ఈరోజు మనం law of attraction అంటే ఏంటి తెల్సుకుందాం .

మనకి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు . మనం ఏమైనా చేయాలి అంటే ముందు మన మనసులో అనుకోవాలి
అదే కాకుండా మనకి ఏమైనా పని అవ్వాలి అంటే దానికి 90% planning కావాలి ఆ planing కి తగట్టు పని చేస్తేనే ఆ result అనేది వస్తుంది .
ఈ law of attraction అనే concept rhonde Byrne రాసిన the secret అనే పుస్తకం ధ్వారా చాల famous అయింది .
అసలు ఈ law of attraction ఏమని చెప్తుంది అంటే . మనకి ఏమైనా జరగాలి అని అనుకుంటే ముందు అది compulsory గా జరుగుతుంది అనే నమ్మకం ఉండాలి దానితో పాటు మన ఆలోచనల్ని కూడా దాని మీదే ఉంచాలి . మన నమ్మకం ఆలోచన గనక గట్టిగ ఉంటె . మనం ఏమి అనుకుంటే అది జరుగుతుంది అనేది law of attraction లోని concept. ఈరోజు ఇది నిజంగా జరుగుతుందా లేదా అనే దాని మీద discuss చేద్దాము . ముందు మనకు ఎమన్నా కావాల్సిన పని జరగాలి అనుకుంటే ఆ ఆలోచన ముందు మన brain కి వెళ్తుంది . మన brain ఆ ఆలోచన కి solution వెతుకుతుంది . మనకి solutions వచ్చినప్పుడు మనం ఆ పని మీద work మొదలుపెడతాం . మనకి ఏ పని జరగాలన్నా దానికి మన మెదడు చాల ముఖ్యం . ప్రపంచంలో ఉన్న 80లక్షల జీవరాశులలో దేవుడు మనకే ఆలోచించే మెదడు ని ఇచ్చాడు . అందుకే మనకన్నా పెద్ద జంతువులు బలమైన జంతువులు ఉన్నా మనం వాటిని ctrl చేయగలిగే capacity మన మనుషలకే ఉంది ఇది తరతరాలుగా మన DNA లో పాతుకుపోయిన ఒక వరం . దీని బట్టి మనం ఆలోచిస్తే మనుషులు అందరికి common గా ఉండేది DNA . so మన అందరికి ఆలోచించే శక్తీ ఉంది కానీ మనం మన ఆలోచనల్ని సరైన విధంగా ఉపయోగించము . ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళు పెద్ద పెద్ద scientist లు engineers doctor లు business man లు అవుతారు . ఇప్పుడు మనం daily ఉండే problem లు ఎలా solve చేస్తామో చూద్దాము
ఇపుడు మనకి చలి గా ఉంది దానిని problem అనుకుంటే మనం అప్పుడు fan ఆపేస్తాము . అదే వేడి గా ఉంటె fan వేసుకుంటాం .
అదే విధంగా మనకు ఆకలి వేస్తే మనం భోజనం చేస్తాం . So ఇవన్నీ మనకి daily ఉండే చిన్న చిన్న problem. దీనిని మనకు నచ్చిన విధంగా solve చేస్తాం .
మనలో ఇప్పుడు చాల మంది లావు అయిపోతున్నాము weight ఎలా తగ్గాలి అని అనుకుంటూవుంటాము ఇలా లావు గా ఉండేవాళ్ళు weight తగ్గాలి అని అనుకుంటే వాళ్లలో చాల తేడాలు వచ్చేస్తాయి . Gym కి వెళ్ళాలి . ఎలా workout చేయాలి . ఎలాంటి food తినాలి , ఎలాంటి food తినకూడదు . రకరకాల diet లు follow అవుతారు చాల మంది తగ్గుతారు కూడా . ఇక్కడ మనం చూస్తే వాళ్ళు లావు గా ఉన్నపుడు YouTube లో video లు diet లు తెగ చేసేస్తారు , ఇవన్నీ ఎప్పట్నుంచో ఉన్నాయ్ కానీ వాళ్ళకి ఆ ఆలోచన అనేది వచ్చినప్పుడు మాత్రమే అవి చూస్తారు . వాళ్ళకి ఆ ఆలోచన రాగానే ఎప్పుడు చూడని video లు weight loss పుస్తకాలు చదివి వాళ్లకి వున్న problem కి solution వెతికేవాళ్ళు బరువు తగ్గించుకుంటారు . ఈ విధంగా law of attraction పని చేస్తుంది . ఈ law of attraction పని చేయాలి అంటే రెండు ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి . ఒకటి నాకు ఏమి కావాలి . రెండు అది కావాలంటే నేను ఏమి చేయాలి .

ఇపుడు మనకి డబ్బులు కావాలి ధనవంతులు అవ్వాలి అనుకుందాం . దాని కోసం మనం ఏమి చేయాలి . ముందు ధనవంతుడు అయినట్టు ఆలోచించి నేను ధనవంతుడుని అయ్యాను అని అనుకోవాలి . ఏంట్రా అనుకుంటే అయిపోతుందా , నేను చాల అనుకుంటా అవన్నీ అయిపోతాయా అని నన్ను అడగొద్దు . అది నిజమే ఎందుకంటే మనం అనుకోగానే అన్ని అయిపోవు . చాల మంది కొన్ని తప్పులు చేస్తారు . వాటి వల్ల మనం అనుకున్నవి చేయలేము . అవేవో పెద్ద తప్పులు కాదు కానీ అవి నీ పనిని మాత్రం ఆపేస్తాయి అవి ఏంటంటే .

