సాగిపో సోదరా....ఆగిపోకు ఎక్కడా....!

మోసకారులకు భయపడి
మనసు మూసుకోకు
శకుని ఆటకు భయపడి
పోరు వీడిపోకు
ఎండమావి అని తెలిసేవరకు
దాహం తీర్చింది ఆశే అని మర్చిపోకు.
రణరంగంలో కనుమూసే వరకు
అంతిమ విజయం నాదే అని పలవరించు.
కటిక చీకట్లో కృంగిపోయేటప్పుడు
మద్యాహ్నపు సూర్యుడినే నువు భ్రమించు.
గుండెల నిండా ఆశల ఎంజైమ్ ఉంటే
ప్రతి వైఫల్యం ప్రసూతి వైరాగ్యమే ...
సాగిపో సోదరా....ఆగిపోకు ఎక్కడా...