తెల్లవారి ఇంత సేపు అయ్యింది...

ఈరోజు ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం....

ఇంకా శుభాకాంక్షలు తెలపలేదు అని అనుకుంటున్నారా...?

ఎలా తెలుపమంటారు...?

మనకు ఇంకా తెల్లవారలేదు... అదే చీకటిలో బ్రతుకుతున్నాం

బ్రిటిష్ ప్రభుత్వానికి , మన ప్రభుత్వాలకు పెద్ద తేడా ఏమీ లేదు...

మనదేశం లో తెల్లవాడు పోయి ... నల్లవారు దేశాన్ని పరిపాలిస్తున్నారు తప్పా.. మార్పు ఏమి లేదు...

స్వాతంత్రంగా జీవించే రైతులు లేరు...

కష్టపడే వారికి తిండి లేదు...

అవినీతి... అక్రమాలు జరగాని గ్రామాలు లేవు నా ఈ స్వాతంత్ర్య దేశం లో....

ఎలా తెలుపమంటారు...?

సామాన్యుడికి భయం రోడ్డు మీదకి పోవాలి అంటే...

రోడ్లు సరిగ్గా లేకపోయినా కానీ ఎక్కడ పోలీస్ వాడు వాహనానికి అది లేదు ఇది లేదు అని డబ్బులు దండుకుంటాడని....

నిరుద్యోగులకు భయం వందలు అప్లికేషన్ ఫీస్ కట్టించుకొని ఉద్యోగాలేమో అర్హత లేని వాళ్ళకి లక్షల్లో అమ్ముకుంటారు అని..,

పూరి గుడిసె ఉండే పేద వాడికి భయం ఆ గుడిసె ఖాళీ చేయించి ఏ ఆఫీస్ కడతారో అని..,

పేద రైతుకు భయం వెల కొలదీ ఎకరాలు ఉన్న వాళ్ళని వదిలేసి కుంచాలలో పొలం ఉన్న వాడు... కూతురికి పసుపుకుంకుమ కిందన ఆ పొలం ఇవ్వాలి అనుకుంటే... ఎన్ని లక్షల రూపాయలు పన్ను అడుగుతారో అని...

ఏదీ స్వాతంత్య్రం... ఒక స్త్రీ... కాదు కాదు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా రోడ్ మీద ప్రయాణించాలి అంటే భయం... ఎవడు రేపు చేస్తాడో అని...

అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశ పురాణం చాలానే ఉంటుంది... మన ఈ బ్లాగ్ కూడా సరిపోదు...

సరేలే మీరు మారారు... మన రాజకీయ వ్యవస్థ మారదు... మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశం అనీ... స్వాతంత్య్ర దేశం అని... సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలం వెలగదీద్దాం...

ఎక్కడి నుండో వచ్చి వాళ్ళ ఆధిపత్యం కోసం మనల్ని
అణసి వేస్తే.... డబ్బు కోసం మన సోదరుల్ని మనమే అతమరుస్తున్నాం కదా....

అందుకే నాకు బ్రిటీష్ కాలం లొనే అభివృద్ధి జరిగింది అని అనిపిస్తుంది.... అయినా నాకు ఎందుకు లే...

ఈ చీకటి కోరల్లోనే ఉంటూ కూడా.... స్వాతంత్య్రం వచ్చింది అని అపోహ పడే ప్రతీ భారతీయునికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు....


                                          ఆవేదన తో... మీ రామ్ కర్రి...