ప్రపంచం లోకెల్లాఅందమైనవారు...
అంతకన్నా అందమైన మనసు ఉన్నవారు..
అన్ని రంగాలలోను అభినివేశం వున్నవారు...
మొక్కవోని దైర్య సాహసాలుకలవారు...
తనవారికోసం నిలబడే ధీసాలులు వారు...
కష్టాలను,కన్నీళ్లను లెక్కచెయ్యని వారు...
స్నేహానికి ప్రాణం ఇచ్చేవారు...
మానవత్వానికి విలువనిచ్చేవారు...
ఇన్ని మాటలెల...
వారు ఈ సృష్టి కే సృష్టికర్తలు...
ఎవరు
ఇంకెవరు
ఆడువారు
తల్లిలా,చెల్లిలా,చెలిలా నెచ్చెలిలా,కూతురిలా ఇలా
ఎన్నో ఎనెన్నో రూపాలను సంతరించుకుంటూ ఉన్నారు...
అలాంటి ఎందరో స్త్రీ లకి అభినందనలు...
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...
కృతజ్ఞతతో మీ రామ్ కర్రి
8096339900
ఆధునిక సభ్య సమాజంలో ప్రస్తుత వ్యవస్థ లో ..దిన..దిన ప్రవర్ధమానమవుతున్న మహిళాభ్యున్నతినిపరిశీలిస్తే అది అందరు హర్షించ దగిన విధం గానే వుంది…
ఒప్పుకోదగిన పరిణామం .
నాటికి , నేటికి ..స్త్రీల పరిస్థితులు మారాయి.
నాలుగు గోడలమధ్య వంటిల్లే స్వర్గం లా భావించే మహిళలు ఇప్పుడు జన జీవన స్రవంతిలో ఒక విశిష్టమైన శక్తిలా కలిసి పోయి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు.
అభినందించవలసినవిషయం .
విద్యారంగంలో బాలికలదే అగ్రస్తానం. ! ఆనందించవలసిన విషయం,
వృత్తి విద్యాకోర్సులు , ఉద్యోగాలలో, రాజకీయాలలో , స్త్రీలకూ ప్రాముఖ్యత !! స్త్రీలు సమంగా , నేర్పుగా, అంకితభావంతో పనిచేస్తారు . వారు రాణించినంత విధంగా పురుషులు రాణించలేరు .!! గొప్ప విశ్లేషణ .!!!
సంతోషించదగిన మార్పు.వైద్య,విద్య, విజ్ఞాన ,రాజకీయ, క్రీడా, రక్షణ , రంగాలలో ఎక్కడ చూసిన, ఏ నోట విన్నా , మహిళా శక్తి! మహిళాస్పూర్తి!!మహిళ చైతన్యం !!! మహిళా అభ్యున్నతి. !!!! దీని గురించి ఉపన్యాసాలు! ఉద్యమాలు.. ఉపమానాలు !!!సన్మానాలు.!!!!!సత్కారాలు !!!!!!!విని, చూసి, పొంగిపోవటం లో ఆవగింజంతైనా అతిశయోక్తి లేదు. ..
మనస్పూర్తిగా అందరు..
ఏకగ్రీవంగా అంగీకరించవలసిన విషయమే …!!
కాని…..ఈ రెండు అక్షరాల లోనే వుంది అసలు విషయమంతా….
ఇన్ని రకాలుగా, అన్నివిధాలుగా ఇంత గొప్పగా ..
ఎంతో ..అద్భుతంగా ఆవిష్కరించబడుతున్న సతీ పాత్ర,
సమాజం లో మమేకమవుతున్న స్త్రీ అభ్యుదయం ..
ఇంకా మొదట్లోనే వుంది.. మొక్కగానే వుంది ..
