శరీరంలోని 7 చక్రాలకు సంబంధించిన మార్మిక విజ్ఞానం :
ఆ 7 చక్రాలు ఏమిటి?
వాటిని 114 నాడీ కేంద్రాలు లేదా కూడళ్లుగా గమనించవచ్చు. ఆ నాడులు శక్తి శరీరములోని ప్రాణశక్తికి వాహకములు. ఈ కేంద్రాలు ఎల్లప్పుడూ త్రిభుజకారంగా ఉంటాయి. చక్రముల్లాగ అంటే గుండ్రని లేదా వృత్తకారంతో కదులుతున్నట్లుగా, అవి ఒక పరిమాణం నుండి మరొక పరిమాణంలోకి చలనం తీసుకువస్తాయి కాబట్టి, గుండ్రనివి చక్రాలు కదలికకు ప్రతీక కాబట్టి వీటిని చక్రములని అంటారు. కాని వాస్తవానికి అవి త్రిభుజాలు.
ఈ 7 పార్శ్వాలు లేదా పరిమాణాలను 7 చక్రాలుగా ప్రస్తావిస్తారు. ఇదే 7 విధాలైన యోగములకు ఆధారం అయ్యింది.
ఈ 114 చక్రాలలో రెండు చక్రాలు భౌతిక శరీరానికి బయట ఉంటాయి. మిగిలిన 112 చక్రాలలో కేవలం 108 చక్రాలు మీద మాత్రమే సాధనకు అనువై ఉంటాయి. మిగిలిన నాలుగు, సాధనకు పర్యవసానంగా వికసిస్తాయి అంతే. సూర్యగ్రహ మండల వ్యవస్థ నిర్మాణంలో ప్రధానమైన 108 సంఖ్య కనుక అదే సంఖ్య మానవ శారీరక నిర్మాణ వ్యవస్థలో ఆవిర్భావం అయ్యింది. సూర్యుని వ్యాసానికి, సూర్యునికి భూమికి మధ్య ఉండే దూరం 108 రెట్లు. చంద్రుని వ్యాసానికి, చంద్రునికి భూమికి మధ్య ఉండే దూరం 108 రెట్లు. భూమి వ్యాసానికి సూర్యుని వ్యాసం 108 రెట్లు. అందువలననే 108 సంఖ్య పలు రకాలగా ఆధ్యాత్మిక సాధనలలో ప్రధానం అయ్యింది.
ఈ 114 చక్రాలలో రెండు చక్రాలు భౌతిక శరీరానికి బయట ఉంటాయి. మిగిలిన 112 చక్రాలలో కేవలం 108 చక్రాలు మీద మాత్రమే సాధనకు అనువై ఉంటాయి.
ఈ 112 చక్రాలును పదహారు అంశాలు కలిగి ఉన్న ఏడు పార్శ్వాలుగా విభాగించవచ్చు. 112 గురించి ప్రస్తావన అనేక మందికి ఎంతో ఎక్కువగా అనిపించవచ్చు కనుక అన్నిటి బదులు పరిమాణాలు, వర్గాలను బట్టి ఏడింటి గురించే మాట్లాడడం సాధారణం. ఈ 7 పార్శ్వాలు లేదా పరిమాణాలను 7 చక్రాలుగా ప్రస్తావిస్తారు. ఇదే 7 విధాలైన యోగములకు ఆధారం అయ్యింది.
112 నుండి 7 చక్రాలు
ఒక మనిషి భౌతికంగా, సామాజికంగా పూర్తి సామర్ధ్యంతో జీవించాలంటే అతని శరీరంలోని 21 చక్రాలు ఉత్తేజితం అయితే చాలు. ఈ 21 చక్రాలకు కూడా 7 సంఖ్యతో సంబంధం ఉంటుంది. పింగళ, ఇడ మరియు సుషుమ్న అనే మూడు విధములైన శక్తులు, ఒక్కొక్క దానిలో మూడేసి చక్రముల సముదాయంగా, ఏడు సముదాయాలుగా క్రియాశీలమవుతాయి. అవిధంగా ఇరవై ఒక్క చక్రాలు భౌతికంగా, మానసికంగా, భావనాత్మకంగా క్రియాశీలమైనప్పుడు మీరు పుర్ణతతో ఉండవచ్చు. కానీ శక్తి దృష్ట్యా కాదు.
ఒక మనిషి భౌతికంగా, సామాజికంగా పూర్తి సామర్ధ్యంతో జీవించాలంటే అతని శరీరంలోని 21 చక్రాలు ఉత్తేజితం అయితే చాలు. ఈ 21 చక్రాలకు కూడా 7 సంఖ్యతో సంబంధం ఉంటుంది.
