జీవితంలో ఏదో సాధించాలన్న తపన, కానీ అదేంటో తెలియదు.
ఎటు వెళ్లాలో తెలియక, నడిదారిలో నిలకడలేక నావలా తొణికిసలాడుతోంది ఈ జీవితం.
ప్రతి వ్యక్తికి ఏదో ఒక కర్తవ్యం ఖచ్చితంగా ఉంటుంది, కానీ అదేంటి అని తెలుసుకునేసరికే సగం జీవితం అయిపోయుంటుంది.
ఆ కర్తవ్యాన్ని నిబద్ధతో నిర్వర్తించుటలో జీవితాలు ముగిసిపోతున్నాయి.
ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది గమ్యం లేని ప్రయాణం చేస్తున్నారు, అస్సలు ఈ ధాత్రిపై వారి ఉనికి ఎందుకో వారికే తెలియదు.
గమ్యంలేని ప్రయాణం ఎటు చేరునో ఎవరికీ తెలియదు.
సరైన ప్రణాళిక ఉంటేనే గమ్యాన్ని చేరుకోవడం కష్టమవుతున్న తరుణం ఇది.
మరి అలాంటప్పుడు అసలు గమ్యమే లేకుంటే జీవితంలో ఏం చెయ్యాలి, ఎలా జీవించాలి?
బ్రతకడం ప్రతి ఒక్కరు చేసే పని, చివరికి కుక్క కూడా బ్రతుకుంది, మరి దానికి మనకి బేధం లేదా ?
ఉంది, కానీ ఎప్పుడైతే నీ కంటూ ఒక నిర్దిష్టమైన గమ్యాన్ని ఏర్పరచుకుని ఇష్టంతో దాన్ని చేరుటకు కష్టపడుతావో ఆరోజే నిజమైన జీవితం అంటే ఏంటి అని నీకు తెలుస్తుంది.
ఏదో బ్రతుకుతున్నాం అనుకుంటే పొరపాటు, జీవితం ఒక వరం, బహుశా కొంతమందికి అంది శాపం కావచ్చు (వారి దృష్టిలో)
మన జీవితం ఒక రాయి లాంటిది, దాన్ని నువ్వు ఎలా మార్చుకుంటావో అలాగే దాని విలువ మారుతుంది.
ఒక రాయిని సమాంతరంగా చేసితే , ఇంటి పునాదికో లేక గోడలు కట్టుకోవడానికో వాడుకుంటారు, అదే రాయిని ఒక దైవం లా చెక్కితే పూజిస్తారు.
నువ్వు నీ జీవితాన్ని ఎలా మలచుకుంటావో నీ ఇష్టం, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా బాధపడుతావ్, ఆరోజు నా జీవితాన్ని నేను ఆలా మలచుకొని ఉంటె ఏదో సాధించి నా జీవిత సార్థకతను సాధించివుండేవాడిని అనుకుంటావు.
కాబట్టి, ఎవరైతే గమ్యం లేని ప్రయాణం చేస్తున్నారో ఇక ఆగిపోండి, మీ జీవితంలో వెనక్కు తిరిగి చూసుకుంటే మీ కన్నీరు కాదు, మీ పై అభిమానంతో ఇతరులు పెట్టుకున్న కన్నీరు గుర్తొచ్చేలా జీవించండి.
నేను చదివిన ఒక జీవిత సత్యం “గెలుపు ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, ఓటమి ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుంది”.
ప్రపంచానికి మీ గురించి చాటి చెప్పేందుకు ప్రయత్నించండి.
ఈ సొసైటీ ఏమనుకుంటుందో ? అన్న భయం మీకుందా, అయితే మీకోసం ఏమి చెయ్యని సొసైటీ గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు, మీరు కూడా ఆ సొసైటీ లో ఒకరిగా మిగిలిపోవాలి అనుకుంటే అలాగే ఉండిపోండి.
కాదు, నేను సాధించాలి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, దేశానికీ ఏదో చెయ్యాలి అనుకుంటే ఈరోజే నీ గమ్యాన్నినిర్దేశించుకో…..
విజయాలు సాధించి చరిత్రలు సృష్టించిన ప్రతిఒక్కరు మొదట్లో అవమానాలు పడ్డవారేనని మరవకండి...