🚩● మేము హిందువులం● యోగిరామ్ జీ🚩





నీ కడుపు చీల్చి సాగుచేసి మమల్ని పోషిస్తున్నావూ....
 లోకమంత నిన్ను మట్టి అంటుంది.... 
మేము నిన్ను "భూమాత" అంటాం...
        --- మేము హిందువులం


లోకమంత వెలుగు నిచ్చావు... 
మా బ్రతుకుకు దీపమై నిలిచావు... 
ఇతరులు నిన్ను మండే అగ్నిగోళం అన్నారు... 
మేము నిన్ను "సూర్యనారాయణుడు" అన్నాం...
         --- మేము హిందువులం


నీ స్పర్శతో బీడు భూములు బంగారు భూములు అయ్యాయి.... 
నీ చలువతో దాహార్తుల ఆర్తనాదం చల్లారింది.... 
అన్యులు నిన్ను జలప్రవాహం అన్నారు... 
మేము నిన్ను "నదీమతల్లి " అంటాం... 
మా ఇంటి ఆడబిడ్డలా  లాంచనాలిస్తాం...  
హారతులిస్తాం.... 
ఆదరిస్తాం.... 
పుష్కర సంబరాలు చేస్తాం...
       --- మేము హిందువులం


 జన్మనిచ్చిన తల్లి, 
నడవడిక నేర్పిన నాన్న,
 విద్య నేర్పిన గురువులకి అది వారి బాధ్యత అనుకున్నారు వారంతా.... 
మేము 'మాతృదేవోభవ ', 
'పితృదేవొభవ', 
'ఆచార్యదేవోభవ' అన్నాం...
        --- మేము హిందువులం


ఇతర జాతులు హిందూ జాతిని దోచుకున్నాయి  కాని...
 హిందువులు ఎవ్వర్నీ దోచుకోలేదు... 
ఆ అవసరం కుడా లేదు,రాలేదు... 
ఇది రత్నగర్భ... 
వేదభూమి... 
ధన సంపదకీ పుట్టినిల్లు.. 
అడిగితే బిక్ష పెట్టేవాల్లం... 
పంచి ఇచ్చే గుణం మాది... 
దోపిడి సంస్కృతి వాల్లది....
        --- మేము హిందువులం


పాశ్చాత్య దేశాలు 
చీమిడి ముక్కుతో, 
చింపిరి బట్టలతో తిరిగేటప్పుడు 
పట్టు వస్త్రాలు కట్టిన చరిత్ర మాది.... 
నాగరికతలో ప్రపంచం కనులు కుడా తెరువకుండా పసికూనగా ఉన్నపుడే అంబరాన్ని అంటిన ఘనత మాది...
        --- మేము హిందువులం


మహోన్నతమైన సనాతన సంస్కృతికి వారసులం 
అని తలుచుకున్నపుడల్ల మా హృదయం ఉప్పొంగుతుంది... 
మా కనులలో వెలుగొస్తుంది... 
మా నరనరల్లొ రక్తం ఉరకలెస్తోంది... 
ప్రపంచం అంత ప్రతిద్వనించేలా... 
గర్వంగా ఘర్జిస్తున్నాం

   🕉 !! మేము హిందువులం !! 🕉

మీ యోగిరామ్ జీ