ఒకవేళ సరైన జీవన సామర్ధ్యానికి ఎదగాలంటే మిగిలిన చక్రాలు ఉత్తేజితం అవ్వాలి. బుద్ధికుశలత శక్తివంతం అవ్వాలి. అలాకాకుండా బుద్ధి నిద్రాణమైతే, అది బుద్ధి అసలు లేకపోవడంతో సమానము. వినియోగంలోకి తీసుకురాలేని కంప్యూటర్ ఒక రాయి పలకతో సమానం. అలాగే మానవ శరీర వ్యవస్థ కూడా. ఇది ఒక సూపర్ కంప్యూటర్, అయినప్పటికి చాలామంది కేవలం మనుగడ లేదా బ్రతుకుతెరువే ప్రధానంగా దాని క్రియాశీలతను వినియోగిస్తుంటారు.
మనవ శారీరక వ్యవస్థకు కలిగిన సమర్ధత వెలికి తీసుకురావాలంటే, దానిని ఉత్తేజపరచవలసిన అవసరముంటుంది. హఠయోగం అనేది యావత్ శారీరక వ్యవస్థను ఉత్తేజితం చేసే ఒక క్రమసాధన. దురదృష్టవశాత్తు ప్రజలు హఠయోగ అంటే ఒక వ్యాయమం, లేదా అదో రకమైన ఆరోగ్య నియమం అనుకుంటారు. ఎప్పుడైనాసరే యోగా అనేది దేనికీ చికిత్స నిమిత్తం కాదు. మేము కేవలం శారీరక వ్యవస్థను పూర్తి సామర్ధ్యంతో పనిచేయించడం ఎలా అనేది చూస్తాము. అది పూర్తి సామర్ధ్యానికి చేరితే అంతా బహుళ ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలాగైనా అదే స్వయం సిద్ధమైన చికిత్సా విధానం వినియోగానికి తీసుకురాగల శక్తిని కూడా ఉత్తేజితం చేస్తుంది.
7 చక్రాల స్థానాలు & పేర్లు
మౌలికమైన చక్రాలుగా తెలియబడే ఏడింటిలో మూలాధారం, ఉపస్థేంద్రియమునకు గుదద్వారమునకు మధ్యగల స్థానం; స్వాధిష్టానం, జననేంద్రియమునకు కొద్ధిగా పైన స్థానం; మణిపూరకం, నాభికి కొద్ధిగా క్రింద స్థానం; అనాహతం, రెండు పక్కటెముకలు కలిసే చోటుకు కొద్ధిగా క్రింద స్థానం; విశుద్ధి, గొంతు వద్ద గల గుంటలాంటి నొక్కు స్థానం; ఆజ్ఞ, రెండు కనుబొమ్మలకు మధ్య స్థానం; సహస్రారం, బ్రహ్మరంధ్రం అనబడే, నడినెత్తిన అంటే జన్మించిన పసిపిల్లలో తలపై సుతిమెత్తగా ఉండే స్థానం.
చక్రాలకు ఒకటిని మించి ఎక్కువే సమర్ధతలు ఉంటాయి. వాటికి ఒక భౌతికంగానే కాక ఆధ్యాత్మిక సామర్ధ్యం కూడా ఉంటుంది.
మామూలుగా మాటల్లో తక్కువా, ఎక్కువా శక్తికేంద్రాలు అనే పదాలు మనం వాడుతుండవచ్చు. కానీ ఆ భాషవలన చాలాసార్లు సులువుగా తప్పుడు అర్ధం రావచ్చు. అది ఒక భవనం యొక్క పునాదిని పైకప్పుతో పోల్చినట్లుగా ఉంటుంది. పునాదితో పోల్చడంలో పైకప్పు శ్రేష్టమైనదని అర్ధం కాదు. భవన నిర్మాణానికి పునాదే పై కప్పు కన్నా ఎంతో ముఖ్యమైనది. నాణ్యత, జీవితకాలం, సుస్థిరత, మరియు భద్రతలు మొదలయినవి పై కప్పు కన్నా పునాది పైనే చాలావరకు ఆధారపడి ఉంటాయి. కానీ భాషా ప్రయోగంలో మాత్రం కప్పు పైన, పునాది క్రింద ఉంటాయి.
మీ శక్తి మూలాధారం నందు ఎక్కువగా నున్నట్లయితే, నిద్రా మరియు ఆహారాలే మీ జీవితంలో ప్రధానం అవుతాయి. చక్రాలకు ఒకటిని మించి ఎక్కువే సమర్ధతలు ఉంటాయి. వాటికి ఒక భౌతికంగానే కాక ఆధ్యాత్మిక సామర్ధ్యం కూడా ఉంటుంది. దీనికి అర్ధం అవి సంపూర్ణమైన మార్పును సంతరించుకోగలవు. ఉదాహరణకి, మీరు సరైన స్పృహను కలుగచేస్తే, ఆహారం నిద్రలకు పాకులాడే మూలాధార చక్రమే వాటినుండి సంపూర్ణమైన స్వేచ్ఛను సాధించగలదు.
