అమితమైన బలాన్ని అందించే - అతిబల ( ముద్రబెండ )
సంజీవని ఔషధ వన ఆశ్రమ అభిమాన పాఠకులారా ! 🙏🏻
 మన రాష్ట్రంలోని దాదాపుగా అన్నిగ్రామాలలో కనిపించే చెట్టు అతిబల . 
దాదాపుగా ఇది తెలియని గ్రామీణులు వుండరు.
 అమితమైన బలాన్ని అందించే శక్తి ఇందులో వుంది కాబట్టే దీనికి అతిబల అని పేరువచ్చింది.
 ప్రాచీనకాలంలో కూడా రామాయణంలోను భారతంలోను ఆ తరువాత కాలాలలో కూడా ఈ అతిబల మొక్క ప్రశంస చాలాచోట్ల కనిపిస్తుంది. 
దీని ఆకులు, పూలు, గింజలు, వేర్లు సర్వాంగాలు శక్తివంతమైనది. 
ఇలాంటి అసాధారణమైన ఔషధశక్తిగల ఓషధులు గ్రామ గ్రామానవుండి కూడా వాటి గురించి తెలుసుకోలేక ఉపయోగించుకోలేక మన భారత జాతి బలహీనమైపోతుందంటే ఇది ఎంత దురదృష్టమో ఆలోచించండి.
 ఇప్పటికైనా ఈ మొక్క గురించిన వాస్తవాలు ప్రజలందరికి తెలియజేసి అందరిని శక్తివంతులుగా మార్చడానికి ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాము . . .



అతిబల- పేర్లు
సంస్కృతంలో అతిబల అని, హిందీలో కంగి అని, 
తెలుగులో ముద్రబెండ, తుత్తురుబెండ, దువ్వెనకాయల చెట్టు, అతిబల అని, 
లాటిన్లో Malya Rotondifolia ఆంగ్లంలో Mallow Tree అంటారు.


అతిబల - రూప గుణ ధర్మాలు
తుత్తురుబెండ ఆకులు మృదువుగా జిగట కలిగి మేహశాంతిని కలుగజేస్తాయి .
 శరీరంలోని సకల మలినాలను బయటికి తోసివేసి శుద్దిచేస్తాయి.
 గడ్డలను వ్రణాలను మెత్తపరచి పక్వంచేసి మాన్పి వేస్తాయి. 
ఇంకా అనేకయోగాలు తెలుసుకుందాం . . .


మూత్రంలోమంట, రాళ్ళు వుంటే ?
తుత్తురుబెండ నాలుగైదు ఆకులు నలిపి పావు లీటరు నీటిలో వేసి సగానికి మరగబెట్టి వడపోసి చల్లార్చి ఒకచెంచా కండచక్కెర కలిపి మూడు పూటలా తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోయి రాళ్ళు కరిగి మూత్రం ద్వారా పడిపోతాయి . . .


నేత్రదోషాలకు - ఆకుకషాయం
పైనచెప్పినట్లు కషాయం చేసి చల్లార్చి ఆ కషాయాన్ని మూసిన కండ్లపైన కడుగుతూవుంటే కంటి దోషాలు హరించి కంటిచూపు పెరుగుతుంది . . .

జ్వర తీవ్రతలో - అతిబల
అతి బలాకులను నీటిలో నానబెట్టి వడపోసి అందులో కొద్దిగా కండచక్కెర కలిపి కొద్ది కొద్దిగా తాగుతూ వుంటే వేడితగ్గి జ్వరం శాంతిస్తుంది.

* ఇదేనీరు మూడుపూటలా సేవిస్తుంటే మూత్రంలో మంట, చురుకు, మూత్రాశయంలో వాపు, దీర్ఘకాలిక దగ్గులు కూడా హరించిపోతాయి . . .


పిచ్చికుక్క విషానికి - అతిబల
పిచ్చికుక్క కరచిన వెంటనే అతిబల ఆకులరసం 70 గ్రా॥ మోతాదుగా తాగించాలి. 
ఆకుముద్దను కాటుపైన వేసి కట్టుకట్టాలి. 
ఇలాచేస్తుంటే విషం విరిగి పోతుంది. . .


శీఘ్రస్కలనానికి - అతిబల
తుత్తురుబెండ గింజలు 50గ్రా||, శతావరి వేర్ల పొడి 100గ్రా॥, 
ఆ రెండింటికి సమంగా పటిక బెల్లంపొడి కలిపి నిలువవుంచుకోవాలి. 
రోజు రెండుపూటలా ఒకచెంచాపొడి చప్పరించి తిని ఒక కప్పుపాలు తాగుతూవుంటే శీఘ్రస్కలనం మాయమైపోయి వీర్యం గట్టిపడి యౌవనం పెరుగుతుంది . . .


పైత్యపు - గుండెదడకు
అతిబల ఆకులు ఏడు తీసుకొని మంచినీటితో నూరి బట్టలో వడపోసి ఆ రసంలో చక్కెర కలిపి తాగుతూవుంటే అధిక వేడివల్ల కలిగిన గుండెదడ శీఘ్రంగా హరించి పోతుంది . . .


