------ ------- ----- ------ ----- ------ ------ ------- ------ ------ 

ఎప్పుడైనా మీకు ఆస్తి అంతస్తులువున్నాయని అహం పెరిగితే....!

శ్మశానాన్ని ప్రదక్షణ చేసి సమాధులు చూసి రండి...

కుదిరితే చనిపోయినోడు ఏం తీసుకెళ్ళాడో అడగండి...!

ఎప్పుడైనా మీకు పరమాత్మునిపై ప్రేమనేది కలిగితే...!

ఆకలితో ఉన్న వాడికి మీ చేతులతో అన్నం పెట్టండి ..

కడుపు నిండా దీవెనలతో మీ ఆత్మ సంతోషిస్తుంది చూడండి..!

ఎప్పుడైనా మీలో దాగిన రాక్షసుడు మేల్కొని వికట్టహాసం చేస్తే...

వాడిని ముక్కలు చేసి..గర్వంగా తలెత్తి నిలబడండి...!

ఎప్పుడైనా మీకు కొవ్వుపెరిగి కండ బలంతో పొగరెక్కితే..

ఏదైనా ఒక వృధ్ధాశ్రమానికి వెళ్ళి ఒక చుట్టుచుట్టి రండి...

సత్తువ తగ్గినవారు కాటివైపు నడుస్తుంటారు చూడండి...!

ఇదే జీవిత పరమార్ధం...

అందుకే..

మన ప్రవర్తనే మనకి దిక్సూచని తెలుసుకొని మసులుకోండి....!

------ ------- ----- ------ ----- ------ ------ ------- ------ ------ 

కర్మకు తగినట్లే  ఫలితం అందుకు తగినట్లే అవకాశాలు కూడా లభిస్తాయి .

సర్వవేళలా సంతోషంగా ఉండేవారు ఎవరూ ఉండరు , అలాగే అన్ని జన్మలలోను దుఃఖాన్నే అనుభవించేవారూ ఉండరు .

సుఖ దుఃఖాలతో కూడుకున్నదే ఈ సృష్టి .

దుఃఖమే లేకుంటే సుఖానుభూతి ఉండదు.

అందరూ సుఖంగా ఉండటం అసాద్యం.

------ ------- ----- ------ ----- ------ ------ ------- ------ ------ 

కొలమానంతో తినేవాడు యోగి !

కావాల్సినంత తినేవాడు భోగి !

అనవసరంగా తినేవాడు రోగి!

ఇతరులది తినేవాడు ద్రోహి!

------ ------- ----- ------ ----- ------ ------ ------- ------ ------ 

జీవితంలో ఏది ఊరికే రాదు, 

వచ్చినా,చివరి వరకు నీతో ఉండిపోదు

కంట్లో కన్నీరు అయినా, 

పెదవి పై చిరునవ్వు అయినా.

అందుకే స్థితప్రజ్ఞులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి..

------ ------- ----- ------ ----- ------ ------ ------- ------ ------

- స్వస్తి....