శరీరంలో 7 చక్రాల సూక్ష్మకోణ దృష్టి
ఈ చక్రాలు శరీరంలో సాకారం చెంది ఉంటాయి. ఇవి సూక్ష్మ స్థాయిలో కూడా సాకారం కలిగి ఉంటాయి. ఈ ఆవిర్భవాలను క్షేత్రములనే పేరుతో పిలుస్తారు. ఎక్కడైనా ఎవరైనా నివసించే ఒక స్థలమే క్షేత్రం. మీరు మీ కార్యాలయంలో ఉన్నా కానీ నివసించే స్థలం మరొక చోట ఉంటుంది. అదే మాదిరిగా బయట ఉండే క్షేత్రాలను బాహ్య క్షేత్రాలని, లోపల ఉంటే అంతఃక్షేత్రాలని పిలుస్తారు. నివసానికి ఒక గృహం, విరామానికి ఒక గృహం.
ఈ చక్రాలు శరీరంలో సాకారం చెంది ఉంటాయి. ఇవి సూక్ష్మ స్థాయిలో కూడా సాకారం కలిగి ఉంటాయి. ఈ ఆవిర్భవాలను క్షేత్రములనే పేరుతో పిలుస్తారు.
మీరు ఇంటి వద్ద ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు. సాధారణంగా లౌకిక విషయాలే మీ సమయాన్ని జీవితాన్ని ఆక్రమించుకుని ఉంటాయి. మీ సమయంలో చాలా భాగం వంట, శుచిశుభ్రత, సర్దుబాట్లు వంటి నిర్వహణలకు గడుస్తుంది. వంట, శుచిశుభ్రతలు వంటి లౌకిక విషయాలు విరామ గృహంలోనూ ఉన్నా అవి మిమ్మల్ని మొత్తంగా ఆక్రమించుకోవు. అది ఒక ఉల్లాసవంతమైన జీవనం.
పర్వతంపైన ఒక విరామగృహంలో జీవనం భౌతికంగా కష్టతరంగా ఉన్నప్పటికీ, మామూలుగా నివసించే గృహంకన్నా మరింత ఉల్లాసవంతంగా ఉంటుంది. నివాస గృహంలో ఉండడం సులభం. సులభం కనుకనే చాలామంది బయటికి వెళ్ళకుండా ఇంటివద్దే ఉంటారు. అయినప్పటికీ నివాసానికి దూరంగా హోటల్లో ఉండాలని అనుకోకుండా, మరో విరామ గృహానికి వెళ్ళడానికి కారణం ఏమిటంటే, మీకు ఇంటివద్ద లభించే సౌఖ్యమూ తెలియాలి, అత్యంత ఉల్లాసవంతమైన జీవనం కావాలి. వాటి అన్నిటికి సరిపడా ఆ సృష్టికర్త సమకూర్చాడు. మీరు అంతగా స్పందన లేకుండా అంతఃక్షేత్రంలో నిద్రిస్తూనైనా ఉండవచ్చు, లేదా బాహ్య క్షేత్రంలోనైనా ఉండవచ్చు. ఎప్పుడైనా వెనక్కి వెళ్ళాలనుకున్నా అది సమస్యే కాదు, మీరు ఎప్పుడైనా వెనక్కి అడుగు వేయవచ్చు.
