ఏ నొప్పులు ఉంటే ఎలా పడుకోకూడదు..

మనం నిద్రపోయే భంగిమ మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. కొన్ని రకాల నిద్రపోయే పొజిషన్లు.. అనారోగ్యానికి దారితీస్తాయి. కొన్ని రకాల వ్యాధుల రిస్క్ ని కొన్ని స్లీపింగ్ పొజిషన్స్ పెంచితే మరికొన్ని తగ్గిస్తాయి. మరి మీరు నిద్రపోయే భంగిమ మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్లు ఇలా పడుకోకూడదు..

బోర్లా పడుకొనే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ పొజిషన్ జీర్ణక్రియను స్పీడ్ చేస్తుంది. ఇంతవరకు మంచిదే అయినా ఎటువంటి సపోర్ట్ లేని పొజిషన్ కావడంచేత బ్యాక్ పెయిన్ వచ్చే ప్రమాదం ఉంది. గురకపెట్టి అలవాటుండి, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వంటివి లేకుంటే పొట్టపై (బోర్లా) పడుకోవచ్చు. కానీ పలుచటి దిండు ఉపయోగిస్తే మంచిది.

ఎడమవైపు మంచిది.

ఆహారం జీర్ణమై.. వ్యర్థాన్ని బయటకు తీసుకొచ్చే శోషరస గ్రంథులు, జీర్ణాశయం, మూత్రాశయం, క్లోమంపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఎడమవైపు తిరిగే పడుకోవాలి. గర్భిణీ స్త్రీలు పడుకునే విషయంలో తీసుకునే జాగ్రత్తలను ప్రసవ విధానం ఆధారపడి ఉంటుంది. ఎడమవైపునకు పడుకుంటే బిడ్డకి, తల్లికి మధ్య రక్త ప్రసరణ చక్కగా ఉంటుంది.

చర్మ సమస్యలు ఉన్న వాళ్లు ఇలా వద్దు.
. కానీ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది
వెల్లికిలా స్ట్రైయిట్ గా చేతులూ స్ట్రైయిట్ గా పెట్టుకుని పడుకుంటే వెన్నుముకకు చాలా మంచిది. ఈ సమయంలో వెన్నుముక న్యాచురల్ పొజిషన్ లో ఉంటుంది. ఇలా పడుకుంటే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. కాని ఇలా నిటారుగా పడుకుంటే చర్మంలో త్వరగా వయసు ఛాయలు కనిపిస్తాయట. చెస్ట్ పై ముడతలకూ ఆస్కారమిస్తారని పరిశోధనల్లో బయటపడింది.

మెడనొప్పివాళ్లు ఇలా చేయకూడదు..

మెడను తటస్థ భంగిమలో ఉంచాలి. మెడ కింద ఎక్కువ దిండ్లు పెట్టు కోకూడదు. బోర్లా పడుకోకూడదు.

భుజాలు.. చేతులు నొప్పిగా  ఉంటే ఇలా వద్దు..

ఓవైపునకు తిరిగి చేతులను అలాగే సైడ్ కి పెట్టుకుని పడుకుంటే వెన్నుముకకు మంచిదే అయినా భుజాలు, చేతులు నొప్పులకు గురవుతాయి. ఇలా ఎడమ లేదా కుడి వైపులకు తిరిగి పడుకోవడంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కుడివైపు తిరిగి పడుకునే ఉంటే హోర్ట్ బర్న్ సమస్యతో పోరాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మొకాళ్ల నొప్పులు ఉంటే ఇలా వద్దు..

మొకాళ్ల నొప్పులు ఉన్న వారు ముడుచుకొని పడుకోకూడదు. ఏ భంగిమలో పడుకున్నా కాళ్లను స్ట్రైయిట్ గానే ఉంచాలి. బొర్లా తిరిగి పడుకోకూడదు.
మీరు నిద్రపోయే విధానం బట్టి మీ ఆరోగ్యం ఆధార పడిఉంటుంది.. ఏ పొజిషన్ లో పడుకుంటే ఏమవుతుందో చూడండి


