🌲🌿🦋🌷🌹🔥🌴🍃🍀🌻🌱🎍🌸🍂🌾💐🍁🌳

*ధన దాహం*

"ఈ భూమి నాదంటే ....కాదు నాదంటూ.." తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన భూమి ఆస్తులు కోసం వారసులు తన్నుకు ఛస్తుంటే "భూమి" చిన్నగా నవ్వుతుంది.. ఎవరికీ తాను సొంతం కాక పోయినా "ఈ భూమి నాది" అన్న ప్రతిఒక్కరూ తనలో కలవాల్సిందేనని..

🌿🌲🌿🌲🌿🌲

కడుపులో కాళ్ళు పెట్టుకుని కన్నీటి సంద్రంలో జీవిత నౌకను నెట్టుకొస్తూ.. కటిక దారిద్యంలో వున్నవారు దాహం అని మంచినీళ్ళు అడిగితే.. కనికరం చూపని ఖరీదైన మనుష్యులను చూసి "నీరు"చిన్నగా నవ్వుతుంది. సునామీ వస్తే అందరూ తనలో కలవలిసిందేనని..

🦋🌹🌷🦋🌹🌷

విమానంలో ప్రయాణించే బడా బాబులు నేలపై పడుకుంటున్న వారిని చూసి అవహేళన చేస్తుంటే ఆ "ఆకాశం" కూడా చిన్నగా నవ్వుతుంది ఎప్పటికైనా అందరి ప్రాణాలు నింగిలో కల్సిపోవాల్సిందేనని..

🦋🔥🦋🔥🦋🔥

పంచభూతాల ప్రస్తావన ఎలా వున్నా..  చివరికి  ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన బంధాల మధ్య కూడా ధనం కోసం దెబ్బలాటలు వచ్చినప్పుడు..ఆ "ధనం" కూడా చిన్నగా నవ్వుకుంటుంది.. నన్ను సృష్టించిన మీరే నాకోసం విడిపోతున్నారని.

🌷🌹🌷🌹🌷🌹

చూశారా చిన్ననవ్వు లో ఎంత భయంకరమైన సత్యం దాగి వుందో...?!👌

ఈ సత్యాన్ని తెలుసుకున్నవారు నిజమైన "మేధావులు"☺

ఈ సత్యం ఎప్పటికీ అర్ధంకాని వారు ఒట్టి "మూర్ఖులు"..                 

శుభోదయం ఆత్మీయులారా...!!

🦋🌳🍁🔥🍀🌻🌲🌱🎍🌿🌸🍂🌾💐🍃🌹🌷🌴


------------------------------------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.
--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --

Whatsapp : +918096339900 ,

Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --

Web Sites & Blogs :


--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --
Google Map : Ram Karri


---------------------------------------- సమాప్తం --------------------------------