1. మనం మన brain కి పని పెట్టం.

ఈరోజుల్లో fb ఉంది Youtube ఉంది PlayStation ఉన్నాయి evening pub లు ఉన్నాయి . ఈ విధంగా ఆలోచిస్తే మనకి రోజు అంత entertainment లు ఉంటాయి ఇన్ని entertainment లు ఉంటె మనకి ఆలోచించడానికి ఇంత time ఎక్కడ ఉంది ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే , మనం concentration అంత చేయాల్సిన పని మీద ఉంచాలి అప్పుడే మనం ఆ పని correct గా చేయగలం అంతే కానీ కాస్పెయూ fb browse చేద్దాము ఒక CInema చూసి పనిచేద్దాం అని ఆలోచిస్తే మన పనులు అవ్వవు కదా , slow గా మనం ఆ పని చేయడమే మానేస్తాం .

2 మన వల్ల కానీ పనులు గురించి ఆలోచన చేయడం .

OK నిన్న అంతా సినిమాలు చూసాం ,fb, whatsapp, social media చుట్టేసాం , బయట తిరిగేసాం . తర్వాత ...ఈరోజు ఏమనుకుంటున్నాము ? అయ్యో నిన్న అంతా time waste చేసేసామే అని. అలా అనుకోవడం వల్ల ఈరోజు కూడా time waste అవుతుంది తప్ప అయిపోయిన విషయాన్ని మార్చలేం .so ఈ విధమైన ఆలోచనలు ఉంటె మనం అనుకున్న పనులు చేయడం చాల కష్టం . మన brain కి confusion ఇచ్చే పనులు గురించి ఆలోచన చేయడం , ఇది మన అందరికి common గా ఉండే తత్వం . నాకు కొంత మంది చెప్తుంటారు . నా దగ్గర చాల idea లు ఉన్నాయి . అది start చేస్తే నా company పెద్ద trendset చేస్తుంది అని . మళ్ళీ వాళ్లలోనే వేరే ఆలోచన ఉంటుంది అయినా ఇప్పుడు life happy గా ఉంది ఇన్ని risk లు అవసరమా అని . ఇలా మనలో రెండు రకాల ఆలోచనలు ఉండడం వల్ల ఉపయోగం లేదు . నువ్వు చేయాలి అనుకుంటే నువ్వు ఆ పని చేయాలి వద్దు అనుకుంటే వదిలేయాలి అంతే కానీ రెండు పడవల మీద కాళ్ళు వేయడం వల్ల ఉపయోగం లేదు .

3 మనం అనుకున్న పని చేయటానికి కావాల్సినంత time ఇవ్వకపోవడం .

ఇప్పుడు మనలో చాల మంది నాకు ఒక business idea ఉంది దాని ధ్వారా కొన్ని కోట్ల రూపాయిలు సంపాదిస్తా అని అంటారు సరే business మొదలు పెడదాం అనుకునే సరికి ఎందుకొచ్చింది . మనం అనుకున్న time కి సంపాదిస్తామో లేదో అని ఆలోచించి ఆ పని చేయడం మానేస్తారు . మనం ఏమైనా పని చేయాలి అంటే దానికి కొంచెం సమయం పడతుంది అంతే కానీ అన్ని పనులు అయిపోవాలి అంటే అవ్వవు . కొన్ని సార్లు మనం అనుకున్నది సాధించడానికి కొన్ని సంవత్సరాలు పడతుంది లేకపోతే ఒక పది సంవత్సరాలు పట్టొచ్చు కానీ మన అనుకున్న పని మాత్రం అవుతుంది . So మనం ఏ పని చేయాలి అనుకున్న దానికంటూ సమయం పడుతుంధి అనే అవగాహనా మనకు ఉండాలి .

అంతా బానే ఉంది , మన law of attraction బాగా పని చేయాలి అంటే ఏమి చేయాలి ?

1ముందు మనం problem నుంచి పరిగెత్తకుండా . ఆ problem ని solve చేయగలము అనే ధ్యాస పెట్టాలి

2 మనం పని చేసేప్పుడు మన focus అంతా ఒక problem మీద ఉండాలి అది అయ్యేంతవరకు మన concentration దాని మీదే ఉండాలి

3 negative ఆలోచన ఆపేసి మనం ఆ పని చేయగలం అనే ధీమా తో ముందుకు వెళ్ళాలి .

4 ఇది చాల important. ముందు నువ్వు చేసే పని నీవల్ల నిజంగా అవుద్దా లేదా అనే నిర్ధారణ నీలో ఉండాలి . లేకపోతే అనవసరంగా అవ్వని పనులు మీద నీ energy ని waste చేసినట్టు ఉంటుంది .

ఈ విధంగా ఈ నాలుగు rules apply చేయగల్గితే . మనం అనుకున్నది అనుకున్నట్టు చేయగలం .


---------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -

Whatsapp : +918096339900 ,
Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -


Web Sites & Blogs :

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---
Google Map : Ram Karri

----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------