నిద్రపోయే భంగిమ వాళ్ల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని రకాల నిద్రపోయే భంగిమలు.. ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతాయి. కొన్ని రకాల వ్యాధుల రిస్క్ ని కొన్ని స్లీపింగ్ పొజిషన్స్ పెంచితే, మరికొన్ని తగ్గిస్తాయి. మరి మీరు నిద్రపోయే భంగిమ మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పొట్టపై పడుకోవడం అంటే.. బోర్లా పడుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇలా పడుకోవడం వల్ల.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కానీ.. ఇలా నిద్రపోవడం వల్ల ఎలాంటి సపోర్ట్ ఉండక బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు గురక పెట్టే అలవాటు ఉండి, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ లేకపోతే.. పొట్టపై ( బోర్లా ) పడుకోవచ్చు. కానీ పలుచటి దిండు ఉపయోగించడం మంచిది.
గర్భస్థ శిశువు పొజిషన్. ఈ పొజిషన్ లో నిద్రపోవడం వల్ల 60 శాతం మందికి.. మంచే జరుగుతుంది. కానీ అప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ భంగిమ వెన్నెముక, మెడకు మంచిది కాదు. అలాగే శ్వాస సంబంధ సమస్యలు కూడా ఎదుర్కొంటారు. గర్భిణీలకు, గురకపెట్టేవాళ్లకు ఈ పొజిషన్ చాలామంచిది
స్ట్రెయిట్ గా పడుకోవడం. స్ట్రెయిట్ గా పడుకుని, చేతులను స్ట్రెయిట్ గా పెట్టుకుని పడుకుంటే.. వెన్నెముకకు చాలా మంచిది. ఈ సమయంలో వెన్నెముక న్యాచురల్ పొజిషన్ లో ఉంటుంది. ఇలా పడుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఇలా స్ట్రెయిట్ గా పడుకోవడం వల్ల.. చర్మంలో త్వరగా వయసు ఛాయలు కనిపిస్తాయి. చెస్ట్ పై ముడతలు త్వరగా కనిపిస్తాయి.
ఒకవైపు తిరిగి పడుకోవడం ఒకవైపు తిరిగి పడుకుని, చేతులను అలాగే సైడ్ కి పెట్టుకుని పడుకోవడం వల్ల వెన్నెముకకు మంచిదే. కానీ.. భుజాలు, చేతుల నొప్పికి కారణమవుతాయి. ఇలా ఎడమ లేదా కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కుడివైపు తిరిగి పడుకునే అలవాటు ఉంటే.. హార్ట్ బర్న్ సమస్యతో పోరాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎడమ వైపు తిరిగి నిద్రపోవడం వల్ల.. కాలేయంపై ప్రెజర్ పెరుగుతుంది. అలాగే ఊపిరితిత్తులు, పొట్టపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. గర్భిణీలు ఎడమవైపు తిరిగి పడుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. ఎందుకంటే.. ఎడమవైపు పడుకోవడం వల్ల.. కడుపులోని బిడ్డకు బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా అందుతుంది.
భుజాలపై ఎక్కువ ఒత్తిడి పెంచి పడుకోవడం భుజాల సపోర్ట్ తో ఎక్కువ ఒత్తిడి పెంచి పడుకోవడం వల్ల.. వెన్నెముక, మెడ ఆరోగ్యానికి మంచిది. కానీ.. ఈ పొజిషన్ వల్ల.. గురక సమస్య వచ్చే అవకాశం ఉంది.
దిండును పట్టుకుని పడుకోవడం - ఎలాంటి పొజిషన్ లో అయినా.. దిండుని పట్టుకుని పడుకున్నారంటే.. తక్కువ నొప్పితో ఉదయం నిద్రలేస్తారు.
మీ ఆరోగ్యాన్ని బట్టి.. వీటిలో మీరు ఒక స్లీపింగ్ పొజిషన్ ని ఎంచుకుని హ్యాపీగా నిద్రపోండి..


---------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -

Whatsapp : +918096339900 ,
Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -


Web Sites & Blogs :

Intellectual Brainy || Ram Karri || Tech Guru Ram || Ammaku Prematho || Nannaku Prematho || Ethics of Old Genarations || Telugu Quotes Park || Health Tips || Telugu Vignana Sarvaswam || Telugu Whatsapp Group's || Go for Green World || Naaku Amma Cheppindhi ||Karri Ram || Left Handers Club India || Lefties Rule The World || BroadMind Creation's || Mana Telugu Patalu Lyrics || Pusthakalayam || Voice Of Ram || RamKarri.In || RamKarri.Com ||

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---

Facebook Id https://www.facebook.com/UrsRamKarri
Google Map : Ram Karri
LinkedIn      : https://www.linkedin.com/in/karriram


----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------