నడుమునొప్పికి - నాణ్యమైన మార్గం
పైన తెలిపినట్లు అతిబల ఆకులతో కాచిన కషాయం రెండుపూటలా తాగుతూ ఆకులను నలగ్గొట్టి వేడిచేసి నొప్పుల పైనవేసి కట్టుకడుతూ వుంటే కేవలం నడుమునొప్పే కాక ఎక్కడి నొప్పులైనా తగ్గి పోతాయి . . .


మొలలకు - అతిబల ఆకుకూర
అతిబల ఆకులను కూరలాగానండి రెండు పూటలా తింటుంటే మొలలనుండి కారేరక్తం ఆగిపోతుంది.


స్త్రీల - స్తనాల వాపుకు
అతిబలవేరును నిలువచేసుకొని రోజూ రెండు పూటలా కొంచెం నీటితో సానరాయి పైన ఆవేరును అరగదీసి ఆ గంధాన్ని వాపులపైన పట్టిస్తూవుంటే రొమ్ముల వాపు తగ్గిపోతుంది.
అలాగే కండరాల వాపుపైన కూడా పట్టిస్తూవుంటే ఆవాపు తగ్గుతుంది.



దగ్గు, ఉబ్బసం - హరించి పోవుటకు
బాగా ముదిరిన అతి బలచెట్టును సమూలంగా పెకలించి తెచ్చి ముక్కలుగా చేసి కడిగి ఎండలో ఎండబెట్టాలి. 
తరువాత దాన్ని కాల్చి బూడిదగా చేయాలి. 
ఆ బూడిదను ఒకకుండలో పోసి నిండా నీరుపోసి మూడురోజులపాటు వుంచాలి.
 రోజుకు ఒకసారికర్రతో కలుపుతూవుండాలి.
నాలుగవ రోజున పైకితేలిన నీటినిమాత్రమే ఉంచుకొని చిన్నమంటపైన మరిగిస్తే అంతా తెల్లటి క్షారంగా మిగులుతుంది.
 దాన్ని మెత్తగానూరి నిలువ చేసుకోవాలి.
ఈక్షారం రెండుమూడుచిటికెల మోతాదుగా ఒకచెంచా తేనెతో కలిపి సేవిస్తువుంటే దగ్గు, ఉబ్బసం హరించిపోతాయి . . .


మూత్రపిండాల - నొప్పితగ్గుటకు
అతిబల ఆకులను 50గ్రా॥ తీసుకొని మెత్తగా నూరి చిన్న చిన్న బిళ్ళలుగా తయారుచేయాలి. 
తరువాత ఆవునెయ్యి 50గ్రా॥ పాత్రలోపోసి పొయ్యి మీద పెట్టి నెయ్యి మరుగుతుండగా 'ఈబిళ్ళలను అందులోవేయాలి. . . 
 బిళ్ళలన్నీ వేగేవరకు వుంచి దించి వడపోసి వాటిని నిలువచేసుకోవాలి.
 రోజూ రెండుపూటలా ఒకటి లేక రెండుచెంచాల మోతాదుగా వాటిని సేవిస్తుంటే మూత్రపిండాల నొప్పి తగ్గి పోతుంది . . .


నులిపురుగులు హరించుటకు
అతిబల గింజలను నిప్పుల పైనవేసి ఆ పొగను పిల్లల గుదస్థానమునకు తగిలేటట్లుగా చేస్తే దాని ప్రభావానికి లోపలి నులిపురుగులు హరించి పోతాయి . . .



మొలలకు - అతిబల గోలీలు
అతిబల ఆకులు ఇరవైఒకటి, అలాగే మిరియాలు ఇరవై ఒకటి తీసుకొని మొత్తం మెత్తగానూరి ఏడు గోలీలుచేయాలి.
 రోజు ఒకగోలీ చొప్పున ఏడు రోజులు పరగడుపున ఒకగోలీని మంచి నీటితో సేవిస్తుంటే వాతదోషం వలన కలిగిన మొలలు హరించి పోతాయి . . .


గుండె బలానికి - ముఖ కాంతికి
అతిబలవేర్లను దంచి పొడిచేసి జల్లించి నిలువ వుంచుకోవాలి. 
ఈ పొడిని మూడునాలుగు చిటికెల మోతాదుగా ఆవునెయ్యితో కలిపి రెండుపూటలా ఆహారానికి గంటముందు సేవిస్తుంటే గుండెకు బలంకలగడమేకాక ముఖంకూడా కాంతివంతంగా మారుతుంది . . .



✍🏻 . . . రామ్ కర్రి 
 జ్ఞానాన్వేషి 🧠, 
 ధర్మ రక్షక్ 📿, 
 నవ యువ కవి 📖, 
 రచయిత ✒️, 
 బ్లాగర్ 🪩 ,. 
 టెక్ గురు 🖥️ , 
 సామాజిక కార్యకర్త 🩸 , 
 📖 తెలుగు భాషా సంరక్షణ వేదిక 📚 , 
 🪷 సంజీవని ఔషధ వన ఆశ్రమం 🌱 , 
 మరియు 
 🛕 జ్ఞాన కేంద్ర 🚩 
 వ్యవస్థాపకులు . . . 








- స్వస్తీ . . . 
.