ప్రపంచ ఎయిడ్స్ (AIDS) దినోత్సవం


ఎయిడ్స్ (AIDS) అంటే?

     ఎక్వైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోం (Acquired Immune Deficiency Syndrome). విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరి కంటే ఎక్కువ మంది తో సంభోగం లో పాల్గొనడం వల్ల వచ్చే వ్యాధి. స్త్రీ నుండి పురుషుడికి, పురుషుడి నుండి స్త్రీకి రావడం, ఆ తర్వాత తల్లి నుండి బిడ్డకు, ఇంకా కలుషిత సిరంజిల వల్ల ఒకరినుండి ఇంకొకరికి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణాంతక వ్యాధిగా పరిగణించేవారు. 1980 లో రాబర్ట్ చార్లెస్ గాల్లో అనే శాస్త్రవేత్త ఎయిడ్స్ పైన పరిశోధన చేశాడు. 1981 జూన్ 5 వ తేదీన మొదటిసారిగా అమెరికాలో నలుగురు స్వలింగ సంపర్కుల్లో గుర్తించబడిన ఎయిడ్స్ నేడు ప్రపంచ వ్యాప్తముగా 3.8 కోట్లు మందికి సోకింది. 1987 లో భారత దేశంలో "నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం" మొదలైనది.

ఎయిడ్స్ ఎక్కడినుంచి వచ్చింది?




      శాస్త్రవేత్తల అంచనా ప్రకారం హెచ్ ఐ వి(HIV) వైరస్ సోకిన వ్యక్తి ఆఫ్రికా ఖండంలోనే ఉండాలి. ఇది 1915, 1941 సంవత్సరాల మధ్య జరిగి ఉండవచ్చు అని ఊహిస్తున్నారు. అప్పట్లో గ్రీన్ చింపాజీలకు హెచ్ ఐ వి సోకుతూ ఉండేది. ఈ హెచ్ ఐ వి రూపాంతరం చెంది మనుషులకు సోకటం ప్రారంభించింది. కాని అధికారుల లెక్కల ప్రకారం జూన్ 18, 1981 వ తేదీన అమెరికాలో మొదటగా స్వలింగ సంపర్కంలో పాల్గొనే పురుషులకు సోకె వ్యాధి అని అనుకున్నారు, కాని వచ్చిన కేసులతో పాల్గొనని వారికి కూడా వచ్చే జబ్బుగా నిర్ధారించారు.
ఎయిడ్స్ డే ను ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారు?

      ప్రతి ఏట డిసెంబర్ 1 తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటారు. ఎయిడ్స్ వ్యాధి పై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్య వంతులుగా చేసి తద్వారా ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనే సంధర్భంలో గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరుకు ఉన్న ప్రజలు అందరు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఎయిడ్స్ ఎలా వ్యాపించదు?

       దోమ కాటు, పిల్లులు కాటు, ఒకే దుస్తులు ధరించడం వలన కాని లేదా ఎయిడ్స్ గల వారితో కలసి మెలసి జీవించడం వలన కాని, లేదా కలసి పని చేయడం ద్వారా కాని దగ్గు, తుమ్ముల వల్ల, ముద్దుల వల్ల కాని సంక్రమణకు గురయ్యే ప్రమాదం ఎంత మాత్రం లేదు.

ఎయిడ్స్ ను ఎలా అరికట్టాలి..?

       ఎయిడ్స్ ను పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. అయితే ఎయిడ్స్ ను నివారించడానికి చాలా సులువైన పద్దతులు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని ఆసుపత్రులలో స్వచ్చంధంగా రక్తం పరీక్షించుకోవడానికి, సరియైన సలహాలు పొందడానికి VCTC కేంద్రాలను ఏర్పరచారు.

ఎయిడ్స్ డే ను నిర్వహించడానికి దృష్టి సారించిన అంశాలు

2015: ఎయిడ్స్ ను త్వరగా అంతం చేయడానికి వడి వడిగా నడుద్దాం.

2014: హెచ్ ఐ వి రహిత సమాజం.

2013: ఎయిడ్స్ వివక్షత వద్దు.

2012: మనం అందరం కలిసి సమిష్టిగా ఎయిడ్స్ ని నియంత్రిద్దాం.

2011: ఎయిడ్స్ ని సంపూర్ణంగా నాశనం చేద్దాం.

2010: యూనివర్సల్ యాక్సెస్ మరియు మానవ హక్కులు.

2009: యూనివర్సల్ యాక్సెస్ మరియు మానవ హక్కులు.

2008: ఎయిడ్స్ ని అరికడతామని వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడానికి ఉపాధి కల్పించి కాపాడుదాం.

2007: ఎయిడ్స్ ని అరికడతామని వాగ్ధానాన్ని నిలబెట్టుకుందాం - నాయకత్వం లో ముద్దు బిడ్డలుగా నడుద్దాం.

2006: ఎయిడ్స్ ని అరికడదాం - భాద్యతగా నడుచుకుందాం.

2005: ఎయిడ్స్ ని అరికడతామని వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడం.

2004: మహిళలు, బాలికలు- హెచ్ ఐ వి, మరియు ఎయిడ్స్.

2003: హెచ్ ఐ వి రోగుల పట్ల వివక్షత వద్దు .

2002: హెచ్ ఐ వి రోగుల పట్ల వివక్షత వద్దు .

2001: ఎయిడ్స్ రాకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను? మరి మీరు?.