణంతోనే సవాయి జయసింగు పిలుపు నందుకొని రాజస్థానంలో స్వతంత్ర సమరా నికి సాగి వెళ్ళారు. జైపూర్‌ సవాయి జయసింగు, ఠాకూరు నందలాల్‌ మాల్వా హిందువుల పక్షమున ‘‘హిందూ గౌరవమును మరల ప్రతిష్ఠించమని విజ్ఞప్తి పంపారు. మహారాష్ట్రులు అంగీకరించి బాజీరావు సోదరుడు చిమ్నాజీ అప్పారావు నాయకత్వంలో దేవాస్‌ పట్టణం దగ్గర మొగలుల రాజ ప్రతినిధిని చంపి మొగలుల నోడిరచినారు. దీనితో మాల్వా హిందువులు స్వతంత్ర శ్వాసను పీల్చుకున్నారు.


ఛత్రసాలుకు అండగా నిలిచాడు బాజీరావ్‌

శివాజీ అడుగు జాడలలో పయనించి మొగలు లతో పోరాడిన బుందేలఖండ్‌ రాజు ఛత్రసాలుడు వయోవృద్ధుడైనందువలన మొగలులతో పోరాడలేక బాజీరావును సహాయపడవలసినదిగా కోరగానే డెబ్బదివేల సైన్యంతో బుందేల ఖండము ఆక్రమించు కున్న ముహమ్మద్‌ఖాన్‌ను 1729లో ఓడిరచి బుందేల ఖండ్‌ను తిరిగి హస్తగతంచేసుకొని ఛత్రసాలుకు అప్పగించాడు. మొగలులను పారద్రోలారు. మహా రాష్ట్రులు మొగలులనుండి గుజరాత్‌ను కూడా స్వాధీన పరుచుకున్నారు.

సంధి షరతులను భంగ పరిచిన ఆంగ్లేయుల గతి: ఇంగ్లీషువారు మహారాష్ట్రులతో చేసుకున్న సంధి ప్రకారం రఘోబాను అప్పగించాలి. కాని అప్పగించ లేక యుద్ధానికి సిద్ధపడ్డారు. 1779లో ఇగర్టన్‌ సేనా నితో పూనామీద దండయాత్ర చేయాలని ప్రయత్నం చేశారు. కాని బాగాఒంటబట్టిన గెరిల్లా యుద్ధ తంత్రతో ఆంగ్లేయులను చిత్తుచిత్తుగా ఓడిరచారు మరాఠాలు.


మహారాష్ట్ర నావికా విజయం

సేనాపతి అనంతరావు దులావ్‌ సాహసోపేత మైన దాడిచేసి ఇంగ్లీషు యుద్ధనావను విజయ పారి తోషికంగా తీసుకొని వచ్చాడు.1783లో నానాతో చేసుకున్న సంధి ప్రకారం బందీగా వున్న రఘోబాను మరాఠా అధికారులకు అప్పగించాలి. పురంధర సంధి ప్రకారం సర్వ భూభాగాలు మహా రాష్ట్రులకు అప్పజెప్పాలి. ఆంగ్లేయులు దానిని తలవంచి స్వీక రించవలసి వచ్చింది. హిందువులపై అత్యాచారాలు సాగించిన టిప్పు సుల్తానుకు మరాఠా వీరులు మంచి బుద్ధి చెప్పారు. మహా రాష్ట్రులు ఉత్తర హిందు స్థానంలో పూర్తిగా పనిలో నిమగ్నమైవుండగా మూడో సారి టిప్పు 1798 లో మహారాష్ట్రుల అధికారాన్ని ధిక్కరించాడు. దీనితో మహారాష్ట్ర అధికారులు ఛందవర హోనవర్‌, ధారేశ్వర్‌, గణపతిరావ్‌ మహం దాలె నర్సింగరావ్‌ దియోజి తమ సైన్యాలతో శ్రీరంగ పట్టణాన్ని ముట్ట డిరచారు. రెండవవైపు కార్నవాలీస్‌ సైన్యాలు కూడా విరుచుకు పడినాయి. ఇటు మహా రాష్ట్రులు, అటు ఆంగ్లేయులు దాడిచేయటంతో హీనాతి హీనమైన సంధికి సిద్ధపడ్డాడు. టిప్పు తన రాజ్యంలో సగభాగం మహారాష్ట్రులకు అప్పగించి, 8కోట్ల నష్టపరిహారం చెల్లించాడు. 1727లో డచ్‌ మరియు పోర్చుగీసు వారినికూడా మరాఠా వీరులు మట్టి కరిపించి గోవాను జయించారు. 1732 లో పిలాజీ గైక్వాడ్‌,కాంతాజీ బాందే, చిమ్నాజీ అప్పారావ్‌ మొదలగు మహారాష్ట్ర వీరులు బరోడాను విదేశీయుల నుండి విడిపించి స్వాధీన పరచుకున్నారు. అదే వరుస క్రమంలో సంపూర్ణ గుజరాత్‌ని గెలుచుకున్నారు.


