సన్నగిల్లుతున్న సంప్రదాయాలు

నేటి ఆధునికయుగములో పూర్వపు ఆచారాలు, సంప్రదాయాలు మూఢనమ్మకాలుగా మారాయి. మన సంస్కృతికి జీవగర్రలు అయిన ఇవి ప్రస్తుతం ఊతకర్రతో నడుస్తున్నవి. ఏదో మొక్కుబడిగా చేస్తున్నాం కాని నిజమైన భావంతో చేయటం లేదు. మరికొన్నాళ్లకు ఆచార సంప్రదాయాలతో పాటు పండగలు కూడా అదృశ్యం అయ్యే ప్రమాద ఘంటికలు విన్పిస్తున్నవి. పండగలు దండగలు అవ్ఞతున్నవి. దీనికి కారణం ఆధ్యాత్మిక లోపం. ధనదాహం. పండగ రోజు కూడా డబ్బు దం డుకొందాం అనే ఊహ తప్పించి ఆచార సంప్రదాయాల అర్థాన్ని, పండగ పరమార్థాన్ని గ్రహించే రోజులు పోయాయి. ఈ యాంత్రిక యుగములో చెప్పేవారు లేరు. చెప్పినా వినేవారు అసలు లేరు. అందుకే పండగలు, ఆచారాలు నిర్జీవంగా, నిరాదరణగా ఆనందం లేకుండా సాగుతున్నవి. పెద్దలు పెట్టిన ప్రతి ఆచారం మన అందరం ఆనందంగా ఉండాలని, పర్వదినాల్లో అయినా భగవంతుని గురించి తెలు సుకోవాలని ప్రవేశపెట్టారు. ఈనాటి వరకు ఈ సమాజం, కుటుంబవ్యవస్థ కూలిపోకుండా కాపా డింది ఈ పండగలు, ఆచారాలే. ఆచారాలు అనగా దాని అర్థం తెలిసి చేసినవి.
సంప్రదాయాలు అనగా దాని అర్థం తెలీకుండా తాతముత్తాలు నుండి చేస్తున్నారు కదా మనమూ చేద్దాం అని మమ అనే పద్ధతిలో చేసినవి. మన పెద్దలు చేసినవి ఆచారాలు. మనం చేస్తున్నవి సంప్రదా యాలు. తెలిసి రామభజన అన్నారు. రాముడు ఎంత ఉన్నతుడు, ఎలాంటి గొప్పవాడు అని తెలిసిచేసింది నిజమైన రామభజన. వాడు భజన చేస్తున్నాడు, నేనూ చేస్తాను అని చేసిన ఫలితం అంతంత మాత్రమే. మన పూర్వీకులు చేసిన ప్రతి ఆచారం తెలిసి చేసేవారు. తెల్లవారి బ్రాహ్మీమూర్తంలో లేచేవారు. ఆ సమయంలో వీచేగాలి అమృతతుల్యమైనది. అందులోని ప్రాణవాయువ్ఞ మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పురాణాల ప్రకారం ఆ సమయంలో స్వర్గంలోని పారిజాత వనం నుంచి వీచే గాలి వీస్తుందని అంటారు. ఆ సమయంలో చేసే ధ్యానం కూడా బాగా కుదురుతుంది. ప్రపంచం ఇంకా నిద్రలేవలేదు కనుక ప్రశాంతంగా ఉండి, నిద్ర అప్పుడే లేస్తాం కనుక మెదడు చురుకుగా ఉండి సాధకులకు, రచయితలకు, విద్యార్థులకు మంచి అనుకూల కాలంగా ఉంటుంది. యోగా లాంటివి కూడా ఆ సమయంలో మంచిఫలితాన్నిస్తాయి. ధ్యానం బాగా కుదిరి దైవఆశీర్వాదం లభిస్తుంది. పూర్వం ఆ సమయంలోనే ఆడవారు నిద్రలేచి ఇంటి పని ప్రారంభించేవారు. మగవారు పొలాలకు పోయేవారు. ఆ సమయంలో ప్రకృతి దృశ్యం కూడా ఎంతో రమణీయంగా ఉండి మనసుకు కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
దానికి ప్రత్యామ్నాయమే నడక, బంతి ఆటలు మొద లైనవి. ఆడవారు ఆ సమయంలో రంగవల్లులు (బియ్యపు పిండితో) తీర్చిదిద్దటం వలన వారిలోని సృజనాత్మకత పెరగటమే కాక చీమలు లాంటి మూగజీవాలకు పెందల కడనే ఆహారం లభించేది. ఇలా మన ఆచారాలు మనకు కాక సృష్టికీ ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. నేడు వస్తున్న కలర్స్‌ ముగ్గులు వలన మనకే కాక పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతోంది. పూర్వం గడపలకు పసుపు రాసేవారు. దానివలన అది యాంటి బయోటిక్‌గా పనిచేసి సూక్షజీవ్ఞలే కాక పాములు లాంటి విషజీవ్ఞలు కూడా లోపలికి ప్రవేశించేవి కావ్ఞ. నాటి స్త్రీలు కూడా క్రీములకు బదులు పసుపునే రాసుకొనేవారు. దాని వలన వారికి చర్మవ్యాధులు రాకపోవటమేకాక, మంచి చర్మ సౌందర్యం కలిగి ఉండే వారు. ఈనాడు గడపలకు, గోడలకు అంతా కలర్‌ పెయింటింగే. కాబట్టి పాములు వస్తున్నవి, పాముకన్నా ప్రమాదకరమైన కేన్సర్‌ లాంటి వ్యాధు లు సోకుతున్నవి. ఆనాటి సున్నం తెల్లగా ఉండి మనస్సును స్వాంతన పర్చటమే కాక ఎంతో ఆరోగ్యాన్నిచ్చేది. శరీరములోని అధికవేడిని తగ్గించేది.
పున్నమి నాటి రాత్రి ఆరుబయట పవళించే ఆనందాన్ని కలుగ చేసేది. పెద్దలు నియమించిన సంక్రాంతి లాంటి పండగలు ఎక్కడో ఉన్న రక్తసంబంధీకులనందరి ఓ చోట చేర్చి మర్చిపోతున్న వారి ప్రేమాబి µమానాలను గుర్తుచేస్తూ ఉంటాయి. కాలానుగుణంగా పండగ వంటల్లో వండిన వంటకాలు మనిషికి ఎంతో బలాన్ని, ఆరోగ్యాన్నిస్తాయి. చనిపోయిన మన పెద్దలను పూర్తిగా మర్చి పోకుండా సంక్రాంతి పెద్ద పండగలు గుర్తుచేసే విధానం ఆత్మీయతలు, అను బంధాలు ఎడల మన పూర్వీకులకు ఉన్న గొప్ప ప్రేమను తెలియజేస్తుంది. ఉగాది పచ్చడి మన జీవితంలోని కష్టసుఖాలు ఒక్కటిగా తీసుకోవాలని అనే జ్ఞానాన్ని తెలియజేస్తుంది. నాటి పెద్దలు తినే అంబలి, తోప, బెల్లం లాంటి బలవర్ధక ఆహారాలు మంచి అలవాట్లకు కాలం చెల్లిపోయింది. ప్రపంచం మంచిగా మళ్లీ మారాలి అంటే మన ఆచారాలు పాటించక తప్పదు. –


---------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -

Whatsapp : +918096339900 ,
Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -


Web Sites & Blogs :

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---
Google Map : Ram Karri

----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------