రెండవ చక్రం స్వాధిష్టానం. స్వాధిష్టానంలో మీ శక్తి ఆధిక్యత సాధిస్తే మీ జీవితంలో సుఖానుభూతి ఆధిక్యత వహిస్తుంది – మీరు వినోదాలను కోరుకుంటారు
రెండవ చక్రం స్వాధిష్టానం. స్వాధిష్టానంలో మీ శక్తి ఆధిక్యత సాధిస్తే మీ జీవితంలో సుఖానుభూతి ఆధిక్యత వహిస్తుంది – మీరు వినోదాలను కోరుకుంటారు, మీరు అనేక విధాలుగా బౌతికమైన ఆనందాలు అనుభవిస్తారు. మణిపూరకంపై మీ శక్తి ఆధిక్యత సాధిస్తే మీరు మంచి పనిమంతులు; మీరు ప్రపంచంలో ఎన్నో కార్యాలు సాధించగలరు. అనాహతంలో మీ శక్తి ఆధిక్యత సాధిస్తే మీరు చాలా సృజనాత్మకత గలవారు. విశుద్ధిలో మీ శక్తులు ఆధిక్యత సాధిస్తే మీరు ఎంతో బలవంతులు కాగలరు. ఆజ్ఞ చక్రంలో మీ శక్తి ఆధిక్యత సాధించినా, లేదా ఆజ్ఞను చేరినప్పుడు మీకు మేధో పరంగా జ్ఞానోదయం తెలుస్తుంది. ఇది మీలో ప్రశాంతతను, సమతుల్యాన్ని ఇస్తుంది. అనుభవపూర్వకంగా జ్ఞానోదయం ఇప్పటివరకు మీకు జరగలేదు, కానీ మీ బయట ఏది జరుగుతున్నప్పటికీ, మీలో శాంతి సంతులనం పొందగల స్థితికి తెచ్చే బుద్ధికుశలత కలిగింది. ఇంక మీ శక్తులు ఒకసారి సహస్రారాన్ని స్పృశిస్తే, తన్మయత్వంలాంటి దివ్యానుభూతి మీకు కలుగుతుంది. బయట ఏ రకమైన ప్రేరకం ఉండదు, ఏ కారణం ఉండకనే కేవలం శక్తులు సరైన అగ్రస్థానాన్ని చేరడంతోనే సహజంగా ఆనంద పరవశులు అవుతారు.
7 చక్రాలు, 7 స్థాయిలుగా ప్రభావం
మౌలికంగా, ఆధ్యాత్మిక సాధనలో ఏ మార్గామైనా మూలాధారం నుండి సహస్రారం వరకు జరిగే ప్రయాణంగా వివరించవచ్చు. ఈ ప్రయాణం ఆధ్యాత్మికత ఒక పరిమాణం నుండి మరొక పరిమాణానికి చేరే పరిణామ ప్రక్రియ; ఇవి ఏడు విభిన్న స్థాయిలలో ఆధ్యాత్మిక ప్రభావంతో ఉంటాయి.
మౌలికంగా, ఆధ్యాత్మిక సాధనలో ఏ మార్గామైనా మూలాధారం నుండి సహస్రారం వరకు జరిగే ప్రయాణంగా వివరించవచ్చు.
మీ శక్తులు మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు చేరడానికి చాలా ఆధ్యాత్మిక ప్రక్రియలు మరియు మార్గాలు ఉన్నాయి, కాని ఆజ్ఞా నుండి సహస్రారం వరకు మార్గం లేదు. ఒక ప్రత్యేకమైన మార్గం అంటూ ఏమీ లేదు. ఇందుకు మనమో అగాధంలోకి దుకాలి, కానీ ఇది కిందికి దూకడం కాదు, పైకి పడడమే.
యోగాభ్యాసంలో పై వైపుకు పడడానికి మీకు ఆసక్తి లేకపోతే మీరు అక్కడికి చేరలేరు. ఇందువలననే చాలా మంది ఆధ్యాత్మిక సాధకులు ప్రశాంతతే ఉన్నత అవకాశమని ఆజ్ఞాచక్రం దగ్గరే ఆగిపోతారు. నిజానికి ప్రశాంతతే ఉన్నతమైన అవకాశం కాదు. మీరు అర్ధంచేసుకుంటే, అనుభవంతో చూస్తే ప్రపంచమంతా పెద్ద వినోదం అనిపించేటంత తన్మయత్వం చెందవచ్చు. అందరికీ మృతప్రాయంగా అనిపించేవి మీకు హాస్యాస్పదంగా అనిపిస్తాయి.
మీ శక్తులు మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు చేరడానికి చాలా ఆధ్యాత్మిక ప్రక్రియలు మరియు మార్గాలు ఉన్నాయి, కాని ఆజ్ఞా నుండి సహస్రారం వరకు మార్గం లేదు.
కానీ ప్రజలు ఆజ్ఞా చక్రం వరకు చేరి ఇంకా పైకి దూకడానికి మనస్సును సంసిద్ధం చేసుకోవడానికి చాలా కాలం ఆగుతారు. ఇందువలననే ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎప్పుడూ గురు శిష్య సంబంధాల గురించి అంత నొక్కి చెప్పడానికి కారణం మీరు ఇలా దూకాలంటే గురువుని పూర్తిగా నమ్మాలి. 99.9 శాతం ప్రజలు అలాంటి విశ్వాసం లేనప్పుడు దూకలేరు. ఇందుకే ఈ సంబంధానికి అంత ప్రాముఖ్యత ఉంది, పూర్తి విశ్వాసం లేకపోతే ఎవరైనా ఎప్పటికీ అలా దూకలేరు.
- స్వస్తి...