1740లో బాజీరావ్‌ మరణంతో హిందూ సామ్రాజ్య ఉద్యమం ఆగలేదు. బాజీరావ్‌ కుమారుడు నానాసాహెబ్‌ (బాలాజీ రావ్‌) చిమ్నాజీ పుత్రుడు భావూసాహెబ్‌ మహారాష్ట్రనాయకులైనారు. ముల్తాన్‌, పంజాబ్‌, రాజపుత్రస్థాన్‌ రోహిల్‌ ఖండ్‌ ప్రాంతాలు మహారాష్ట్రుల ప్రాబల్యంలోనికి వచ్చినవి. హిందూ వీరుల పోరాటపటిమకు సంతోషపడి సందేశం పంపుతూ నానాజీ ‘‘అఖండ హిందూ సామ్రాజ్యానికి స్తంభాలు మీరే మీ పేరు ఇరాన్‌-తురాన్‌ దేశాలకు ప్రాకిందని’’ 1751లో సందేశంలో వ్రాశాడు.


1752లో బాలాజీరావ్‌ పీష్వా ఫ్రెంచివారిని, వారిని పోషిస్తున్న నిజాంతో యుద్ధంచేసి,భల్లకి పట్టం వద్ద సంధికివచ్చేవిధంగా చేశాడు దానితో తపతీ గోదావరి మధ్యనున్న భూభాగమంతా మహారాష్ట్రుల వశమైంది. ఫ్రెంచి అధికారం బీటలు వారింది. హిందూవీరులు బెంగళూరును కూడా ముట్టడిర చారు.

1758 నాటికి తైమూర్‌, సుల్తాన్‌, జహాన్‌ ఖాన్‌ల బలాలు పూర్తిగా నాశనమైనాయని సేనాపతి రఘు నాథరావుగారు నానా సాహెబ్‌ గారికి వ్రాసిన ఉత్తరంతో మనకు తెలుస్తుంది. అంతాజీ మంకే శ్వరుడు సేనాపతి రఘునాథునికి ఈ విధంగా ఉత్తరం వ్రాశాడు లాహోరు మన వశమైంది. శతృవులు మన పుణ్య భూమికి అవతలకు తరిమివేయబడినారు.


మూడవసారి టిప్పు ఎదురు తిరిగితే నానా నాయకత్వంలో మహారాష్ట్రులు1782లో అతనిని ఓడిరచడంతో టిప్పు సంధికి ఒప్పుకొని తన రాజ్యం లోని సగం రాజ్యాన్ని, మూడు కోట్ల నష్ట పరిహారాన్ని చెల్లించాడు. 1800లో పేష్వా పర్నవీస్‌ మరణ సమయంవరకు అఖండ భారతదేశమంతా హిందు వుల వశమైంది నేపాల్‌ నుండి తిరువాన్కూరు వరకు హిందూరాజుల స్వాధీనంలో వుండి ఒకే రాజ్యాధి కార సంస్థగా పాలింపబడేది. మహారాష్ట్ర సమాఖ్య నేతృత్వం వహించింది. ముల్తాన్‌ నుండి రామేశ్వరం వరకు వారి మాట శాసనాక్షరమైంది. ఇరాన్‌, తురాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లను గెలిచారు. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌వారితో పోరాడి తమ హక్కును నిలబెట్టుకొ న్నారు. హిందూ సామ్రాజ్య కాంక్ష ఫలప్రదమైంది. రామదాసుని ఉపదేశాలు కార్యరూపాన్ని దాల్చాయి.


ఈ విధంగా నానాఫడ్నవీసు, పీష్వా మాధవరావ్‌, రఘోబా, సవాయి మాధవరావ్‌-1, సవాయి మాధవ రావ్‌-2లు అనేక ఆటుపోటులకోర్చి అనేకమంది శతృవులతో పోరాడి హిందూ సామ్రాజ్యాన్ని 1857 వరకు స్వతంత్ర పోరాటానికి పూర్వభూమికగా అన్ని రకాలుగా తయారు చేశారు, శివాజీ వారసులు. ఆధునిక స్వాతంత్య్ర పోరాటానికి ఒక వ్యవస్థ, ఒక రాచబాటను నిర్మించాడు శివాజీ. దానిని కొనసా గించరు అతని వారసులు. ఆ తర్వాత ఆ బాట లోనే ఆధునిక స్వాతంత్య్ర సమర సారథులు తిలక్‌, వీర సావర్కర్‌, లాలా లజపతిరాయ్‌. బిపిన్‌ చంద్ర పాల్‌ అరవిందఘోష్‌. సుభాష్‌ చంద్రబోసు శివాజీ నిర్మించిన పరంపరను ముందుకు తీసుకెళ్ళారు. పోరాటం చేశారు. ప్రేరణనిచ్చారు.


- స్వస్తి...