"ఆకుంటే .....ఈకుంటే...మీకుంటే....మాకుంటే"

ఇభరామ్ సాహేబ్ ముస్లిమ్ ఐనా...

తన రాజ్యములోనీ ప్రజలను- శ్రీరామచంద్రుని వలె పరిపాలించుటచేత అందఱూ అతని "మల్కిభ రాముడు" అని పిలిచేవారు.

ఒక బీద ముసలి పండితుడు - మల్కి భరాముని వద్దకు వచ్చి,

"రాజ! నిన్ను నా కవిత్వముతో మెప్పించి,బహుమతి పొందుదామని వచ్చాన"న్నాడు.

మల్కిభరాము డాతనితో-
"నేను నాలుగు పదములు చెపుతాను.-వానిని దత్తపదిగా స్వీకరించి,
నా గొప్ప తనమును-చిన్న కందపద్యములో వర్ణించమ"న్నాడు.

"ఆ పదములను చప్పమ"న్నాడు కవి!

ఇభరామ్ సాహేబ్-

"ఆకుంటే,ఈకుంటే,మీ కుంటే మాకుంటే.... ఈనాలుగు మాటలను ఉపయోగించి,పద్యమును వ్రాయమ"న్నాడు.

వెంటనే ఆకవి ఆపదములను వాడుతూ...ఈక్రింది పద్యమును చెప్పాడు.

కం"ఆకుంటే వృక్షంబగు
ఈకుంటే లోభియౌను,హీనాత్ముండౌ
మీకుంటే మా కియ్యడు
మా కుంటే మేము రాము మల్కిభ రామా!"

మల్కిభరామ చక్రవర్తి-పద్యములోని పదముల లాలిత్యమునకు సంతోషించి,కవిగారి చాకచక్యమును మెచ్చుకొని ఆకవికి బహుమతి నిచ్చి పంపించాడు.

భావము:
ఆకుఉంటే...చెట్టగును.ఇవ్వకుంటే పిసినారి యగును.హీను డగును. మీకు ఉంటే.....మాకు దానము చేయండి!మాకు ఉంటే....దానము కొఱకు రాము-

8⃣0⃣9⃣6⃣3⃣3⃣9⃣9⃣0⃣0⃣


---------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -

Whatsapp : +918096339900 ,
Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -


Web Sites & Blogs :

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---
Google Map : Ram Karri

----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------