ఎక్కడో ఒకచోట దాని కూకటి వేరు కత్తిరించబడుతునే వుంది.బాలికగా .. విద్యార్ధినిగా, గృహిణిగా..ఉద్యోగినిగా, మంత్రిగా ఇలా ఎన్నో విధాలుగా రూపాంతరాలు చెందిసమాజంలో భాగంగా మారినా .. స్త్రీ యొక్క స్వయం నిర్ణయం .
ఇంకా అది.. పురుషుల చేతుల లోనే వున్నది.
స్త్రీ పురుషులు ఇద్దరూ. పరస్పర అవగాహనతో కలసి ..నడవాల్సిందే !
కాని.. నియంతృత్వ ధోరణి తో నడవడమేఅభ్యంతరం ..
కాని అదే జరుగుతుంది.. అడుగడుగునా ఆటంకాలు.
అలుపెరుగని పోరాటాలు అత్మాభిమానఅణచివేతలు..ఆత్మవిశ్వాసానికి బెట్లు.. !!!
ఇవన్ని ..కలసి మహిళలను వుప్పెనలా చుట్టుకుంటున్నాయి. ..తర తరాలనుండి వస్తున్న సంప్రదాయాలు.. ఆచారాలు, నర నరాల్లో జీరించుకుపోయిన ఈ వ్యవస్థ లో ..కాలక్రమేణా.. పెను మార్పులు చోటు చేసుకున్నాయి,, ఇంకా పూర్తి స్థాయిలో మార్పులు జరగాలంటే.. చాలా ..సమయం పడుతుంది.. ఇప్పటికే పురుషుల ఆలోచనా దృక్పథం లో మార్పు వచ్చింది . ఎలా అంటే.. ఇప్పుడుభార్య అంటే. గృహిణిగా సేవలందించడమే కాకుండా ..,ఉద్యోగిని గా ఆర్ధిక సేవలందించి ..,మాతృత్వం తోసంసారాన్ని పెంచే త్రి పాత్రధారిణి ..!!!. అప్పుడు ..ఇప్పుడు..ఒకే విధంగా స్త్రీ శ్రమిస్తూనే వుంది..గృహ హింస, విడాకుల చట్టం.. ఇలా ఇంకా ఎన్నో చట్టాలు , స్త్రీలకి రక్షణ కవచాలుగా వచ్చినా.. సగటు స్త్రీ జీవితంలో రక్షణ కరువైందన్న కఠినమైన వాస్తవాన్ని అందరు గుర్తుంచుకోవాల్సిన అవసరం వుంది.మహిళే.. స్వయంగా రాజకీయ చక్రం తిప్పుతున్న నేపథ్యం లో, మహిళా బిల్లు ..ప్రవేశ పెట్టటానికే …ఎన్నెన్ని అవస్థలు పడ్డారో.. ఎన్నెన్ని ..ఆటంకాలు ఎదురవుతున్నాయో అందరికి తెలిసిన విషయమే …ఏది ఏమైనా… సగటు స్త్రీ జీవితం లో సమూలమైన మార్పు రావాలి . అత్యాచార కేసుల్లో దోషిని కఠినంగాశిక్షించాలి.. ప్రతి మహిళ ఆత్మ విశ్వాసం తో బ్రతుక గలగాలి.. ..నిర్భయంగా ..నిర్ణయాధికారాలు చేపట్టగలగాలి.అది జరగాలంటే..ముఖ్యంగా పురుషుల దృక్పథం మారాలి. మహిళాచైతన్యం రావాలి. చైతన్యం ఎక్కడి నుండోరాదు.. ముందు మన ఇంటి నుండే మొదలు పెట్టాలి. స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ..స్వాభిమానంతో..ఆత్మ విశ్వాసం తో ముందుకు అడుగు వేయాలి!!! అటువంటి సమ సమాజం గల అద్భుత ప్రపంచాన్నిఆవిష్కరించవలసిన సమయానికి …
స్వాగతంపలుకుదాం…నేటి మహిళకు అభినందనలు తెలుపుదాం …
-స్వస్తి...