ప్రపంచంలో సుఖం ఎరుగనివారు
ఎవరైనా ఉన్నారా? 


అంటే
ఉన్నారంటున్నాయి శాస్త్రాలు
వారిని "దుఖఃభాగులు" అంటారు.

వారి వివరాల్లో కెళితే వారు ఆరు రకాలు :



1. ఈర్ష్యాళువు :


వీళ్లు ఎవరి వృద్ధిని లేక ఎదుగుదలను చూడలేరు
అలాంటివారిని ఈర్ష్యాళువు అంటారు.


2. జుగుప్సావంతుడు :

వీళ్లు దేన్ని చూచినా అసహ్యించుకుంటారు
వారివానికి సుఖం ఎక్కడుంటుంది.



3. నిస్సంతోషి :


వీడొక విచిత్రమైన వాడు వీడికి సంతోషమనేది ఉండదు
దాంతో వీనికి సుఖమెక్కడ


4. క్రోధనుడు :

వీడు ప్రతివిషయానికి చిటపటలాడుతూ ఎప్పుడూ
కోపంతో ఉండే కోపిష్ఠి వీడికి సంతోషమెక్కడ


5. నిత్య శంకితుడు :

అన్నిచోట్లా, అందరినీ శంకించేవాడు వీడు
అంటే ప్రతిదీ అనుమానమే ఇంకేముంది
సుఖం.


6. పరభాగ్యోపజీవి :

ఎప్పుడూ ఇతరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాడు
వీడికి ఎప్పూ ఎవరోఒకరు ఇస్తూవుంటేనే లేదంటే
దుఖఃమే ఇది సాధ్యమా కాదుకదా అందుకే వీనికీ
సుఖం సున్నా.


ఈ ఆరుగురురూ ఎప్పుడూ సుఖాన్నీ,
ఆనందాన్ని,
లేకుండా బాధతో అసంతృప్తితో
జీవిస్తుంటారు కాబట్టి వీరిని "దుఖఃభాగులు" అంటున్నాయి..




- స్వస్తీ...